Apr 17, 2020
వైరాగ్యం మూడు రకాలు!
స్మశాన ,ప్రసూతి ,పురాణ వైరాగ్య ములు ,
అందులో మేటిది స్మశానం !
అక్కడ తెలుస్తోంది ,మనకు పుట్టింది ఎందుకో !""
కానీ ""అది మనదాకా వచ్చే వరకు చూద్దాం ,!",అనుకుంటాం!"
అది ఎప్పుడూ మనలను అంటి ఉంటుంది అని గుర్తించం !"
నేటి దారుణ మారణ హోమం ప్రపంచం లోని అన్ని దేశాల్లో చూస్తున్నాం!" ,
, స్మశానం లో అగుపించే ,లాంటి నిశ్శబ్ద వాతావరణం ,,చూస్తున్నాం !!""
స్మశానం లో తాత్కాలికంగా కలిగించే వైరాగ్యం ఈ రోజుల్లో అందరం చూస్తూ ఉన్నాం ,
""ఏదో కోల్పోయినట్లు ఉంటోంది !""
"",పోయింది తిరిగి పొందలేము కదా !"" అన్నట్టుగా చెప్పలేని బాధను ఇంట్లో ఉంటూ, అనుభవిస్తూ ఉన్నాం మనం !"",
"" నిజానికి , ఈ కరోనా ఒక సూక్ష్మ క్రిమి ,!"
అలాంటి క్రిములు సృష్టిలో కొన్ని కోట్లలో ఉన్నాయి ,!""
కళ్ళతో చూడలేని పరమాణువు ను బేదించ గలిగాడు మానవుడు ,,
కానీ , ఈ కరోనా ను పట్టలేక పోతున్నాడు ,
కానీ , ఇలాంటి దుష్ట జీవి ఒక్కటీ చాలు ,,
,జగత్తును సర్వ నాశనం చేయడానికి ,!""
కుండెడు పాలల్లో ఒక చిన్న విషపు చుక్క వేస్తే ఆ కుండ లోని పాలన్నీ విషమయమై పోయి , నట్టుగా ,ఇపుడు ఈ కరోనా జీవి,మనకు ప్రాణ సంకటంగా ప్రాణాంతకంగా ,దేవాంత కంగా , నరాంత కంగా ,మారింది ,!'"
నిజానికి ఈ" విషక్రిమి ""కి మూలం ,మనిషే, !
తయారు చేసింది వీడే !,
దాని ఫలితాన్ని అనుభవించాల్సిం ది కూడా వీడే !"
పుట్టించాడు ,గానీ అదుపు చేయలేక అది ఆడించినట్టు ఆడుతూ తన ఒక్కడికే కాకుండా యావత్తు ప్రపంచ ప్రజల ,ప్రాణం మీదకు తెచ్చాడు !"
,కరోనా లాంటి హాని కలిగించే గుణాలు , మనిషిలో కనిపించకుండా కొలువై ఉన్నాయి ,!
హాని కలిగించడం లో ,,అవి కరోనా కంటే , ఏ మాత్రం తీసిపో వు ,!""
కామము క్రోధము,లోభము , మోహము ,మదము ,మాత్సర్యము లు ,
ఈ ,,ఆరింటిలో ఒక్కటీ చాలు ,!""
మనిషి ఉన్నతి , సద్గతి సద్బుద్ధి నీ నాశనం చేయడానికి ,!""
మనిషిలోని ఈ దుర్గుణా లే ,, , కరోనా పుట్టుకకు కారణం అయ్యాయి!""
ఇంటింటా అల్లర్లు , దేశంలో అశాంతి ,యుద్దాలు , ఇవన్నీ అలాంటి ఉపద్రవా లే !""
,,ఇపుడు ,బయట మానవ సంచారం తక్కువ అయ్యింది , !"
జంతువుల సంచారం ఎక్కువ అవుతోంది ,!"
సృష్టిలో సంతులనం ,లో ,ప్రకృతి నియమాలలో ఎక్కడో లోపం జరిగింది !
ఎప్పుడో ఏదో రకంగా మనిషి వల్ల ఘోర అపరాధం జరిగిపోయింది !"
మనిషి స్వీయ గృహ నిర్బంధం వలన ,వాటికి స్వేచ్ఛ లభిస్తోంది ,!"
వైరాగ్య భావన ప్రతీ వారిలో ఇపుడు ప్రస్ఫుటంగా అగుపిస్తూ ఉంది ,!!"
ఏదో తెలియని విరక్తి అందరిలో అగుపిస్తు ఉంది !""
అలనాడు ,రావణాసురుని మదము , అంటే అహంకారం వలన ,,, దుర్యోధను ని మాత్సర్యము అంటే ఈర్ష్య భావం వలన వారిని ,వారి వంశాన్ని ,జాతిని ,సంస్కృతి నీ , సర్వ నాశనం చేశాయి ,,
నిజానికి , మనిషిలో కలిగే వైరాగ్య భావన అతడిని దైవానికి దగ్గర గా చేరుస్తుంది ,,!""
"మృత్యు భయం తొలగిస్తుంది ,కూడా !""
అందుకే ,,ఇలాంటి కష్టకాలం లో మనమందరం కలిసి ,,ముక్తకంఠంతో ""తండ్రీ; కరుణించు! ,దేవదేవా!""మా తప్పులు మన్నించు !"" అని వేడుకుంటే నే ,, ఈ జటిల సమస్య పరిష్కారానికి ,,దైవం దారి చూపుతుంది !,,,
""కరోనా ఉత్పత్తికి కారణం మానవ , జాతి పెంచుకున్న ద్వేషం ,అధికార పెత్తనం ,మత విద్వేషం ,,రాజ్య కాంక్ష , ,లాంటి విపరీత దుర్గుణాలు మనిషిలో వికృత రూపంలో కదిలి ,వాడిని రాక్షసుని చేయడం వల్లనే , జరిగింది !""
మంచి చేయడం కంటే చెడు చేయడం బహు సులభం అనిపిస్తుంది , ,
చెడు వ్యాప్తి కూడా చాలా వేగంగా తీవ్రంగా , అదుపు చేయలే నం త ఘోరంగా వ్యాప్తి చెందుతుంది !""
,,మనసును ,శరీరాన్ని దుర్బలం చేస్తుంది !"
నిర్వీర్యం ,నిస్సహాయత , నిరాశా నిస్పృహలకు దారి తీస్తుంది ,!!"
దేనిపై కోరికా ఉండదు,!. ఈ పని చేయాలన్న ఆసక్తి ,,ఆపేక్ష ,ఆతృత ఉండవు ,!
కొత్తదనం ,ఉత్సాహం ,ఆరాటం ఎక్కడా కనిపించవు !"
అంతా శూన్యం ,అయోమయం ,భయం ,ఆందోళన లతో మెదడు పని చేయకుండా పోతుంది !"",
ఎందుకంటే ,ఎటు చూసినా , ఏ దేశ వార్తలు వింటున్నా ,,వేలల్లో , శ వాల కుప్పలే అంటూ టీవీ లు వినిపిస్తున్నాయి !""
""__ శరీరానికి రోగం రాకుండా ,దూరం పాటించడం ,మాస్క్ ధరించడం లాంటి జాగ్రత్తలు , తీసుకోగలం !""
__""కానీ ,మానసికంగా ఉత్సాహం ఉత్తేజాన్ని పొందాలంటే మాత్రం ప్రస్తుతం ,దైవానుగ్రహం ఒక్కటే శరణ్యం
స్వస్తి !"
హరే కృష్ణ హరే కృష్ణా !""
Saturday, April 18, 2020
కనీసం ఇప్పుడైనా!
Subscribe to:
Post Comments (Atom)
A Drama that became Real!
The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...
-
The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...
-
May 8, 2020 పగలే వెన్నెలా.... పల్లవి !" ____&___ "కరోనా వచ్చేరా ,కష్టాలు తెచ్చేరా !! కరుణ లేక మన వారిని చంపు చుండే రా!!...
-
May 27, 2020 ఈ గోపికా స్త్రీలకు శ్రీకృష్ణుని పట్ల గల ఆ ఆరాధనా భావం ఎలా కలుగు తోంది? భర్తా పిల్లలు అత్తా మామలు బంధువులు,సంసార బాధ్యతలు , ఇ...
No comments:
Post a Comment