Mar 22, 2020
అంతం కాదు ఇది ఆరంభం !
యుద్దం ప్రారంభం అయ్యింది ,!
ఆకారం తెలియని వింత మృగం తో మన అంతర్యుద్ధం !
""రేపు ఉదయం 5 నుండి ఎల్లుండి ఉదయం 5 గంటల వరకూ ఇంటింటా, ఊరూరా, స్వీయ నిర్బంధం ,సామాజిక దూరం ,!?
ఇది దేశమంతటా స్వచ్చందంగా పాటించాలని ,ప్రధానమంత్రి ,తో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పిలుపు !"
ఈ కర్ఫ్యూ ఎందుకు?
దీనికి సమాధానం ,మనకు తెలుసు !
కరోనా ను అరికట్టేందుకు !
భారతదేశం వణకి పోతోంది !
కరోనా వ్యాధి సోకిన వారిని ఎవరు తాకినా ,వారితో చేతులు కలిపిన,వారు దగ్గిన తుమ్మినా కూడా ,, వారు ఏ వస్తువులను ముట్టినా , ఆ భయంకర వ్యాధి సోకడం ఇదంతా వారికి ,తెలియకుండా వ్యాపిస్తూ ఉంటుంది !
కరోనా తమకు వచ్చిందని తెలియడానికి పట్టే సమయంలో చేయి దాటి పోతే , వారు ఒక్కరే కాకుండా కుటుంబ సమేతంగా కరోనా వ్యాధికి గురి అవుతూ ఉన్నారు !
వేలాదిమంది రోజూ వివిధ దేశాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు !
అమాయకం నటిస్తూ కరోనా వ్యాధిగ్రస్తులు బయట ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ,ఎంతో మందిని కలుస్తూ రోజు రోజుకు కరోనా పేషంట్ల ను పెంచుతూ ఉన్నారు !
బుద్ది లేని వెధవ లు !
ఇటలీ ,చైనా ,అమెరికా దేశాల్లో ప్రజలు 30 రోజుల నుండి ఇంట్లోనే ఉండి ,తమకు తాముగా స్వచ్చందంగా కరోనా ను నిరోధించే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూ ఉంటే ,
అలాంటిది రేపు ఒక్క రోజు మన ఇంట్లో మనం గడపడం ,ఎవరికోసమో కాదు
మన కోసం
మన పిల్లలకోసం
మన పెద్దవారి ఆరోగ్యం కోసం
దేశ భద్రత కోసం ,సంతోషంగా బాధ్యత గల పౌరుడుగా చేయలేమా !??
మన తెలంగాణాలోనే 21 పాజిటివ్ కరోనా కేసులు ఉన్నాయి అంటే , పరిస్తితి ఎంత తీవ్రంగా ఉందో ఊహించండి !
గంట గంటకు కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి ! ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి!!
చావో రేవో,తేల్చుకో ,అంటూ వార్నింగ్ ఇస్తోంది కరోనా !
ప్రపంచ వ్యాప్తంగా 11,000పైగా మరణాలు !
అమెరికాలో సుమారు 300 మరణాలు !
ప్రక్క రాష్ట్రం మహారాష్ట్రలో 64 కరోనా కేసులు !
ఈ సంఖ్యలు రోజు రోజుకూ పెరుగుతూ ఉన్నాయి ;
దయచేసి,
అందుకే ,,మాస్క్ లేకుండా ఎక్కడా తిరగ వద్దు!
దయచేసి ,,పదేళ్ల లోపు పిల్లలను
60 ఏళ్ల పెద్ద వారిని ఇంట్లోనే ఉంచండి !
అసలే మన దేశంలో శుభ్రత తక్కువ !
అజ్ఞానం ,అమాయకం ,నిర్లక్ష్యం ,మొండితనం ఎక్కువ !
"",ఎందుకు చెబుతున్నారో వినిపించు కో వాలి!""
విషయం ఎంతగా చెయ్యి దాటిపోయింది , చెబితే అర్థం చేసుకోవాలి !"
కనీసం టీవీ లో మొత్తు కుంటు ఉంటున్న ఛానెల్ వార్తలు చూసి అయినా మనం బుద్దిగా ఉం డాలి !""
ఈ కరోనా వ్యాధి ఉన్నవారు వారిని ఎంత మందిని తాకి ఉండవచ్చు ?
వారు తాకిన వస్తువులను ఎందరు ,ఎన్ని చోట్ల తాకుతూ ,మిగతావారికి కూడా అంటించి ఉండ వచ్చును ,?
ఇది అజ్ఞాత శత్రువు !
కళ్ళకు కనపడేది కాదు ;!
పట్టుకుంటే దొరికేది కాదు!
మందు పెట్టలేం !
దానికి మనం ఏ
మందు తినలేం!
ఈ రోగానికి మందు లేదు !
ఇంకా కనిపెట్టబడ లేదు !
దానికి జాగ్రత్త ,పరిశుభ్రత నే తగిన మందు !; అదే మనం అనుక్షణం ,అనుదినం చేయాల్సింది !;
చేసేది మంది కోసం ! మనవారి కోసం !
మన కోసం !
బస్సులు రవాణా రైళ్లు విమానాలు ఆలయాలు షాప్ లు రైతు బజార్లు అన్నీ బంద్!
ఎందుకు అంటే కరోనా ను వ్యాప్తి చెందకుండా ఉండేందుకు !!
జనం ఎక్కడా జమ గూడ రాదు !
ఇది కనిపించని శత్రువుతో ,,మనం చేస్తున్న యుద్దం !!
ఆయుధాలు లేవు !
కేవలం మాస్క్ ధరిస్తూ ఇల్లూ ,ఒళ్లూ పరిశుభ్రంగా ఉంచుకోవడం తప్ప మరేమీ చేయలేం!
మన కుటుంబ సభ్యులైనా కూడా ఒక మీటర్ దూరంగా ఉంచి మాట్లాడుతూ ఉండడం మంచిది
నియంత్రణ పాటిద్దాం !!
ఇది ప్రపంచ యుద్దం కంటే మించిన విపత్తు !!
ఇది ప్రాణాలతో చెలగాటం!;
బయట తిండి తినకండి !
ఇంట్లోనే వండుకొని తినండి!
బైక్ కార్, లాంటి వస్తువులు detol సబ్బు లతో శుభ్రం చేసుకుందాం !!"
Care for you!
Care for your family!
Care for your locality!
Care your nation ,and the world at large !!""
మనం మన దేశానికి చేసే దేశ సేవ ఇదే!
సంఘటిత భావాన్ని తెలియజేస్తూ ,, జనతా కర్ఫ్యూ ఉద్యమంలో పాల్గొని ,మనవంతు సామాజిక బాధ్యత గా ,నిర్వహిస్తూ ,, కరోనా శత్రువు వీర విహారానికి కట్టడి చేయడం !!
రేపు ఒక్కరోజు ,, ఇంట్లో పిల్లలకు రక రకాల ఆటలు ,పాటలు ,క్విజ్ పోటీలు ,అభినయం ,సంగీతం , భగవద్గీత శ్లోకాలు శ్లోకాలు చదవడం,బొమ్మలు వేయించడం , ,కథల పుస్తకాలు చదివించడం ,జోక్స్ చెప్పించడం , కరోనా వ్యాధి గురించిన వివరాలు ,,వాటిని అరికట్టే లక్షణాల గురించి చెప్పించడం ,రాయించడం ఇలా తమ పిల్లలను ఇంట్లో ఏదైనా నేర్పుతూ ఉంచాలి !!
పిల్లల అమూల్యమైన సమయాన్ని విలువలు కూర్చి అందించు దాము !!
రేపు సాయంత్రం 5pm కు అందరం ఇంటి బయటికి గేట్ ముందరికి వచ్చి నిలబడి ,3,4నిముషాలు చప్పట్లు కొట్టాలి!
ఎందుకు అంటే!!
తమ ప్రాణాలను పణంగా పెట్టీ , కరోనా వ్యాధి గ్రస్తుల ప్రాణాలను కాపాడుతూ ,కరోనా వ్యాధితో 24 గంటలు యుద్ద ప్రాతిపదిక పై అప్రమత్తంగా ఉంటు పోరాడుతూ ఉన్న మన వైద్య బృందానికి , డాక్టర్ అభినందనలు తెలియజేస్తూ వారిని ఉత్సాహ పరిచే సంకేతం ,, ఈ విధంగా సంతోషంగా చప్పట్లు చేయడం !
మనమందరం ఒక్కటైతే ,ఎంతటి ఘోర సమస్యనైనా దైర్యం గా ఎదుర్కోవచ్చు అనే అవగాహన సంకేతం గా ఈ చప్పట్లు చరుస్తూ ఉండాలి !
ఈ ఒక్కరోజైనా కరోనా వైరస్ ఎక్కడా కూడా బయట వ్యాపించకుండా కట్టడి చేసే జనతా కర్ఫ్యూను సంఘటితంగా మనస్ఫూర్తిగా నిర్వహించు కుందా ము!
భారత్ మాతా కీ జై !
జై తెలంగాణా !
ప్రపంచ శాంతి వర్ధిల్లాలి
ఓమ్ శాంతి శాంతి శాంతిః!
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా!
Wednesday, March 25, 2020
కరోనా కర్ఫ్యూ !
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment