Apr 25, 2020
ఇక నీళ్లలో బ్రతికే ఏ ప్రాణిని కూడా విడిచిపెట్టకుండా తింటూ ఉంటారు !""
""స్వామీ !
నీవు పుట్టించిన ఆ ప్రాణులను ,మరవకుండ ,,విడవకుండా ,,వాటిని "",తినడమే పనిగా"" పెట్టుకొని , ఆ ప్రాణుల దారుణ మారణ కాండను సాగిస్తూ ఉన్న ఆ చైనా వారిని చూస్తుంటే ,, కోపాన్ని ఆవేశాన్ని ఆపుకోలేక వారికి తగిన శాస్తి వేయాలి అనిపిస్తోంది నాకు !
శివ శంకరా!! అభయంకరా ! నేను చెబితే గానీ ,
,నీకు తెలియని విషయమా ఇది ?
హే పరమేశ్వరా ,!
ఆ మానవుడు అంత తొందరగా మారే వాడు కాదు ,!!
వాడికి వెనకచూపు లేదు !
వాడిని ఎన్నడూ నమ్మరాదు ,కూడా !""
మేక వన్నె పులి !
మోసం ,ద్వేషం, పగ ,ఈర్ష్య ఇవన్నీ వాడి రక్తంలో ఉంటాయి !!
పులి ,,సింహం, ఏనుగు లాంటి ఏ క్రూర మృగాలను నమ్మవచ్చు నేమో గానీ
ఈ నర రూప రాక్షసుని మాత్రం నమ్మలేం శంకరా ?""
హే శంభో శంకరా , మానవుడు అధర్మ మార్గాన్ని అనుసరించడం ,వల్ల సంభవించే దుష్పరిణామాలు చూసి , చలించి ,శ్రీమహావిష్ణువు అలనాడు శ్రీకృష్ణుడుగా స్వయంగా ఇలపై అవతరించి , పాపాత్ముడు దుర్యోధను న్ని,, ఆ దుష్ట చతుష్టయం కు సహకరించిన పద్దెనిమిది వేల అక్షౌహిణుల ను అర్జునుడి చే నిలబడి చంపించాడు , !!"
తాను మాత్రం కేవలం రాక్షస జాతి అంతానికి పరిమితం అయినాడు !!""
ఎంత అన్యాయం చేసినా
మనుషులను చంపే సాహసం ఎక్కడా చేయలేదు కృష్ణుడు !""
ఏనాటికైనా బుద్ది రాకపోతుందా అని అవకాశం ఇచ్చాడు గోవిందుడు !!""
""ఈశ్వరా !
,భూతలం పై ఈ మానవుడు అనబడే దానవుడు నిత్యం చేస్తూ ఉన్న ఘోర కృత్యాలు ఇంకా చెప్పాలని ఉంది స్వామీ ,!""
మూగ ప్రాణులను అంతం చేస్తున్న ఈ మనుషులు దురాగడాలను చూస్తూ సహించలేక పోతున్నాను తండ్రీ !!""
మహాదేవ మహాదేవా,!
భూమిలో నున్న బంగారం ,వెండి, కాకుండా బొగ్గు ,గ్రానైట్ లాంటి ఖనిజాల కోసం వేల ఎకరాల భూమిని తవ్వేసినపుడు ఆ చెట్ల పై ఉండే పక్షులు ,అడవుల్లో నివసించే జంతువు లు అనుభవించిన నరక బాధ మాటల్లో చెప్పలేం!!""
సెల్ ఫోన్లు అనే పరికరాల వినియోగం కోసం నిర్మించే టవర్ ల నుండి వెలువడే రేడియేషన్ తీవ్రత కి నాశనం అవుతున్న పిచ్చుక లాంటి చిన్న చిన్న పక్షుల బాధ ఏమని చెప్పను ??"" ఈశ్వరా !
ఫ్యాక్టరీ ల నుండి వెలువడే కలుషిత రసాయన విష పదార్థాలు నీటిలోకి వదిిలినప్పుడు వాటి దెబ్బకు గిల గిల కాడుతూ నీటిలోనే ప్రాణాలు వదులుతూ ఉన్న జలచరాలు పడే బాధ నాకు చూడవశం కావడం లేదు,, పరమాత్మా !"
జంతు వధ శాలలో కబే లాలలో నిత్యం బలి అవుతూ, వదింపబడుతున్న ఆవులు, ఎద్దులు దున్నలు ,లాంటి సాదు జంతువుల బాధ ఘోరంగా ఉంది !!
""మనిషి వేట ""అనే వినోదానికి బలై పోతున్న అడవి జంతువులు ,అందమైన నెమళ్ళు జింకలు ,చిలకలు , కుందేళ్ళు ,,పక్షులు , ,,కోతులు ,వాటి దురవస్థ వర్ణించ నలవి కావడం లేదు!!"" మహా దేవా !"
భూమిలో ,పచ్చని మొక్కలపై వేసే క్రిమి సంహారక మందులకు ఉక్కిరబిక్కిరై ,మరణిస్తూ ఉంటున్న తేనెటీగలు సీతా కొక చిలుకలు ,""ఈశ్వరా!! మమ్మల్ని ఎందుకు పుట్టించావు?"""
అని వాపోతున్నట్టు గా విలపిస్తూ ఉన్నాయి !!
తినడానికి పచ్చని పచ్చిక దొరక్క ,ఆకలికి ప్లాస్టిక్ సంచులను తిని ప్రాణాలు వదులుతూ ఉన్న గేదెల లాంటి మూగ జీవుల బాధ మీకు తెలియనిది కాదు కదా ,, జగదీశా !""
సర్కస్ లలో జంతు ప్రదర్శన శాలలో జీవచ్ఛవం లా బ్రతుకుతున్న వన్య జీవాల బాధ మీకు తెలియనిది కాదు కదా !!
సోకుల కోసం,, భవనాల నిర్మాణం కోసం,, నామరూపాలు లేకుండా నరకబడుతు ఉన్న వృక్షాల ఆర్తనాదం మీకు వినిపిస్తూనే ఉంటుంది కదా ,సదా శివా !""
ఇలా ఒకటేమిటి ?" స్వామీ,! మహాదేవా !!
,నాగరికత ఆధునికత పెంచే నెపంతో,,అందాల ప్రకృతిని సర్వ నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని , బ్రతుకుతూ ఉంటున్న ఆ మనిషి చర్యలను ఇక నేను ఉపెక్షించ లేక పోతున్నాను !!"
మహా ప్రభో ,దేవాది దేవా !"
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !""
( ఇంకా ఉంది )
Tuesday, April 28, 2020
""భగవంతుడా ఏది దిక్కు ?""_4
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment