Wednesday, March 25, 2020

క్రమ శిక్షణ దేనికీ ? - 2

Mar 18, 2020
  కాలం విలువైనది ,అది మనకోసం ఆగదు !
కాలం ఇచ్చిన ఈ బ్రతుకును ,కాలం ఇచ్చిన వ్యవది లో సద్వినియోగం చేసుకోవాలి
ఇది విజ్ఞత ! ఇదే జ్ఞానం !
ఇదే మనిషి తన మనసుకు ఇవ్వాల్సిన క్రమశిక్షణ !!
  కష్ట పడుతూ ,ఇలా  చేస్తుంటే   మనిషికి ఏం లాభం ?
ఇది  తరచుగా అందరికీ వచ్చే సందేహ మే !
""జవాబు  మాత్రం  ఒకటే !__ భగవంతుని వద్దకు నేరుగా అతడి సాన్నిధ్యం లోకి  సమీపంగా  క్రమంగా వెళ్తూ ఉంటాం  ,!
దేవుడు అంటే ప్రేమ ,ఇష్టం ,, ఉంటూ దానికోసం కష్ట పడే వాళ్ళు , మాత్రమే , ఈ" క్రమశిక్షణ " అనబడే  "" యాత్రా స్పెషల్ బస్సు'""లో ఎక్కడానికి  అర్హులు ! యోగ్యులు కూడా !
   దైనందిన జీవితంలో , దేవుని పూజ  చేయడం లాంటి  అభ్యాసము   చేస్తూ , ""ఇహం ""కాకుండా   ""పరం ""గూర్చిన చింతన చేస్తుంటాం !
ఈ రకమైన క్రమశిక్షణ  తో కలిగే  దైవారాధన చింతన  వలన భగవంతునిపై భక్తి శ్రద్ధలు ,ప్రేమానుబంధం కలుగుతాయి
ఒక్క రోజు పూజ చేయలేక పోతే పిచ్చి పట్టినట్టు గా ఉంటుంది
అంటే దేవుని పూజ లేకుండా తినడం తాగడం ,పని చేయడం కుదరదు!
అంటే  నీవు దేవునికి దగ్గరగా రాకుండా ఒక్క రోజైన  ఉండలేవు !
దేవుడు లేకుండా బ్రతకలే ని మహర్దశ  ,విగ్రహ పూజ నిష్టతో చేస్తూ ఉండడం వలన మనకు ప్రాప్తిస్తు ఉంటుంది !
ఇది  మన అందరికీ   అనుభవైక వే ద్యం. అయిన ""పరమసత్యం ""!
దేవుడు ఎక్కడ ఉన్నాడు ??
మా ఇంట్లో ఉన్నాడు !
దేవుడు ఉన్నాడు కనుక నే మేము ఉంటున్నాం ఇంట్లో!
అంటే దేవుడు లేను ఇంట్లో మేము ఉండము !. ఉండలే ము !!
ఉండకూడదు కూడా !
ఎందుకంటే మనల్ని బ్రతికేది వాడి దయ వల్లనే కదా !
దేవుడు లేని ఇల్లు స్మశానం తో సమానం !
దేవుడు లేడనే వాడు ,నడుస్తున్న శవం తో సమానం !
దేవుణ్ణి పూజించ లేని బ్రతుకు మరణం తో సమానం !!
హరి సేవకు ఉపయోగించని ఈ దేహం ఉన్నా ఒకటే ,లేకున్నా ఒకటే ,
ఎందుకంటే,,
మేక గొర్రె కోడి వంటి జంతువులు  మెడ మీద కత్తి పడుతూ ఉండడం చూస్తూ కూడా  , మృత్యు భయం పొంద వు కదా  !
జంతువులకు మనిషికి తేడా ఒకటే  ""దైవ చింతన !""
విద్య లేనివాడు వింత పశువు!
భగవంతుని గూర్చిన జ్ఞానమే  అసలు "విద్య "!
అందుకే మనిషిలా బ్రతకడం ఒక వరం! ఒక కళ !ఒక అదృష్టం !!
జన్మ జన్మల  పుణ్యఫలం !
అందుకు ""పెట్టీ పుట్టాలి !!""
భాగ్యం అంటే అదీ !
దైవానుగ్రహం అంటే అదీ !!
దైవాన్ని నమ్మినవాడు ఎన్నడూ చెడి పోడు!
ఎంత నమ్మితే ,భగవంతుడు అంతగా కరుణ తో ,మనిషి  యోగక్షేమాలు చూస్తూ ఉంటాడు
నాద బ్రహ్మ. ,,త్యాగరాజుగారు ,, తాను అనుదినం పూజించే ,పంచాయతనం  దేవతా మూర్తులు కనబడకుండా  పోతే,, ఆయన అవి తిరిగి తనకు  దొరికే వరకూ నిద్రాహారాలు మాని  , ఇల్లు ఊరూ భార్యా పిల్లలను విడిచి పిచ్చి వాడిలా,, దేశదేశాలు తిరిగాడు
అతడి ఇలవేలుపు , ఆరాధ్య దైవం , ఆ శ్రీరాముడే  ,తన భక్తుడి దీనా వస్త ను చూడలేక స్వయంగా   వచ్చి , మార్గదర్శనం చేసి , అతడికి  జీవన్ముక్తి నీ, అనుగ్రహించాడు !!
అని మనందరకు తెలుసు కదా !!
మనం నిత్యం పూజించే ,""మూర్తి పూజ""లో అంత మహత్తు ఉంటుంది !
స్వయానా దేవుని సన్నిధిలో ఉన్నంత పరమానందం  మనకు కలుగుతూ ఉంటుంది ,క్రమం తప్పకుండా పూజలు చేసేవారికి !;; 
  ఆ విధంగా మనిషి తన  మనసును సాధనతో నిగ్రహించడానికి.  గీతాచార్యుడు సూచించిన అభ్యాసము అనబడే  ప్రక్రియ అది !
-____
ఇక  రెండవది ""వైరాగ్యం !;". ఈ "వైరాగ్య ""భావన కూడా,, దైవారాధన త్రికరణ శుద్ధిగా చేయాలంటే    తప్పనిసరి గా అలవరచు  కొంటూ ఉండాలి !!
దేవుని సన్నిధికి చేర్చే మహత్తర సాధనం , ఈ వైరాగ్య భావన !!
కాశీ యాత్రలో , గయా క్షేత్రంలో పిండ ప్రధాన సమయంలో ,తర్పణం విడుస్తూ ,  , దానితో బాటు, ""గయ సాక్షిగా ఇక తినను!""అంటూ.ప్రమాణం చేస్తూ ,,  తాను  విడిచి పెట్టిన మామిడి పండు పై ఉన్న  మమకారాన్ని  ,,,తిరిగి
ఇంటికి వచ్చాక ఎండాకాలంలో బంగెన్ పల్లి మామిడి పళ్ళు చూసి  ,నోటిలో నీళ్ళు ఊరుతూ  ఉంటే,  , మామిడి పండు ను విడిచి పెట్టినట్టు అవుతుందా !?మీరు చెప్పండి ?!
అది వైరాగ్యం అనిపించు కో దు కదా !;
పదార్థం పై   మమకారం పోవాలి ! I
ఇంద్రియాలు నిగ్రహిం చు కోవడం  అంటే మాటలా ??
ఎంత సాధన కావాలి ? ఎంత మనో నిగ్రహం ఉండాలో,,
మీరు  చెప్పండి ,??
దేనినైనా ,ఒక్కసారి ""వద్దు!"" అనుకుంటే ,దాని మొహం చూడ కూడదు ,,,!కదా!!
వైరాగ్యం  అనే భావన  పదార్థం పై అంటే ప్రాపంచిక సుఖ భోగాలపై విరక్తిని , ,కలిగిస్తూ , వాటి స్థానంలో పరమాత్ముని చేరుస్తూ ఉంటుంది,,మన  మనసు !
అంటే మనసు ""అత్మ బంధువు""  గా మారి మన ""శ్రేయోభిలాషి ""అయ్యాడు అన్నమాట !
మహా భాగవత కథా శ్రవణం చేస్తూ ఉండడం వలన
  జీవితంలో ఎదురయ్యే లాభ నస్టాలు ,కష్ట సుఖాల తాపత్రయం గురించి మనసు ఆలోచన చెయ్యకుండా ఈ  కథా శ్రవణం మనసుని   నిగ్రహిస్తూ ఉంటుంది !;
సంసారం లో ఉంటూ , సంసార సౌఖ్యాలు పట్ల  విముఖత చూపించడం సామాన్య విషయం కాదు కదా ,!
స్మృతి ,,శృతి,, ఇతిహాసాలు ,రామాయణ భారత భాగవత పురాణాలు శ్రవణం చేస్తూ,, కాశీ రామేశ్వరం మొదలైన తీర్థ క్షేత్ర యాత్రలు దర్శిస్తూ  ఉంటుంటే ఈ వైరాగ్య భావన  శీఘ్రంగా మెండుగా కలిగే అవకాశం ఉంటుంది 
కేవలం చేతుల తో హరిని పూజిస్తూ, సేవిస్తూ ,నోటితో హరి నామం అనడం మాత్రమే సరిపోదు కదా !
, చెవులతో కూడా భగవంతుని రూప గుణ వైభవాలూ , శ్రవణం చేస్తూ , పంచేంద్రియాలు దైవ చింతన లో  నే  నిమగ్నం చేస్తూ ఉండాలి
కొందరు అంటారు 
"యోగా "చేయాలి ! అనీ,,,
ఏకాంతంగా ""ధ్యానం"" చేయాలి ""ఏకాగ్రత  ""కోసం ! అనీ
నిజమే !
"ఏకాంతం "లో కూడా పరమాత్మ చింతన చేస్తూ ఉండాల్సిన  బుర్రలో, ఇంటి గురించిన ఆలోచనలు వస్తూ ఉంటే, ఏకాంతం లో ఉన్నా ,అడవుల్లో ఉన్నా ,ఆశ్రమాల్లో ఉన్నా ఏం లాభం  చెప్పండి ??
అందుకే  ,_,"" నీ ఊరిలోనే ,_నీ ఇంట్లోనే ,,నీ వాళ్ళ మధ్యే "",,ఉంటూ   అభ్యాస వైరాగ్య ముల సిద్ది కోసం నిరంతరం సాధన చేస్తూ ఉండాలి ,,!!
దానికి సత్సంగం తోడు చేసుకొంటూ లక్ష్య సాధన కోసం  ధృఢ సంకల్పంతో , పరమేశ్వరుని మరవకుం డా, విడవకుండా  దీక్షగా , ముందుకు సాగాలి
ఈ "క్రమశిక్షణ"" మనిషికి ఇస్తే పొందే  లాభం  కన్నా , మనిషి లోని మనసుకు ఇస్తే పొందే  లాభం  ఎన్నో వందల వేల  రెట్లు మిన్న!""
అభ్యాసం తో పరమార్థ చింతన కు""  మనసుకు ఇచ్చే శిక్షణ"" ద్వారా క్రమంగా   దగ్గర అవుతూ ఉంటాం
వైరాగ్యం తో సంసార,, ప్రాపంచిక చింతన కు  మనసుకు ఇచ్చే శిక్షణ ద్వారా  క్రమంగా దూరం అవుతూ ఉంటాం
మానవ జీవిత ఆశ య సిద్ది ,,పరమాత్ముని సన్నిధికి చేరడమే  కదా !
అందుకే
మన బ్రతుకుబాటను సరి దిద్దే " పరమ పావన గ్రంథం ,మన ""భగవద్గీత "ను నిత్యం అధ్యయనం చేద్దాం
అందులో పొందే అద్భుతమైన  గీతాసారాన్ని   మనం  ఆస్వాదిస్తూ  తోటివారికి అందించే ప్రయత్నం చేద్దాం!.
సర్వే జనాః సుఖీనో భవం తు !""
సమస్త సన్మంగళానిభవంతు !"
ఓమ్ శాంతి ,! శాంతి! శాంతిః ,!
సర్వం పరమేశ్వర చరణార విందార్పణమస్తు !
గోపాలకృష్ణ భగవాన్ కి జై !
జై శ్రీ రాధే !
స్వస్తి !*
హరే కృష్ణ హరే కృష్ణా !"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...