Wednesday, March 25, 2020

ఎందుకిలా అవుతోంది ?

Mar 8, 2020
ఈ ప్రశ్న అందరూ అనుకునేదే!" దేశంలో ,రాష్ట్రం లో ఏదైనా కరోనా లాంటి  అనుకోని విధంగా విపత్కర పరిస్థితుల్లో ,లేదా ఆత్మీయులు దూరం అయితే నో  బాధతో అంటూ ఉంటాం!!
ఇక ,"నాకే ఎందుకు  జరుగుతోంది ,?""
అనే ప్రశ్న ,,అనుకోకుండా ,మనకు ఏదైనా బాధ కలిగినప్పుడు  మాత్రమే వేసుకుంటా ము !
కానీ  ఈ ప్రశ్న ను సుఖం అనందం కలిగితే అనుకోము !!,కదా !!
కారణం ,,చెత్త టీవీ సీరియల్ ,సినిమాల  ప్రభావం ,!!
ఎవరికైనా కావచ్చు !!కానీ తనకు మాత్రం కాకూడదు!! అన్న మానసిక దౌర్బల్యం,!
ఎంత దారుణం !! అది మనిషి చేసే పనేనా ??"", ఉదాహరణకు ,
ఒక సత్యనారాయణ స్వామీ వ్రతం జరుగుతుంటే భక్తులు వస్తారు కూర్చుని ముచ్చట్లు పెడతారు ,, కథ వింటారు ప్రసాదం గ్రహిస్తారు  అనుకుందాం !!
కానీ  , వారు
ఎక్కడా మనసు నిలపరు ,! కారణం మనసును నిలిపే శక్తి లేదు!
మనసుకు అలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదు !అది ఆడించినట్టు  దాని చేతిలో బొమ్మలా ఆడుతూ ఉన్నారు !
అందరూ మనుషులే , !కానీ మనసు ఒకటే ! కానీ చూసే తీరు వేరు ,!ఆలోచనలు వేరు !
ఇంట్లో టీవీ సీరియల్ చూడటానికి , ఈ వ్రతం చూడటానికి  వారికి పెద్ద తేడా అగుపించదు ,!! అది మరచిపో తూ ఉంటారు ఇది కూడా అంతే!
ఈ బ్రతుకులు ఎప్పుడూ ఇంతే!
ఉదయం లేచినప్పటి నుండి  టీవీ సీరియల్ వలె ,తాగుతూ తింటూ  పనులు చేస్తూ బజార్లు  తిరుగుతూ ,రాత్రి పడుకునే వరకూ  30 కి పైగా ఎన్నో సీరియల్స్ ఈ విధంగా మన " మనో ఫలకం ' టీవీ స్క్రీన్ అనే  తెర పై చూస్తూ ఉంటాం !!
కానీ ఏ ఒక్కటీ కుదురుగా నిలవదు !
కారణం మనసును నియంత్రించే శక్తిని కోల్పోవడమే !
వృద్దాప్యంలో కుటుంబ భారాన్ని కొడుకు కోడలు కు అప్పగించి నిశ్చింతగా ఉందామను కుంటు ,,,వాళ్ళు ఆడించినట్టు ఆడుతున్న విధంగా ఉంటుంది !!
""ఏ మాత్రం తప్పు లేదు,, భౌతిక అవసరాల కోసం తన వారిపై నమ్మకం ఉంచి ఆధార పడటం లో!!
కానీ మనసు మాత్రం మన చేతుల్లో ఉండాలి. !!
ఎన్ని పనులు చేస్తున్న ,, చూస్తున్న  కూడా అందులో పరమాత్మను  భావించగలగాలి !
ఏదో టీవీ సీరియల్  చూస్తూ మరచిపోతే ఫర్వాలేదు !!
కానీ  ,అనుక్షణం మనల్ని కాపాడుతూ ఉండే దైవాన్ని మరచిపోతే ఎలా ?'
""పెట్టీ పుట్టాలి అంటారు కదా !
అందుకే ఇతరుల లో ,నీలో దైవాన్ని దర్శిస్తూ  వారికి ఇవ్వడం నేర్చుకోవాలి
!అదే మన తో తోడుగా నిలిచేది!వస్తువును మాత్రమే కాదు ,, ఆ వస్తువును అంటిపెట్టుకుని ఉన్న నీడను కూడా చూడు!
అలాగే పరమాత్ముడు నిన్ను నన్ను అంతటా అంటిపెట్టుకొని ఉన్నాడని గ్రహించు !!
భగవంతుడు  అనే  భావం ఆ టీవీ సీరియల్ వలె ఒక  "మాయ ""కాదు !
"పదార్థం" కాదు! ,
,""తాత్కాలిక సౌఖ్యం ""కాదు !
శాశ్వత ఆనందాన్ని, జ్ఞానాన్ని ,ప్రశాంత చిత్తాన్ని మనకు  అనుగ్రహించే అద్వితీయమైన  అలౌకిక అపురూప అద్భుతమైన ఒక భావ  సంపద ,!!
మనం అనుభవిస్తున్న ప్రతీ వస్తువు మనిషి ధనం ఇల్లు బంధు బలగం అన్నీ భగవంతుని ప్రసాదాలు అని  మనకు తెలుసు !!
ఏ ఒక్కటీ తేలేదు , తీసుకెళ్ళే వీలు లేదు అని కూడా మనకు తెలుసు!!
మంచి చెడూ పాప పుణ్యాల మూట లు తప్ప !!, ఇది కూడా తెలుసు !!
ఇంత తెలిశాక ,ఇక ,""నాకే ఎందుకు జరుగుతోంది??"" అన్న భావ దారిద్య్ర ము  ,సంకుచిత భావం నుండి  విముక్తి పొందాలి  కదా!!
ఏది జరిగినా అంతా ""ఈశ్వరెచ్చ"" !!ప్రకారం జరుగుతూ ఉంది"నీవు ఉన్నాయి లేకున్నా ఎవరూ నీకోసం రారు
జగత్తులో ఏ మార్పు ఉండదు !
ఉన్నప్పుడు అయ్యో!భగవంతుని భావించలే క పోయాం కదా అనే వేదన జీవాత్మ ను  కాలుస్తూ ఉంటుంది!!
ఏదైనా తనదాక వస్తేనే తెలుస్తూ వుంటుంది,,కదా !!
కష్టాలు ఉంటేనే బ్రతుకు అనే సాగరం లో లోతు తెలుస్తుంది,,!
కొన్ని తీసేస్తున్నా డు భగవంతుడు అంటే   అర్థం ,,నిన్ను సరియైన దారిలో పెట్టడానికి అని గుర్తు!!
ఇచ్చినవాడికి తీసుకునే హక్కు ఉంటుంది!!
నీది అంటూ ఉంటే నీవు తయారు చేసింది ఉండాలి కదా! ఏముంది నాది అనేది ??
ఈ శరీరమే నీది కాదు! చుట్టూ చూసేవి అంతకంటే కాదు కదా!!
నీది అనేది భగవంతుని గురించిన భావన ,ఒక్కటే !!
అదే జీవన్ముక్తి నీ కలిగించేది!! అని మరచిపోవడం నిజమైన దౌర్భాగ్యం !దురదృష్టం !!
పదార్థం పై ,,బంధు జనాలపై  ,,తాత్కాలిక సుఖ సంపదల పై కాకుండా,, మన అనురక్తినీ ,ప్రగాఢమైన విశ్వాసాన్ని ,,ప్రేమను ఆ కరుణామయుడు అనంత గుణ సంపన్నుడు లోక రక్షకుడు దయానిధి అయిన పరమేశ్వరుని  చరణాల ముందు శరణాగతి భావంతో సమర్పించు కుందాం!!
""అచ్యుత !అనంత! గోవిందా ,,శరణు !
పరంధామ ,!పరాత్పారా! శరణు !
హే జగత్పితా !
హే దీన బందో!
హే పరమాత్మా !
శరణు !
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా ,!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...