Apr 20, 2020
కరోనా కు కోపం వచ్చింది ,!""
"కరుణ లేని కరోనా" ""అంటూ జనం తనని నిష్టారాలు ,శాపనార్థాలు పెడుతూ ఉండడం చూసి భరించలేక కైలాస హిమాలయ వెండి కొండపై, గౌరీ దేవితో ప్రమథ గణాలతో కొలువుతీరిన భోలాశంకరుని సన్నిధి కి చేరి తన గొడునంతా వెళ్లబోసుకున్నాడు ,
""హే సదాశివ !,పరమేశ్వరా ,5!శరణు దేవదేవా !
ప్రభూ ,!""
"" శివుని ఆజ్ఞ లేనిదే చీమ అయినా కదలదు !""
అంటారు గదా !
భూలోకంలో ని మానవులు ,,తమ ప్రవృత్తిలో దానవులను కూడా మరిపిస్తున్నారు !
ఆకారం మనిషి !
కానీ వాడు చేయని అరాచకం , అకృత్యం లేదు ,!!
ఆ నాడు రాక్షస జాతి తమ అజ్ఞానంతో ,,అవిద్య , అనాగరికంతో చేసిన దారుణాలు ,,
ఇప్పుడు ఈ మానవులు , చేస్తున్నారు !!
, దేవా,,!మీరు మనిషికి దయతో ,ఇచ్చిన అపార జ్ఞానం ,చదువు ,,వనరులు , ఆయువు , బంధు బలహాలు సుఖ భోగాలు అనుభవిస్తూ ,, మానవత్వం మరచి ,పాపభీతి ,,లేకుండా పరమ నీచంగా పశువుల కంటే హీనంగా , భూమిపై ,,,ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నా డు !""
"" హే ,స్వామీ !!,, ఈ మనుషులు ,దేశాలు ,ప్రాంతాలు శత్రుత్వం పెట్టుకొని నిరంతరం తగాదా పడుతూ , దాడులు చేస్తూ,, పరస్పరం చంపుకుంటూ ,,ఉన్నారు !!"
"వావి వరుసలు లేవు !,బంధుత్వం లేదు! ,స్నేహం అని లేదు ,!పెద్దవారు ,కన్నవారు ,అన్నది లేదు !
బాలలు ,చిన్నపిల్లలు వృద్దులు అన్న కనికరం లేకుండా హింసిస్తూ ఉన్నారు !
అనుబంధాలు , ప్రేమలు మరచిపోతున్నారు !""
ఏం చెప్పను స్వామీ ,??""
చంపడం , లేదా చావడం మామూలు విషయం అయిపోయింది వీరికి !""
అన్నను తమ్ముడూ ,తల్లిని కొడుకు ,భార్యను భర్త ,సంబంధాలు ,బంధువులు ,అని చూడకుండా అస్తి కోసం , మాట పట్టింపు కోసం దూరం అవుతున్నారు !""
,బంగారం లాంటి తమ మానవజీవితాన్ని మట్టి పాలు చేస్కుం టూ వున్నారు !!
, ఇలా బాధతో చెబుతూఉన్న కరోనా ను చూసి ,, ఈశ్వరుడు అన్నాడు
,"" నాయనా !,ఇది కలియుగ ధర్మం!
,బుద్దిని సక్రమంగా ఉపయోగించు కొకపో తే,, వారికే నష్టం,, కష్టం కూడా ,,!"
,ఇందులో నువ్వైనా ,,నేనైనా ఎం చేస్తాం చెప్పు??
ఎవరు చేసిన ఖర్మ వారే అనుభవించాలి,,మరి !""
కింకరునికి బాధ అనచుకొలేకుండ పోతున్నాడు !!"
""హే దయానిధి ,!
నీకు తెలియని విషయమా ,,ఈశ్వరా,!?
ఆ నాడు దక్షుడు నీతి నియమాలు ఉల్లంఘించి ,నిరీశ్వర యాగం తలపెట్టి ,అహంకరించి నీ ఆగ్రహానికి గురయ్యాడు ,! చివరకు తన కూతురు ,,మీ అర్ధాంగి అయిన సతీ దేవి తన యోగాగ్నిలో మీకు ఆత్మ సమర్పణ చేసుకుంటూ హతమైంది కదా !""
మీ కోపాగ్నికి గురియై , వాడికి ,,వాడికి వంత పాడిన వారంద రికీ ,,తగిన గుణ పాఠం చెప్పడానికి మీరు వీర భద్రుని సృజించారు కదా , స్వామీ,!""
""అవును ,! నిజమే ,కానీ ,ఇపుడు ఆ కథ చెప్పే అవసరం ఏమిటి , ,??""
కరోనా చెప్పుకు పోతూ ఉంది ,
""ఉంది మహాప్రభూ!,
అంతటి దారుణాలు అకృత్యాలు :ఇప్పుడు మానవులు చేస్తున్నారు !!
భూమిపై మీరు దయతో సృజించిన సమస్త ప్రాణికోటికి ఈ మానవుడు ముప్పు తీసుకొస్తూ ఉన్నాడు ,,దేవరా ,!"
స్వస్తి!"
హరే కృష్ణ హరే కృష్ణా !"
( ఇంకా ఉంది)
Tuesday, April 28, 2020
భగవంతుడా ! ఏది దిక్కు ? 2
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment