Saturday, April 18, 2020

కరోనా పై సమరం !

Apr 11, 2020
"ఏ ప్రాణీ కైన ,"ప్రాణం కంటే తీపి అయినది జగతిలో మరొకటి ఉండబోదు కదా !"
మరి ,ఇపుడు అదే ప్రాణం ,తనని తాను రక్షించు కోవడం లో  బహు  ""సంకట స్తితి " లో పడింది !!
, ""న భూతో ,న భవిష్యత్!""
అన్నట్టుగా  ఏ యుగంలో నూ ,, ఏ చరిత్ర లో నూ, ప్రపంచం ఇంత దయనీయ స్థితిలో ఉన్నట్టుగా మనకు  కనిపించదు ,!""
, దీనికి కారణం ఏదైనా ,కారకులు ఎవరైనా , మనం అందరం,, దేశం ,ప్రాంతం ,అనకుండా ఘోరమైన దురవస్థ లో పడి పోయాం !
ప్రపంచం అంతా  అంతులేని  కష్టాలు , అకాలమరణాలు , ,భయాందోళన లు  అనుభవిస్తూ ఉన్నాయి !!""
""భగవంతుడు లేడు ,ఉంటే కనపడాలి కదా ,,!""
అంటూ చాలా మంది భౌతిక వాదులు  అంటూ ఉంటారు !
ఇప్పుడు  మన అందరకూ,,  స్వచ్చందంగా సేవ చేస్తున్న ప్రతీ స్త్రీ పురుషుడు ప్రత్యక్ష దేవతా స్వరూపాలే ,కదా !!
దేవుడు ఎన్నడూ ,, ఎప్పుడూ, ఎక్కడకు,తానే స్వయంగా రాడు !""
ఏదో ఒక రూపంలో ,వస్తూ ,దీనులకు ఆర్తులకు ,అభయహస్తాన్ని అందిస్తూ ఉంటాడు !!__ఇప్పుడు    కరోనా రోగులకు తమ ప్రాణాలకు తెగించి ,రాత్రి పగలు అనకుండా నిరంతరం సేవ చేస్తూ పరిశ్రమ చేస్తూ ఉన్న డాక్టర్స్ ,నర్సులు   ఆ దేవుడి రూపాలే !
మనకు  ఎదురుగా ,""కనపడే
దేవుళ్లు !"" వారు !",
ఆ  పోలీస్ బృందాలు, !
దేవుని ""శ్రీరామరక్ష  ""కంకణ రూపాలు వారు !;
,పారిశుధ్య కార్మికుల అంకితభావం చూస్తుంటే , దేవుడే స్వయంగా ఇన్ని  రూపాల్లో అవతరించి  
మనకు బ్రతుకు పై తీపిని ,ఆశను ,నూతన ఉత్సాహాన్ని  కలిగిస్తూ ఉన్నాడు అనిపిస్తుంది !""
___""తాను ఉన్నాడు !""అన్న సత్యాన్ని  ,, వారి ఉత్సాహ పూరితమైన సేవా భావం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆ  భగవంతుడు !!
ఈ కరోనా లాంటి ,దుష్ట శక్తుల నుండి  శిష్ఠులను రక్షించే భారాన్ని  కూడా ,, ఈ విధంగా ,, తాను వహిస్తూ ఉన్నాడని అనిపిస్తోంది , !!"
వారు కూడా ,మిగతావారి వలె , మన వలె ,,
తమ కుటుంబాల మధ్య ,, తాము కూడా , అనందంగా  హాయిగా గడప వచ్చు !""
నిజంగా వారంతా అలా అనుకుంటే  ,,మన పరిస్తితి , ఏం గానూ ??""
మన ,దేశ రక్షణ చర్యలు ఎంత దయనీయంగా ఉండేవి !?!""
దేశ సరిహద్దుల్లో శత్రువు నేదుర్కొనే ఆ  వీర జవాను ల వలె ,,
తమ , దరి దాపులో పేషంట్ రూపంలో ,ఎదురుగా భయంకరంగా నిలిచి, తమను చూస్తూ ఉన్న  ఆ  మృత్యువు కు , భయపడకుండా ,భగవంతుని పై భారం వేసి , దేశసేవ యే పరమార్థం గా భావించి ,కరోనా పై సమర శంఖాన్ని పూరి స్తు ,రోగుల బ్రతుకులో ఆశను ,ఉత్సాహాన్ని అందిస్తువున్న ఆ వైద్య బృందానికి  ,, మనం ఏమిచ్చి ,ఏ విధంగా ఋణం తీర్చుకొనగలం ? చెప్పండి ??""
,,__నిజంగా,_ వారు , మనిషి రూపాల్లో ఉన్న  దేవతలు !!
",,మానవతా దృక్పథం తో , కనీస నైతిక విలువలు  కాపాడుతూ , రాబోయే తరం లో వారి గురించి,చెప్పుకునేలా  ,వారు తమ  అద్భుతమైన  సేవలు  మనకు అందిస్తూ ఉన్నారు ,,!!"
ఇలాంటి నిస్వార్థ ,ఉదార ,ఉన్నత భావాలు ,సంకల్పం కలిగిన  వారు మన భారతీయులు అని చెప్పడానికి చాలా గర్వంగా ,అనందంగా ఉంది !!""
""మానవతా ధర్మం ""అంటే ఏమిటో,, వారు అక్షరాల  తమ విధులను చక్కగా నిర్వహిస్తూ ,,నిరూపిస్తూ  ఉన్నారు ,,;;"
""సరియైన సమయంలో ,,సరియైన treatment ,సరియైన చికిత్స ,,సరియైన రోగులకు అందజేస్తూ ఉండడం ,గమనార్హం !!""  అందుచేత ,మన ,ప్రభుత్వం  పనితనాన్ని ప్రశంసించి తీరాలి మనం !;""
  ప్రస్తుత ,సమస్యల ,పట్ల, వాని పరిష్కారం పట్ల   చక్కని అవగాహన   కేంద్ర రాష్ట్ర , ప్రభుత్వాలకు   ఉందని తెలుస్తోంది , ,!!""
కానీ ,,ఇంకా ,మనలో ,,కొందరు  ,,తమ అజ్ఞానం తో ,మొండితనం తో ,ప్రభుత్వం వారి సూచనలను ,హెచ్చరిక లను , వ్యాది తీవ్రత గురించిన అప్రమత్తత ను , బొత్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు ,!!
తమకు అంటిన ,లేదా'  తెలియకుండా  అంటించుకున్న రోగ లక్షణాలను ఎవరికి  చెప్పకుండా  దాస్తూ ,ఉన్నారు ,!!""
తమ కుటుంబ సభ్యులకు కూడా వారికి తెలియకుండానే అంటిస్తూ ,,వ్యాధిగ్రస్తుల ను ఇంకా  పెంచుతూ ఉన్నారు !
ఇది తెలిసి చేసినా ,తెలియక చేసినా ,వారి అపరాధాన్ని  భగవంతుడు కూడా క్షమించ డు  కదా !!
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...