Wednesday, March 25, 2020

నమస్తే కరోనా!'

Mar 21, 2020
""మెడకు పడ్డ పాము కరవక మానదు !""
అన్నట్టుగా ఈ రాక్షసి చైనా దేశం సరిహద్దులు దాటుతూ, అన్ని దేశాల తో పాటు ,,మన రాష్ట్రం, మన ఊరికి కూడా ,వచ్చేసింది
వచ్చింది ఈ విష సర్పం ,!! దాని కాటు నుండి తప్పించుకోవాలి ! తప్పదు!
మందు, మాకూ లేని ఈ వింత వ్యాధిని కేవలం శుభ్రత ద్వారానే నివారించాలి !!
అంతే కాదు ,ఇతరులకు దాని పొ డ తాకకుండా కూడా  చూడాలి !!
, జాగ్రత గా దాని  వ్యాప్తి ఉనికిని గమనిస్తూ  పరిశుభ్రత పాటిస్తూ ,అందరితో కలిసి సామూహికంగా ,దీక్షతో ఆ కరోనా ను శాశ్వతంగా మట్టు బెట్టాలి !
ప్రతీ పనికి మంచి చెడూ రెండూ ఉంటాయి ,
కనక మనం కరోనా వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం
,1_  పూర్వ కాలంలో "మడి" అనే ఆచార వ్యవస్థ ఉండేది !
,దాని ఉద్దేశ్యం ఖచ్చితంగా  "పరిశుభ్రత"" పాటించడం ,!
ముఖ్యంగా ఆహారం ,దైవారాధన విషయంలో , ఇతరులను అంటకుండా , ఆ విధి పూర్తి అయ్యేవరకు  జాగ్రత్తగా పాటిస్తూ ఉండేవారు
దాని ప్రాముఖ్యత మనకు  ఇప్పుడు తెలుస్తోంది !
దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తుంటే , ఇదిగో,ఇలాంటి కరోనా రాక్షసి పుడుతూ, జన నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది
సద్వినియోగం వల్ల అనందం శాంతి ,సౌఖ్యం  ,ప్రపంచమంతటా , ప్రభవిస్తు ఉంటాయి
2_ఒకరినొకరు "హగ్" చేసుకునే విదేశీ పద్దతి కంటే ,గౌరవంగా , ఒకరికొకరు నమస్కారము అంటూ  సంతోషంగా నోరారా పలుకుతూ  ఉండడం మన సంప్రదాయ వైభవం ఎంత గొప్పదో ప్రపంచానికి  గుర్తు చేస్తోంది
3_"నేను బాగుంటే చాలదు ,!ప్రక్కవాడు కూడా నావలే ఆనందంగా ఉండాలి !""
అనే మానవతా దృక్పథం  ,మానవీయ విలువల మహనీయతను,,ఇప్పుడు మనం  అనుభవం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము !
కరోనా నుండి నీకు ,మీకు  మాత్రమే కాదు నీ చుట్టూ ఉన్న సమాజం కూడా విముక్తి అయ్యే లా చూసే బాధ్యత కూడా మనదే అవుతోంది
4_ పంట చేలు రక్షణ చర్యలు,చేనుకు తెగులు  రోగం వ్యాపించకుండా  చూస్తూ , తన పొలం చేను మాత్రమే కాకుండా ప్రక్కన ఉన్న వందల ఎకరాల పొలాల రక్షణ బాధ్యత కూడా  నీదే అని సూచిస్తూ ఉన్నట్టుగా , నీది నాది అని బెదభావం లేకుండా , అందరం ఒకటై, ఈ మహమ్మారిని రూపు మాపాలనే ధృఢ సంకల్పంతో కలిసి కట్టుగా , యుద్ద ప్రాతిపదిక పై ,చైతన్యవంతులు గా ఆశయం నెరవేరేలా ముందడుగు వేస్తూ ఉండాలి
5_ ఇన్నాళ్లూ ,,ప్రతీరోజూ ,మన  ఇంట్లో ఊడ్చిన చెత్త చెదారం బయట పారేయడం , ప్రక్కవారి ఆరోగ్యం గురించి ఆలోచన చేయకుండా ఉండే సోమరితనం ,నిర్లక్ష్యం ఇక పనికి రావు అని గమనిస్తూ , ప్రక్కవా రీ బాధ్యత కూడా నీదే అని గుర్తించాలి!!
6_  ఆ రోజుల్లో ఒక దేశంలో జరిగిన అధర్మాన్ని అణచడానికి రాముడు ,కృష్ణుడు అవతరించా రు
కానీ ప్రపంచమంతా పలు రూపాల్లో  విస్తరిస్తూ ఉంటున్న  ఈ బ్రహ్మ రాక్షసి , వేలాదిమంది ని నిర్దాక్షిణ్యంగా పొట్టన నెట్టుకుంటూ ఉన్న ఈ సైతాన్ ను పరిమార్చడానికి ఇంటింటా ఊరూరా రాముడు కృష్ణుడు దుర్గా చాముండి గా భావిస్తూ అప్రమత్తత గా ఉంటూ ,అది అంతమయ్యేవరకు  అనుక్షణం కనిపెడుతూ ఉండాలి
7  - మనలో అంతర్లీనంగా  దాగి ఉన్న ,అద్భుతమైన క్రమశిక్షణను ,ఐకమత్యాన్ని ,  కరోనా దయ వల్ల మనం పరస్పరం అంది పుచ్చుకుంటూ ఉన్నాం !;
కుల మత వర్గ దేశ ప్రాంత బేధాలు లేకుండా ,ప్రపంచం లోని సమస్త ప్రాణికోటి ఒక్క త్రాటి పై నడుస్తోంది
, ఈ లక్ష్య సాధన కొరకు; కరోనా నివారణకు!; ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు,పరిశుభ్రత అవగాహన   మీడియా ద్వారా అందజేస్తూ  గతంలో ఉన్న ,అపార్థాన్ని శత్రుత్వాన్ని మరచి ,మిత్ర భావం ,తో సహకరిస్తూ ఉంటున్నాయి
కరోనా బాధిత దేశం అమెరికా, , కూడా  అదే కరోనా తో వేలాదిమంది నీ పోగొట్టు కుంటున్న సాటి ఇటలీ దేశ పౌరులకు సాయం చేస్తూ ,తన మానవత్వాన్ని చాటుతూ ఉంది ,
ఇలాంటి సోదర భావం శ్లాఘనీయం ,ఆదర్శం ,అనుసరణీయం కూడా !
8__చేతులు మాత్రమే కాకుండా ,ఇంట్లో మూల మూలకు , ప్రతీ వస్తువును నీటితో కడుగుతు ,తుడుస్తూ ప్రతి రోజూ, ఇల్లంతా ,ఇంటి చుట్టూ , శుభ్రంగా ఉంచాలి
ఈ పని రోజూ, చేస్తూ,ఉండాలి
బజారులో సరుకులు తెచ్చుకున్నా కూడా వాటిని కడగాలి ,తాను కాళ్ళు చేతులూ కడగాలి ,
దీని వల్ల మనలో ఉంటున్న సోమరితనం నిర్లక్ష్య భావం ,అలసత్వం ,అహంకారం ఇవన్నీ తుడిచి పెట్టుకు పోతున్నాయి,
బదులుగా
పరస్పర సంఘీభావం  ప్రకటి స్తూ, సామాజిక శ్రేయస్సు తలపెడుతున్నాం
సర్వే జనాః సుఖి నో భావంతో ,
సమస్త సన్మంగళాని భవం తు!
అని వేద మాత సూచిస్తున్న మంగళ ప్రదమైన వాక్యాలు అక్షరాల అమలుచేసే శాంతి బాటలో నడుస్తున్నాము 
"",అందరం బాగుందాం !""
అనే ఆదర్శ మానవత్వ భావం తో ,ఆనందంగా  ఉందాం
"కలిసి ఉంటే కలదు సుఖం !"
"నమస్తే కరోనా,!""
అంటూ  ఇంత చెడులో కూడా కొంత  మంచిని వెదికే ,మన భారతీయ సంస్కృతీ వైభవా నికి. జేజేలు పలుకుదాం !   మన సనాతన సంప్రదాయాలను  ప్రతిబింబించే  , ఈ చక్కని ""పరిశుభ్రత పరిరక్షణ ప్రాముఖ్యత అవగాహన"" తో ,,శుభ్రత ను అక్షరాల ఆచరిస్తూ కరోనా ను అణచి వేద్దాం ;"
స్వస్తి !"
హరే కృష్ణ హరే కృష్ణా!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...