Apr 29, 2020
మనిషికి ఉన్న గొప్పతనం భావించ గలిగే జ్ఞానం ఉండటం !!""
ఏ ప్రాణికి లేని వరం ,భగవంతుని దయ వలన "" జ్ఞానం అంటే ఆలోచనా శక్తి ,""ఈ మనిషికి లభించింది !
""సంకల్పం ""అనేది మనస్సుకు ఉన్న గొప్ప సాధనాబలం !! దానితో ,కార్య సాధన చేస్తూ మనస్సుపై నియంత్రణ చేస్తూ, ద్యేయాన్ని చేరుకొడం మనిషి జీవితలక్ష్యం !
__అందుకే , ఈ మనసు యొక్క మహత్వం ,అద్భుతం! అమోఘం !"" ,,
మానవుడి ని పరమాత్మ వద్దకు చెర్చేది ,, పతనం చేసేది ఈ మనస్సే !
అది చేసే తలంపుల ప్రభావమే !!
దైవానుగ్రహం కలిగించేది , ఆత్మహత్య లు చేయించేది ,హత్యలు చేసేది ,,సమాజ సేవ చేయించేది ,జీవన్ముక్తి కలిగించేది ,,దానవుడిని చేసే ది అంతా ఈ మనస్సే కదా !
_1,, స్వచ్చమైన బంగారం , ఉన్నది ఒకటే ,
కానీ దానితో ఆభరణాలు , పాత్రలు,ఉంగరాలు ఇలా ఎన్నో రకాలుగా తన ఉపయోగం ,అవసరం కోసం పలు రూపాల్లో మార్చవచ్చు ను ,
అంటే బంగారాన్ని చూసే భావం లో తేడా ఉంది కానీ బంగారం లో లేదు ,పదార్థంలో పరిణామం వల్ల భావం లో మార్పు వచ్చింది !!
,, ,,_2 ,, !!గోమాత వైభవము అద్భుతం ,!గోవుకు తెలీదు ,,పాపం! తాను దేవతా స్వరూపం అనీ!""
గోమాత ను మహాలక్ష్మిరూపంగా ఆరాధించే విధానంతో ముడివడి ఉంటుంది మన భావం !!
తాను తినేది గడ్డి ,మనకు ఇచ్చేది బలవర్ధకమైన పోషక విలువలు ఉన్న పాలు !
పరోపకారం తన జీవనంగా అంకితమైన పరమ సాదు జంతువు ,గోమాత !
ఒక పశువు లో ఇలా దైవాన్ని దర్శించడం మనస్సు గొప్పతనం !!
__3_,, పరమ పావన నదీ జలాల తో సకల పాపాలు పోవడమే గాకుండా దైవాన్ని దర్శిస్తూ ఉన్నామన్న దివ్య మధురానుభూతిని , నదుల్లో స్నానం చేయడం వలన , తీర్థంగా గ్రహించడం వలన పొందవచ్చును !!"
,__త్రాగడానికి అమృత తుల్యమైన తీయని స్వా దు జలాలను ,,బంగారు పంటలు పండించు కోడానికి , సకల ప్రాణులకు జీవనాధారంగా , ఉపయోగ పడుతున్న నీరు పరమాత్ముని కరుణ !;"" గంగా యమునా సరస్వతీ లాంటి నదుల పేర్లు వింటేనే చాలు ,మనసు దైవభావం తో జాగృతం అవుతూ ఉంటుంది !
ఇలా తీర్థం లో దైవాను భూతి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడం మనసు చేయగలిగే , ఆత్మ చింతన !!
_4__అడవుల్లో మునులవలే ,నిశ్చలంగా ఉంటూ ,ప్రకృతి మాత శోభలను పెంచుతూ ఉంటున్న అడవుల్లో,,ఎంతో అందంగా పెరుగుతూ ,,సర్వ ప్రాణులకు ఆనందాన్ని ఇస్తున్న వృక్ష రాజాలు చేస్తున్న మహోపకారం పరమాత్మ వైభవానికి ప్రత్యక్ష సాక్ష్యం !!
,మనకు స్వచ్చమైన ప్రాణవాయువును అందివ్వడం ,,
జంతువులకు చల్లని నీడను ఇవ్వడం ,, పక్షులకు తన శాఖల్లో నివాసాన్ని కల్పించడం ,వర్షాలు కురిపించడం ,మనిషికి గృహాల కోసం వలసిన కర్రను ఇవ్వడం ,,తన వద్ద పూసే పూలు ,కాసే పండ్లు,,పచ్చని ఆకులూ ,ఇలా పరోపకారం కోసమే శ్వాసిస్తు , భగవంతుని రూపం లో విరాజిల్లే చెట్లను ,మొక్కలను , మన కోసం భువిపై వెలసిన దేవతల వలె ఆరాధించే భావం లో ,,,ఎంత ఔన్నత్యం దాగి ఉంటుంది ? చెప్పండి !""
___5__ మనిషి కూడా తన శరీరాన్ని ,అదే విధంగా ఇతరుల సేవ కోసం అంకితం చేస్తూ , సకల ప్రాణుల సేవయే , సర్వాంతర్యామి కి చేస్తున్న సేవగా , భావ సంపదను స్ఫూర్తిని పొందితే,, ఎంత బావుంటుంది!!""
6 __భగవంతుని సృష్టిలో అంతా పవిత్రము !,యదార్థ ము !,సత్యము ,!జ్ఞాన మయము! మరియు ,శాశ్వతమైన బ్రహ్మ పదార్థం కూడా !;
, కాలచక్ర భ్రమణ ధర్మం వలన,,పదార్థం లో , ధర్మం లో , శరీరంలో,,జగతిలో , కలిగే పరిణామాలు ,మనసులోని అనేక ఆలోచన ల వల్ల ,అనేక రూపాలుగా మార్పులు చేర్పులు చెందుతూ ఉంటున్నాయి ,
కానీ బ్రహ్మ మొక్కటే !
పరబ్రహ్మ మొక్క టే!""
__7,,_సూర్యభగవానుడు అందించే వెలుతురు వేడి ప్రకాశము , శక్తి చైతన్య, ములు , ఇవన్నీ భగవంతుని ఉనికిని సూచించే వే!
విశ్వాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తూ ఉంటున్న , ఆ దివాకరుని ,సృష్టి , స్థితి ,ల యాది కార్యక్రమాలను నేరుగా దర్శిస్తూ ఉన్నాం ఎవరికి ఎంత ప్రాప్త మో,అంతగా అనుభవిస్తూ ఉంటున్నాం ,కూడా !
అతడు కర్మ సాక్షి వలె ,,ఆత్మ సాక్షి వలె కేవలం సాక్షి !.
,,అందుకే ,,ఎలాంటి కర్మలు అతడికి అంటవు!
__అతడి చత్రచ్చాయలో మనం ఊపిరి పీలుస్తూ ఆనందంగా ఉంటున్నాం !!,
భగవంతుడు ఈ విధంగా అనుగ్రహిస్తూ ఉన్న ఈ అపురూప అనంత అద్భుత అమూల్యమైన ఈ మహదైశ్వర్యాన్ని ఎలాంటి మనసుతో గ్రహిస్తారు అనేది ,,వారి వారి కర్మలను బట్టి ఆధారపడి వుంటుంది !
""నీవు"" ఎవరివో నీవు చేసే కర్మ అనగా పని నిర్ణయిస్తుంది !!
8_ ఏడుకొండల పై , ఆ_తిరుమల వాసు ని దర్షించాక ,అది ఒక అందమైన సాలగ్రామ శిలా మూర్తిగా మాత్రమే భావిస్తూ , కొండ దిగి వచ్చాక స్వామిని మరిచి పో యే భక్తులు కొందరు ఉంటే,
అదే దివ్యమంగళ విగ్రహాన్ని సాక్షాత్తూ ,శ్రీమహావిష్ణువు గా భావిస్తూ , ""ఆహా ! నా జన్మ ధన్యం అయ్యింది !
,ఎంత దయ చూపా వు, తండ్రీ,, ఈ దీనునిపై ,!!""
నీకివే నా ప్రణామాలు , స్వామీ!""
అంటూ ,పరాత్పరుని ప దే ప దే భావిస్తూ , ఆనందిస్తూ , ఇంటికి వచ్చాక కూడా మళ్లీ మళ్లీ ,, మళ్లీ మళ్లీ తలచుకుంటూ తరించేవారు మరికొంత మంది భక్తులు ఉంటున్నారు !
ఈ తలంపు లే "",నేను ఎవరిని ?" అన్న ప్రశ్నకు సమాధానంగా
,,,తాను పొందిన మధుర అనుభూతి ని , ఆనంద భాష్పాల రూపంలో రాలుస్తూ, ఆత్మానందం తో,,జీవుడిని పరవశింప జేస్తూ ఉంటాయి !;
ఇలా ఆత్మచింతన చేస్తూ ఉండాలి తప్ప ,ఇతర చింతలు మనసులో పుట్టుటకు చోటు ఇవ్వకూడదు ,!!
తనను తాను ఈశ్వరునికి ఎంతగా మనస్సుని అర్పించు కుంటాడో,అంత భారాన్ని అతడు వహిస్తూ ఉంటాడు ,!!
మనకు తెలుసు ,సమస్త భారాలు ఈశ్వరుడే నిర్వహిస్తూ ఉన్నాడని !
మరి ఎందుకు "",నేను ఇది చేయాలి ,!!
నేను అది చేయాలి !,అంటూ విలపిస్తూ చింతించడం ??"""
ట్రైన్ ,అన్నీ బరువులు తీసుకెళ్తూ ఉంటుందని తెలిశాక , చంకలో మూటను అందులో పడవేసి ,,హాయిగా ఉండకుండా దాన్ని, మన నెత్తి మీదఉంచు కుం టూ ఎందుకు కష్ట పడాలి ,,?? చెప్పండి ??""
నీవు ,ఎవ రె వరినో నమ్ముతావు కదా !
""భగవంతు డు ఎల్లవేళలా నీ సహచరుడు గా ఉంటున్నాడు !""
అన్న పరమ సత్యాన్ని ,, నీవు ఎందుకు నమ్మడం లేదు !?"""
అందుకే ,. ముందు మన మనసును ఈశ్వరార్పనం చేసే ప్రక్రియను సంకల్పిం చుదాం !!
అప్పుడు తెలుస్తుంది! "",,నీవు ఎవరివో ,!""
సర్వం ఈశ్వరార్పణ మస్తు
(ఇంకా ఉంది)
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !""
No comments:
Post a Comment