Saturday, April 18, 2020

కరోనా పై సమరం ! -2

Apr 12, 2020
రోజూ  మనం టీవీ లో  చూస్తున్నాం ,,!.
, ఈ దిక్కుమాలిన కరోనా వ్యాది ఎలా ,ఎంత వేగంగా అంతటా  ప్రబలు తూ,,,  ఒక లక్ష పైగా మనుషుల నిండు ప్రాణాలు బలి చేస్తూ  ,వ్యాపిస్తూ వెళ్తూ ఉందో  ,,అందరం   గమనించాలి !!
దేశం  ,,రాష్ట్రం లోని ప్రజలు సంపూర్ణంగా ప్రభుత్వానికి సహకరిస్తే తప్ప , మనం కరోనా వ్యాది నియంత్రణ చేయలేము కదా !
""డబ్బు ఉంటే దాచుకోవాలి ,!;
చెప్పకండి !!
కానీ ,,
కరోనా లాంటి ఘోరమైన కష్టాలు వస్తె ,దాపరికం లేకుండా వెంటనే  చెప్పుకోవాలి ,!!",
""మేమున్నాం ,మీకు అండగా !""
,  మీరు ,,ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు,,!""
అంటూ ప్రకటన ల ద్వా రా ,,మనకు  నిత్యావసర వస్తువులను  దౌర్యాన్ని ,,ఉచిత వైద్య సహాయాన్ని. ,వైద్య ,బృందాన్ని ,రవాణా సౌకర్యాన్ని 24గంటలు  ప్రభుత్వం స్వచ్చందంగా మనకు అందిస్తూ ఉంటే ,
ఎందుకు రోగాన్ని దాచాలి !? చెప్పండి!""
అదేమైనా ,బంగారమా ,??""అది మనిషిని నిలువునా కాల్చేస్తుంది రా బాబూ !" , అని  నెత్తి నోరు కొట్టుకొని ప్రభుత్వం  చెబుతున్నా  కూడా ,,
,నిమ్మకు నీరెత్తినట్టు ,మూర్ఖంగా ఎక్కడో ఎవరికీ దొరక్కుండా దాక్కుంటే ఎలా ?""
""ఇదేం ,"పోలీస్ దొంగాట!"" కాదు కదా ,! దాక్కోవడానికి !!""
""పిల్లి వచ్చే ,,
ఎలుకా భద్రం !""
ఎక్కడి దొంగలు అక్కడనే !""
గ ప్,,! చుప్ !"
అని చిన్నపిల్లల వలె ఆడుకోడానికి  ఇది hide and seek,game,, కాదు కదా !
ఇది ""ప్రాణాలతో చెలగాటం !"" సుమా !""
నీవు వేసే ప్రతీ ఒక్క అడుగూ , నీ సభ్యత నూ సంస్కారాన్ని , నీ మానవత్వాన్ని  చాటు తుంది ! "
దేశసేవ చేయడం అంటే ,నిన్ను. నీవు  కాపాడుకుంటూ ,తోటివారిని కూడా నీతో పాటు భద్రంగా ఉంచుతూ ఉంటే , అదే దేశ రక్షణ ,దేశ భక్తి ,దేశ సేవ అవుతుంది ,!""
లేదా ,దేశాన్ని  ప్రమాదం లోకి నెట్టడం అంటే , ,తీవ్రవాదం అవుతుంది,,సుమా !
"కాబట్టి ,,
"",తస్మాత్ ,జాగ్రత్త !!""
భారత దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ,,తన  బాధ్యతను గుర్తించాలి ,,!!
దీనికోసం ఎవరి నుండి గానీ,ఎలాంటి ప్రతిఫలాన్ని గానీ,సానుభూతిని గానీ,సహాయాన్ని గానీ ,ఆపెక్షించ కూడదు ,!!""
ఇది నీ  "ప్రథమకర్తవ్యంగా "
గుర్తించాలి !!
జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు  ,వారి వృద్దాప్యం లో ,ఎదిగిన కొడుకులు ,,కూతుళ్ళు ,కోడళ్ళు ,అల్లుళ్ళు తమ్ముళ్లు చెల్లెళ్ళు ,బంధువులు ఇలా ప్రేమతో ,సంతోషం తో , ఏది ఆశించకుండా ,నిస్వార్థంగా ,వారిని ప్రాణానికి ప్రాణంగా చూస్తూ ఎలా సేవించు కుంటు ఉంటారో ,
అలా మనం ,,ఇప్పుడు, మన జాతిని ,దేశ గౌరవాన్ని దృఢంగా నిలబెట్టుకోవాలి,!!
దేశ మాత మనకు , ఇన్నాళ్లూ, సమృద్దిగా ,సంతృప్తి కరం గా అన్ని వసతులు అందించినపుడు అనందంగా ఉన్నాం ,కదా !"
మరి ,,ఇపుడు ,,మన  దేశ మాత చిక్కుల్లో పడిపోయింది ,!"
,బాధతో విల విల లాడుతూ ,మరణిస్తున్న తన సంతానం గురించి ఎవరికీ చెప్పుకోలేని ,ఏమీ చేయలేని ,నిస్సహాయ స్థితిలో పడి , తెలియని భయాందోళన కు గురి అవుతోంది , మన దేశ మాత  !""
""తన సంతానం వైపు ఆర్తితో ఆశగా ,చూస్తోంది , తనను రక్షించు కోమని ,!""
కష్టాల్లో ఒకటి కావాలని !""ఆశిస్తూ ఉంది ,,,
___మాతృభూమి సేవలో పాల్గొనాల్సిన  తరుణం మనకు ఇపుడు  కలిగింది !!"
అనాడు మన దేశానికి స్వాతంత్య్రం రావడం కోసం ,, కాశ్మీరు నుండి ,ఆసేతు హిమాచలం  వరకూ భారతీయులం  అందరం  ఒకటయ్యా ము!!"
కష్టపడి,ప్రాణాలొడ్డి,,, స్వాతంత్ర్యం సాధించు కున్నాం !
ఇపుడు కూడా అలాంటి అవకాశం వచ్చింది ,!!
మన దేశభక్తిని నిరూపించుకునే సందర్భం అత్యవసర పరిస్థితి   ఇపుడు  ఏర్పడింది !,
రండి , ముందుకు !; ఉత్సాహంతో, ,, మాతృ భూమికి అందజేసే సేవాభావం తో !"రండి,,!!"
అందరం ఒకటి అవుదాం !
మన సత్తా ఏమిటో ,ప్రపంచానికి చూపు దాం ,!
దేశ భక్తిని ఐక్యతా భావాన్ని , ఆచరణ ద్వారా అమలు చేద్దాం !
కులాలు మతాలు ,జాతులు , బాషా సంస్కృతి సంప్రదాయాలు వేరైనా  భారతీయులం మేమంతా ఒకటే ,! అని ప్రపంచానికి తెలియ జేద్దాం!!""
"" ,కరోనా వ్యాది నివారణకు కావల్సిన చర్యలు  ఆచరణ లో చూపిస్తామని  ప్రతిజ్ఞ చెద్దా ము ,!
మానవత్వాన్ని చాటుదాం !
కరోనా పై సమరశంఖం పూరిద్దాం ,!
ఇంట్లో ఉందాం !
మాస్క్ లు మరచిపోకుండా రక్షణ కవచం వలె ధరించు కుందామ్!
చేతులు ,అవయవాలు ,దుస్తులు ,, ఇల్లు  నిత్యావసర వస్తువులు శుభ్రంగా ఉంచుదాం !
వ్యాది లక్షణాలు ఉంటే , భయపడకుండా ప్రభుత్వానికి తెలియ జెద్దాం !!"
కలసి ఉంటే కలదు సుఖం !
మనసు ఉంటే మార్గం ఉంటుంది !
మనిషికి సాధ్యం కానిది అంటూ ప్రపంచం లో ఏ ది కూడా లేదు !
కష్ట పడదాం,అందరికోసం ,దేశం కోసం ,మన కోసం మనం ,,నమ్మిన  దైవం కోసం !""
దృఢమైన సంకల్పం తో అచంచమైన విశ్వాసం తో  మాతృభూమి ఋణం తీర్చుకునే  ఈ  అవకాశం ,, ఖాళీ సమయాన్ని
సద్వినియోగం చేద్దాం !""
భారత్ మాతా కీ జై !
వందేమాతరం !""
స్వస్తి !""
హరే కృష్ణ హరే కృష్ణా !!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...