Saturday, April 18, 2020

శ్రీకృష్ణ శక్తి చైతన్యము

Apr 13, 2020
""ఎవరికీ చిక్కని  ఆ బ్రహ్మాండనాయకుడు,
,చిన్ని కృష్ణుని రూపంలో యశోదమ్మ భక్తి భావనకు  ఆమె పూర్వజన్మ కృత సుకృత ఫలాలకు , చిక్కాడు ! "
"" మహ మహా తపో ధనులకు కట్టుబడని పరమాత్ముడు తల్లి ప్రేమకు, భక్తి తత్పరత కు  పట్టు బడినాడు !"
"భక్తుల హృదయాల్లో  తానే వచ్చి కొలువై  ఉంటాడు . ఆ కృష్ణుడు !!"
""అయినా మనవరకే  కృష్ణుడు ఉండాలని అనుకోడం ,చాలా పెద్ద  పొరబాటు ,కదా !""
""కృష్ణుడు ,పున్నమ చంద్రుని వెన్నెల వలె చల్లని వాడు !;
  సూర్య కాంతిి వలె. శక్తిని ,జ్ఞానాన్ని  చైతన్యాన్ని కలిగించే వాడు !""
,ప్రకృతి మాత వలె తన  ఒడిలోని ప్రేమా నురాగాలు  ఆదరణ ,అందించేవాడు!!
నదీ జలాల వలె  మన బ్రతుకులో  తీపిని , ప్రాణాన్ని     ఆనందాన్ని పుష్కలంగా అందించే ఒక  అమృత భాండం  ఈ కృష్ణుడు !!""
మన లాగా ఎందరో భక్తులు ,ఆర్తులు ,అభాగ్యులు ,, ఈ  పవిత్ర ధరిత్రి పై జన్మించి  కృష్ణ సందర్శనార్థం  ఎదురుచూస్తూ ఉన్నారు !!
కృష్ణుడు చేయాల్సిన  దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ,ధర్మాన్ని పాటిస్తూ,,లోక కళ్యాణానికి  ,,అతడు సంకల్పించిన  అనేక  మహత్తర కార్యక్రమాలకు మనం అడ్డు నిలవడం  బావుండదు కదా !,""
_""తీయని  పవిత్ర యమునా నదీ జలాలను  దోసిలి తో పట్టి కడుపారా త్రాగి , ఆ మధురానుభూతి నీ మనసారా  అనుభవించాలి !""
,కానీ , ప్రవహించే  యమునా తరంగాలను  ఆపాలని భావించడం తప్పు కదా ,!"""
పంటలు ,పండించడానికి దాహార్తులకు ,ఇలా
ఎంతమంది కో అందాల్సిన ఆ మహా సంపద మనకే స్వంతం కావాలని అనుకోవటం తప్పే కాదు ,ఘోర, అపరాధం కూడా  అవుతుంది ,!""
"" ,,కాబట్టి,,  ఓ నా ప్రాణ స్నేహితులారా!!.
సహజ చైతన్య ప్రకాశవంతమైన , ఆ తేజో పుంజాన్ని, ఆ ,కృష్ణుని ఆపమని  మీరు నన్ను కొరవద్దు ,సుమా !"
కృష్ణుడు కోందరివాడు  కాదు ! .
అతడు అందరివాడు ,!""
""అతడు పరమాత్ముడు !""
మన రేపల్లె బృందావన వాసులకు  ,,తన వరంగా కృష్ణుడు ఇచ్చిన జ్ఞాపకాలను ,కృష్ణ లీలలను  ,తీపి అనుభూతులను మన గుండెల్లో భద్రపరచి ,వాటిని నెమరు వేస్తూ ,కృష్ణుని సౌందర్య  రూప గుణ లావణ్య  వైభవాలను  స్మరిస్తూ,. నిరంతరం ,కృష్ణ నామ ధ్యాన చిత్తంతో తరిస్తూ  దన్యులం కావాలి ,!;""అంతే !
ఇదే మన కర్తవ్యం !!""
కృష్ణుడు తన అపారమైన ,  కరుణతో   మనకు అనుగ్రహించిన   దివ్యమైన భావ సంపద , యే, ఆ కృష్ణ చైతన్యం  !.
దానితో" ,కృష్ణ భక్తిని ,పెంపొందించు కుంటూ, ఆ సచ్చిదానంద ఘన స్వరూపాన్ని మరవకుండ  ,,విడవ కుండా ,మన హృదయాలలో  నిక్షెపించు కుందాము;!"
, ""హరే కృష్ణ హరే కృష్ణా ,""
!అన్న నామ మంత్ర ఉచ్ఛారణ ,గాన వైభవాన్ని , మనం అనుభవిస్తూ ,కృష్ణ భక్త లోకానికి అందజే ద్దాం !
శ్రీకృష్ణ భక్తులలో మన లాంటి  గోపికల వంటి ""ఆత్మ సమర్పణ,శరణాగత భావం "" మరెవ్వరూ చేయలేరు !""
అన్న విధంగా , కృష్ణుని భక్తి శ్రద్ధలతో  నిత్యం  సేవించుకుందాం !
కృష్ణుడు ,మన వలె ఒక ఒక భౌతిక శరీరం కాదు, !!"
అందరూ బాహ్యంగా  పంచుకోడానికి !
అతడు ఒక మధురానుభూతి ! దాన్ని
అంతరంగం లో నిక్షిప్త  చేసుకోవాలి !"
ఎంత తీసుకున్నా తరగని పెన్నిధి కృష్ణుని సన్నిధి !""
మనలాంటి అజ్ఞాని,అమాయక ,అవిద్య , పల్లె వాసులకు నిగ్రహాన్ని ,ఏకాగ్రతను నిలుపుకొడానికి వీలుగా  కృష్ణుడు , ఒక స్వరూపం తో దర్శనం ఇస్తున్నాడు !!"
, శిఖిపించ మౌళి, పీతాంబర ధారి, కస్తూరీ తిలక ధారి, వేణుగోపాల మూర్తి  ,,నంద యశోదా నందనుడై, గోపికా లోలుడై, గోవుల కాపరియై ,, అల్లరి చిన్ని కృష్ణు డై ,,గోపాల బాలుర అనురాగం పంచిన  చెలికాడై,బృందావన విహారియై ,,పూతన శకటాసురా బకాసుర ,త్రుణావర్త సంహారియై, కాళీ య మర్ధనుడై ,గోవర్ధన గిరి ధారియై,  ఈ రాధ కు విదేయుడై ,,,నవనీత చో రుడై ,
  ఇలా తన చిద్విలాసం తో  ఎన్నో అపరూప భంగిమల్లో ,,
మన లను ధన్యులను చేశాడు , ఆ శ్రీకృష్ణ పరందాముడు !!
సర్వాంతర్యామి వైభవాన్ని  అనవరతం  ఆస్వాదిస్తూ   ఆనందించాలి కానీ , మన శ్రమ లేకుండా  కృష్ణుడు దొరకాలి అనుకోడం తప్పు కదా !!
అయినా ,, ఈ మాంస నేత్రాలతో కృష్ణుడి దివ్య మంగళ విగ్రహ రూపాన్ని దర్శించ గలమా చెప్పండి ??""
,అతడి అనుగ్రహం ఉంటే తప్ప !!"
అందుచేత ,కళ్లు మూసుకొని  మీరు ధ్యానిస్తూ ఉండండి ,!! మెల్ల మెల్లగా,,
మీరు మీ హృదయాలలో కృష్ణసందర్శన భాగ్యాన్ని పొందుతారు ,!!""
అపుడు ,, మీకు బాహ్య ప్రపంచం తో పనిలేకుండా పోతుంది !!
కళ్ళు తెరిస్తే ""కృష్ణుడు ,, ఎక్కడ మాయమై పోతాడేమో ""అన్న తపనతో   అంతరాళం లో ప్రకాశించే ఆ కృష్ణుడితో రమిస్తూ మీ అస్తిత్వాన్ని ,దేహ చింతన ను మరచి బ్రహ్మానందం  స్థితిని పొందుతారు !!""
ఈ సాధనా బలం తో సాక్షాత్కరించిన కృష్ణుడు ,ఇక మిమ్మల్ని విడిచి  దూరంగా పోలె డు !!"
ఆ కొం టె కృష్ణయ్య మిమ్మల్ని  కూడా పోనీయడు !""
ఇలా సదా మీరు కృష్ణుని తోనే ఉంటారు !!"
శరీరాలు ఉన్నప్పుడు చేస్తున్న ఈ ఆరాధనా బలం ,శరీరాలు ఒది లాక ,, ,మిమ్మల్ని శాశ్వతంగా  ఆ పరంధాముని పరమ థామానికి తీసుకెళ్తూ ఉంటుంది !"
____&____
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...