Wednesday, March 25, 2020

హరేకృష్ణా ! అంటే ఏమొస్తుంది ?

Mar 4, 2020
______&_____
ఏమిటీ ఆ పిచ్చి తనం , హరే కృష్ణా ! అంటూ ఆ వెఱ్ఱి గా ఎందుకు ఆ అరుపులు?""అంటూ , కృష్ణుని గురించి భజన కీర్తన , పురాణం చెప్పినా ,నేను అహంకారం తో కోపంగా పెద్దగా అరిచే వాడిని!!
డబ్బుల కోసం ఈ పగటి వేషాలు!! భక్తి లేదు ఏమీ లేదు!అంటే నాటకం!""అంటూ నోటికి వచ్చినట్టుగా దూషించడం చేశాను ,
నేను చెప్పిందే రైట్! అంతే! ఎవరూ నాకు ఎదురు మాట్లాడ వద్దు !"
నా ఇంట్లో వారు , దేవుడి పేరు చెప్పడానికి  భయపడే వారు!
ఆ విధంగా పెద్దా చిన్నా, చెల్లే తల్లీ, అని లేకుండా అందరినీ దబాయించే వాడిని!
పాపం ! నా నోటి దురుసు తనాని కి భయపడి ,నాకు కనపడకుండా దూరంగా వెళ్లి పోయేవారు
నాకు అదే సరదా! ఎంతో హాయి!
కాదా మరి!
ఎవడి పిచ్చి వాడికానందం !"" పెద్ద మొనగాడిలా పెత్తనం చెలాయిస్తూ బ్రతికిన
""నేను ""ఎంత చెడ్డవాడినో నాకే తెలియదు  ?
నా చెడు నడక గురించి నాకు తెలుసు!
చేసేది తప్పు అనీ తెలుసు!
నా ఈ బలహీనత  ఎవరికైనా చెపితే , వారు నన్ను చిన్న చూపు చూస్తూ అవమానిస్తే ఎలా ? అన్న భయం తో   చెప్పకుండా , అలవాటు గా మారిన అదే తప్పును  మళ్లీ మళ్లీ చేస్తూ పెద్ద దగుల్బాజీ గా మిగిలాను !,
పులి మేక తోలు కప్పుకొని సాధు జంతువు లా ,మేక మందలో తిరుగుతు న్నట్టుగా  నేను మంచివాడిలా పోజు కొడుతూ ,అందరినీ మోసం చేస్తున్నాను!!""
కాదు, కాదు !!
,నన్ను నేనే మోసం చేసుకుంటూ, చెడ్డ తనాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ సమాజాన్ని , భ్రష్టు పట్టిస్తూ  ఉన్నాను,!
  నాలోని అనర్థాలను  అలా దాచి ,దాచి ,వ్యర్తున్ని గా ,తయారయ్యాను!
,నేను ఏమిటో,?చేస్తున్నదీ ఏమిటో,?, నా బ్రతుకు ఏమిటో ,,?నాకే అర్థం కావడం లేదు !!  మనిషిగా సహజమైన  జీవ నం గడిపే బదులుగా,, కృత్రిమ అనందం తో ,వెకిలి వేషాలు వేస్తూ, క్రూర మృ గం వలె అరుస్తూ ,నిజంగా ," నేను ఒక  గొప్ప మూర్ఖుడి ని అవుతున్నాను  ! అని తెలుస్తోంది!
కనీసం ఎవరూ చూడకుండా ,, ఒక్కసారి అయినా ,కృష్ణుని విగ్రహం ముందు నిలబడి , నేను చేసిన  తప్పులు ఒప్పుకుంటూ రెండు చెంపలు వాయించు కోలేని నా అహం నా అజ్ఞానం , పరమానంద కరమైన కృష్ణ ప్రేమను దూరం చేస్తుందని  నేను గ్రహించ లేక పోయాను! నా ఈ పాపానికి పరిష్కారం ఉంటుందా?
నా . ఈ ఘోరమైన  అపరాధాలను   శ్రీకృష్ణ పరంధాముడు మన్నించేనా?
నా ప్రవృత్తి నుండి నివృత్తి అయ్యే  మార్గం ఏ నాటీకైన కృష్ణయ్య కరునించే నా??
తెలిసి కూడా నిజం చెప్పలేని  నా మేకపోతు గాంభీర్యం ,  లేనిదంబం  నటిస్తూ బ్రతికే నేను ,, మనిషి ని అనిపించుకునే యోగ్యత నాకు ఉందా??
నాకన్నా ఆ జంతువు లు ఎన్నో రేట్లు  నయం , కదా !
వాటి బ్రతుకులో  నా వలె నటన లేదు;,అబద్దం చెప్ప వు!, ఎవరిని మోసం చెయ్యవు,!
ఎంత సహజంగా పుడతాయో అంత సహజంగా చస్తా యి అవి!
నిజం చెప్పాలంటే మనిషి కంటే చక్కగా ధర్మంగా జీవిస్తాయి జంతువులు !
కానీ నేను అంతకన్నా హీనం !
మనిషి లా బ్రతకడం తెలియని నాకు ,  ఇలా బ్రతికే అర్హత  ఉందా? అని,,
ఇంటా,, బయటా , డబ్బు  దర్జా , పదవీ , గుర్తింపు  ల  కోసం ప్రతీ రోజూ  ఎన్ని వెధవ వేషాలు వేస్తూ  ఎందరినో  మోసం  చేస్తు వచ్చాను !;
? రోజుకు  ఎన్ని నాటకాలు ,ఎన్ని అబద్ధాలు ? ఇంత అనర్థం జరిగాక
ఇప్పుడనుకుంటే  ఏం లాభం ?
""వృద్దనారీ పతివ్రతా ""వలె,. ఉంది ,,నా   ఈ పరితా పం!!
నేను  చేసిన పాపం !!
, నన్ను ,కాల్చి వేయకుండా ఉంటుందా? చెప్పండి !!
ఇప్పుడు ,ఏం చేయను,నేను??
తలచుకుంటే  నా బ్రతుకు పై  నాకే రోత  పుడుతోంది !
చ్చీ ,!చీ ,! నాదీ,ఒక బ్రతుకేనా??""
నా  అహం ఎవరికి ఉపయోగ పడేనూ?
నా అధికారం ఎవరిని ఉద్దరించేను?
ఇలా , అత్మ విచారణ చేస్తూ,గడచిన జీవితంలో కి, ఒకసారి, వెనక్కి తిరిగి చూస్తే , , ఏం మిగిలింది ??అంతా మోసం, దగా ,కుట్ర!!,,
చెప్పుకోడానికి ఒక్క మంచి పనీ  కూడా ఎవరికీ చేయలేదు!!
కనీసం ప్రేమతో  నైనా మాట్లాడ లేదు !
,సహాయం అయితే అసలే  చేయలేదు,!
పేదవారికి  పిలిచి ఏ నాడూ పట్టెడు అన్నం  కూడా పెట్టలేదు!డబ్బులు ఇవ్వలేదు!
ఎన్నడూ ఎవరికీ కూడా ప్రేమతో ఆప్యాయత ను పంచ లేదు !
పైగా  అహం తో తిట్టాను! గద్దిం చాను!
చిన్న పిల్లలను కాలితో తన్నాను !
నోరు పెద్దగా చేసి , అందరిలో బూతులు ,, తిట్టాను ,!
నేను చెప్పినట్టు వినని వారిని  , తిట్ల దండకం తో భయపెట్టి,
నాకు భయపడేలా ,నేను ఏ పని చెబితే  అది చేసేలా కుక్కిన పేనుల మార్చేశా ను!
అలా చేయడం ప్రెస్టేజ్ గా గర్వంగా  భావించాను !
అలా అధికారం చలాయిస్తూ ఉంటే,నాకు గర్వంగా దర్జాగా ,అనందం గా అనిపించేది!!
కానీ ఇప్పు డిప్పు డే ,మెల్లగా అర్థం అవుతోంది,!!
నా  వారంతా  చాటుగా నన్ను అసహ్యించు కుంటు ,, ఉమ్మేస్తు, పోతున్నారని ,, ""పాపాత్ముడు , దుర్మార్గుడు ,! వాడి నోరు పడి పోనూ !""అంటూ శాపనార్ధాలు పెడుతూ  తిట్టుకుంటూ పోతున్నారని   గ్రహించాను!
మెల్ల మెల్లగా తెలుస్తోంది, నా ప్రవర్తన ఎంత భయంకరంగా ఉందో?!
జ్ఞానం తో వినయం , అజ్ఞానం తో గర్వము, అహం వస్తాయి అంటారు ! నిజమే కాబోలు !!,
నా విషయలో అదే నిజమైంది !!
పరమాత్ముడు శ్రీకృష్ణుని గురించి తెలియని వారు తాము " మహా గొప్ప!"  అనుకుం టూ ఉంటారు!!
కానీ ఎప్పుడైతే ,,కృష్ణ చైతన్యం  గురించిన జ్ఞానం తెలుస్తూ ఉం టుం దో ,, అప్పుడు తనకు తెలియకుండానే," చిన్న""గా అవుతుంటాడు !.
కృష్ణుడు అనే కొండ దూరంగా ఉంటే ,,చేతి వేలు పరిమాణం లో కనిపిస్తు ఉంటుంది!!
కానీ సమీపం లోకి వెడితే అదే కొండ , అంటే శ్రీకృష్ణుడు ,,, నీ కంటే ఎంత గొప్పగా , పెద్దగా మహోన్నతంగా ఉంటాడో తెలుస్తూ ఉంటుంది!!
తన గర్వం , తననే  భగవంతుడికి దూరం చేస్తు ఉంటుంది! కదా!!
""జ్ఞాని. ""మాత్రం ,, విశ్వాసం తో  క్రమంగా  దైవానికి దగ్గరవుతుంటాడు. !
మనిషి. తన జీవితంలో,ఎవరిని విశ్వసించాలి?ఎవరిని విశ్వసించకూడదు అన్నది నాకు ఈ  నిజ జీవిత సంఘటన లు చూస్తే ,, అర్థం అవుతోంది
""ఒక పెద్దమనిషి, చావుబ్రతుకుల్లో ,కష్టంగా ఊపిరి తీస్తూ , కొట్టు మిట్టాడుతూ ఉన్నాడు ,,!
బంధువులు అంతా చుట్టూ చేరి,"" ఎప్పు డు పోతాడా,,ఈయన !"", అని ఎదురు చూస్తూ ఉన్నారు!  ,
   ఆయన తన ముగ్గురు కొడుకులను దగ్గరకు  పిలిచాడు !
ఇంకా ఎక్క డెక్క డ , డబ్బు దాచా డో  చెబుతా డెమో అని పరుగున వచ్చారు  తండ్రీ వద్దకు !!
""పెద్దవాడు ఉన్నాడా ?""
""ఉన్నా ,నానా!! ఇదిగో ఇక్కడ !!""
""నడిపి వాడు ,,,?""
""ఇదిగో "!!నేను ఇక్కడే ఉన్నా ; నీ ప్రక్కనే !""
""మరి ,చిన్నోడు  ఎక్కడ రా ?""
""అయ్యో! నేను నీకు ఎదురుగా ఉన్నా,, నా న్నా!! నీకు కనపడటం లేదా??""
""మీరు ముగ్గురూ ఇక్కడే ఉంటే,మరీ ,షాప్ లో ఎవ రుంటారు రా ?? అంటూ బరువుగా శ్వాస తీస్తూ ,
ఆయన కోపానికి వస్తూ ఉంటే ,, ఆ కోపంలో తుస్సుమన్నది అతడి ప్రాణం !
అలా   బంధం దేనితో ఎక్కువగా  పెంచుకుని ఉంటే ,అదే అలవాటు మనిషి  అంతిమ  శ్వాస వరకూ   ఉంటుంది!!
మరో వాస్తవ సంఘటన చూద్దాం !
ఒక కృష్ణ భక్తుడికి  ప్రతీ రోజూ ,ఉదయం 4 గంటల కే లేచి ,చేతిలో  మాల త్రిప్పుతూ "  హరే కృష్ణ"" మంత్రం ,,జపించడం అలవాటు!!
అనుకోకుండా  ఆయనకు పక్షవాతం వచ్చి ఆ చేయి కాలు  పడిపోయి , హాస్పిటల్ లో చేరాడు!!
మరునాడు , ఉదయం 4 am అయ్యేసరికి ఆయన చేయి  పైకిలేచి చేతి  వేళ్ళు  మాల త్రిప్పుతూ ఉన్నట్టుగా కదలడం చూస్తూ నర్సులు డాక్టర్స్  అందరూ  ఆశ్చర్య చకితులు అయ్యారు!
ఇదీ అలవాటే మరి!!
మరొక రకం అలవాటు చూద్దాం !
ఒకాయన కు సిగరెట్ బాగా  త్రాగడం అలవాటు  chain smoker!
ఆయనకు , జ్వరం వస్తే హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు!
ఉదయం డ్యూటీ చేస్తున్న సిస్టర్ వచ్చి ధర్మ మీటర్ అతడి నోట్లో పెట్టింది ,!  నిద్రలో ఉన్న పెద్దాయన ఆ థ ర్మా మీటర్ ను సిగరెట్ గా భావించి, రెండు వేళ్ళతో పట్టి , పైకెత్తి"" ఉఫ్, ఉఫ్"" అంటూ నోటితో పొగ త్రాగుతూ  ఉన్నట్టుగా అనుకుంటూ ఆనందంగా కనిపించడం చూసి సిస్టర్ బిత్తర పోయింది,!
అలవాటు లో ఏది మంచి ఏది చెడు అని తెలియనంత అజ్ఞానులు ఎవ్వరూ ఉండరు
కానీ మంచి అలవాటు కావాలి , దైవ భక్తి, భయం ఉండి తీరాలి !!
ఈ రోజుల్లో ఫోన్  లు ,,టాబ్ లు లేకుండా జీవితం లేదు అన్నంతగా అందరూ చిన్నా పెద్దా తేడా లేకుండా  వాటికి బానిసలు  అవుతున్నారు ,
ఫోన్ చేతిలో లేకుండా తినడం లేదు! ,పడుకోవడం లేదు ,,! ఏ పని లేకుండా ,ఖాళీగా ఉన్నప్పుడు   విశ్రాంతి తీసుకోవడం ,,ధ్యానం చేయడం , ఇంట్లో వారితో సంతోషంగా గడుపుతూ నవ్వుతూ  ముచ్చట్లు చెపుతూ ఉండటం ఇలాంటి ఆనందాలు  ఎప్పుడో  మరచి పోయారు!
ఒకాయన  తన "ఫోన్" ఎక్కడో  పోగొట్టుకొని, ఆ రంధి తో  డిప్రెషన్ లోకి వెళ్లి పోయాడు!
మరొకడు కుక్కపిల్ల తప్పి పోయిందని , డిప్రెషన్ లో పడి పోయి  ,,అంటే బుర్ర పనిచేయడం మానేసి ,వెఱ్ఱి చూపులు చూస్తూ ,,తిండి నిద్రా మానేశాడు,
,ఇలా వస్తువుతో ,మనిషితో  "బద్దం "" అంటే వ్యామోహం అతిగా  పెంచుకోవ డం వల్ల మానసిక బలహీనత ఏర్పడుతూ ,ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది
ఇది వస్తు ప్రపంచం !
,ఇది  ఉపయోగించు కోకుండా , అవి లేకుండా ఉండలేము !జీవితం గడవదు !!
నిజమే ,దీనిని
కాదనే వారు ఎవరు?
కానీ  ఆ వస్తువు తో attachments    అతిగా పెట్టుకోవద్దు!!
అన్నింటి లో కృష్ణుడు అంతర్యామి గా ఉన్నట్లు భావిస్తూ , శ్రీకృష్ణ ప్రసాదంగా  అనుకుంటూ ఉపయోగిస్తూ , జీవిస్తూ ఉంటే ,,నీకు అదే అలవాటుగా మారి పోతూ  క్రమ ,క్రమంగా   ఆ అలవాటు ,నిన్ను  భగవంతు ని. సన్నిధికి  చేరుస్తూ ఉంటుంది  , అనడం లో సందేహం లేదు! ఇది వేద సమ్మతం !
""శ్రీకృష్ణానుభవం  "కలగడం అనేది , ఒక్క రోజులో ఒక మాసం ఒక సంవత్సరం లో  గానీ పొందేది కాదు!దానికి నిరంతర సాధన కృషి తపన , కృష్ణ ప్రేమ కావాలి ;
అది వస్తువు కాదు , కదా,,ఎంత వెల అయినా పెట్టీ కొనడానికి!;"
అది  నీకు ఇష్టమైన  మనిషి కాదు ,,రమ్మన్నపుడల్లా రావడానికి !!
అది హృద యాంత ర్గత మైన మధుర భావన !!
కృష్ణ తత్వం తెలిసి, కృష్ణ లీలల చింతన , చేస్తూ , కృష్ణ భక్తుల సత్సంగం లో ఉంటూ ,కృష్ణుని పూజిస్తూ స్మరిస్తూ ,,కృష్ణ భజనలు, కీర్తనలు గానం చేస్తూ శ్రీకృష్ణ  స్తోత్రం విధిగా  చదువుతూ ,తీరిక వేళల్లో కృష్ణుని గురించిన జ్ఞానాన్ని కలిగించే గ్రంథాలు పఠిస్తూ ఉండగా  ఉండగా ,తనపై ,నీకున్న  అనురక్తి కి భక్తి తత్పరత కు గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం తప్పక  లభిస్తూ ఉంటుంది!!
అందుకు
ముందు యోగ్యత సంపాదించాలి !!,
" అడగందే అమ్మైనా అన్నం పెట్టదు !""అంటారు కదా!
అలాంటిది "దైవ అనుగ్రహం ""పొందడం , అనేది ఏదో ఒక అధికారి వద్దకు వెళ్ళడం కాదు కదా !!
సర్వాధికారాలు కలవాడు, సర్వాంతర్యామి ,సర్వజ్ఞుడు , అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు పరమాత్ముడు శ్రీకృష్ణా భగవానుడు !!
అయినా కూడా గోవిందుడు భక్త సులభుడు!
అంతటివాడు కూడా, నీవు ఆర్తితో, ఆర్ద్రత తో  ,, ""గోవిందా , హరి గోవిందా, గోకుల నందన గోవిందా! భక్త వల్లభ గోవిందా!,,భాగవత ప్రియ గోవిందా !
అంటూ ప్రేమానురాగాల తో పిలిచే   నీ పిలుపుకు , ఆ భక్తి బంధానికి  కట్టుబడి ,నిన్ను అనుగ్రహిస్తూ ఉంటాడు
ఇదే అలవాటు  గా చేసుకుంటే , అంతిమ ఘడియల్లో ,ఆత్మానందం కలిగిస్తూ   మనల్ని ,శ్రీకృష్ణుని  సన్నిధానం లోకి చేరుస్తుంది!
ఈ భార్య భర్త పిల్లలు బంధువు లు ఎందరున్నా కూడా , తోడు ఉండేవాడు ఆ గోవిందుడు ఒక్కడే!
బ్రతికి ఉన్నప్పుడు ,ప్రాణం లేనప్పుడు , ప్రాణం లా అ దుకొని ,,తన అక్కున చేర్చుకొని ,ప్రేమతో జీవన్ముక్తి ప్రసాదిస్తాడు  ఆ గోవిందుడు!;
శ్రీకృష్ణుని నమ్మి చెడిన వారు  సృష్టి లో లేరు, !
ఎంత విశ్వాసం ఉంటే అంత కృష్ణానుభవం ప్రాప్తిస్తుంది !
పూర్వ జన్మ కర్మ బంధాలను , సంచిత పాప పుణ్యాల  మూటలను తొలగించే హరినామ గాన  వైభవాన్ని  మన అలవాటుగా చేసుకుందాం ,!
,శాశ్వతము ,పరమానంద కరము ,అయిన సచ్చిదానంద ఘన స్వరూపుడైన ఆ గోవిందుని నామాన్ని విడవకుండా మరవకుండ  తలచుకుంటూ మానవజన్మ ను సార్థకం చేసుకుందాం !
హే కృష్ణా , !మాధవా ! మధుసూదనా , !కేశవా ,! నారాయణా  !నిన్ను భావించి సేవించుకు నే భావ సంపదను , స్ఫూర్తిని సంకల్పాన్ని , మాకు  అనుగ్రహించు  తండ్రీ!!
హే గోపాలా ,! హే కరుణా సిందో,! హే దీన శరణ్యా!! శరణు! శరణు !శరణు !
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...