Saturday, April 18, 2020

శ్రీరాముడు దేవుడా ? మానవుడా ?

Apr 3, 2020
  ప్రేమ ,,మరియు ధర్మం ""ఈ రెండింటిలో   ఏది గొప్ప ??
అంటే ""ప్రేమ"" నే గొప్ప  అని చెప్పాలి !
దానికి జాతి కుల మత జంతు నీచ ఉచ్చ బేధం ఉండదు !
ఎల్లలు లేనిది,అనంతమైన ,అమూల్యమైనది ,,భక్తుని భగవంతుని వద్దకు చేర్చేది , ఈ ప్రేమ తత్వం !!
రామాయణం లో రాముని ద్వారా  ,, మాతృ ప్రేమ , సోదర ప్రేమ ,, గురు భక్తి ,ప్రజాదరణ , ప్రకృతి తో , పశు పక్షి జంతు సంబంధాలతో   అనుబంధం ,,తో  అనిర్వచనీయమైన ,, అద్భుతమైన ఈ ప్రేమమృత రసదార లు  వర్షిస్తు ఉంటాయి !!
""  ప్రవహించే నది కి, రెండువైపులా స్థిరంగా ఉండే గట్టు ల వలె ,,
మానవ జీవన విధానాన్ని   ధర్మం  హద్దుల్లో పెడుతూ ఉంటుంది !!
కానీ ,ప్రేమ ఆ హద్దులను దూరం చేస్తుంది 
అది విశ్వ మానవ ప్రేమ అవుతుంది !!
భరతుడు ," నాకు రాజ్యం వద్దు ,రాముని సేవయే ముద్దు !"",అంటాడు
తాను చేయని పాపానికి ,ప్రజలు కుటుంబం అందరూ తనని చీదరించుకో వడం  , ఆ బాధనుండి తనకు  విముక్తిని ప్రసాదించమని ,రాజ్యాన్ని తిరిగి స్వీకరించమని  కోరుతాడు అన్నగారిని !!
జ్యేష్ట సోదరుడు ,యోగ్యుడు , రాజా రాముడు మాత్ర మే రాజు కావాలి !
దానికి తాను అడ్డుగా ఉండకుండా  ,,ప్రాణత్యాగం చేస్తానని అంటాడు  ,భరతుడు !!
అద్భుతమైన అత ని ""సోదర ప్రేమ ""కు రాముడు విచలితుడవు తాడు!!
""తమ్ముడా !
నీ ప్రాణం కంటే అధికంగా నన్ను ప్రేమిస్తున్నా వు,,నీవు !
ఇంతఅదృష్టం ఏ అన్న కు ఉంటుం ది చెప్పు ??"
కానీ ప్రాణం ఇవ్వడం కంటే ,,ప్రాణంతో ఉంటూ ,, తాను  అధికంగా ప్రేమించే వారి కోసం నిస్వార్థం గా ఫలాపేక్ష లేకుండా ,అంకితభావం తో కర్తవ్య దీక్షతో జీవిస్తూ ఉండడం లోనే ,,భక్తి ఉంది !
ముక్తి ఉంది ,!శక్తి ఉంది ,!,జీవన సాఫల్యత ఉంది , !
ప్రేమకు అర్థం భక్తి !
ఆరాధన అంటే ఇదే !
భగవంతుని , భక్తుని ముందు కట్టి పడేసే సమ్మోహనాస్త్రం ఈ  శరణాగత భావం ! ""
  ప్రేమించే వాడిలో ,,తనకంటూ ఏమీ ఉండదు !
ఒక కింకరుని వలె,తాను నమ్మిన స్వామి కోసం మనసా వాచా కర్మణా తో చేసే సంపూర్ణ సమర్పణ భావ మే ,నిజమైన ప్రేమ!!""
జీవుని దేవునితో అనుసంధానం చేసేది ఈ మమత అనురాగాలు ,, ఈ ఆత్మీయ బంధాలు !!
కానీ ,, భారత !!
ఎంతసేపు నీ పక్షం నుండే  ఆలోచిస్తూ ఉన్నావు !!
,,నీవు చేసేఈ త్యాగం ,,, నా హితం ,నా ప్రయోజనం కోసం ఉపయోగపడుతుం దా ,లేదా!""
అనేది నీవు ఊహించడం లేదు !!
ప్రేమ లో  ఇంత  స్వార్థం ఉండకూడ దు ,, భరతా !
ఎవరిని నీవు దైవం ల ఆరాధిస్తూ ,ఆదరిస్తూ ఉంటావో వారిపట్ల
అంకితభావం ,ఆత్మ సమర్పణ  ,ఉండాలి !!
,,అది వారికి సంతోషాన్ని సంతృప్తిని కలిగించాలి !
,నీవు చెప్పినట్టుగా నేను రాజ్యం స్వీకరిస్తే ,
నీకు సంతోషం ,ప్రజలకు అనందం ,!!
నిజమే !!
కానీ ,
ప్రాణం పోయినా ,, మాట తప్పని రఘుకుల రీతి గా వస్తున్న  ,, తండ్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం  సంగతి ఏమిటి ?
తండ్రిగారు  తల్లికి ఇచ్చిన రెండు వరాల మాట అసత్యం చేద్దామా ??
తండ్రి గారు ఉన్నపుడు  చేసిన "సత్య వచనం"" ,అతడు వెళ్ళిపోయాక ""అసత్యం"" చేద్దామా ,,చెప్పు ??
మనల్ని ఆదర్శంగా భావిస్తున్న ప్రజలు
మన ఇష్టం వచ్చినట్టు గా బాధ్యత లు మార్చుకుంటే  వారు  మన ప్రవర్తన గురించి ,
ఏమనుకుంటారు ??
విచ్చలవిడిగా సమాజం ,ధర్మం తప్పి పోదూ ??""
తల్లికి  ,,తండ్రీ గారు ఇచ్చిన మాటలను నిలబెట్టడం పుత్రులుగా మన ధర్మం కాదా ?? ఆలోచించు !!
భావనా వేశంలో ""కర్తవ్యం"" మరచి పోదామా ??
నన్ను సత్య ధర్మ మార్గంలో నడిపించడం మీ బాధ్యత కాదా??
మనం చేసే ఆలోచన ,, పనీ  ఎవరూ గమనించడం లేదు అనుకోడం పొరబాటు  సుమా !!
తమ్ముడా !!
పరమాత్ముడు ప్రతీ ప్రాణి లో ఆత్మసాక్షిగా.
,పైన సూర్యభగవానుడు కర్మసాక్షి రూపంలో మనప్రతి చర్యలను పర్యవేక్షి స్తూ ఉన్నాడు
తమ్ముడా !
త్యాగానికి మించిన ధనం లేదు , !!
ఇది మనిషికీ మాత్రమే సాధ్యం !
నిజానికీ ఇతరులకి ఉపయోగపడిన జన్మ  సార్ధకం అవుతుంది !!
నాకు వనవాస దీక్షను ,,నీకు రాజ్యభారాన్ని  అప్పగించి , ప్రజా సంక్షేమం కోసం ,మనల్ని నియుక్తులను  చేసిన తండ్రి గారి ఆజ్ఞను  శిరసావహించి ,మన పుత్ర ధర్మాన్ని  అనుసరించి ఈ 14 ఏళ్లు కష్టంగా అనుకోకుండా ఆనందంగా,, కర్తవ్య నిష్టతో  నిర్వహించుదాము !!
నేను నీ మాటను కాదనను !!
ఆ రాజ్యభారాన్ని తప్పక నేను  స్వీకరిస్తాను,!!
కానీ ఇప్పుడు కాదు ,!!
తండ్రీ గారు మనకు అప్పగించిన బాధ్యత ను పూర్తి చేశాక ,నేనే నీ నుండి రాజ్యాన్ని గ్రహిస్తా ను!
అంతవరకూ , నా పై గల నీ ప్రేమను , నా ప్రతినిధిగా ఉంటూ  నిర్వహించు !!
నా ప్రియ సోదరా,!! నీలాంటి తమ్ము డు, భువిలో దీవిలో ,గతంలో వర్తమా నం లో ఉండడు!! ఇక  ఉండ బోడు!
ధన్యుడవు ,,భరత, ,, నీవు!!
నీ పేరు భారతావని పై ఆచంద్ర తారార్కము జగత్ప్రసిద్ది పొందుతూ
**"సోదరుడు అంటే నీ వలె ఉండాలి ""  అని జగమంతా ,అనుకుంటారు,
నీలాంటి  నిస్వార్థ ప్రేమ గల సోదరుడు ఉండడం ,నా  కు గర్వంగా ఉంది !!
ఇందుకు ఆ
భగవంతునికి  కృతజ్ఞతా పూర్వక ప్రణామాలు అందజేస్తున్నా ను !!
"" విధి బలీయం  తమ్ముడా !
రాజైనా ,,పేద అయినా పరిస్తితులకు తల వంచ వలసిందే  ,,కదా !!
రాజ్యంలో ఉంటూ నేను చేయాల్సిన విధులను ,,,
అన్న  మాటకోసం , తండ్రి ఆజ్ఞ కోసం ,ప్రజల క్షేమం కోసం ,తల్లుల సంరక్షణ కోసం నీవు భక్తి తో స్వీకరిస్తున్నా వు!!
,నీవు చేబట్టిన ఈ ""శ్రీరామ పాదుకా పట్టాభిషేకం"" దీక్షను  సకల జనుల సమ్మతం !
ఆదర్శనీయం !
రఘుకుల వంశీయులు ",,పితృదేవతలు ,  గర్వపడుతారు కూడా  ,నిన్ను చూసి !!
నీ భ్రాతృప్రేమ చూసి !
సోదరా,!! భరతా!!
ఈ ,14 ఏళ్లు గడిచిన మరుసటి రోజే నీ ముందు ఉంటాను !!
అంతవరకు సహనం  శాంతం ,తో అయోద్యనగర ప్రజలకు ఏ లోటూ రాకుండా ,ప్రజాసేవ చేసే బాధ్యతను నీకు అప్పగిస్తున్నా ను. !!
రాముడే తన ఆచరణ ద్వారా , భగవద్గీత  లో చెప్పబడిన వేద వాక్యాన్ని ,,ముందే , ముందు చూపుతో,, తన ఆదర్శ జీవితంలో అమలు  చేసి  చూపాడు !!
""కర్తవ్యం దైవమాహ్నికం !!""
భగవద్గీత లో
2 వ అధ్యాయం ,47 వ శ్లోకం !!
""కర్మణ్యే వాధికారస్తే ,, మా ఫలేశు కదాచన !
మా కర్మ ఫలహే తుర్భూర్ మాతే  సంగో స్త్వ కర్మణి !""
శ్రీకృష్ణ భగవానుడు అంటాడు ,,
అర్జునా !;
కర్మము చేయుట యందే నీకు అర్హత ఉంది!
కానీ ,, ఆ కర్మ ఫలాలను అపెక్షించుట యందు మాత్రము నీకు  అధికారము  లేదు !I' _____
ఇదే మనిషిగా  పాటించవలసిన అతి  ముఖ్యమైన ధర్మము ,!;
___
సర్వే జనాః సుఖినోభవంతు !
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...