Apr 20, 2020
మహాదేవా,,!
ఇక ఆ దేశంలో ,, అయితే ,, స్వామీ !
""దేవా !,ఏమని చెప్పను,, వారి తిండి విధానం ??"
వారు తినని జంతువులు లేవు!,ఘోరం! ఘోరాతి ఘోరం !"
. ఏమిటంటే ప్రాణులను ,మృగాలను ,జల చరాలను , ఆవి ,బ్రతికి ఉండగా నే ,,రాబందుల్లా పీక్కుతిం టూ ఉంటారు ,!
వాళ్ళు తినని జంతువు లేదు, ప్రభో,!
ఒక్క మనిషిని తప్ప !""
భూమి పై ఉన్న
కుక్కా, నక్కా, పంది, పాములు, ఎలుకలు ,,పశువులు ,, క్రూర మృగాలను, బల్లి , కప్పా ,లాంటి ప్రాణులను క్రమం తప్పకుండా నిత్యం ఆరగిస్తు ,అందులో పరమానందం పొందుతూ ఉన్నారు !!""
""ఈశ్వరా !
ఇక కనీసం నీళ్లలో బ్రతికే ఏ ప్రాణిని కూడా,, విడిచిపెట్టకుండా తింటారు!
""స్వామీ !,,
నీవు పుట్టించిన ప్రతీ ప్రాణులను , వారి కంటికి కనబడితే చాలు ,!
అదే తినడమే పనిగా పెట్టుకొని, మారణ కాండను సాగిస్తూ ఉన్న వారిని చూస్తుంటే , నా కోపాన్ని ఆవేశాన్ని ఆపుకోలేకపోతున్నాను !"" వారికి తగిన శాస్తి చేయాలని ,, మీ అనుమతి కోరకుండా ఈ కింకరు డు చేసిన ఈ చిన్న తప్పిదానికి ,,నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను,
మహాదేవ, దేవాది దేవా!"
సదాశివుడు మందహాసం చేస్తూ ,,
అయితే ,నీ ఈ అవతార క్రమానికి,,, ఆ మానవులు "కరోనా "అని బిరుదు తగిలించారు!"" అవునా??""
కింకరుడు తన తప్పు ఒప్పుకుంటున్నా ట్టుగా ,,తల వంచుకున్నాడు ,,
"" అవును ,శివ శంకరా! అభయంకరా ,!
ఈ విశ్వంలో ,,నీకు తెలియని విషయం ఉంటుందా , శివా?"
అయితే
ఇంతకూ ,, నీ ఈ దెబ్బకు వారికి బుద్ది వస్తుంది అంటావా ?
కింకరు డు ,తల అడ్డంగా ఊపు తూ ,సాష్టాంగ ప్రణామం చేశాడు ,,
""హే పరమేశ్వరా ,!
ఆ మానవుడు అంత తొందరగా మారే వాడు కాదు ,, స్వామీ,!
వాడికి వెనకచూపు లేదు !
పశ్చాత్తాపం లేదు !
పాపభీతి కానరాదు !
తాను పుట్టిస్తున్న ఆధునిక సాంకేతికత తో మితిమీరిన అహంకారం ,మదం ,ఈర్ష్య ,లతో రోజు రోజుకూ మృగంలా తయారవుతున్నాడు ,!!
వాడిని ఎన్నడూ నమ్మరాదు !!
తేనె పూసిన కత్తి!""
మేక వన్నె పులి !!
మోసం ద్వేషం పగ ,, ఇవన్నీ వాడి రక్తంలో జీర్ణిం చి ఉన్నాయి !
పులి ,సింహం ,ఏనుగు లాంటి ఏ క్రూర మృగాలను అయినా నమ్మవచ్చు నేమో గానీ ,,
ఈ నర రూప రాక్షసుని నమ్మలేం శంకరా ?""
శివయ్య కు జాలి కలిగింది ,తన కింకరు ని దీనా వస్తను చూసి,,
,,నాయనా !ఇంకా నీ మనసులో ఏదో చెప్పాలని ఉంది , సందేహించకుండా చెప్పు !!""
కింకరు డు కైలాస నాథుని పాదా లకు తన నుదురు తాకించాడు !
, చేతులు మోడ్చి నమస్కారం చేస్తూ ,,అన్నాడు
""హే శంభో శంకరా ,! మానవుడు అధర్మ మార్గాన్ని అనుసరించడం ,వల్ల సంభవించే దుష్పరిణామాలు చూసి ,,పరమాత్ముడు, కృష్ణుడుగా స్వయంగా అవతరించి ,, పాపాత్ము డైన ఆ దుర్యోధనునికి ,, ఆ దుష్ట చతుష్టయం కు,,వారికి సహకరించిన పద్దెనిమిది వేల అక్షౌహిణుల ను ,నిలబడి అర్జునుడి చే హతమార్చాడు !!""
తాను మాత్రం కేవలం రాక్షస జాతి అంతానికి పరిమితం అయినాడు !!""
ఎంత అధర్మం చేసినా
మనుషులను చంపే సాహసం చేయలేదు కృష్ణుడు !""
ఏనాటికైనా బుద్ది రాకపోతుందా అని అవకాశం ఇచ్చాడు గోవిందుడు !"
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!"
("ఇంకా ఉంది )
Tuesday, April 28, 2020
భగవంతుడా ఏది దిక్కు ?
Subscribe to:
Post Comments (Atom)
A Drama that became Real!
The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...
-
May 8, 2020 పగలే వెన్నెలా.... పల్లవి !" ____&___ "కరోనా వచ్చేరా ,కష్టాలు తెచ్చేరా !! కరుణ లేక మన వారిని చంపు చుండే రా!!...
-
Mar 28, 2020 "తీరని ఆపద ,ఘోర విపత్తు ""కరోనా వ్యాధి రూపంలో ప్రపంచం అంతటా ఒకేసారి వచ్చి పడింది! ఒకరికి మరొకరు సహాయం చేసుకునే...
-
Oct 24, 2019 Austin "రాధే శ్యామ్, రాధే శ్యామ్, రాధే శ్యామ్, !""అనే నామం లో , ఆ నామ గానం లో ఏదో తెలియని అనందం అద్భుత శక్తి ఉం...
No comments:
Post a Comment