Tuesday, April 28, 2020

మానవ కర్తవ్యం !

Apr 27, 2020
  ప్రస్తుతం కరోనా  గురించిన భయాందోళన ప్రపంచాన్ని వణికి స్తు ఉంది ,
ఎక్కడ విన్నా , ఏ ఛానెల్ చూసినా ఇదే భయం ,!!
మనిషి  ఎంత సుకుమారి అంటే ,,చలికీ  తట్టుకోలేడు !
అమ్మో చలి !"అంటాడు
ఎండకు ఓర్వ డు,!
వామ్మో ,ఎంత ఎండ ?""అంటాడు
కష్టాన్ని భరించలేడు ,!
ఎప్పుడూ సుఖం కోసమే ఆరాటపడతా డు !!
జీవితంలో సుఖాల కంటే ,కష్టాల అనుభవాలే , ప్రతీ వాడికి ,చక్కగా  గుర్తు ఉంటాయి ,!!
ఎందుకంటే ,,కష్టాల్లో అతడి లో ఉన్న ప్రజ్ఞ ,,తెలివి తేటలు బయట పడుతూ , సమర్య్యాన్ని తెలియజేస్తున్నాయి !""
ప్రతీ మాసంలో  కృష్ణ పక్షం ,తర్వాత శుక్ల పక్షం వస్తుంది !!
తరుగుతూ ఉన్న చంద్రుడు ,మరల కాంతిని పుంజుకుంటా డు ,!;
రాత్రి అంధకారం పోయాక వెలుతురు దానంతట అదే వస్తుంది !; మనిషికీ ,కష్టాలుగాని ,సుఖాలు గానీ ,ఎప్పుడూ ఉండవు  కదా !
వస్తుంటాయి ,పోతుంటాయి  కూడా !""
""మార్పు"" అనేది , కాలచక్రం ధర్మం ,!!
నీకు ఇష్టం ఉన్నా ,,లేకున్నా
నీవు జీవించి ఉన్నా,, లేకున్నా జగతి మార్పుకు లోనౌతూనే  ఉంటుంది !!
జననం తర్వాత మరణం తప్పదు !;
అలాగే మరణం తర్వాత జననం  కూడా తప్పదు !
అది గ్రహించే జ్ఞానం మనిషికి లేదు !!
సూర్యోదయం అయ్యింది అంటే,,,
సూర్యాస్తమయం అవుతుంది  అన్నమాటే !;
ఇలా మన చుట్టూ ,మన శరీరంలో  ,,సృష్టిలో ఎన్నో ఊహించని మార్పులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి,!!
అందుకే ఈ కరోనా  భయం కూడా  కేవలం తాత్కాలికం ,;""
ఏ మాత్రం భయపడే అవసరం లేదు !
మనలో దాగి ఉన్న ప్రతిభను తట్టి లేపు తూ ఉంది !!"
ఏదీ శాశ్వతం కాదు ,!!"
ఇప్పుడు మనం వాడుతున్న సెల్ ఫోన్  ఎక్కడో ,ఎప్పుడో ,ఎవ్వరో కనుగొన్నారు , !;
ఏళ్ల తరబడి  ఒక ఆత్మీయుడు గా దాన్ని  ఉపయోగిస్తూ ఆనందంగా ఉంటున్నాం , !;
అలాగే టీవీ ,కార్లు ,,కంప్యూటర్ ,రైళ్లు ,విమానాలు ,ఇలా ఎన్నో సాధనాలతో సంతోషంగా బిజీ గా ,డబ్బు ఆర్జిస్తూ ,సంపదలు సమకూర్చు కుంటూ ,కాలాన్ని మరిచిపోయాం !,,
అప్పుడు పగలు ప్రతీకారాలు ,శతృత్వాలు ,తగాదాలు , ఇలా మనలోని వికారాల తో చేయరాని తప్పులు చేశాం ! దానవుల వలె ప్రవర్తించా ము ,!""
ఇప్పుడు,మూడు నెలలు గా  కాలం  తాబేలు నడక నడుస్తూ  ఉంది ,
ఇది అలవాటు లేని పని కదా !
,,కరోనా అడ్డంకి తో ,ప్రగతి ఆగింది ,!
మన నడక ఆగింది! ఆలోచనలు పనులు ,సంపాదనకు ఆగిపోయాయి ,!
కారణం కష్టకాలం వచ్చింది !
తనవారు ,ఆత్మీయులు గుర్తుకు వస్తున్నారు !
ఫోన్ చేసే టైమ్, తృప్తిగా ,సంతోషంగా మాట్లాడే  వీలు దొరికింది !
అంటే ,మనలో ఉన్న మంచితనం వెల్లి విరుస్తూ ఉంది !
మానవత్వం విలువలు తెలుస్తూ ఉన్నాయి !
ఏ మాత్రం నిరాశ పడకుండా ,ఆశా బీజాలు  హృదయం అనే క్షేత్రం లో నాటాలి ,!!
""విపత్తు ""కాలంలో అక్కరకు వస్తాయి దాని ఫలాలు !
అపద ఉన్నపుడే మనిషి దైర్యంగా ఉండాలి ,!;
ధర్మంగా ఆలోచించాలి !
ఈ శరీరం పంచభూతాలతో నిర్మించ బడింది !!
కష్టాలు వచ్చినపుడు
అవి మనసును ఆధారం చేసుకొంటూ , మనసు లోని భయము ,బాధ ,. నిరాశ నిస్పృహ లకు గురి చేస్తూ ఉంటుంది ,;!
ప్రకృతి ఒక మాయా స్వరూపం ,!
ఈ మాయా జాలం మనసును పరీక్షకు గురిచేస్తూ , మనిషికి  తట్టుకునే ఆత్మస్థైర్యం ఏర్ప డే లా  చేస్తుంది ,!!,
కష్టం ,సుఖం  రెండు రూపాయి నాణెం కు ఉండే రెండు ముఖాలు !
చేసిన కర్మలను బట్టి బొమ్మా లేదా బొరుసు పడుతూ ఉంటుంది !
ఏది పడాలో  అది ఆ పై వాడు నిర్ణయిస్తాడు !
నీవు అనుకుంటే పడదు !!
ఇలాంటి దురవస్థల లోనే , మనిషి   తన మనోబలం ,స్థిరంగా ఉంచాలి !
కష్టాలు వచ్చినపుడు బాధ పడడం ప్రాణులకు సహజ ధర్మం!
,.అయితే  చేయాల్సిన పని చేస్తూ  ,,తన యందు గల ,బాధ్యత ను ,,ధర్మంగా ,,న్యాయంగా ,పెద్దలు సూచించిన ప్రకారం  నెరవేరుస్తూ ఉండాలి!
ఇదే ప్రతీ మనిషి ప్రధాన కర్తవ్యం ,!!"
ఎంత కష్టం వచ్చినా , నీతి నిజాయితీ  మరవకూడదు;;
,అబద్దం చెప్పకూడదు ,,;!
సోమరి గా ఉండకూడదు !
చాలా జాగ్రత్తగా పరిస్తితుల ను గమనిస్తూ ,తగిన విధంగా ఆచరిస్తూ ఉండాలి !!
తాను ఉపవాసం ఉంటూ కూడా ,ప్రక్కవాడి ఆకలి తీర్చే విధంగా సేవ చేస్తూ ఉండాలి ,,!;
అన్నం దొరక్క ఆకలి కేకలు పెడుతున్న వారు ఇలాంటి ఘోర విపత్తులో ఉన్నారు !
ఇప్పుడు వచ్చిన కరోనా కష్టాలు కూడా ,మన కున్న మనోబలాన్ని గుర్తు చేసేవే ,!!""
,,కష్టాలు చెట్లకు రావు ,కదా ;
మనసున్న
మనుషులకు మాత్రమే వస్తాయి ,!!""
ఇది మన కర్మ ఫలం అని కొందరు  అంటే  మరి,కొంత మంది నాస్తికులు  ,కాదని  ఆక్షేపిస్తూ ఉంటారు ,!;
పాపం లేదు పుణ్యం లేదు అనీ ,,
కరోనా ను పుట్టించిన వాడిని చంపేయాలని !!
ఎక్కడో తయారయ్యే ఫోన్ లను ఎగిరి గంతేసి లక్షలు పెట్టీ కొంటావు కదా !
మరి ఎక్కడో తయారైన ఈ కరోనా ను ఎందుకు ఆనందంగా స్వీకరించడం లేదు !
తప్పు వస్తువు ఇచ్చేవాడి దా ?
లేక పుచ్చు కొనే వాడి దా !
అనుకూలంగా ఉంటే సంతోషం
ప్రతికూలంగా ఉంటే దుఖం ,కోపం ,  పగ ,ద్వేషం
ఇదేనా మానవత్వం !
చర్యకు ప్రతిచర్య ఉంటుంది కదా !
అంటే ఇతరుల తప్పులు నీవు లెక్కపెడి తే,మరి నీ తప్పులు కూడా సరి చేసేవాడు ఒకడు ఉన్నాడని నీకు మాత్రం తెలీకుండా ఉంటుందా ??""
ఇప్పుడు వచ్చి పడ్డ విపత్తు ఒక నగరం  కాదు ,!
దేశం ,కాదు ,!
ప్రపంచం  మొత్తం మారు మూల అనకుండా పిడుగులా  ,,ఇంతమంది మీద  ఒకేసారి  పడింది !!
ఒకేసారి ఇంతమంది తమ పాప భారాన్ని కర్మ ఫలితాన్ని మోస్తూ ఉన్నారా ?""
అంటే
""అవును ,"అనాలి !
ఎందుకంటే,,
తప్పులు మనిషే చేస్తాడు !
తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా !
ఈ తప్పులు వాటి లెక్కలు ఆ పైవాడు లెక్క పెడుతూ ఉంటాడు ,!!
ఆ అకౌంట్స్ అన్నీ క్లియర్ అయ్యాక గానీ ,,
ఈ కరోనా విపత్తు నుండి బయట పడే అవకాశం మనకు  లేదు !;
అందుకు మనం చేయాల్సింది , దేవుడి ముందు తల వంచి ,చేసిన  మన తప్పును  ఒప్పుకోడమే ,ఒక మనిషిగా  మన ముందున్న  ప్రథమ కర్తవ్యం !!
నేరస్తుడు స్వయంగా ,స్వచ్చందంగా చేసిన నేరాన్ని అంగీకరిస్తే  శిక్ష  కాస్తా తగ్గే అవకాశం ఉంటుంది ,!!
"""నేను ఏ తప్పూ చేయలేదు !""అని,
మెడ మీద తల ఉన్న ఏ మనిషి అన లేడు,కదా !
తప్పు చేయనివాడు దేవుడు  ఒక్కడే !;
తప్పు చేసేవా డే  మనిషి !
"" నేను తప్పు చెయ్యలేదు !
చేసినా నేను ఒప్పుకోను !
అని మూర్ఖంగా ఎవరైనా అంటే ,,,
అసలు ""వాడు మనిషి కింద లెక్కకు రాడు!""
భూమిపై జన్మ వచ్చిందంటే అర్థం ,తప్పులు చేసినట్టే లెక్క !
వాని ఫలితాన్ని అనుభవించ డానికే  జన్మ ఎత్తింది ! అని అర్థం !!""
""ఓ భగవంతుడా ,! నేరక చేసిన
మా అపరాధాలు మన్నించు,,ప్రభో !;
మమ్మల్ని క్షమించు తండ్రి !
ఈ కరోనా ను అరికట్టే శక్తి యుక్తులను అనుగ్రహించు !" దేవాది దేవా!"" శరణు !""
అంటూ  మనం చేసిన అపరాదాలను ఒప్పుకుంటూ  ,,,మీద వచ్చి పడ్డ కష్టాలను తొలగించమని, ఆ సర్వాంత ర్యామిని , ఆ శరణాగత వత్సలుని ,,పరమాత్మ ను ఆర్తితో ,ఆర్ద్రత తో ,  వేడుకుందాం !"
ఆపదమొక్కుల వాడా ,,అనాథ రక్ష కా !"
వెంకటరమణ ,,సంకట హరణ ,గోవిందా ,;!""
శరణు ,శరణు,,శరణు !"
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...