Sunday, April 19, 2020

మానవ మృగాలు

Apr 19, 2020
ప్రస్తుతం మనల్ని నీడలా వెంటాడుతూ ,వేటాడుతూ ,వేటు వేస్తూ ,, దినదినము ,,తన బలగాన్ని పెంచుకుంటూ , ,దొరికిన వారిని దొరికినట్టు గా హతమారుస్తూ , లక్ష నర మందిని అన్యాయంగా పొట్టన నెట్టుకుంటూ ఉంటున్నా ,ఈ విపరీత పరిస్థితుల కుకారణము ""ఇది "!
అని ఎవరూ ఖచ్చితంగా తెలపడం  లేదు  ,!;""
ఎవరికి దోచి నట్టుగా వారు అనుకోడం తప్ప,,ఎలా వచ్చింది ?ఎలా వ్యాప్తి చెందుతోంది ??""అనే విషయం    ఎవరికీ ,,తెలియడం లేదు  !;""
ఎక్కడైనా  " దారుణ మారణ కాండ  "" జరిగితే "",దీనికి కారణం మేమే!"" అంటూ ఉగ్రవాద సంస్థలు  ఒక  ప్రకటన  చేస్తూ ఉండేవి ,!;""
కానీ ఈ కరోనా ఉత్పాతానికి  ,,""మేము కారకులం!""
అని ఏ దేశం , ఏ తీవ్రవాద సంస్థ కూడా ముందుకు రావడం గానీ  ,ఒప్పుకోవడం  గానీ లేదు ,!"""
కరోనా వైరస్  వ్యాధి వ్యాప్తికి ,, కారణం ఏదైనా ,కారకులు ఎవరైనా ,""మనిషి  యొక్క ఆకతాయి తనం ""అని తెలుస్తోంది ,,అందరకూ !!""
__అతడు  విచ్చల విడి తనం , పిచ్చి రాక్షస తత్వం ,హద్దులు లేని హింసా ప్రవృత్తి   నేడు ఈ అంతుపట్టని  వ్యాధి  ద్వారా ,మనకు బయట పడుతోం ది ,!!""
మనిషి చేస్తున్న ఈ అకృత్యాలకు
ప్రకృతి మాత  అసహనం  ,,ఇలా బయటపడుతోంది !!"""  గుండెల్లోంచి పొంగుతూ ,కట్టలు తెంచుకుని వస్తున్న  ఆమె ఆవేశం ,,ఆక్రోశం ఉగ్ర రూపంలో ఇలా  వెలువడు తూ ఉందనీ,,,
మనకు అర్థం అవుతుంది !!""
అది ఈ కరోనా రూపంలో ఉదృతంగా  ప్రచండ స్వభావంతో చెలరేగు తూ  ఉందనీ మనకు తెలుపుతూ ఉంది !""
పరమ శివుని ఆధ్వర్యం లో  స్మశానం ,అంటే రుద్రుని ఆనంద నిలయం ,,లో ,,కోట్లాది ప్రమథ గణాలు భూత ప్రేత పిశాచ శాకిని డాకిని లాంటి  శక్తులు నియంత్రణ జరుగుతూ ఉంటుంది ,!!""
నేటి మానవుడు  భూమిపై చేస్తున్న  ఘోరాలు చూస్తూ ఉంటున్న  పరమశివుని ప్రమథ గణం లోనీ ఒక  కింకరు ని శక్తి , యొక్క     ప్రళయ తాండవ నృత్యం ఈ కరోనా మహమ్మారి  ""అకాల ఆగమనం """
అని అనుకోవ చ్చు ను !!,
స్మశానం లో రుద్రుడు ఇలాంటి  కనిపించని  శక్తులను   నియంత్రిస్తూ ,అవి భూమిపై కి రాకుండా ,మానవుల పై దాడి చేయకుండా ,చేయడం వలన ,శివునికి ,భూత నాథుడు అనే పేరు వచ్చింది ,
ఎక్కడో ,ఎప్పుడో ఎన్నడో ఎవరికో అన్యాయం , ఈశ్వరుడు కూడా భరించలేని ,, క్షమించరాని ,,ఘోర అపరాధం ఈ మనిషి వలన జరిగింది !!!"" అనిపిస్తూ ఉంది !!""
,తప్పులు అపరాధాలు ,  ఏ జాతి మూగ ప్రాణులు కూడా  చేయలేవు కదా !!""
పులి సింహం ,లాంటి  ఏ క్రూర మృగాలు  కూడా చేయలేని దారుణాలు  , ఈ మనిషి  వల్ల జరుగుతున్నాయి !!జరిగాయి కూడా !!"""
నోరు ఉంది కదా అని,ఇష్టం వచ్చినట్టు గా మాట్లాడుతు శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉన్నాడు  అందరితో !!""
,,తన
తెలివి  తో ,,అద్భుతమైన జ్ఞానం తో   ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్లగలిగే  పరిజ్ఞానం  తో  ,మానవత్వ సుగంధ సౌరభాలను వెదజల్లే బదులు , ద్వేషం ఈర్ష్య ,కోపం ,పగ ప్రతీకారాలు విష జ్వాలల రూపాల్లో  తోటివారి ప్రతిభ ఓర్వజాలక ,,విలయ తాండవం  చేస్తూ , ధరణి మాతకు కోపం తెప్పిస్తు. ,, ప్రకృతి మాతకు సంయమనం కోల్పోయేలా ,చేస్తున్నాడు , సాంకేతికత ,ఆధునికత సంతరించుకున్న నేటి  మనిషి , !;"""
రుద్రునికి కోపం వస్థే ,మూడవకన్ను తెరిస్తే ,  సర్వం కాలి  భస్మం  అవుతూ ఉంది
ఇక అలాంటి రుద్రుని ప్రతిరూపాలు ప్రమథ గణం లో ఒక ప్రేత కరోనా రూపంలో   ,స్మశానం నుండి  బయటకు వచ్చి, , చేస్తున్న   కరాళ నృత్యం ,,,,,అదుపు చేయలేని ,,నేటి కరోనా వైరల్ ప్రభావం  ఇది ,,అని  అనిపిస్తూ వుంటుంది !"""
ప్రకృతి  కి సహజంగా ఉండాల్సిన నియమాలలో సంతులనం కొరవడింది !"
ఆ తప్పు ఈ మానవాధముడు తోనే జరిగింది ,నేరస్తుడు వీడే !"",,
__ఒక దేశం మరో దేశాన్ని ,ఒక మతం మరో మతం వారిని  ,,మత వ్యాప్తి కొరకు ,సామ్రాజ్య విస్తరణకు ,దురాపెక్షతో   చంపడం  అనేది ,పశువుల వలె ,ఒక  వృత్తిగా కొనసాగిస్తూ  ఎవరికి ,శాంతి లేకుండా ,,అంతటా   హింసాకాండ కొన సాగిస్తూ  ఉన్నా డు ,,మనిషి !""
,ఇలా ఏదో ఒక వంకతో  సాగిస్తున్న మనిషి పశు ప్రవృత్తి కి చరమగీతం పాడేందుకు  అవతరించిన  ప్రళయకాల  ,""వీరభద్ర స్వామి """రూపమేమో ఈ కరోనా అనిపిస్తూ వుంటుంది , ఒక్కొక్కసారి !""
మనుషులు ఇప్పుడు రోడ్లపై కి రావడం లేదు ,!!
పాపం , ఇన్నాళ్ళు ఈ మానవ మృగా లకు భయపడుతూ  ఎక్కడో నక్కి నక్కి నివసిస్తూ ఉన్న మూగజీవాలు పక్షులు ,ఇప్పుడు స్వేచ్చగా బయటకు  వస్తున్నాయి ,!!
ఆనందంగా ఊపిరిని పీల్చుకుంటూ తిరుగుతూ ఉన్నాయి , !!""
తన కంటికి కనబడితే చాలు , చంపి ,రక్తం పీల్చి,,దాని   పచ్చి మాంసం   మృగం వలె తింటూ , మృగ జాతి లేకుండా చేస్తూ ఉన్న ఈ  మనుషులు,,
ఇప్పుడు , ఈ కరోనా దయవల్ల   ఖైదీలు గా ,తమ తమ గృహాల్లో  స్వచ్చందంగా  నిర్బంధించ బడ్డారు ,!!""
ఇన్నేళ్లు  తమ జీవనంలో కనీ వినీ ఎరగని  స్వేచ్ఛను  ప్రసాదించి , ఈ మానవ మృగం బారినుండి విముక్తి ని అందించిన  ఆ కరోనాకు అవి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా యేమో కదా !""
అనిపిస్తూ ఉంది ,!!"
వాతావరణం కాలుష్యం  తగ్గి , ఓజోన్ పొర మందంగా ఉండటంతో ,ప్రకృతి మాత తన  హర్శాన్ని అనందాన్ని  ప్రకటిస్తూ , స్వచ్చమైన ప్రాణవాయువు తో సమతుల్యాన్ని పొందుతూ ఆనందంగా ఉంది , అనిపిస్తూ ఉంది !!""
ఒకరికి వినోదం ,మరొకరికి ప్రమాదం ,!
ఇది విధి  ,,తన లీలగా ఆడించే నాటకం , !""
స్నేహం తో ,ప్రేమతో , హస్తాన్ని అందించే మానవుడు ,,,, అణువు లను ఆయుధాలుగా   మారుస్తూ ,నర హంతకులు గా మారితే ,,కరోనా కే కాదు ,గదిలో వేసి కొడితే  చిన్న  పిల్లికైనా  కోపం వస్తుంది కదా !""
పులి పులిని చంప దు,,
కానీ , ఈ మనిషి మరొక మనిషిని చంపుతూ ఉంటాడు ,
కాలాలు ,మారినా ,యుగాలు ,తరాలు మారినా ఈ మనిషికి ఉన్న ఓర్వలేని తనం  మాత్రం  పోవడం లేదు కదా !
ఎంత విజ్ఞానం ,వనరులు ,మాట్లాడే శక్తి  ,యుక్తులు ఎన్ని ఇస్తే మాత్రం ఏం లాభం !""
మనిషి కంటే పశువు నయం ,,అంటే ,మనిషికి కోపం రాకపోవచ్చు
కానీ పశువుల ఆత్మాభిమానం దెబ్బ తింటుంది కదా !
ఈ వెధవ కూ , మాకు పోలికా ,, చీ,, చీ చీ c,అని ఈస డించు కోవూ ?"""
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...