Tuesday, April 28, 2020

భగవంతుడా ! ఏది దిక్కు ? 3

Apr 23, 2020
""హే కైలాస వాసా !,పరమేశా !
, భూమిపై గల మూగజీవా ల పై దయ నాకుంటే చాలదు ,పరమాత్మా ,, మీకు వుండాలి !
"" అందుకే మీ వద్దకు వచ్చాను ,ప్రభో!""
""ఈ మనిషి ఎంత స్వార్థ జీ వో  అంటే  మాటల్లో చెప్పలేము  జగదీశ్వర !"
మహా క్రూరుడు !
ఇపుడు తన టైమ్ బాగా లేక , కోరలు తీసిన త్రాచు పాము వలె తన ఇంట్లో బుద్దిగా ఉంటున్నాడు ,
కానీ ,,వీడిది కుక్క బుద్ది ! నేనైతే బయటకు రానీ ,, ఈ వన్య ప్రాణుల సంగతి చూస్తాను ,,అని కసితో ,జైలు లో ఖైదీ లా ,ప్రకృతిపై పగతో ఊగి పోవడం , పళ్ళు నూరుతూ ఉండడం  మీరు కూడా చూస్తున్నారు కదా. !""
"""పవిత్రమైన ,పరమ పావనమైన  , ఆ గంగ, యమున ,సరస్వతి వంటి అనేక జీవ నదులను , తన తమ మల  మూత్ర  విసర్జన , మరియు ప్లాస్టిక్ ,అనేక చెత్త కుళ్లు పదార్థాలను అందులో వదులుతూ  త్రాగడానికి వీలు లేకుండా ఘోరంగా కలుషితం చేస్తున్నాడు ,కదా ఈ నికృష్ట మానవుడు !!"
""తండ్రీ !""ఏమనాలి వీడి మితిమీరిన,,క్షమించరాని  అకృత్యాలను ?""
,అంతేకాదు ! అటు చూడండి ,శంకరా !
ఆ పెద్ద పెద్ద ,కర్మాగారాల్లో వెలువడే పలు రసాయనిక విష  పదార్థాల ను కూడా ఈ గంగా కృష్ణా గోదావరి లాంటి పవిత్ర నదుల్లో వదులుతూ ,,పశువులు పక్షులు జంతువులు చివరకు మనుషులు కూడా త్రాగే వీలు లేకుండా ,అపరిశుభ్రంగా చేస్తూ, ఉన్నాడు
  ఒకవేళ విధి లేక ,,గతి లేక తాగితే అనారోగ్యం కారణంగా హాస్పిటల్ ,లో పడి అనేక రోగాల బారిన పడి  అమాయక ప్రజలు మరణిస్తూ ఉన్నారు  ,
జంతువులు  హతమౌతూ ,, వున్నాయి !!"
,,""నాయనా ! నీవు ; ,ఎన్ని చెప్పినా  ,మనిషి అన్యాయ అక్రమ కేసుల జాబితా పూర్తి కాదుకదా   !""
ఎందుకు నీకీ కంటశోష ? చెప్పు ,
భూమి పై తిరుగుతూ , ఉండగా అతడికి కళ్ళారా చూసి ,చెవులతో విన్న ఆ జీవాల ఆర్తనాదాలు  కింకరు ని కి . పట్టరాని ఆవేశాన్ని  తెప్పిస్తు ఉన్నాయి ,,
""మహాదేవ మహాదేవా  !! నన్ను ఆపకం డి,,మహాదేవా! నన్ను  ,పూర్తిగా చెప్పనీయం డి,,!""
హే నీలకంఠ , !
ఆనాడు నీవు  లోక రక్షణ కోసం , ఆ  గరళాన్ని మింగి  నీ కంఠం లో దాచుకున్నా వు గదా !"
ఇప్పుడు  నీవిచ్చిన అద్భుత జ్ఞానం శరీరం అవకాశం తో  మనిషి చేస్తున్న వాడి క్రూరమైన , పరమ నీచమైన  విషచర్య లు  కూడా విని  గుండెల్లో దాచుకో వాలి  స్వామీ !!"
""దేశానికి ,,దేశానికి , మద్య పెంచుకున్న
, శత్రుత్వం  భావనతో ఏళ్ల పాటు కొనసాగుతూ వస్తున్న యుద్దాలు ,అందుకు ఉపయోగిస్తున్న ఆధునిక మారణాయుధాలు అందులో బలి అయిపోతున్న  సాటి మానవుల   ను కూడా లెక్క చేయకుండా  ,,వేలల్లో అణు ఆయుధాలను  ప్రయోగిస్తూ ,పశువుల్లా  ఒకరినొకరు చంపుకుం టూ ,, తాము చస్తూ ఉన్న ఈ మనిషి  దుండగాలకు  ఇక  అంతు లేదా ఈశ్వర ,!""
ఆ బాంబుల  తాకిడికి మనుషులే కాదు ,  స్వచ్చమైన వాతావరణం కూడా విషతుల్యం అయ్యింది ,
ఆ ప్రాంతంలో బ్రతికే మూగ జీవాల , మనుగడ కోసం కనీసం గడ్డి కూడా మొలవడానికి వీలు లేకుండా  చేస్తున్నారు !!,, ___కేవలం తమ   ఆధిపత్యం  కోసం  మాత్రమే ,యుద్దాలు  సాగిస్తూ ఉంటున్న ఈ రాబందుల ను ఎలా చూడాలి ,??" దేవా !""
"" వీరు మనుషులు !""అని పిలవడానికి సిగ్గుగా ఉంది నాకు ,!!
కనీసం  ఏ జంతువు పేరు పెట్టి తిడదామని ఉన్నా , ఆ జంతువుకు  కూడా అవమానం  ,!
   వ్యవస్థ ను ఇలా భ్రష్టు పట్టిస్తూ ,,పరమ దౌర్భాగ్యం  గా , జీవిస్తూ కూడా  ఏ మాత్రం అపరాధ భావన లేని  ,,పశ్చాత్తాపం లేని, ఈ  మనిషి జీవితం నాకు అసహ్యంగా తోస్తోంది ,ప్రభో!!""
మోసం ,,ఈర్ష్య ,,ద్వేషం , పగలు ,ప్రతీకారాలు , మద మాత్సర్యాల తాకిడికి   నిబ్బరంగా   ఉండాల్సిన మానవతా విలువలు ,న్యాయం ధర్మం అన్నీ మంట కల్సి పోయాయి కదా,  హే పరమపితా !!
ఎన్నని చెప్పను??"
ఏది చెప్పిన ,ఎంత చెప్పినా , భరింపలేని వేదన ,బాధామయం  శోకమయం   , !"
అనాధలు ,వృద్దులు రోగస్తులు ,పిల్లలు ,,నాగరికత కు నోచుకోక  వెనక పడిన వారు ,ఇలా ఎందరో నిర్భాగులు  ఆత్మహత్యలు చేసుకోవడం ,, ఆడవారిపై అత్యాచారాలు మానభంగాలు జరగడం ,,, , , పట్ట పగటి రాజకీయ హత్యలు  , ,   కుట్రలు ,కుతంత్రాలు  , అబ్బో ఎన్నో ఎన్నో ,!!
చిత్రగుప్తుని చిట్టా కు కూడా అందని మనిషి మాయ లు ఎన్నో ఉంటున్నాయి ఈ భూమిపై , పరమేశ్వరా ,!
ఏ పేపర్లో ఏ రోజూ  ఏ ప్రాంతం ఏ దేశం లో చూసినా ,అంత మనిషి సాగిస్తూ ఉంటున్న దారుణ మారణ  కాండ  రోజు రోజుకు పెరుగుతోంది !!"
పైకి  ఏమెరుగని అమాయకం,, అజ్ఞానం నటిస్తూ , చాటుకు  మాత్రం  గుండెలు తీసిన బంటు లా , ఏ సమయానికి ఏం చేస్తా డో, , బొత్తిగా ఒకరిని మరొకరు నమ్మడానికి వీలు లేకుండా సమస్యల వలయంలో  చిక్కుకుని,ఉన్నతమైన విలువలు గల బంగారు జీవితాన్ని ఈ మనిషి తన  చేజేతులా రా  దుర్భర నరకంగా మార్చుకుంటూ,,  నటిస్తూ ,, బ్రతుకు తూ ఉన్నాడు. !
పాపం , ఈ మనుషులు చేస్తున్న ఘోర పాప భారం , ఆ ధరణీ మాతా ఎంత దుఖిస్తూ  భరిస్తూ  ఉందో కదా ,మహాదేవ ,!"
కింకరు ని కంఠం గద్గద మయ్యింది !
స్వస్తి!"
హరే కృష్ణ హరే కృష్ణా!""
  ( ఇంకా ఉంది )

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...