Saturday, April 18, 2020

తప్పెవరిది ?

Apr 6, 2020
ఏ మనిషి కూడా  పిల్లవాడైనా ,యువకుడైన  చివరకు ,వృద్ధుడై నా కూడా ,తాను చేసిన తప్పు ఒప్పుకోడు !!
""తప్పు జరిగింది !"" తన వల్ల ,,అని తెలిసినా  ఒప్పుకో డు !!
కారణం,,,? అహంకారం ,,ఇగో !
అందుకే ,, మహాశయుడు. , కాలజ్ఞా ని వేమన , అన్నాడు ,కదా !!
""___తప్పులెన్నువారు
, తండోతండంబు ,,,
ఉర్వి జనుల కెల్ల ఉండు తప్పు !!
తప్పులెన్నువారు  తమ తప్పు లెరుగరు,,
విశ్వధాభిరామ వినురవేమ !! ""
__&__
ఏ దేశ చరిత్ర , ఏ ఇంటి కథ ,, ఏ పురాణము రామాయణ ,భారత ఇతిహాసాలు ఏవి చూసినా ,, తప్పులు  చేయడం ,  వల్ల జరిగాయి అని అర్థం అవుతుంది ,
తిరిగి వాటిని ""ఎలా దిద్దుకోవాలి  ??అని  సూచిస్తూ ఉంటారు !!
క్షమించరాని తప్పు ,,తమ వల్ల జరిగింది అన్న జ్ఞానం ,,వారికి , కలిగినా కూడా  ,విపరీతమైన
అహంభావం వల్ల  ఆ తప్పులు కప్పి పుచ్చుకోడానికి మళ్లీ తప్పులు చేస్తుంటారు !!!
, ""తప్పు అంటే ఏమిటి??"""
అని ఒకసారి  విచారిస్తే , ,
మనసా వాచా కర్మణా ఇందులో ఏ ఒక్క విధానం తో నైనా ఎదుటివారు బాధ పడితే , ,, పది మంది కలిసి నిజమే ,,"పాపం అన్యాయం జరిగింది ;"  అని ధృవీకరిస్తూ ఉంటే ,అది తప్పు గా అనుకోవచ్చు !!
రావణుడు బ్రహ్మజ్ఞా ని !!
"తప్పు "అని తెలిసి"  తప్పు ""చేశాడు !
ఎందరు చెప్పినా వినలేదు !!
సమూలంగా
సర్వ నాశనం అయ్యాడు !
దుర్యోధనుడు కూడా పాండవులను బాధపెట్టాడు!  ఘోరంగా
హింసించా డు !
సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడే  చెప్పినా వినలేదు !!
అధికార మద ము ,మాత్సర్యము ,తో ,తనతో బాటు 18అక్షౌహిణుల సైన్యం నాశనం చేసుకున్నాడు !!
చివరకు ఏం మిగిలింది ?.
అపకీర్తి తప్ప!
భగవంతుడు అందుకే ,జ్ఞానం ఇచ్చాడు ,
మనిషిగా బ్రతకమని !!
___ఇప్పుడు కూడా ,,
మన చుట్టూ రావణ దుర్యోధన ప్రవృత్తి గల నీచా తి నీచులు ఉన్నారు!!
అందుకే ఈ యుద్దాలు !!
మేము అగ్ర రాజ్యంగా ,ప్రపంచాన్ని శాసించే విధంగా ఉండాలి అన్న అధికార దాహం తో చేయరాని తప్పులు చేస్తూ దేశాలు  ప్రపంచ యుద్దాలు తెచ్చాయి !!
జెర్మనీ హిట్లర్  నిరంకుశ విధానమే యుద్దానికి మూలం అయ్యింది !!
ఇలా ఏ ఇంట్లో  , ఏ దేశం లో విప్లవాలు ,బాంబుల ప్రయోగాలు ,,కొట్లాట ,  అపార్ధాలు , శతృత్వ భావన , ఇవన్నీ  చేసిన తప్పు లు   ఒప్పుకోక పోవడం , వల్ల జరిగే అనర్ధాలు  మాత్రమే !!
""ఎదుటి వాడు మాత్రమే తప్పు చేస్తాడు !!"
",తాను  మాత్రం  సత్యవంతుడు !!"  , అనీ గర్వంగా ఉంటాడు !
కానీ ఏ ఒక్క రోజైనా ఆత్మ విచారణ చేసుకో డు కదా ఈ మనిషి అనబడే వాడు !!!
""ఈ రోజు నేను ఎవరికైనా ఉపకారం చేశానా ?""
""సేవ చేశానా ??"" దానం చేశానా ??
ఒక మంచి. ఆదరణ  మాట మాట్లాడా నా ??""
""ఏదైనా మంచి పని చేశానా ??""
""ఏదైనా తప్పు  నాచే జరిగిందా ??""
""___ తెలిసిగానీ ,తెలియక గానీ ఎవరినైనా  నొప్పించానా ??"" నేను ,,!
అనుకుంటూ,
పడుకునే ముందు ఒకసారి  ""ఆత్మావలోకనం"" చేసుకోవాలి "మనిషి "అన్న ప్రతీ వాడు !
ఒకవేళ ,,దిద్దుకొలేని అపరాధం జరిగింది అనుకుంటే ,
కనీసం  అంతరాత్మ సాక్షిగా  ,,
క్షమించమని  పరమాత్మను వేడుకోవాలి కూడా !
______
ఇప్పుడు మన ముందు కరోనా పిశాచి కరాళ నృత్యం చేస్తూ  ,,నేరుగా మన వద్దకు వస్తూ ఉండడం చూస్తున్నాం !!
, ఇప్పుడు ,మనం  చేయా ల్సింది  "" చైనా కోవిద్ ""ను తిట్టడం కాదు !
,, కరోనా ను మన వరకూ మోసుకొస్తు ఉంటున్న   సూపర్ spider లను కూడా  ,,తిట్టడం వల్ల కూడా  లాభం లేదు !!
కక్ష్య  కోపం , ఈర్ష్య ,అపార్ధాలు ,, తగాదాలు పెంచుకునే సమయం కూడా  కాదు  ఇపుడు !!
దేశం ,ప్రపంచం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది !!
కాబట్టి మనం ఎంత కోపం తెచ్చుకుంటే ,అంత గా ఈ కరోనా భావం రెచ్చి పోతూ ఉంటుంది !!
అని గుర్తు పెట్టుకోవాలి,,!!
పరిష్కారం  పంచాయితీ తో సాధ్యం కాదు !
సంయమనం ,తో ఎదుర్కోవాలి !!
ఏక్సిడెంట్ వలె అనుకోకుండా ఎదురైన
సున్నితమైన  ఈ  సమస్యను  ,,జీవన్మరణ పరిస్తితి నీ  ,,
ఎవరికి వారే జాగ్రత్తలు పాటిస్తూ ,, ఇంట్లో ఉంటూ ,,ఛాలెంజింగ్ స్వభావం తో ,,అప్రమత్తంగా ఉంటూ  పరిష్కరించు కోవాలి !!
,"" సమస్య వు నీవే!""
"" దానికి సమాధానం చెప్పేది కూడా నీవే !""
""వ్యవస్థ ను బాగు చేసేది, నీవే!""
""అవస్త పాలు చేసేది కూడా  నీవే !""
""నేనుఅఙ్ఞానిని !"
,""అమాయకున్ని !",
""తెలియక పొరబాటు చేశాను !""
""తప్పు జరిగింది !""
""కానీ చేయాలని ఈ తప్పు చేయలేదు ,!"
ఇకముందు అలా చేయను !"
బుద్ది వచ్చింది !!""
క్షమించు !! సారీ !!""
నాకు మాత్రం చావాలని ఉంటుందా !""
నాకు మాత్రం బ్రతుకుపై తీపి లేదా ?""
అంటూ చేసిన తప్పును మాటలతో  కప్పి పుచ్చినా ,,
, నీ తప్పుడు నడకతో , వెధవ చేతలతో ,
,నీతో బాటు
, ఆ దుర్యోధన రావణ రాక్షసుల వలె ,
సమూలంగా ఈ సమాజాన్ని కూడా   నాశనం కావడానికి ముఖ్య కారకుడు నీవే !!" ""అవుతావు అని గుర్తించాలి!""
తెలిసి చేసినా
తెలియక చేసినా
తప్పు, తప్పే,, కదా !
నిప్పును ముట్టుకుంటే కాల్చి పారెస్తుంది ,అని తెలుసు కదా !
మరెందుకు ఈ దిగజారుడు పనులు ,,చెప్పు !!""
ఇది మాములుగా దిద్దుకు నే " మామూలు ""తప్పు!"" "కాదు !!""
ఘోరమైన మహాపరాధం అవుతుంది !!
కోర్టు, న్యాయం ,దండన లకు లొంగే  నేరం కాదు ఇది!!"
తప్పు జరిగింది అని ఒప్పుకున్నా కూడా
శిక్ష తగ్గే అవకాశం కూడా I లేని భయంకరమైన ,భయాందోళన కలిగించే , ప్రళయ కాల మారణకాండ సాగిస్తున్న  వైపరీత్యం , ఈ కరోనా! " కాబట్టి
""ఏ తప్పు"" చేస్తే , ఈ వ్యాధి  ప్రబలుతూ ఉందో ,
ఆ తప్పు చేయకుండా ఉండడం   ఇప్పుడు మనిషిగా
ప్రతివాడూ చేపట్టాల్సిన నైతిక ధర్మం !""
"అపురూపమైన , ఈ మానవ విలువలు చక్కగా కాపాడుకుందాం !!
మన దేశాన్ని ,తద్వారా మానవ జాతిని రక్షించు కుం దాం !!!
తప్పులు చేస్తూ ఉండడం మానవ నైజం !!
నిజమే !
కానీ ""
చేయకూడని ఘోరమైన తప్పు  ఇలా చేయడం!!"" "అని తెలిసి కూడా ఇలాంటి " తప్పు" పదే ,పదే  ""చేయడం మాత్రం,,
దేవుడు కూడా క్షమించలేని మహా మహా మహా  ""అపరాధం ""!!""
ఎందుకంటే ,
కరోనా వ్యాది అరికట్టే విధంగా ప్రభుత్వం , డాక్టర్స్ ,పారిశుధ్య కార్మికులు ,నర్సులు ,, పోలీస్ బృందాలు ,దేశ సరిహద్దుల్లో సైనికుల వలె ,, ,,రాత్రింబవళ్ళు ,మనకోసం ""ఎంత గా శ్రమిస్తున్నారు !""
అన్న  జీవిత సత్యం ,మానవత్వ  విషయం తెలియని భారతీయుడు ఉండడు  గాక ,, ఉండడు !!"
అలాంటి త్యాగ మూర్తులకు  చేతులెత్తి కృతజ్ఞతా పూర్వకంగా నమస్కారం చేద్దా ము  !!
ప్రభుత్వ సూచనలు  అక్షరాలా పాటించు దాము !!
వందే మాతరం !
జై తెలంగాణా !
సర్వే జనాః సుఖినోభవంతు !""
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...