Saturday, April 18, 2020

ధన మెక్కిన మదమెక్కును

Apr 10, 2020
మహా యోగి  వేమన పద్యం  ఒక్కొక్కటి మానవ జీవన విధానానికి దర్పణం పడుతుంది
""ధన మెక్కిన మదమెక్కును ,,
మద మెక్కీన మత్సరంబు మరి మరి ఎక్కున్  ,,,!"
అన్న విధంగా  ,
ఒకవైపు,,
నేడు ,,కొన్ని  దేశాల మధ్య   ""ధనం , టెక్నాలజీ ,  అధికార మదం,ఇలాంటివి చాలా  "ఎక్కువైన దేశాలు ,, మిడిసి పడుతూ ,,అగ్ర రాజ్యాలు గా గుర్తింప బడుతూ ,వాటి అధికారాన్ని , ఇతర దేశాల పై ,,బాంబుల దాడితోనూ హింసాత్మక ఘటన ద్వారా ప్రదర్శిస్తూ ఉన్నాయి ,,,!
మరొకవైపు__  విపరీతమైన మతవిద్వేశం ,లో  రగులుతూ ,  తమ మతవ్యాప్తి కోసం ,ఎంతటి మారణ విధ్వంసానికి అయినా  వెను దీయకుండ ,ఘోర దారుణాలకు  పాల్పడుతూ ప్రత్యక్షంగా ,, ఎదురుదాడి చేస్తున్న దేశాలు   కొన్ని ఉన్నాయి !!
ఇలా గుర్తింపు కోసం ,,కొన్ని ,, ఒకరి పై మరొకరు  ,పై చేయి గా ఉండాలన్న  దురాశ ,ఈర్ష్య ,ద్వేషం ,పగ ప్రతీకారాల తో కొన్ని దేశాలు , శతృ త్వ భావంతో  చెలరేగు తూ , ఉంటున్నాయి !!
,శాంతిని కోరే మన  భారతదేశం లాంటి దేశాలను బెదిరిస్తూ ,,అరాచకాన్ని ,అల్లారులను సృష్టిస్తూ  తమ చేతుల్లో ఉంచుకొని ,వారు చెప్పినట్టుగా అడించాలని అనుకుంటున్నాయి !!  బహిరంగంగా నే ,,రాజకీయ కుట్ర కుతంత్రాలను  చేస్తున్నాయి ,!;
ఇలాంటి దుర్బుద్ధి ఫలితమే ,ఇప్పుడు  ఈ "కరోనా మహమ్మారి"" ఉదృత ప్రభావం !;
నిజంగా ఇది  ఒక పరాన్నజీవి ,!
ఏదో ఒక ప్రాణి పై పడి తింటూ బ్రతుకుతూ ఉంటుంది !!
దాని మనుగడ కోసం ,క్షణాల్లో వాటి సంఖ్యను పెంచి ,జలగల్లా  రక్తం పీలుస్తూ ,దేహమంతా వ్యాపించి , చివరకు మనిషి ప్రాణాన్ని హరిస్తూ ఉన్నాయి ,!!
ఇంత ఘోరం ఏ క్రూర జంతువు కూడ చేయలేదు ,!!""
కానీ  ఆ "",మనిషి"" చేశాడు ,!""
క్రూర మృగాలను తింటూ,అంతకంటే  క్రూరంగా  దురాలోచనలు చేస్తూ  ఇంత పాపపు పనికి ఒడిగట్టడం , ఆ  దేవుడు కూడా క్షమించ లేడు కదా !
""బ్రహ్మాస్త్రం ప్రయోగించడం ,తెలిసిన దనుర్థారి కి, ,దాన్ని ఉపసంహరించే విధానం తెలీక పోతే ,జగత్తు భస్మం అవుతుంది , కదా !!
ఇప్పుడు  ఈ కరోనా వ్యాది విషయం అంతే !
పుట్టించిన వాడు ,
ఈ క్రిమి ఎంత దారుణంగా మానవజీవనాన్ని అతలాకుతలం చేస్తుందో  స్వయంగా ,తెలిసి కూడా ,
తమ దేశం లో ఆ ఘోర  పరిణామం , కళ్ళారా  చవి చూసి కూడా స్వీయ   ,అనుభవం తో తెలిసి కూడా  , ఆ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా  ,,నేడు 209 దేశాల కు ఆ దిక్కుమాలిన పీడను పంపిం చి,,
ఇప్పుడు ఏమీ ఎరుగని వాని వలె అమాయకంగా  మొహం పేట్టి ,ఘోరాన్ని ఆనందంగా  చూస్తున్నాడు !!
,జరిగిన ,జరుగుతున్న   అన్యాయ మారణకాండ సాగిస్తున్న వైపరీత్యం గురించి ,,కనీసం ఒక్కసారైనా ,తన  పెదవి విప్పకపోవడం , మానవజాతికి తీరనీ మచ్చగా , కళంకం గా ఆ దేశాన్ని  భావించాలి !
""ఇదేనా అగ్రరాజ్యంగా గుర్తింపు కోసం చేయాల్సిన పని ?""
ఏ ప్రయోజనం ,జనకల్యానం ఆశించి  ఈ వింత క్రూర క్రిమి నీ పుట్టించినట్టు !?""
ఇక్కడికి అయిపోయిందా ,,ఇలా  ద్వేషం తో విషం చిమ్మే ప్రయోగాలు ,? "
ఇంకా ఉందా ??""
""తప్పు జరిగితే ,దిద్దుకోవాలి ,!""
అది విజ్ఞుడి లక్షణం !;
తెలిసి చేసినా,తెలియక చేసినా,,తప్పు తప్పే !""
ఈ ,మామూలు తప్పు కాదు !
క్షమించరాని తప్పు !
ఇంత జరగుతున్న కూడా
,నేరం చేసిన వారికి పశ్చాత్తాపం కలగక పోవడం ,శోచనీయం !
, ఇప్పటికైనా దేశాలన్నీ బుద్ది కలిగి ,పరిష్కారం కోసం ,, ఒక కొలిక్కి వస్తాయా !""
""క్రూర మృగాన్ని ,బోను లోకి తిరిగి తేవాలా ,,వద్దా ?""
తెచ్చే వరకు
, ఆ "మృగం యజమాని"" జరుగుతున్న ఘోరా లకు  బాధ్యత వహించాలి కదా !""
తమాషా చూస్తూ కూర్చుండటానికి ,,ఇదేం పాక్ దేశం ఆడుతున్న  నాటకం కాదు,!
బాలీవుడ్,హాలీవుడ్ సినిమా అంతకంటే కాదు ,!!
నేటికీ సుమారుగా లక్ష మనుషులను పొట్ట బెట్టుకుం టూ ఉంటోంది , ఆ సైతాన్ !!
కాదు కాదు !
,దాన్ని పుట్టించి ,రెచ్చగొట్టి , ఇతర దేశాలకి పంపించిన ఆ  దుష్ట  దేశం ,చంపిస్తూ ఉంది ,!!
""ప్రాణం తీయడం.  సులువే  కావచ్చు !""
కానీ ,ప్రాణం పోయడం ఎవరికైనా , అసాధ్యం కదా !
.బ్రతుకు పై తీపి లేని వారుంటారా ??
ఇన్ని వేల మంది ప్రాణాలను తీయడానికి నీకేం హక్కు ఉంది ? ,,చెప్పు ,,!""
ఇలాంటి వారిని మనుషులు ఆనవచ్చా ?""
ఇలాంటి దుష్ట దేశాలతో  ఇంకా సంబంధాలు  పెట్టుకోవచ్చా ?""
సంకరజాతి ,పశువులు ,మొక్కలు ,విత్తనాలు తయారు చేస్తున్నట్టుగా , సంకర జీవాలను  కూడగట్టి , బయోలాజికల్ వార్ ,రూపంలో ,,
ఇలా ""మానవ బాంబులు"" గా తయారు చేస్తూ , భగవంతుడు అనుగ్రహించిన ఈ
అందమైన ప్రకృతిని ,
భయాందోళన కు గురి చేస్తున్నావు కదా !!,
జాతి విద్వేషం తో ,,అధికార మ దం తో , సాంకేతిక పరిజ్ఞానం తో ఇలా వికారంగా  వికృతంగా  మారుతూ ,పరిసరాలను , మారుస్తూ ఉంటున్న ఈ నరరూప రాక్షసులను ఏమనాలి ,?""చెప్పండి !!
ఏ పేరుతో పిలుద్దాం ? అలాంటి తెగ ను ???""
ఎలా వీరి ఆట కట్టేది ?""
రోజూ ,మూడువేల కు పైగా బలి అవుతున్న మన అమాయక సోదరుల ఆత్మలు  ఆకాశం లో శాంతితో వుండే నా ?
అవి ఘోషిస్తూ తిరగవా ప్రేతాలై ?
అవి అన్నీ ఒక్కటై , తిరిగి ఏదో ఒక రూపంలో  మానవ జాతి పై ,ప్రతీకార చర్యలకు పాల్పడి తే , ఏం చేయగలం ? ""
అవి శాంతిగా ఉండె నా !!
మనకు మనః శాంతి కలుగేనా ,ఏనాటికైనా ??
ఈ కథకు అంతు ఎక్కడ ,? ఈ విషమ పరిస్తితి నుండి బయట పడటం ఎలా ?""
కనబడని శత్రువుతో  యుద్దం చేసేది ఎలా ??ఎన్నాళ్ళు ఈ దాగుడుమూతలు ?""
ఎవరిని ఆశ్రయిస్తే ,మనం బ్రతికి  బట్ట కడదాం ?
ఇంత మంది దేశ నాయకులను , వాని ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నంలో , ఈ వ్యవధిలో ఇంకా ఎంతమంది ఎన్ని దేశాల్లో ,ఎన్ని వేలల్లో ,, ఇలా ఆత్మాహుతి చేసుకోవాల్సి ఉంటుంది ?
""జంతువు ల ప్రాణానికి విలువ కడుతున్నా రు, ,వాటిని చంపి కోసుకుని తింటూన్నవారు   !!!"
మరి ,అత్యంత ఘోరంగా చంపబడుతున్న ఈ నాటి మనుషుల సంగతి ఏమిటీ !? "
ఈ ప్రాణాలకు విలువ కట్టేవారేవరు ??""
""మందు మాకూు లేని,ఉనికి తెలియని ఈ దుష్ట పరాన్న జీవి అంతమయ్యేదేపుడు ?"""
"""తిరిగి శాంతి భద్రత ల నడుమ ,,దేశాల మద్య ఆనందం వెల్లివిరిసే దెపు డు ?""
""ఓ భగవంతుడా ,!""
, నీ చల్లని చూపు ల వర్షపు చినుకుల ద్వారా మాత్రమే , ఈ కరోనా మహమ్మారి అగ్ని జ్వాలలు  సమసిపోతాయి ,!""
వేరే గతి లేదు !
మరో దారి లేదు !!
,""హే ,,పరమేశ్వరా!""
,ఇక చాలు ,స్వామీ ,,!చాలు !
భరించ లే క పోతున్నాము ము !  కరోనా ఆగడాలు !"" """దీన్ని నియంత్రించడం ,,మాకు చే త కాకుండ పోతోంది !"" తండ్రీ !!
  ""ఇక ,,నీవే దిక్కు !""
""నీకే శరణు !"
""దయజూడు ,, గౌరీ రమణా !""
పాహిమాం ,, శంకరా ,!
హర హర మహాదేవ శంభో శంకరా!
రక్ష మామ్ ! సదాశివ !!""
ఇక  ,,ఏ మాత్రం , ఓపిక లేని ,సహించలేని ,దుర్భర  దిన దిన చెరసాల జీవితం అవుతోంది  మాది !""
""హే నారాయణా !
""ఈ  కరోనా సమస్య నీదే !;
,, మాది కాదు !""
""దీని పరిష్కార బాధ్యత కూడా నీదే , స్వామీ,,;""., మాది కాదు !""
"ప్రభూ !
""నీవున్నావు ,!
""అంతా  చూస్తూ ఉన్నావు ,!""
""మా ఆర్తి  ,,మొర వింటున్నావు!!"
""మా దీన గాథ  ,,నీవు ఆలకిస్తు ఉన్నావు ,;!""
అని మాకు తెలుసు !"""
""హే పరమాత్మా ! పరందామా !
నీ వెక్కడో, ఏ రూపంలో నో,ఉంటావో  మాకు తెలీదు ,!""
కానీ  ,,నీవున్నావ న్న పరిపూర్ణ  విశ్వాసం తో  , మేం నీ కృపకై నిరీక్షిస్తూ  ఉన్నాం !!""
అది నిరూపించుకునే బాధ్యత నీదే ,,ఈశ్వరా !!""
""మా రక్షణ భారం కూడా నీదే !""
""నేరక చేసిన మా  అపరాదాలు   అన్నీ దయచేసి క్షమించు !"
నీకు శరణాగత
వత్సలుడ వు  కదా ! సర్వేశ్వరా ,,!"
నీకు తెలియనిది ఉంటుందా !
చీమ అయినా నీ ఆజ్ఞ లేకుండా మనగలదా ?? జగత్పితా !!""
శరణు ,శరణు ,,శరణు !""
స్వస్తి !"
హరే కృష్ణ హరే కృష్ణా !!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...