Saturday, April 18, 2020

ఇంట్లో ఉండండి ,! భద్రంగా ఉండండి!

Apr 14, 2020
"ఇంట్లో ఉండండి  !"అని అనడం సులభమే ,!
కానీ,మనిషిని బలవంతంగా ఇంట్లో బందీ చేయవచ్చు ,,కానీ , ఈ చంచలంగ తిరిగే మనసును కట్టు చేయలేం కదా !
ఎంత వద్దంటే ,అంత ప్రతిఘటించడం మనసు నైజం !!""
ఏదైనా  అలవాటు అయ్యే వరకూ కష్టంగా అనిపిస్తుంది , కదా !"
ఇంట్లో ఉండడం  ,,అంటే ,,
భౌతికంగా శరీరాన్ని ఇంట్లోనే 24గంటలు కట్టిపడేయడం ,!!""
""తిరిగే కాలు ,, వదిరే నోరూ""ఇవి రెండూ, ఊరకే ఉండవు ,,అంటారు ,!!""
ఉదయం వెళ్తే ఏ రాత్రికో గానీ రాని వారికి ,ఇలా  ఇంట్లో ఉండడం  నరకంగానే  తోస్తు ఉంటుంది !!""
ఇది ఒక రకంగా మనసును నియంత్రించ డం అవుతుంది !!""
మహాభారత సంగ్రామా న్ని ""సత్యం"" అనే ఆయుధం తో గెలిచారు !
ఇపుడు ఈ కరోనా సమరాన్ని  మనం ""సంయమనం ""తో గెలవాలి !
"సంయమనం "అంటే మనసును ""నియంత్రించడం,!""
ఇది అంత సులభం కాదు !
ప్రపంచం లో దేనినైనా ఆధీనంలో కి తేవచ్చు, కటో ర పరిశ్రమ ద్వారా !"
కానీ , ఈ మనసును ,మనసు చెప్పినట్టు వినే మనుషులను నియంత్రణ చేయడం  అతి దుర్లభం!""
మనిషిలో మనసుతో బాటు బుద్ది అనే మంచి ఉపకరణం ఉంటుంది,
మనసు బుద్ది ఇవి రెండూ కనపడేవి ,కావు
ఇలా ఉంటాయని కూడా. చెప్పలేం
కేవలం మనిషి ఆచరణ ,అలవాట్ల ద్వారా మాత్రమే గ్రహించవచ్చు
మనసు ,పంచేంద్రియాలు చెప్పు చేతుల్లో ఉండి అవి చెప్పినట్టు చేస్తూ పోతూ ఉంటుంది,
నాలిక ద్వారా  ఆహారం ,స్పర్శ ద్వారా చల్లని వాతావరణం ,
కంటికి ఇంపైన దృశ్యాలు ,చెవికి ఇంపైన. సంగీతం ,ముక్కు తో సువాసన గల భోజనం,  ఇలా  స్పందిస్తూ మనసు పెట్టీ ఆనందిస్తూ ఉంటాము ,
ఇపుడు ఇంట్లో ఉండి చేస్తున్న భోగాలు అన్నీ ఈ ఐదు ఇంద్రియాలతో అనుభవిస్తూ ఉంటున్న సుఖాలు అవి.
అందుచేత ఇంట్లో ఉండడం అనేది మనసును గెలవడం ఎంత మాత్రం కాదు
ఇక రెండవది భద్రంగా ఉండాలి అనేది !
ఇది ఖచ్చితంగా మనసును నియంత్రించడం అవుతుంది,
ఎందుకంటే ,
భద్రత అనేది   బుద్ధికి సంబందించిన విషయం ,
పంచేంద్రియాలు మనసును ఉత్తేజపరుస్తూ ఉంటే ,బుద్ది మనిషిలోని ఆత్మ ప్రబోధం వల్ల ప్రకోపిస్తు ఉంటుంది ,
ఆత్మ బుద్ది సుఖం చైవ !"
అని గీతాచార్యుడు శ్రీకృష్ణా భగవానుని భగవద్గీత వేద వాక్యం
ఎవరు ఏది చెప్పినా ,అందులోని మంచి చెడూ గ్రహించేది బుద్ది మాత్రమే
మనిషి శరీరానికి ,మానసిక ఉల్లాసానికి ఆధ్యాత్మిక చింతనతో పుష్టిని ,, సు శిక్షణ ఇస్తూ ,భద్రత కలిగించేది బుద్ది మాత్రమే ,
మనసును దాని ఇష్టం వచ్చిన విధంగా పోనీయకుండా , ఉన్నతి కోసం ప్రయత్నం తో ,సమయాన్ని సద్వినియోగం  చేస్తుంది ,,
యోగా మెడిటేషన్ వంటివి చేస్తూ , భగవద్గీత శ్లోకాలు పఠిస్తూ,పుస్తక పఠనం చేస్తూ ,పిల్లలతో కథలు ,జోక్స్ ,games ,బొమ్మలు వేయించడం ,పాటలు పాడించడం ,వారితో ఆటలు ఆడిస్తూ ఉండడం , రామాయణ భారత ,ఇతిహాసాలు చెప్పడం ,భాగవత పద్యాలు చదివించడం , పజిల్స్ ,words building లాంటివి ,,,,ఇలా వారిలో దాగిఉన్న కళలు ,ప్రతిభ , వెలికి తీసే ప్రయత్నం ,తలిదండ్రులు ఇద్దరూ కలిసి చేసే  బుద్ది కుశలత తో మాత్రమే  సాధ్యం అవుతుంది !
ప్రతీ ఇంట్లో స్త్రీలు రోజూ తన కుటుంబం కోసం చేసే  వంట పనీ,,ఉద్యోగం  , ఇల్లు శుభ్రం చేయడం ,బట్టలు ఉదకడం ,సామాను తేవడం ,  తిండి నిద్రా  విశ్రాంతి   తన ఆరోగ్యం ఇవేమీ పట్టించుకో కుండా ,ఇలా ఆమె చేస్తున్న    నిరంతర కృషి ని గమనిస్తూ, తమ వంతుగా , షేర్ చేసుకుంటూ ,, పిల్లలు భర్తా ,ఆమెకు చేదోడు వాదొడు గా సహాయం చేయగలిగే  చక్కని అవకాశం ఇపుడు కలిగింది ,
కష్టాలు పంచుకోడం లో నే నిజమైన ఆనందం ఉంటుంది
బయటకు వెళ్లి  సహాయం అందించే వీలు అందరికీ ఉండదు కదా
అందుచేత  స్నేహ హస్తాన్ని ఇంటి నుండే ప్రారంభం చేద్దాం , ఆత్మసాక్షిగా ,చిత్తశుద్దితో ,మనసుపెట్టి  మనలోని ఉదారత  ను మానవత్వాన్ని అందిస్తూ
ఇంట్లో  నే ఉంటూ భద్రంగా ఉండండి  అనే ప్రభుత్వ సూచనలను అనుసరించి,,క్రమశిక్షణ యుతంగా  ఒకరికొకరం తోడ్ప డుతూ, మనలో ఉన్న బుద్దిని ప్రచోదనం చేద్దాం ,
ఇంట గెలిచి రచ్చ గెలువు అన్న  పెద్దలు చెప్పిన నానుడిని నిజం చేద్దాం !
ఇంట్లో ఉందాం !
భద్రంగా ఉందాం !"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...