Wednesday, March 25, 2020

మాతృదేవోభవ

Mar 3, 2020
_____&__________
స్త్రీ ని సృష్టించి భగవంతుడు  పురుషుని జీవితాన్ని ఆనందమయం చేశాడు
ఆమె లేకుండా సృష్టి  లేదు! ,
అనందం అందం ,శాంతం , సహనం , సంపదలు సౌభాగ్యాలు , సుఖ సంతోషాలు  అమ్మ దయ వల్లనే లభిస్తాయి ,!
సమస్య లు ఎన్ని ఉన్నా సమాధానాలు వెదకి పట్టుకోవడం లో అమ్మను మించిన ప్రజ్ఞా శాలురు ఉండరు! అందుకే ఆమె ఘనత ,ప్రతిభ ,ప్రజ్ఞ పాటవాలు అద్భుతం ,!మణిద్వీపం లో నెలకొని తన చల్లని ,, కను చూపుల తోనే సర్వ జగత్తును శాసిస్తూ , పాలిస్తూ , ఉన్న లలితా త్రిపుర సుందరీ దేవి  ప్రతి రూపాలే ,జగతిలో ఇంటింటా శక్తి స్వరూపాలు గా వెలసిన స్త్రీ మూర్తులు!
అనగా,,
""అమ్మలగన్నయమ్మ !,ముగురమ్మల మూలపుటమ్మ! చాల పెద్దమ్మ! సురారులమ్మ ! కడుపారడి పుచ్చిన యమ్మ ! తన్నులోనమ్మిన  వేల్పు టమ్మల మనమ్ముల ఉండెడి అమ్మ ! దుర్గ మా యమ్మ! కృపాబ్ది నిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ !""
అమ్మ ఆజ్ఞ అయితేనే ,శీఘ్రంగా  అయ్య కరుణిస్తాడు !"
బృందావన దివ్య సీమ లో సంచరించే గోవిందుని  దర్శించాలంటే ముందు రాధారాణి నీ వేసుకోవాల్సి ఉంటుంది !
దేవత అయినా మనిషి అయినా స్త్రీ శక్తి యుక్తుల ముందు తలవంచాల్సిందే !""
మనసున్న మనిషిగా ,అమ్మ ,మానవత్వం విలువలు అక్షరాలా  పాటిస్తూ,, తనలో , తన ఇంటిలో , ఇంటి ముంగిట్లో  దైవత్వం దర్శింప జేస్తుంది అమ్మ !
లక్ష్మీ కళ అమ్మ  ప్రేమ చూపులో , ఆమె మధురమైన మాటల్లో, ఉంది ! సంస్కార యుత మైన కట్టూ బొట్టూ జడ ,నడక ,, అడుగడుగునా భారతీయత ప్రతిబింబించే   తీరులో ఉంటుంది !
అందుకే మొదట ఇంటిని చూడు ,తర్వాత ఇల్లాలిని చూడు అన్నారు పెద్దలు! ;,
లక్ష్మీ నారాయణుడు, గౌరీ శంకరులు,, రాధా మాధవుడు , సీతా రాముడు ,!
ఇలా శక్తి ముందు  వస్తుంటే ,,చైతన్యం తర్వాత  అనుకరిస్తూ వస్తుంది !!""
అందుకే ఏ దేవత అయినా,  ముందు అమ్మ పేరు  తో గుర్తింపు  ఇస్తూ , తర్వాత తన పేరుతో  మహిమాన్వితుడు అవుతారు !!
ప్రత్యక్ష దైవాలు అమ్మా నాన్నలు !
అమ్మ గురించి చెప్పాలని అనుకోడం మూర్ఖత్వం ,అజ్ఞానం !,
దైవ ఋణం తీర్చుకున వచ్చును
కానీ అమ్మ ఋణం తీర్చుకునే వీలు  ఆ  దైవానికి కూడా లేదు!
కన్న తల్లి ప్రేమ  అనంతము,! అపారము ,! అమృతము !అద్భుతము ,! అపురూపం !""
మనుషుల్లో నే కాదు పశు పక్ష్యాదులు   కూడా అమ్మప్రేమలో  అనందాన్ని అనుభవిస్తూ ఉంటాయి ,,! సమస్త ప్రాణికోటికి అమ్మ మూలము,!
సృష్టికి
అమ్మ ప్రేమ యే మూలాధారము ,!!
అమ్మ అంటే దేవతా మూర్తి, కి ప్రతిరూపం!!
, ఆధునిక నాగరికత మోజులో ,,నేటి మనిషిలో మృగ్యం అవుతున్న ,ప్రేమను అనురాగాన్ని. ఆత్మీయత ను,, అనుబంధాలను  ,
మానవత్వపు విలువలు పెంచేది , పంచేది, అమ్మ !
ప్రతీ కాన్పుకు ,, నరక యాతన అనుభవిస్తూ , పురుటి నొప్పులు పడుతూ,, కొడుకులేదా బిడ్డను కనడానికి చావు బ్రతుకుల మద్య కొట్టు మిట్టాడు తూ,, ,,బ్రతికి ఉండగానే మరణ వేదన అనుభవిస్తూ ,  పునర్జన్మ ఎత్తుతూ ,ఉంటుంది అమ్మ !
కాన్పు అనే యజ్ఞం లో ,సంతానం కోసం ,తన ప్రాణాన్ని బలి చేస్తుంది అమ్మ !
తన రక్త మాంసా లతో ప్రాణం పోసుకున్న  పాపని గుండెలకు హత్తుకుని చనుబాలిస్తూ అంతవరకు తాను పడిన యమయా తన ను మరచిపోయి,పరమానందం పొందుతూ వుంటుంది పిచ్చి అమ్మ !!
అమ్మ వలె అలా ప్రాణాన్ని త్యాగం చేయగల వారు ఎవరుంటారు ,చెప్పండి ?!
అమ్మ ఒక ఇంటికి కూతురు అయితే  , మరో ఇంటికి కోడలు,అవుతోంది !
అక్క డా, ఇక్కడా  ఎన్ని కట్టుబాట్లు ఉంటాయో కదా అమ్మకు ?!
అయినా పుట్టింటికి ,మెట్టినింటికి  పేరు తెచ్చేందుకు  కత్తి మీది సాములా సాధన తో  శ్రమ చేస్తూనే ఉంటుంది అమ్మ !!
పెళ్ళై  అత్తారింటికి వచ్చాక ఇక ఆమె  భర్తయే దైవము !! అంతే కాదు,,
అతడి అన్న ,, తన అన్నయ్య గా, అతడి తమ్ముడిని తన తమ్ముడిగా ,అతడి తోబుట్టువుల ను ,తన అక్కా చెల్లెలుగా భావిస్తూ ,,ఆప్యాయతలు అనుబంధాలు  పెంచుతు , ఆ ఇంటిని వైకుంఠ ధామం చేస్తుంది  అమ్మ!!
, ఆమె ,అమ్మలగన్న అమ్మ గా ,కుటుంబంలో సంప్రదాయాలను  చక్కగా  పాటిస్తూ ,, తన సంతానానికి . సభ్యతా సంస్కారాన్ని , వారసత్వంగా  తరతరాలకు తరగని సంపద గా అందిస్తూ ఉంటుంది అమ్మ !!
ఆమె శక్తి రూపం లో ఉన్న దుర్గా దేవి అయితే,ఆమె  సహచర్యంలో భర్త   ను కూడా  చైతన్యవంతం చేస్తూ , అతడిలో నిబిడి యున్న ప్రతిభను ,తెలివితేటలను ,ప్రజ్ఞను ,వెలికిదీ సే ప్రయత్నం చేస్తుంది అమ్మ !!
,కుటుంబ సౌఖ్యా నికి ,, సమాజ శ్రేయస్సుకు తన శక్తి యుక్తులను  వినియోగిస్తుంది ధీశాలి, అమ్మ !
తనను కని చదువు సంధ్యలు చెప్పించి , పెంచి పెద్ద చేసి న తలిదండ్రుల ను ,, చూడాలనుకున్న కూడా చూడలేని  నిస్సహాయ  దయనీయ పరిస్తితి  అమ్మ ది ! ,
పనీ పాటా,సభ్యతా సంస్కారాల ను ప్రేమానురాగాలను  అందించిన , తన తల్లిని తండ్రిని తోబుట్టువుల నూ తన తల్లిగారి తరఫున బంధువులను అందరినీ  త్యాగం  చేయాల్సి రావడం ఎంత బాధాకరం?? !, కళ్ళల్లో నుండి ధారగా కారే  కన్నీరు  , ఎవరికీ కనబడకుండా  చాటుగా కొంగు మాటున  దాస్తూ,, బాధను గుండెల్లో నే ఉంచేస్తుంది  దయ గల బిడ్డ గా అమ్మ !!
ఆడ పిల్ల కావడం వల్ల అంత త్యాగం  చెయ్యాలా ? అంతులేని ఆవేదన ,బాధ ,  పడుతూ ,వ్యక్తిత్వం లేకుండా జీవించాలా ??
నిజానికి , అమ్మ చేస్తున్న త్యాగానికి  ఆ దేవుడు కూడా విలువ కట్టలేడు సుమా ;!
పేగుతో ముడివడిన రక్త సంబంధాన్ని ,, వివాహ బంధంతో ,  దూరం చేసుకోవడం ,, స్త్రీ యొక్క అద్భుతమైన త్యాగదనానికి పరాకాష్ట  అవుతుంది !!,
పెళ్లి చేసుకున్న "భర్త "అనే అపరిచిత వ్యక్తితో   కాపురం చేస్తూ, అతడి వారంతా తన వారుగా భావిస్తూ ,,ఆమె జీవించే విధానం ,ఆమె ఔన్నత్యానికి ,దివ్యమైన గుణ శీల సంపదకు ,, ఆమె విశాల హృదయ భావనకు పరాకాష్ట !!
అద్భుతంగా ఉన్న అమ్మ గురించిన పాట  విందాం !!
""అమ్మ అన్నది ఒకకమ్మని మాట!
అది ఎన్నెన్నో మమతల తరగని మూట!!
అమ్మంటే అంతులేని సొమ్ము రా !
అది ఏనాటికీ తరగని భాగ్య మ్మురా!
అమ్మ మనసు అమృతమే చిందు రా!
అమ్మ ఒడిలోనే స్వర్గమే ఉందిరా !ఉందిరా!!""
, అమ్మ అనురాగ బంధాన్ని అందంగా  ,పాట రూపంలో రాసిన కవికి  ,,నేను సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను !;
ఇలా ,,తనకంటూ అస్తిత్వం లేకుండా, కట్టుకున్న  భర్త పేరుతో నే పిలువబడుతూ ,,భర్త వంశం కోసం ,అతడి పేరు ప్రతిష్టలకోసం ,అతడి కుటుంబం కోసం ,  జీవిస్తూ ఉంటుంది అమ్మ ;!
అతడి కోసం తన ప్రాణాలను శక్తి యుక్తులను , కూడా   ఫణంగా పెడుతుంది అమ్మ !
,,త్యాగమూర్తి గా ,దైవానికి ప్రతిరూపంగా ,,మహాలక్ష్మిగా , ఇంటింటా దీపించే అమ్మ వైభవం వర్ణించడానికి ఆ బ్రహ్మ తరం కూడా కాదు ;!
""పితృదేవతలు ,,ఇక  తమకు సద్గతి ప్రాప్తిస్తుంది అని సంతోష పడేది, ఈ అమ్మ అందించే వంశాంకురం తోనే కదా !
,కీర్తిశేషులు అయిన అత్తా మామలకు ,,తన భర్త ,ఏటేటా విధిగా శ్రద్ధతో పెట్టే తిథి కార్యక్రమాలకు సంతుష్టులై , కొడుకు పుట్టాలని , ,,పితృదేవతలు  ఆశీస్సు లు అందిస్తారు !
, ఆ విధంగా ,తమ  వంశాభివృద్ధి నీ , పేరు ప్రతిష్టలను పెంచుతుంది  అమ్మ !!
తన కూతుళ్ళకు కుమారులకు మొగుడికి ,, ,ఆడపడుచులకు , అత్తా మామల కు తలలో నాలుకలా , సేవచేస్తూ, ఆ ఇంటికి కోడలు గా, వారిని సంతృప్తి పరుస్తూ సంతోష పరుస్తూ, , గృహమే కదా స్వర్గ సీమ అని తలపిస్తూ ఉంటుంది, అమ్మ !!
అలాంటి దేవత పాదాలకు ,  రోజుకు ఎన్ని సార్లు   సాష్టాంగ ప్రణామాలు సమర్పించినా తక్కువే కదా!!
ఆమె  చెప్పకుండా ,, భర్త ఏమీ చెయ్య లేడు కదా!!
గౌరీదేవి. ప్రక్కన  లేని శివభగవానుడు,, శక్తి విహీనుడే కదా!!
ఆమె సంతోషం లో ఆ ఇల్లు స్వర్గధామం అవుతుంది!;
ఆమె కన్నీటి కి కారణమైన వారు,, చేజేతులా, తమ  ఇంటిని నరకం చేసుకున్న వారు అవుతారు!;
ఆమె కు తన సంతానమే కళ్ళు ,,!
కుటుంబ సభ్యులు తనపై చూపే ప్రేమ యే  తనఊపిరి, గా భావిస్తూ , వారికోసమే బ్రతుకుతూ ఉంటుంది అమ్మ!;
పనిమనుషులు కొన్ని గంటలు మాత్రమే  పని చేస్తూ , ,జీతం తీసుకుంటారు
; కానీ ఈ అమ్మ ఆఖరు శ్వాస వరకూ పైసా  ప్రతిఫలం ఆశించ కుండా పని చేసే అద్భుతమైన వ్యక్తి !
ఆమెకు కావాల్సింది కుటుంబ ప్రేమ !
""అమ్మా !!ఈ రోజ నీవు చేసిన వంట  చాలా రుచికరంగా బావుంది ;!"" అనీ,
""అమ్మా ,,!పాపం ! మా కోసం లేచినప్పటి నుంచి ,పడుకునేవరకు ఒక  గంటైనా  విశ్రాంతి తీసుకోకుండా పని మీద పనీ చేస్తూనే ఉన్నావు కదా, అమ్మా ;
ఇంత కష్ట పడుతున్నావు కదా  , ఇలా అయితే నీ ఆరోగ్యం దెబ్బ తినదూ !""అంటూ తనని వారు ఆప్యాయంగా  ప్రేమతో ఒక చిన్న గా పలకరిస్తే చాలు ,, ఆమ్మ సంతోషం తో బూరెలా పొంగిపోతూ రెట్టింపు ఉత్సాహంతో ఇంకా పని చేస్తూ పోతూ ఉంటుంది పాపం !నిజంగా ప్రేమ పిచ్చిదే  కదా ఈ అమ్మ !
తన భర్త ,తన  పిల్లలు తమ అత్తామామలు కష్ట పడితే ,,ఆమెకు తన కంటిలో నలుసు పడినంతగా , బాధ పడుతూ ఉంటుంది!!
దానితో    మనః శాంతి లేకుండా పోతుంది  అమ్మకు !;
""వారి సంతోషమే,, తన సంతోషం !""
వారు తృప్తిగా తిన్న రోజు న,, సంక్రాంతి  పండగ  అమ్మకి !;
""వారే తన దైవాలు;"
వారే ప్రాణం! , వారి తోడిదే జీవితం!!
ఆ దేవుడు స్వయంగా  దివినుండి దిగి రాలేక,, మంచి చెడ్డలు చూడలేక , ,,మనిషికి ,,తగినంత ప్రేమను ఇవ్వలేక  దేవత లాంటి దయగల  అమ్మ ను  , భువి పై కి పంపించాడు !!
ఇంటింటా దేవత గా  వెలసి  ఆమె ,ప్రతీ ఇంటిని ఆనందమయంగా. కమనీయంగా రమణీయంగా తీర్చి దిద్దుతు ఉంటుంది !!
నవరసాలు కుప్పిస్తు,  విభిన్న పాత్రలు  పోషిస్తూ, ఆ పాత్రల్లో ,పరకాయ ప్రవేశం చేస్తూ పాపం , ఆమె, ప్రతీ రోజూ,తన  రెక్కలు ముక్కలు చేసుకుంటూ , కుటుంబ శ్రేయస్సే ధ్యేయంగా నిరంతరం శ్రమిం చే  ఆ శ్రామిక జీవికి ,,,మనం ఏమిచ్చి రుణం తీర్చుకునగలం !!,
వివాహం అయిన రోజూ నుండి , అలుపెరగకుండా సెలవు లేకుండా, ,  తన జీవితాన్ని సమిధగా మార్చి,, తన కుటుంబ సంక్షేమం అనే యజ్ఞంలో హవిస్సు గా వేస్తున్న పరమ పావని మాతృ మూర్తి కి అనుదినం అనుక్షణం కృతజ్ఞతతో ప్రణమిల్లడం తప్ప,, ప్రత్యుపకా రం ఏ విధంగానూ   చేయలేము కదా అమ్మకు !!
తన  అత్తా మామల ను తలిదండ్రులు గా భావించి ప్రేమించి ,వారిని  సేవించే ఈ మాతృమూర్తి సౌజన్యానికి,,ఆమె  విశాల హృదయానికి  ఎవరు మాత్రం విలువ కట్టగలరు ?
వైకుంఠం లో ఉన్న మహాలక్ష్మిని చూసే భాగ్యం లేకున్నా , మన ఇంటి కి దీపం లా , వెలుగు నిస్తూ ఉంటుంది అమ్మ ;! మహాలక్ష్మి వలె  జడలో పూలు  ,,చేతులకు గాజులు,,, చెవులకు దుద్దులు, మెడలో  బంగారు ఆభరణాలు,, కాళ్లకు  వెండి పట్టా గొలుసులు    ,చక్కగా చీర కట్టు, రవిక  ,,నుదుట కుంకుమ , కళ్ళకు కాటుక, ఇలా,పరమ  మంగళ కరమైన  వస్త్ర ధారణ చేసుకొని, దేవుని గదిలో దీపం వెలిగిస్తూ ,, కుటుంబం శాంతి సౌఖ్యం కోసం జగన్మాతను ప్రార్ధిస్తూ ఇంటింటా అగుపించె  అమ్మ  సాక్షాత్తూ పర దేవతా మూర్తి నీ తలపిస్తూ ఉంటుంది కదా !!
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...