Wednesday, March 25, 2020

మహిళా దినోత్సవ

Mar 5, 2020
____&_________"
దుర్గాదేవి మహిషాసుర మర్దనం ,లాంటి దుష్ట శిక్షణ కోసం అనేక శక్తి రుపా లలో అవతరించింది, అనీ విన్నాం !,,
మహావిష్ణువు దశావతారాలలో అదే దుష్టశిక్షణ కోసం అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి!
అవేమీ మనం కళ్ళతో చూసినవి కాదు కానీ ,,"అమ్మ "అనే  మహిళ  మాత్రం దేవతా స్వరూపంగా, ధరణి పై వెలిసింది !
ప్రతిరోజూ ఆమె , అనేక అవతారాల్లో  తన కుటుంబ పోషణ చేస్తూ ఉండడం  , వివిధ పనుల్లో లీనం అవుతూ ఉండడం  ఇంటింటా  మనం చూస్తున్నాం ,!
, వంటచేస్తూ,బట్టలు ఉతుకుతు ,ఇల్లు శుభ్రం చేస్తూ, పిల్లలకు చదువు చెబుతూ, ఉద్యోగం చేస్తూ,పిల్లలను ట్యూషన్ తీసుకెళ్లడం ,సంగీతం , నాట్యం  యోగా  , డ్రాయింగ్, కరాటే, క్రీడల లో ప్రోత్సాహం , బజార్ లో కూరగాయలు తేవడం , షాపింగ్ , పండగలు పర్వదినాలు చేస్తూ ఉండడం ,దేవాలయాలకు తీసుకెళ్లడం  అప్పుడప్పుడు సినిమాలకు వెళ్ళడం ,,సెలవుల్లో పిల్లలతో అమ్మమ్మ నానమ్మ ల వద్దకు. తీసుకెళ్తూ  ఉండడం,, ఇలా తమ పిల్లలకి భర్తకు సంతోషంగా  ఉండటం కోసం మహిళామణులు ఎన్నో పనులు చేస్తూ,,బాధ్యతలు , చేపడుతూ ఉన్నారు,,,  అనేక అభివృద్ది రంగాల్లో   పాల్గొంటూ , తమ ప్రతిభ రాణించడానికి మహిళలు  నిత్యం చేసే అపురూప విన్యాసాలు ,సాహసోపేత  నిర్ణయాలు , నిజంగా శ్లాఘనీయం !"
అయితే ,ఇందులో తనకోసం అనేది ,రవ్వంత కూడా  ఉండదు,!
స్వార్థం లేని ,విశ్రాంతి తీసుకో ని ,   కత్తి లేని నిరంతర పోరాటం  లో అలుపు ఎరుగని యోధురాలు ఈ మహిళ !
,,ఈ మహా సంసార  సాగరం లో ఆమె నావ లాంటిది, తన కుటుంబాన్ని క్షేమంగా ఒడ్డు చేర్చడానికి ,తాను నీళ్లలో నానుతూ , అంటే శ్రమిస్తూ,ఉంటుంది ఆమె!!
, ఆమె  ఒక్క క్షణం ఇంట్లో  లేకుం టె , ఆ  ఆనంద నిలయం బొత్తిగా   బోసి పోతుంది!!
ఆమె శక్తి తోనే కుటుంబం లో చేతనత్వం ప్రచోదనం అవుతుంది !!
ఇంటిలో అమ్మ ఉంది అంటే, అష్ట మహాలక్ష్మి వైభవం   ఆ ఇంటింటా తాండవం చేస్తూ ఉంటుంది!!
ఎన్ని లక్షలు ఇచ్చినా ,ఎన్ని సార్లు పొర్లు దండాలు పెట్టినా , ఎన్ని కట్న కానుకలు సమర్పణ చేసుకున్నా , అమ్మ ప్రేమకు  మమతకు  సరిపో దు !!
, ఈ అమ్మ దయ కోసమే కదా  ఆ శ్రీమన్నారాయణుడు కూడా   దుష్ట శిక్షణ నెపంతో ,,రాముడూ కృష్ణుడూ  రూపాల్లో పసి పాపలై , యశోదా నందుల ముద్దు తనయుడి గా , కౌసల్య కైక సుమిత్ర ల గారాల కుమారులు గా అవతరించారు !!
అమ్మ ఒడిలో చల్లదనం ,అమ్మ చను బాలలో కమ్మ దనం ,అమ్మ లాలనలో లాలిత్యం , అమ్మ మాటల్లో చెప్పలేని అనుభూతి ఆదరణ ,అమ్మ తినిపించే గోరు ముద్దల లో  అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉన్నంత మధురా నుభవం , దేవుళ్ళు కూడా , ఇవన్నీ అనుభవిం చి తరించారు !!
రుక్మిణీ సీత, సతీదేవి , ,రాధాదేవి లాంటి పర దేవతలు    కూడా ,మహిళామణులు గా  మానవ జన్మ ఎత్తారు!
అద్భుతమైన అమ్మతనం లోని కమ్మదనాన్ని వారు  చవి చూశారు  ,!
మనకు ఆదర్శంగా నిలిచారు కూడా ,!
అమ్మ చనుబాలు త్రాగుతూ పెరిగిన వారి కందర కూ , అరణ్య వాసం చేసినా ,ఎన్ని సమస్యలు ఎదురైనా , బాల్యం లోనే ఘోర రాక్షసుల ను మట్టుపెట్ట  వలసి వచ్చినా కూడా దానికి  సరిపోయే  శక్తి దైర్యం సాహసం,, అమ్మ ప్రేమతో   ఊపిరి పోసుకు న్నాయి కదా!
,అమ్మ అపర సరస్వతి ",వలె  వీణాపాణి" యై , వీణ ను మీటు తూ సప్తస్వరాలు పలికించ గలదు !!
వయొలిన్ వాయిస్తూ , , వేణువు ను ఊదుతూ ,, కూచిపూడి, భరత నాట్య ప్రదర్శన చేస్తూ నవరసాలను పండించ గలదు ;!
,, మృదంగాన్ని  ,అద్భుతంగా తాళ బద్దంగా  మోగించగల దు !
,, ఇటు త్యాగరాజు  పంచ రత్న కీర్తనల నూ ,, అటు  సినిమా సంగీతా న్నీ , అలవోకగా అతి మధురంగా  ఆలపిస్తూ  సంగీత  రసికులను అలరించగలదు కూడా !   ,, ,,ఇలా అనేక  నాట్య గాన  సంగీత సాహిత్య వాయిద్య , కళా రంగాల్లో తనకు తానే సాటిగా అపర సరస్వతీ దేవి అవతార రూపాల్లో   ప్రావీణ్యత  ,తో  పురుష ప్రపంచాన్ని ఆశ్చర్యపడేలా చేస్తూ ఎక్కడ చూసినా తానే అనే దుర్గాదేవి గా ప్రత్యక్ష మౌతూ  ఉంటుంది నేటి మహిళ!!
రక్షణ శాఖలో , పోలీస్ మిలిటరీ శాఖలలో,,తన ఆత్మవిశ్వాసాన్ని , మనో నిబ్బరం ప్రదర్శిస్తూ  దేశ సేవ చేస్తోంది !
,తన చతురత ప్రజ్ఞ  తెలివి తేటలు కేవలం  తన కుటుంబం వరకే పరిమితం కాదు అని చాటి చెబుతూ ఉన్నట్టుగా ,అమ్మ తన విశ్వరూపాన్ని ,,  విదేశాల్లో కూడా   విస్తరింప జేస్తోంది !!
తన  బుద్ది కుశలత నూ  పరిస్తితులకు అనుగుణంగా  ఎప్పటికప్పుడు సరి దిద్దుకుంటు , అభివృద్ది పథంలో , ఇటు కుటుంబాన్ని ,అటు దేశాన్ని తాను ముందుండి నడిపిస్తూ ఉంది!!
ఆ వీర ధీర శూర నారి గా సాహసాన్ని దైర్యం  ప్రజ్ఞ లను ప్రదర్శిస్తూ ముందుకు పోతూ ఉంది !
అంతేకాదు,శాస్త్రీయ , సాంకేతిక పారిశ్రామిక  రాజకీయ ,వైద్య విద్యా రంగం లాంటి  అనేక విభాగాల్లో తానేంటో నిరూపించుకుంటున్న నేటి  భారతీయ  వనిత  నేటి మహిళ !!
అన్నింటికీ మించి  అమృత స్వరూపం లో అమ్మ గా, దైవం వలె , అడగకు న్నా ఇవ్వగలి గేది తన అనంతమైన మాతృ ప్రేమ !!,
ఏ అమృతము మహిళ యొక్క  ప్రేమానురాగాల కు దీటు రాదు , సరి పోదు కూడా ,!
అమ్మ నుండి తీసుకునే ఈ తల్లి ప్రేమ ,అమూల్యం !, వెలకట్టలేి నిది!,, మరచి పోలేని అనుభవైక వెద్యం అయిన అద్భుతమైన అనురాగ బంధం అమ్మది!!
ఏ బంధం అయినా తెంపు కోవచ్చును ,,కానీ ఈ పేగు తీపి గల మాతృప్రేమను , తెంచుకొలేనిది !!
ఏ కష్టం వచ్చినా కూడా కొడుకు కానీ బిడ్డ కానీ తలుచుకునే ది  అమ్మా అమ్మా అంటూ తమ తల్లినే ,అంటే ఈ అమ్మనే కదా !!
తాను ఎంత పెద్ద పదవిలో , పనిలో ,శ్రమ చేస్తూ ఉన్నా కూడా ప్రతీ మహిళ  ,తన భర్త ,పిల్లలు తిన్నారో లేదో అంటూ రోజూ వేదన  పడుతూ,ఉంటుంది !!
వాళ్ళు తినగా మిగిలింది  ఉంటే ,,దానితో కడుపు నింపు కునేది  అమ్మ!
ఏ రోజైనా తన భర్త కానీ పిల్లలు కానీ తినకుండవుంటే   ,వాళ్ళు తిరిగి వచ్చేవరకూ ఉపవాసం ఉండి , పచ్చి మంచనీళ్ళు అయినా ముట్టుకోకుండా , గుమ్మం వైపు చూస్తూ పడి గాపులు పడుతూ ఎదురుచూస్తూ ఉంటుంది అమ్మ !!
త్యాగం లో  మహిళ ను  మించిన దేవుళ్ళు లేరు!! దేవతలు లేరు ,!!
అమ్మకు  తన పిల్లలకు భర్తకు  ,భోజనం పెట్టడం ,వసతులు చేయడం ,ఇంట్లో వారికి కావలసిన వసతులు సమకూర్చడం  ఆనందం !!
వారు ,, అడగక ముందే,ఎవరికి   ఎప్పుడూ , ఏ వేళల్లో ఏమేమి  కావాలో అర్థం చేసుకొని  అందిస్తూ ఉండడం లో , అవన్నీ సంతోషంగా  ఇవ్వడం లో ఆమె పొందే   ఆనందం   అనంతం !, అది వర్ణనాతీతం ,!
ఎప్పుడూ అమ్మ తన పిల్లలకు భర్త కు  ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటుంది ,!!
ఇదే ఆమె సంతోషం !, పిల్లలు భర్త నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉంటూ తిరిగితే ఆమెకు స్వర్గ సౌఖ్యం  !
అనుభవం లా  పిచ్చి ఆనందంతో  తననుతాను మరచి పోయి పరవశిస్తూఉంటుంది  అమ్మ !!
,ఇవ్వటమే గానీ తాను , ఎన్నడూ ఏది తీసుకోవడం తెలియని ప్రేమ పిచ్చిది  అమ్మ !!
ఇంటి ఖర్చులు , పాలవాడి ఖాతా ,కిరాణా దుకాణం , షాపింగ్ ఖర్చులు ,దవాఖాన  బిల్స్ ,, ఇస్త్రీ లెక్క , పిల్లల  ఫీజులు  ,ఇలాంటివన్నీ ఎప్పుడంటే అప్పుడు ఏ రాత పూతా లేకుండా  ఇవన్నీ నోటికి చెప్పేస్తుంది !!! అద్భుతమైన ప్రజ్ఞ పటిమ ప్రతిభ గల మేథా సంపత్తి గల ది అమ్మ!!
పిల్లలకు భర్తకు గానీ , తన కుటుంబం లో  జ్వరం వస్తె , జలుబు పడితే ,వారికంటే ఎక్కువగా బాధ పడిపోతూ ఉంటుంది మంచి మనసు గల  అమృత హృదయం గల  తల్లి  ,!!
అమ్మ దయ అపారం!!
,అనుక్షణం పిల్లలకోసం భర్త కోసం  ఆమె  నిరంతరం పడే  ఆరాటం శ్రమ ఆవేదన ,ఆతృత , లో తాను  జబ్బున పడితే లెక్క చెయ్యదు  అమ్మ !!
ఒళ్ళు కాలిపోతూ ఉన్నా , నిలబడి పనిచేసే ఓపిక శక్తి లేకున్నా ,"" ఏం కాలేదు ,!!నాకేం కాదు ,!"" అదే తగ్గపోతుంది!"" అంటూ అంత చేతగాని నీరసం తో కూడా ఇల్లు సర్దుతూ ఉండడం , కిందా మీదా పడుతూ  వారికి కావాల్సింది  చేసి పెడుతూ వుండడం  మా అమ్మ కు మాత్రమే చేతనైన   అనితరసాధ్యం అయిన అద్భుత విద్య!!
అలాంటి మహిళామణులు ప్రత్యక్ష దైవాలు ,
మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ శక్తి స్వరూపాలు !
కూతురు గా , విద్యార్థిని గా , ఉద్యోగిని గా ,,భార్యగా, తల్లి, చెల్లి, అత్తా ,ఆడపడుచులు  లాంటి పాత్రల్లో జీవిస్తూ ప్రేమానురాగాలను పెంచుతూ ఉంది
నేటి  ఆధునిక సాంకేతిక ,శాస్త్రీయ విధానం తో పోటీ పడుతూ ప్రగతి పథంలో శరవేగంగా దూసుకు పోతూ ఉంది
తనకు ఉన్నవి రెండు చేతులు,
కానీ,శతావధానం చేస్తున్నట్టుగా అనేక విభిన్న కార్యక్రమాలు నిర్వహించే నేటి మహిళా లోకానికి సాదర ప్రణామాలు సమర్పిస్తూ మనసారా అభినందస్తున్నా ము!
మహిళ శక్తికి జై
ఓమ్ శ్రీ మాత్రే నమః
జగదంబ విశ్వ పాలి ని మాతాకి జై
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...