Saturday, April 18, 2020

భారత మాత కు దీపోత్సవం !

Apr 5, 2020
ఆదివారం ,5 ఏప్రిల్ రాత్రి 9pm
130 కోట్ల  భారతీయుల చే కోటాను కోట్ల ఇండ్లలో  దీపోత్సవం !! దీప యజ్ఞం !
చైత్రమాసం ,! పవిత్ర
ద్వాదశి ! పుణ్య దినం !;

మనం ,భారతీయులం నిత్యం ఇండ్లలో , పూజా మందిరం లో అగ్ని దేవతను పూజించే నిమిత్తం ,, దైవారాధన కు ముందు దీపారాధన కోసం దీపాలు  వెలిగిస్తాం !
ఈ విధంగా  నిత్యం ,పరమాత్మను ఈ శ్లోకం చదువుతూ, దైవాన్ని  ఆహ్వానిస్తూ ,,పూజ ప్రారంభిస్తూ ఉంటాం !! శ్లోకం !!
""దీపం జ్యోతి పరబ్రహ్మ ,,,!
దీపేన హరదే పాపం ,,!
దీపేన సాద్యతే సర్వం !
దీప రాజాయతే నమః !!!
_అంటూ నమస్కరిస్తా ము !!
"దీపావళి  ""అంటే దీపాల సముదాయం !
దీపం వెలిగిన ఇంటిలో రోజూ పండగ రోజే!!
""దీపం !""అంటే జయం !,శుభం !
శ్రీమహాలక్ష్మి ఆగమనం !!!
____పూర్వం నరకాసుర సంహారం  ముగించి , ద్వారకాపురి వస్తున్న
సత్యభామా సమేత శ్రీకృష్ణ భగవానులకు ,,అక్కడి 
పురజనులు ,,తమ సంతోషం ప్రకటిస్తూ,,వారికి జయ జయ ధ్వానాలు పలుకుతూ,, ఇంటింటా,, ఊరూరా  ,,ఇలా దీపాలు  వెలిగిం చి ,, ఆ ఉజ్వల దీప కాంతుల లో ,,మంగళహారతి  గీతాలు పాడుతూ స్వాగతం పలికా రు !!!"
అలాగే,,
దుర్గాదేవి మహిషాసుర  మర్దని,,కూడా ,,
,రక్తాక్ష , రక్త బీజ ,,లాంటి ఘోర రాక్షసుల వధ కోసం నవ దుర్గా రూపాల్లో ఆవిర్భవించి వారిని సంహరించింది !!
,,  దేవతలు కూడా ,మహాకాళి ,,మహాలక్ష్మి, మహా సరస్వతి రూప లలితా పరా భట్టారిక అనుగ్రహం కోసం
కోటి కోటి దీపాల తో పూజించారు !!
, అందుచేత ,,మనం కూడా ,,ఇప్పుడు ,, ఈ కరోనా అనబడే రాక్షస సంహారానికి ,,
ప్రతీ స్త్రీ ఒక  దుర్గాదేవి లా శక్తి స్వరూపిణి లా , ,,ఉద్యమిస్తూ ,,
తొమ్మిది దీపాలను వెలిగించి ,, లలితాదేవి స్తోత్రం చేస్తూ ,దేవి అనుగ్రహం కోసం  అమ్మలగన్న అమ్మను ప్రార్థించాలి !!!
___అలాగే ,,ప్రతీ పురుషుడు ,
గౌరీ శంకరుల ను ధ్యానించాలి !
గరళాన్ని మింగి , సకల భువనాలు రక్షించిన పరమ శివుని,, భక్తితో సేవిస్తూ , భావిస్తూ ,,ఈ కరోనా బారినుండి రక్షించమని శివుని కోరాలి !!
""అడగందే అమ్మైనా అన్నం పెట్టదు !""అంటారు కదా!!
అందుకే ,,అలనాటి ""గజేంద్రుని ""వలె మొర పెట్టుతూ శరణాగతి భావంతో ,, మొసలి వలె పీడిస్తూ ఉన్న ఈ దుష్ట శక్తి ని దునుమాడి ,,,సర్వ జనులను ,రక్షించమని. కోరాలి !!!
""మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు కదా!""!
""మనసు ఉంటే మార్గం ఉంటుంది !""
మన సనాతన ధర్మం  మనల్ని వెతుక్కుంటూ వచ్చింది ,,చక్కని ఈ c శుభ ఘడియల లో,,,మన ఇంటి ముంగిట , మంగళ గౌరీ దేవి వలె  నిలిచింది ,!!
, మంగళ గీతాలు పాడుతూ  ,మన గృహాల్లో కి స్వాగతం తో ఆహ్వానించడం కోసం ,, జగజ్జనని 
ఎదురు చూస్తోంది !!
,, ఈ విధంగా నైనా ,,బాగు పడే అవకాశం , మనకు  ఇస్తోంది అమ్మ !
**""ఆ పరమేశ్వరి అనుగ్రహం లేకుండా  కరీనాను నివారించలే ము  కదా !!""
"""విజయలక్ష్మి  ,, పాపాత్ముల మైన ,మనవైపు కన్నెత్తి అయినా చూడదు కదా!
నిత్యం దేవతా పూజ చేయకుండా ,, మూగజీవాల ను బలి చేస్తూ ,, ప్రకృతి మాతను క్షోభ కు గురి చేస్తూ ,మహా పాపం చేస్తున్నాం ,మనం !;
అమోఘమైన అద్భుతమైన మన సంప్రదాయాలను  నిర్లక్ష్యం చేయడం వలన,, మనం ,,అందరం తీరని వ్యధ తో ,, అష్టకష్టాలు పడుతున్నాం !
____తన దివ్యమైన 130కోట్ల  మహోజ్వల దీప కాంతులతో ఈ రాకాసి కరోనా ను తుద ముట్టించడానికి , మోదీ గారి పిలుపు తో  మళ్లీ తిరిగి మన ఇంటి గుమ్మం తలుపు తడుతోంది !!
మన సంఘటిత భావంతో ,
""భవానీ మాతా కీ ,జై!!"" అంటూ జయ జయ ధ్వానాల మధ్య ,,జగన్మాత కు తొమ్మిది దీపాలు వెలిగించి నవ దుర్గా దేవికి ,,, ఉత్సాహం తో ,ఆనందంగా,,ఎవరింటిలో వారు ,సంబరంగా   స్వాగతం పలుకుదాం
!!""___""జగదంబ ""ఉన్న చోటికి , ఈ  కరోనా కాదు కదా ,అలాంటి ఏ దుష్ట శక్తి కి స్థానం ఉండదు !!
మన హృదయాలలో ,మన ఇండ్లలో , వాడలో ,,ఊరిలో, నగరం ,రాష్ట్రం ,దేశం , తో బాటు సకల జగత్తు లో
ఆ మహా దుర్గా దేవిని ,భక్తితో  ,మనం వెలిగించిన దీప కాంతులతో ,, ""దేవీ వైభవాన్ని  ""దర్శించి ,,దివ్యమైన
పరమానందం పొందుదాం!!
"దీపం అంటే ,,ప్రకాశం ,! జ్ఞానం,,! ఉత్సాహం !,,ఉల్లాసం! ,,నవ చైతన్యం! ఒక ,,, మణిద్వీపం!!
, గౌరీ దేవి దరహాసం ,!!, ధరణీ మాతా ,అనందం ,!!
,,నింగిలోని ముక్కోటి దేవతల దివ్య అనుగ్రహం !!,,
మన హృదయ మందిరం  లో వెలిగే దైవ గుణం !
,, అద్భుతమైన ఆత్మానందం ,!!
ఆ పరంజ్యోతి,,,మహాలక్ష్మి వైభవం, !!
అపర దుర్గాదేవి  యొక్క శక్తి స్వరూపం!!
గీతాచార్యుడు ఆ , శ్రీ కృష్ణ భగవానుని చైతన్యం !!",,
""ఆత్మ""ను ""పరమాత్మ"" తో అనుసందించే   అలౌకిక ,, మధుర ,  భక్తి భావన ,!!
,భక్తునికి  ఆ దేవదేవి భగవతి ,జగదంబ పట్ల ఉండే ఆరాధనా ,భావ సంపద ,, !!
""అహం బ్రహ్మాస్మి ,,!""
  ""శివోహం ,,!"
నేనూ కూడా బ్రహ్మ స్వరూపాన్ని   !!,
హే జగన్మాత!
పాహిమాం ,!
హే లోక పావని,,! విశ్వపాలినీ ,!
రక్ష మామ్ !__
సంపూర్ణ ఆత్మ సమర్పణ భావంతో, ఆర్ద్రత తో, ఆవేదన తో, ,,ఘోర విపత్తు నుండి  తమను  గట్టెక్కించమని దుర్గ ను  కోరుతూ ఉన్న ఆర్తుల  నివేదన 
___""భవాన్యష్టకమ్ ",
శ్లోకం !""
""వివాదే విషాదే, ప్రమాదే ప్రవాసే ,,
జలే చా నలే పర్వతే శత్రు మధ్యే ,
అరణ్యే ,శరణ్యే సదా మాం ప్రపాహి,
గతిస్త్వం గతిస్త్వం , త్వమే కా భవానీ !""
అమ్మా !
నేను నీ బిడ్డను ,!!
ఆపదలో ,ఘోర విపత్తులో  భయాందోళన తో ,జీవన్మరణ నరక యాతన తో దిక్కు తోచకుండ ,, అయోమయ పరిస్తితి లో ఉన్నాను ,నేను !!""
""అమ్మా " ఇక నీవే దిక్కు !!""
తల్లీ !!నీకే శరణు  !""
నా  అజ్ఞానం తో మహపరాధాలు చేశాను,, ఈశ్వరీ !""
దయతో క్షమించు !""
ఈ కరోనా మహమ్మారి నుండి సకల జనావళికి
రక్షించు !""
శాంతిని ప్రసాదించు !""
హే  ,,శ్రీమాత !"
హే  ,,భవానీ !
కరుణించు !""
శరణు శరణు శరణు!!
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా !!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...