Apr 28, 2020
"నేను ""అనేది ప్రాణి లో ఉంటున్న ఆత్మ యొక్క ఒక అద్భుతమైన శక్తి ,!
దీని అసలు స్వరూపం,ప్రభావం ,మన ఇంద్రియాలు , లేదా మనసు ద్వారా ప్రకటిత మౌతూ ఉంటుంది ,!"
"" ఒక వస్తువు పై ""మనసు పడటం"" అంటే ఈ ఇంద్రియాల ద్వారా తనకు కావాల్సిన పనులు చేయించడం ,ఇష్టమైన పదార్థాలను గ్రహించడం , ఇష్టం లేని వారిని ,లేదా వాటిని ద్వేషిస్తూ ఉండడం ,ఇలా లేచింది. మొదలు పడుకునే వరకూ మనం చేసే ఆలోచనలు ,పనులు ఇవన్నీ ఈ మనసు " ,నేను"" అనే భావం తో చేస్తు ఉంటుంది !
"మనసు లెని మనిషి ఉండడు !"
"మనసు లెని మనిషి___ ,మనిషి అనిపించుకో డు !
పిచ్చివా డి కి కూడా ఒక మనసు ఉంటుంది,
కానీ అది వాడి నియంత్రణలో ఉండదు ,
అంటే చెప్పినట్టు వినదు !
ఇలా మనసు చెప్పినట్టు మాత్రమే వినేవాడు ,లేదా చేసేవాడు నిజంగా పిచ్చి వాడే అవుతాడు !
""నా ఇష్టం !" నువ్వెవరు అడగడానికి !??""అంటూ ఒక ఉన్మాదం అనే మదం తో పశువులా ప్రవర్తిస్తూ,తప్పు ఒప్పు తెలుసుకునే ఆత్మవీచారణ శక్తి కోల్పోతూ ఉంటాడు! ఇలాంటివా రి మనసు ,వారి చేతుల్లో ఉండదు !
బొమ్మ వలె మనసు ఆడిస్తున్న ట్టుగా ఆడుతూ పోతారు !,,
ఇక్కడే ,భాగవత శ్రవణ ప్రాముఖ్యత ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది !
తన మనసే తనకు శత్రువు ,మిత్రువు కూడా !
అని గీతాచార్యుడు బోధించిన విషయం మనకు తెలుసు కదా !"" ఒక. ఉదాహరణ చూద్దాం !
,""__కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యము అనబడే శత్రువులు నీలో పొంచి ఉండి నిన్ను కాటు వేయాలని చూస్తూ ఉన్నారు!!
, ఈ విషయం నీవు గమనించడం లేదు !
""ముందు వాటిని జయించు తండ్రి !""
అంటూ ప్రణమిల్లుతూ వినయ విధేయతలతో,, భక్త ప్రహ్లాదుడు తన తండ్రి ,హిరణ్యకశిపుని కి హితబోధ చేస్తాడు ,!!
,""అంతటా ఉన్న ఆ శ్రీహ రి కోసం వెదుకుతూ , శత్రుత్వం,క్రోధం పెంచుకుంటూ ఉన్నావు
అసలు శత్రువు నీ హృదయంలో నే ఉన్నాడు !,
""వాడు అంటే శ్రీహరి కనిపించాలి అంటే,,,
,ముందు వీడు అంటే అహం కనిపించకుండా పోవాలి !"", తండ్రి ! అని"""
వేడుకుంటూ అంటాడు
అందుచేత ,,
""నేను ""అనే భావం ,మనసు జాగృతం అవుతున్నం తసేపు ""అహం""మేల్కొని ఉంటుంది !""
మన నిద్రావస్థలో ఉన్నపుడు ,,మనసు తిరిగి తన యధా స్థానం అంటే జన్మస్థానం లోకి చేరి పోతుంది !
""ఎక్కడ పుట్టిందో అక్కడే సమసిపోతుంది !!"మనసైనా ,!మనిషైనా ,! ఏదైనా ,!
నిద్రించే మనిషిలో మనసు ఉండదు ! ""నేను ,నాది ,నీ ది""అనే అహం ఉండదు !!"
__ఇక ,ఈ మనసుకు ఉపకరించే ఉపకరణాలు , కాళ్ళూ చేతులూ అన్నీ అలసటతో విశ్రాంతి అవస్థలో పూర్తిగా సేద దీరుతూ ఉంటాయి !;,
నిద్రిస్తున్న మనిషిలో కేవలం ప్రాణం మాత్రమే ఉంటుంది !
ఇది కూడా పరమాత్ముని అనుగ్రహం ఉంటేనే !!""
అనగా "శరీరం"" అనే బండి,,నిద్రలో ,అంటే రిపేర్ షాప్ లో చక్కగా ఉచితంగా రిపేర్ చేయబడుతూ ఉంది !
""రిపేర్ పని ""అయ్యేవరకు ,,అంటే శరీరం అలసట ,రుగ్మత లు తొలగి ,తిరిగి మంచి కండిషన్ లో చేతికి వచ్చే వరకూ,, హాయిగా పడుకుంటాడు జీవుడు అంటే ఈ మనసు ,!!
అదృష్టం బాగుంటే ,బ్రతికి బట్టకట్టే భాగ్యం ఉంటే ,,ఆయువు ఉంటే ,తెల్లారి లేస్తాడు ,!
లేదా వాడికిక్ ఇదే ఆఖరు దినం అవుతుంది ,!"
అనగా ప్రతి ఒక్కొక్క రోజూ ఉదయం లేవడం అంటే , జీవుడి ఆయువు ఆ ఒక్క రోజూ పెరిగినట్టు ,!అన్నమాట !
అందుకే , ఈ ఆనందాన్ని అనుగ్రహించిన సూర్యనారాయణ స్వామికి కృతజ్ఞత తో నిత్యం నమస్కరిస్తూ ఉండాలి !!
ఈ శరీరాన్ని ఇంత ఉత్సాహంగా హుషారుగా ఉండేలా , లోపల ఉన్న అస్తవ్యస్త వ్యవహారాలను చక్కబెట్టే పని చేసింది ఎవరూ?""
అంటే ,,! ఆ పరంధాముడే !!
మనలో ఉంటూ ,మన చర్యల్ని , ప్రాణ వ్యవస్థను ఉన్ కనిపెడుతూ ఉన్న ఆ అంతర్యామి చలవ యే, శ్రీరామరక్ష గా ఉంటూ,,,చేయాల్సిన కర్మలు పూర్తి చేసేవరకూ , మనల్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు ఆ పరాత్పరు డు !""
""మనసు"" అంటేనే ""ప్రాణం ,"
""ప్రాణం లేని శవానికి మనసు ఉండదు ,"!"
""ప్రాణం పోవడం"" అంటే ,ఆత్మస్వరూపం అయిన ఈ మనసు ,,తాను ఆశ్రయించి ఉన్న జీవుడిని ,, దేహి శరీరంలో నుండి వాయువు రూపంలో బయటకు తీసుకెళ్లడం ,!!""
ఇదే మరణం !
""మనసు ,ప్రాణం జీవుడు"" ఇవన్నీ ఒకటే !
స్వరూపాలు వేరు ! పని చేసే తీరు వేరు ! అంతే !!
చివరకు ప్రాణం ,మనసు ,జీవాత్మ లేని శరీరం , పతనమై , పంచభూతాల్లో కలిసిపోతుంది,!
(ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా!"
Tuesday, April 28, 2020
నేను ఎవడను? 2
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment