Saturday, April 18, 2020

రాధా దేవి "అంటే ఎవరు ?

Apr 16, 2020
ఇన్ని లీలలు చూపిస్తూ,,తాను సామాన్య బాలుడు కాదు, "!అని మనకు చూపించినా ,!అనిపించినా కూడా ,,
కృష్ణుడు ఇంకా మన  చుట్టూ తిరుగుతూ  ఉండే అమాయక  గొల్ల పిల్లవాడు అనే భ్రమలో ఉన్నారు మీరు !
ఇదే విష్ణు మాయ !
అది తోలగితెనే ,కృష్ణుని విశ్వరూపం అగుపిస్తుంది ,,
నేను ఇపుడు కృష్ణుని గురించిన పరమాద్భుతం రహస్యాన్ని చెబుతున్నాను ,;!
మీరంతా
శ్రద్ధతో వినండి ,,!;
""కృష్ణుడు భగవంతుడు ,!!""
అతడు సాక్షాత్తూ , ఆ వైకుంఠ వాసి , లక్ష్మీ రమనుడు,,క్షీరసాగర శయనవిష్ణుమూర్తి ,,నారద గాన లోలుడు ,,భక్తజన పరిపాలుడు ,!
ఆ మహా విష్ణువు అవతార స్వరూపము ,!""
మన పాలిట భాగ్య విశేషంగా ఇక్కడ ,  రేపల్లెలో ""కృష్ణుడు ""గా అవతరించాడు !;
శ్రీకృష్ణుడు  సకల జగత్తును  ఉద్ధరించడానికి ఉద్భవించాడు ,!!
చంద్రుని  చల్లని వెన్నెల కాంతులతో  కలిగే ఆనందాన్ని ఆస్వాదిస్తు ఆనందించ లేకపోతే,,
,అది చంద్రుని తప్పు కాదు !
కృష్ణుని గురించిన జ్ఞాపకాలతో స్రవించే ఈ  కన్నీళ్లు  ,మన ఆనంద,భాష్పాలు కావాలి ,!!""
""శ్రీకృష్ణ ఆరాధన ""అనేది హృదయానికి  సంబంధించింది ,,; బాహ్యంగా  మనం చూసిన ఆ లీలామానుష వేషధారి శ్రీకృష్ణుని  ,,అందంగా మన అంతరంగంలో బంధించి , కృష్ణ చైతన్య భావ తరంగాలతో  ,,మనసు ని నిరంతరం పరమానందం తో పరవళ్ళు తొక్కుతూ  పరవశిస్తూ ఉండాలి ,!""
""భక్తి అంటే ఇదే,,!""
బ్రతకడం అంటే ఇలానే !"" ఈ విధంగానే !""
మన దైవము,మన ప్రాణం ,మన జీవం ,మన దేహం  జ్ఞానం ,, బంధు బలగం , సంపదలు ,,సర్వం ""కృష్ణ మయం"" కావాలి , !;
నిజంగా ,కృష్ణుడు కావాలని మీకు కోరికగా ఉంటే , అనుక్షణం ,అనుదినం , అనునిత్యం  ,
, ఆ శ్రీకృష్ణ భగవానుని ,,శ్రీ పాదముల యందు , మీ హృదయ మనే కమలాల ను భక్తితో సమర్పిస్తూ పూజిస్తూ ఉండాలి !!""
రాధా దేవి అలా చెబుతూ పోతూ ఉంది ,
  అది వింటున్న గోపికలకు , ఆ రాధ ఒక  ""గురువు""లా, జ్ఞాన జ్యోతి లా,, కర దీపిక లా,కనిపించింది !!
  తమకు కృష్ణ చైతన్య  జ్ఞాన వైభవాన్ని  గురించి  చెబుతున్న ఆ  రాధ రాణి నీ  చూస్తుంటే  మౌనంగా ,వింటూ  నిశ్చేష్టులై పోయారు ,, వారు,, గోపికా స్త్రీలు!
కృష్ణ ప్రేమ చైతన్య భావ తరంగాలతో వారు ఉద్విగ్న భావంతో బ్రహ్మానందం తో తేలియాడుతూ కనిపించారు రాధమ్మ కు !!
ఎందుకంటే ,,వారికి కృష్ణుడు అనుగ్రహించిన రాసలీల తత్వ రహస్యం మెల్ల మెల్లగా అర్థమవుతు వస్తోంది !!,
ఈ రాధాదేవి చలవ వల్లనే ,తమకు ఆ  కృష్ణునితో  ,అత్యంత వైభవంగా ఆ రాసక్రీడ  మహోత్సవం లో ఆనందంగా పాల్గొనే ""మహా భాగ్యం ప్రాప్తించింది అనీ వారికి తెలుసు !""
రాధారాణి ,కేవలం ఆ అమాయక  రేపల్లె గోపికలకు మాత్రమే  కాదు ,,,
శ్రీకృష్ణ భక్త చిత్త   సమస్త శిష్య బృందానికి   ఈ రాధా దేవియే  మొదటి గురువు ,! ఇష్ట దైవం !
మొదట
రాధాదేవి అనుగ్రహం కటాక్షం  కోరుకుంటే నే ,,తర్వాత  శ్రీకృష్ణ దర్శనం లభిస్తుంది !
""బృందావనం ఆమె దివ్య సీమ, !""
రాధా దేవి గోలోక పర దేవతా స్వరూపం !""
ఆమె "దైవం "కృష్ణుడు , అయితే ,
ఆ దైవానికి  తన ""మనసు"" అనే అపురూప మందిరం , రాధారాణి !!
అద్వితీయమైన అవినాభావ సంబంధం, రాధా కృష్ణుల ది !""
విడదీయరాని అనుబంధం వారిది !!
అందుకే రాధాకృష్ణు డు,రాధా మాధవుడు ,,రాధా మానస చోరుడు ,రాధా వి దేయుడుగా ""
ఈ శ్రీ కృష్ణుడు గుర్తింప బడినాడు !!
రాధా రాణి  "" కృష్ణ ప్రేమ అనే శక్తి స్వరూపం"" అయితే
,కృష్ణుడు" చైతన్యం ""!
అవి వేరుగా మనలేవు !
శ్రీ కృష్ణా!శరణం , మమ!""
""కృష్ణం వందే జగద్గురుం !""
""కృష్ణాయ వాసుదేవాయ , దేవకీ నందనాయచ,,,
నందగో ప  కుమారాయ ,,
గోవిందాయ నమో నమః !""
సర్వం శ్రీ రాధా కృష్ణుల  చరణార విందార్పనమస్తు !
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...