Saturday, April 18, 2020

రాధా,! శ్రీకృష్ణుని ఆపరాదా ?

Apr 8, 2020
""రాధా , ! ఓరాధా ,ఇక్కడున్నావా ?""
""ఏమిటీ , ఎందుకీ పరుగు ?"" ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా ??""
,__ఎందుకా ,? నీకు తెలీదా , ?? రాధా ,,!ఏమిటి , విషయం ?!
""__రాధా !ప్రత్యేకంగా నీ కోసం నిన్ను వెదుక్కుంటూ వచ్చాం తెలుసా ,??'""
__ఆఖరికి ఈ బృందావనం లో దొరికావు !!""
""అయ్యో !!""ఇంతమంది నా కోసం వచ్చారా?? చెప్పండి ! ఆ  కృష్ణుని గురించేనా?? ఏమిటీ సంగతి??""
  ""రాధా !ఇది వింటే నీవు చాలా బాధ పడతావు  సుమా !""
""అంత చెడ్డ వార్త ఏముంటుంది ,??""
"""__ రాధా !మధుర నుండి. అక్రూరుడు అనే క్రూరుడు వచ్చాడు,మన  , కృష్ణుని కోసం !""
  ""అవునా ? మరి కృష్ణుడు వెళ్తున్నా డా ?""
""అవును  ,,రాధా !ఎవరు చెప్పినా వినడం లేదు! చివరకు యశోద మాత ,నంద రాజు మాటలు కూడా పని చేయడం లేదు , !""
""!నిజమా ??
!!,అంత పనేముంద ట,, మధురలో !!"?!""
__ ఏదో దనుర్యాగం అట ,!! ఆ దుష్ట కంసుడు పిలిచాడట  ,,బల రామ కృష్ణులను!! వీరు వెళ్ళాలి ,, అట !"" 
  ,వాళ్ళు రమ్మన్నారు ,వీళ్ళు వెళ్తున్నారు !!
మద్య  నన్నేం చేయమంటా రు ?""చెప్పండి ,,?""
""రాధా !"" కృష్ణుడు  వెళ్లిపోతే మనం  ప్రాణాలతో జీవించి  ఉండగలమా,,  చెప్పు ?""
రాధా !"
""నాకూ మీలాగే బాధగా ఉంది ,!""మీరు చెబుతుంటే ,,!""
,,"" రాధా ,,!నీవు చెబితే ఆ  కృష్ణుడు వింటాడు !
,నీవంటే  అతడికి ప్రాణం !!"" ఇది మాకు బాగా తెలుసు !!
"నీ మాటను. కృష్ణుడు  కాదన లేడు!!;
"""రాధా !  అందుకే , నీ వద్దకు పరు గెత్తుకుంటు వచ్చాము ,,మేము!!
,""అందుకే ,,రాధా !!మన  కృష్ణుని మధురకు వెళ్లకుండా ఆపు !""రాధా !;
అతడు లేని ఈ నందగ్రామం  జీవచ్ఛవం అవుతుంది !!"
ఆ తల్లి యశోదా పరిస్తితి చూస్తుంటే  మాకు చాలా బాధగా ఉంది ! కడుపు తరుక్కు పోతోంది ,,! ఏం చేయము ,,చెప్పు !
""ఎవరితో చెప్పుకోము మా  బాధ ,,
రాధా ,!,ఒక్క నీతో తప్ప !""
""రాధా!; నీవు కృష్ణుడు కలిసి తిరగని చోటు  ,, ఈ బృందావనం లో లేదు !!
ఎక్కడ చూసినా , మీరే, ఇద్దరు !!
"కాలం  మరచి  , దేహ ధ్యాస విడచి , రాత్రి పవలు తేడా తెలీకుండా,, ఒకరినొకరు విడవకుండా ,ఇన్నాళ్లూ,హాయిగా ,,ఆనందంగా గడిపారు !""
"" రాధా ,,! నీతో పాటు కృష్ణుని ,,మిమ్మల్ని చూస్తూ మేము  ,ఎంతో పరవశించి పోయాము  ,తెలుసా ?""
కృష్ణుడు మాతో నే ,మాలో ప్రతీ ఒక్కరితో , విడి  విడిగా ,,జతగా ,విహరించి నంత ఆనందంగా , మధురానందాన్ని  పొందాము ,మేమంతా !!""
""రాధా;! మీ   సంతోషం సంయో గం  కళ్ళారా దూరంగా ఉండి చూసిన,  మాకే ఇంత వేదన కలిగితే ,కృష్ణ వియోగం,కృష్ణ విరహ తాపాన్ని నీవు ఎలా సహించగలవు రాధా ?""
ఇది తలచుకుంటే ,,మాకు ఆపుకోలేని దుఖం కలుగుతోంది సుమా !"" ""రాధా ! కృష్ణుడు ఇక్కడ ఇక ఉండటం లేదు ,అన్న కటోర   సత్యాన్ని  వింటూ ,,నీవు ఎలా తట్టుకోగల వు ,,రాధా !" ఈ విషయం  నిన్నెం త గా  బాధిస్తుం దొ, కదా ?""
""రాధా !!  ఆ గోపికా లొలుని , రాధా మనోహరుని ,, అల్లరి చిలిపి కృష్ణుని ,,మధురకు వెళ్లకుండా నీవై నా ,,ఆపరా దా,,రాధా !
నీ పాదాలు పట్టుకుంటా ము ,,, రాధా !""
,,దయచేసి కృష్ణుని ఆపు,,రాధా !""
,రాధా !" నీ విషయం మాకు తెలీదు,, గానీ,,
ఆ కృష్ణుడు లేనిది మేము లేము  !!!""
""కృష్ణుడు వెళ్లే దారికి ,,మేమంతా వెళ్లి,,,అతడి రథం,మధురకు  వెళ్లకుండా ,దారికి  అడ్డంగా పడుకుంటాం  !!""
, రాధా,! అతడి రథ చక్రాలు మా శరీరాల పైనుండి పోతే పోనీ !""
వాని చక్రాలు గుర్రపు డెక్కల తాకిడికి మా ప్రాణాలు పోతే పోనీ,!""
కృష్ణుడు వెళ్ళిపోయాక ఈ బ్రతుకు తో ఈ శరీరాలతో పనేముంది చెప్పు !""
""రాధా ,! నిన్ను బ్రతి మిలాడి కుంటున్నా ము,!
,,"ప్రాధేయ పడుతూ,,మేమంతా ,నీకు చేతులెత్తి ప్రార్ధిస్తూ ఉన్నాము ,,!
రాధా !!
"ఎలాగైనా  ,, నీవు ఆ కృష్ణుని ఆపాలీ ,రాధా !""
""నీకు ఆ శక్తి ఉంది !!
""నీ మాట జవ, దాటడు, ఆ కృష్ణుడు !!
మాకు నమ్మకం ఉంది,, నీ మాట కృష్ణుడు వింటా డని,,!""
""రాధా !"  ఒక్కసారి మాతో మాట్లాడు రాధా !"
""కృష్ణుని వెళ్ల నీయకుండా చూసే బాధ్యత నాది !""
అని ఒక్క మాట అను రాధా ,!"""
"" పోతున్న ,మా ప్రాణాలను నిలబెట్ట రాదా,,,, ఓ ,రాధా !
రాధే, రాధే, రాధే, రాధే !""
___&&________&&_
స్వస్తి!"
హరే కృష్ణ హరే కృష్ణా!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...