Saturday, April 18, 2020

కృష్ణుడు అంటే ఎవరు ?

Apr 9, 2020
""మీ అందరికీ నా ప్రణామాలు ,!! మీ అపారమైన ,నిష్కల్మషమైన ,స్వచ్చమైన  మీ కృష్ణ ప్రేమ నన్ను కదిలించింది !!""
""నా తోటి గోపిక లారా!! ,నా కృష్ణుని ప్రాణ సఖులారా !""
, మీరు చెబుతున్నారు నేను,,కృష్ణుని ఆపాలని!!
కానీ ,,ఇపుడు  నేను కూడా కృష్ణుని ఆపలేని  దయనీయ స్థితి లో ఉన్నాను   !
అతడు దయా సముద్రుడు !
సముద్రాన్ని కడవలో పట్టగలమా,,మీరు  చెప్పండి ,!""
""మీకు తెలిసింది ,కేవలం , ""ఆ కృష్ణుడు  లేకుండా  నేను ఉండ లేనని !!""
కానీ యదార్థానికి
నేను లేకుండా ఆ  కృష్ణుడు ఉండలే డు సుమా !"
ఈ రాధను తన హృదయం లో బంధించి తీసుకొని వెళ్తున్నాడు !
మీకు కనబడే రాధ,వట్టి  శరీరం మాత్రమే,
నేను బ్రతికి ఉంటున్నాను అంటే , నా లో ప్రాణం గా ,రక్త ప్రవాహంలో,నవనాడులలో ,స్పందించే అద్భుత చైతన్యంగా కృష్ణుడు నాలో,, నాతో, నా ముందు , నా వెనక , బాహ్యాము లో భావంలో ,అంతటా కృష్ణ చైతన్యం తో ప్రకాశిస్తూ నా కళ్ళకు అగుపిస్తూ ఉంది!
చెలులార, అదిగో కృష్ణుడు , మీ ఒక్కక్కరూ ఒక్కొక్క కృష్ణునిలా అగుపిస్తు ఉన్నారు ,,
ఇలా చెబుతున్న ఈ రాధా ఒక పిచ్చిది అనుకుంటారేమో !
నిజమే, కృష్ణ తత్వం అనే ఉన్మాదం తో నేను కృష్ణ రూప గుణ భావ సందర్శనా ఆరాధన భావంతో నిజంగా పిచ్చి దాన్ని అయ్యాను !"
నేను కృష్ణునితో కలిసి ఉంటూ పొందిన అద్వైత అమృత భావనా మాధుర్యం , ఈ శ్రీకృష్ణ ప్రేమానురాగాల అనుబంధం !
""ఈ భావనా లోకంలో నేను,,, కృష్ణుడు తప్ప మరెవ్వరూ  నాకు కనిపించ రు సుమా !"
"నాకోసం కృష్ణుడు !
""కృష్ణుని కోసం నేను !!"
అంతే !!"
""నా శరీరం , లో ఊపిరి ఆ కృష్ణుడు !
"", ఆ కృష్ణుడే , ఈ రాధా!"
ఈ  రాధాయే,, ఆ  కృష్ణుడు!"
ఇది యుగయుగాల సంబంధం !
చెదరని ,తరగని ప్రేమానుబంధం !""
ఇది దేహ సంబంధ మైనది కాదు,!
ఇందులో స్వార్థం, లేదు,!
మీరు అనుకుంటున్న విధంగా మేము ఇద్దరం వేరు కాదు !!""
""ఒక్కరమే !;""
మేము  ,ఎప్పుడూ ఉండే వాళ్ళమే !""
నేను ఎప్పు డు,, ఎక్కడికి , ఎలా పిలిచినా,, ఆ  కృష్ణుడు వస్తాడు !!"
""మా ఇద్దరినీ , విధి ,కాలము ,,స్థలము , ఏది ,ఎన్నడూ వేరు చేయలేదు !!
, నా చెలులారా !
దయచేసి నన్ను అర్థం చేసుకోండి !!"
మీకు పేరు పేరునా ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను !""
"" రాధా !!
నీవు ఏమేమో చెబుతున్నా వు ,, మాకు అర్థం చేసుకునే అంతగా జ్ఞానం  ,,తెలివి ,,మాకు లే దు?!!
అయినా,,మాకు అదంతా తెలియదు !;
""మాకు కృష్ణుడు కావాలి,, అంతే !""
""మాతో ,కృష్ణుడు , ఇదే బృందావనం లో  ఆడుతూ పాడుతూ  ,,వేణు గానం చేస్తూ , ఎప్పుడూ ఉండాలి !;""
ఆ ఘన శ్యామ సుందరు ,,మోహన కృష్ణుని , అపురూప సౌందర్యం చూస్తూ ,అతడి మధుర మురళీ గాన మాధుర్యం ఆస్వాదిస్తూ ,  ఈ జీవితాలు ఇలా జరిగితే చాలు !!రాధా,;
మాకిక  వద్దు రాదా !; కృష్ణుని దయచేసి , మా కోసం ,ఆపరాదా  ,, రాదా!!""
""మా ప్రాణాలు పోకుండా నిలబెట్టు ,రాదా .!"" చెలులారా ,!మీరు ఇంతగా కృష్ణుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు కనుకనే ,మిమ్మల్ని ఆ కృష్ణుడు తన ప్రాణ సమానంగా ఆదరించాడు!"
కృష్ణుని భావన లోనే అంత అద్భుత శక్తి ఉంటుంది ,
అలాంటిది , కృష్ణుని తో కలిసి మెలిసి ఇన్నాళ్లూ తిరిగిన మనకు ,కృష్ణ ప్రేమ లోనుండి బయట పడటం అంత సులభమైన విషయం కాదు !!
కృష్ణునికి అచ్యుతుడు అన్న బిరుదు కూడా ఉంది !
అతడు ఎవరికీ పట్టుబడడు !
కానీ కృష్ణునికి పట్టుబడ్డ వారెవ్వ రినీ,
కృష్ణుడు విడిచి పెట్ట డు ,సుమా !!"
కృష్ణుడు అంటే  ,,మీరు ఏమను కుంటున్నా రు??"
కృష్ణుడు
గల గలా ప్రవహించే  ఒక నదీ ప్రవాహం !
, .అందలి మధుర స్వాధు జలాలను త్రాగుతూ ఉండాలి గానీ ,
దానిని ఆపగలరా ,ఎవరైనా!!
కృష్ణుడు చక్కగా చల్లగా మెల్లగా పరిమళ భరితంగా వీచే గాలి !""
అది అందించే సౌరభాలను అస్వా దించడమే తప్ప ,దానిని ,కదలకుండా పట్టుకొన గలమా !?""చెప్పండి!
___&&&____
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...