Tuesday, April 28, 2020

ఆనందం అంటే !

Apr 22, 2020
""సంతోషం"" అనేది ఇంద్రియాలకు మాత్రమే  పరిమితం ,!"
ఒక ,ఆత్మీయుడు చాలా రోజులకు  మనకు  కనబడితే ,,లేదా , అనుకున్నట్టు జరిగితే , అనుకోకుండా  డబ్బు వస్తె , ఇల్లు కొంటె ,పదవి దొరికితే , గుర్తింపు లభిస్తే ,ఇలా  ప్రాపంచిక సౌఖ్యాలు కలిగితే అది " సంతోషం !" అనబడుతుంది !!
కానీ ,
ఆ అనుభవం కేవలం    !
ఎలా అంటే , కొత్తగా
పెండ్లి అయ్యాక దంపతులకు కొన్ని రోజులు మోజు ఉంటుంది ,
సంవత్సరం గడిచాక ఆ మోజు తగ్గుతుంది !
ఇలా హెచ్చు తగ్గులు ఉండే సౌఖ్యాలు కేవలం  తాత్కాలికం ,!"
కానీ
,వస్తువు , లేదా మనిషి ,సంపద  లతో ప్రమేయం లేకుండా  తలచుకుంటేనే చాలు , మనసు పొంగి పోతూ ఉండే  ,ఆత్మలో కలిగే మధురమైన అనుభూతిని "ఆనందం"" అంటారు  !  భగవద్ ధ్యానం ,జపం, తపం , సేవా భావం ,,ఆత్మార్పణ   స్తితి ,,, నిరాపెక్ష తో చేసే దానం ,,సద్గ్రంద పఠనం ,సత్సంగం ,భజన ,   ఇలాంటి సత్కర్మలు ,,అన్నీ కూడా  శాశ్వత ఆనందాన్ని ఇస్తాయి !
ఇవి కాకుండా ,
ఆనందం యొక్క విశాల  స్వరూపాన్ని  చూద్దాం !
"ఆనందం "" నిజమైన  మానవత్వం , విలువలను సూచిస్తూ ఉంటుంది !!
ఇదే మనిషిలో దైవాన్ని చూడటం  కూడా  నేర్పుతుంది !
  ఆనందం అనేది " మానవ జీవన లక్ష్యం ! ,,గమ్యం"" కావాలి  కూడా !
మనం నిత్యం చూస్తూ ఆనందించే  ఈ ప్రకృతి అంద చందాలలో , , దూరపు నీలి కొండల్లో , హిమాలయ సానువుల్లో,లోయల్లో ప్రవహించే నదుల్లో ,సూర్యోదయ ,సూర్యాస్తమయ కాంతుల్లో శోభించే గగన వీదుల్లో ,ధరణి మాతా ధరించిన పచ్చని చీర లాంటి చేనుల్లో , పచ్చికబయల్ల లో ఉంది ఆనందపు నిధులు  ,
,   దైవాన్ని దర్శించాలని  తపన తో  చూసే కళ్ళు   ఉండాలి గాని,
,భగవంతుని సృష్టి  శిల్పకళా రచనా నైపుణ్యం లో ,నిత్య నూతన చిత్రాతి  చిత్రాల ఆవిష్కరణ చాతుర్యం లో ఎన్నో ,, ఆనందాల వెల్లువలు ,!
ఎన్నో రత్న మణిమయ మాణిక్యాల గనులు!
  ఎన్నో  సొగసులు! అనంతము అమోఘ ము  , అపురూపము  ,,కదా !
ఉదాహరణ కు ,, ఆ పరమాత్మ  వైభవం చెప్పడానికి ,శ్రీకృష్ణ పరందాముడు   శోభాయమానంగా నిరంతరం ధరించే  ఒక్క  నెమలి పింఛం చాలు !"
అందమైన ఆ నెమలి అపురూప సుందర రూపం , ఆ పక్షి లోని అపురూప  వర్ణాలు ,  వసంత ,శిశిర  ఋతువులో అది  పురి విచ్చి చేసే నాట్యం లో  , మనకు అగుపించే   సొగసులు చూడతరమా ?
వర్ణించ వశ మా ?
ఇలాంటి   అద్భుతాలు ఎన్నో ,,ఎన్నెన్నో !""
హే పరాత్పర !
,నీ లీలలు. అపారం !
నారాయణా ! ,నీవు మాకు కలిగించే ఆనందాల సీమల కు ఎల్లలు లేవు కదా !
,హే ,అనంతకోటి బ్రహ్మాండ నాయకా ,!నమో నమః !"
__అదే అనందాన్ని మనం కళ్ళ ముందు మరో రూపంలో   ఇప్పుడు ప్రత్యక్షంగా నిత్యం   దర్శిస్తూ ఉన్నాం !
__ ఈ _దుష్టకరోనా  నివారణ యజ్ఞంలో   సమిధలు గా మారి ,అంకితభావం తో ,నిరంతరం  శ్రమిస్తున్న డాక్టర్స్ ,నర్సులు ,పోలీస్ శాఖ వారు ,,పారిశుధ్య కార్మికులు  , ఉద్యోగులు ,  ,వలస  కూలీలకు  నిత్యాన్న దానం చేసేవారు ,,డబ్బులు ,బట్టలు ,ఆశ్రయం కల్పించేవారు ,,  వాడా వాడా తిరుగుతూ  కరోనా వ్యాధి గురించిన అవగాహన తెలియజేసే వారు ,, మీడియా మిత్రులు  , టీవీ యాజమాన్యం ,ఇలా ఎందరో మహానుభావులు . ఎండ అనకుండా ,అలసట లేకుండా,,తోటి వారి ఆరోగ్యం భద్రత ,సంరక్షణ కోసం ,అహర్నిశలు కృషి చేస్తున్నారు, కదా !
ఆనందం అంటే ఇదీ !
ఇంతకన్నా ఆనందం ,ఉంటుందా ?" అసలు,!
తోటి వారి సంక్షేమం కోసం ,ఆరోగ్యం ,వారి ప్రాణ రక్షణ కోసం చెమటోడ్చి ,,దేశం కాలం ,అనకుండా రెక్కలు ముక్కలు చేసుకుంటూ  కాపుగాస్తున్న ఈ వీర సైనికులకు  ఎన్ని సార్లు పాదాభివందనాలు  సమర్పించినా తక్కువే కదా !""
తమ ప్రాణాలు అడ్డుపెట్టి కరోనా వ్యాధి గ్రస్తుల ను కాపాడే దీక్ష తో , సంకల్పించిన  ఈ పవిత్ర యజ్ఞం లో   వారి అనుభవం "" బ్రహ్మానందాన్ని ""సూచిస్తూ  ఉంది !
,,ఆనందం అంటే ,,
వైద్య బృందం చేస్తున్న   స్వచ్ఛంద  సహకారం !!
ఆనందం అంటే ,,
,రాత్రి పగలు అనకుండా ,ఎండల్లో ,అర్ధ రాత్రుల్లో గస్తీ తిరుగుతూ , అటు  జనాలను , , ఇటూ కరోనా వ్యాధి పీడితుల ను కట్టడి చేస్తూ , ఇది డ్యూటీ అనుకోకుండా ,దేశ సేవగా ,  మానవ సేవగా ,ఇదే మాధవ సేవగా  భావిస్తూ ఉండడం !""
ఆనందం అంటే ,
  ,,కరోనా వ్యాధి పై  అలుపెరుగని పోరాటం  సాగిస్తున్న రక్షక భట శాఖ  బృందం చేసే శ్రమ దానం !""
___ఆనందం అంటే ,,
ప్రతి రోజూ ,, ,రోత , అనుకోకుండా ,విసుగు చెందకుండా , ,వీధులు ఊడుస్తూ ,మురికి కాలువలు శుభ్రం చేస్తూ ,ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తూ , ,  నగరాలను గ్రామాలను  పరిశుభ్రం చేస్తూ ,ఆహ్లాద వాతావరణాన్ని కల్పించడం!""
వీరంతా భగవంతుని రూపం లో వచ్చి మనకు అందంగా ఆనందంగా వసతులను ,వనరులను , ఏర్పాటు చేస్తున్నారు
మన కోసం
మన  యోగక్షేమాల కోసం
మన ప్రాణాల రక్షణ కోసం
మన కుటుంబాల భద్రత కోసం 
శ్రమించే ఆ సేవా సంస్థలు,బృందాలు ,ఉద్యోగులు  తమ తమ కుటుంబాలతో సహా  మన వలె ,
ఆరోగ్యంగా ఆనందంగా సంతృప్తిగా ఉండాలని
మనమందరం ఇంట్లో ఉంటూ ,భగవంతుని మనసారా ప్రార్థించుదాము!!
ఇలా ఒకరి కోసం మరొకరు తపించడం  లో ,,జీవించడం లో ,అవసరం అయితే ప్రాణాలు సమర్పించడం లో  దేశభక్తి ,దైవభక్తి , మానవధర్మం , నైతికత, ఉంటాయి !ఆనందం ఉంటుంది !
,అన్నిటికీ   మించి మనసుకు  కావల్సిన పరమానంద అనుభూతి  కలుగుతుంది !
పౌరుడు తన కున్న  స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను ,  ,శక్తి  సామర్థ్యాలను  సమాజ శ్రేయస్సుకు ,తద్వారా దేశసేవ కు   వినియోగించడం లో కలిగే  ఆనందాన్ని   ఇలా , తన స్వీయ అనుభవం ద్వారా  పొందాల్సి ఉంటుంది !"
విజయీభవ !
దిగ్విజయీ భవ !""
సర్వే జనాః సుఖినోభవంతు !
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...