Saturday, April 18, 2020

జై శ్రీరామ్ !

Apr 2, 2020
కాలం ,కర్మం ఈ రెండిటికీ కట్టుపడని వారు  లోకంలో ఎవరూ ఉండరు  కదా !!
రాత్రి పగలు వలె  ,,అవి కూడా  ఆగకుండా  ,,వాటి పని అవి చేసుకు పోతూ ఉంటాయి  !!
దాని వేగం ముందు ,,రాజు పేదా , జ్ఞాని అజ్ఞాని , చిన్నా పెద్దా, ఆడా మగ , తేడా లువుండవు !!
  కష్ట సుఖాలు  ,జనన మరణాలు తెస్తూ   పోతూ ఉంటుంది , ఈ కనిపించని కాలం !!!
  అది ,ఏదైనా  ""మహా ప్రసాదం"" గా స్వీకరిస్తూ ఉండడం తప్ప , మనం ఏమీ చేయలేం ,,!
ఈ విషయం ఇపుడు మన కళ్ళముందు  ఉన్న కరోనా నాటకం చూస్తేనే తెలుస్తోంది !
మందు లేదు,మార్గం తెలీదు !
సమస్య తెలుస్తోంది ,!
కానీ పరిష్కారం తెలియదు !;
అతడు అడించే జీవన నాటక రంగం లో తన పాత్ర పోషిస్తూ , నాటకం అయ్యాక , చివరకు రంగ స్థలం దిగిపోవడం తప్ప ,మనిషి చేయగలిగింది ఏం మిగిలింది ??
భగవంతుని సే వా భాగ్యం తప్ప !
భూమిపై ఉన్నన్ని రోజులూ అనందంగా ఉండాలని అందరం కోరుకుంటాం !!
అనుకోడం తప్పు కాదు !
అలా అనుకున్నట్టు జరగక పోతే బాధ పడటం తప్పు !!
, అయినా ఇన్ని తెలిసి కూడా బాధ పడకుండా ఎవరూ ఉండరు !!
కానీ, ఈ బాధ తన వరకూ వస్తె ,ఒక తీరు గా ,ఇతరులకు వస్తె మరొక తీరుగ భావించడం  మాత్రం తప్పు !
ఇలాంటి సద్భావన రమ్మంటే రాదు ,!!
ఆప్పటికప్పుడు కలగదు  !!
కరోనా దెబ్బకు  రోజు రోజుకూ,,ఎంతమంది నిరాశ్రయు లు,కావడం లేదు ?? ఉసూరుమంటూ ,,నిష్కారణంగా ,,
ఎన్ని వేల మంది ప్రాణాలు పోతున్నాయి ???
తలిదండ్రులు ,ఆత్మీయులు ఒక చోట,
వారి పిల్లలు కొడుకులు కోడళ్ళు ,కూతుళ్ళు  అల్లుళ్ళు మనవలు మనవరాళ్లు  మరోచోట , !""
విధికి తల వంచుతూ బ్రతుకు పై తీపితో ,భయాందోళన తో బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు. అరచేతుల్లో పెట్టుకుని   ,, వేలల్లో ,,ఖైదీల వలె అయినవారికి  దూరంగా  అలమటిస్తూ ఉన్నారు  ,!!;,
""విధి బలీయం "అంటే ఇదేనేమో !?
14 ఏళ్ల వనవాస దీక్షకోసం భార్య సీత తో ,ఒక చెట్టు ఛాయలో లక్ష్మణుడు పరచిన ఆకులశెయ్య పై పడుకున్న రాముని చూస్తూ ఆటవిక రాజు విరాదు డు అంటాడు  మంత్రి  సుమంత్రుని తో !!!
"""చూశావా ,!!, ఈ  కాలము ఎంత  దయలేనిదో ?
దేవాసుర సంగ్రామం లో స్వర్గానికి వెళ్లి దేవతల కు ,,రాక్షసులను నిర్జించ డానికి  సహాయం  చేసిన అపర పరాక్రమ శాలి ,, ఆ దశరథుని పెద్ద కొడుకు ఈ రాముడు!!
,దుష్ట తాటకిని ,మారీచుని ఒకే బాణంతో తో శత యోజన దూరంగా పడగొట్టి సుబాహుని చంపిన శూరుడు, రాయిగా పడిఉన్న
అహల్య పతివ్రతా శిరోమణి నీ  చైతన్యవంతం చేసిన ధర్మ మూర్తి ,!!
విశ్వామిత్రుని వద్ద అస్త్ర శస్త్ర విద్యలు నేర్చిన మహా యోధుడు ,!!!
శివుని విల్లును ఎడం చేత్తో సునాయాసంగా ఎత్తి విరిచిన అత్యంత బల సంపన్నుడు ,!!
అయోధ్యా రాజ్యాన్ని , యువరాజ పట్టాభిషేక మును   తమ్ముడు భరతునికి  చిరునవ్వుతో త్యాగం చేసిన  మహా గుణ సంపన్నుడు ,!!
అయోధ్యా నగరానికి , ఈ శృంగి బేరపుర ఆటవిక నివాసానికి   ఏ మాత్రం లేశం కూడా ,,బేదమెంచని ""స్థిత ప్రజ్ఞత ""గల  ధీశాలి !!
ఒక  రాజకుమారుడు ,, ఇలా ఈ కటికనేల పై, అచ్చా ధన లేకుండా , వింజా మర రాజోపచార విధులు లేకుండా  ,, హాయిగా ,ఒక  అతి సామాన్యుని వలె   ఇలా ,నిద్రిస్తూ ఉండడం  రాముని గొప్పతనం అందామా ??
విధి ప్రారబ్దం  అనుకుందామా ?? చెప్పు !!!
, ఆ సీతమ్మను చూడు ,!!
""సతికి పతియే గతి!"" అంటూ , బహు సుకుమారి ,ఎండ కన్నె రుగని , రాజకుమారి ,,జనక మహారాజు ముద్దుల కూతురు , , సమస్త భారతావని ఏలిక అయిన దశరథ మహారాజు పెద్దకొడలు ,
,సమస్త స్వర్గ సుఖాలు ,రాజభోగాలు , భర్త శ్రీరాముని సన్నిధికి సరిపోవని ,  ,
""రాముడు  ఎక్కడో అయోధ్యా అక్కడే"" అంటూ , పతివ్రతా ధర్మాన్ని పాటిస్తూ,నిత్యం హంసతూలికా తల్పం పై ఆనందంగా  పడుకునే ఆ సీతమ్మ ను చూడు ,,!! పాపం  ,!!ఇపుడు  అలా కటిక నేల పై ,,తన చీర చెరగు పరచుకుని పడుకుంది ,!,సామాన్య స్త్రీ వలె !!""
  వీరిద్దరినీ ఇలా చూస్తుంటే. నా గుండె తరుక్కు పోతోంది , సుమా !!
ఈ విధంగా ఒకటి కాదు.,, రెండు కాదు ,,ఏకంగా,, 14 సంవత్సరాలు  ఘోరమైన అరణ్యాలలో వనవాసం చెయ్యాలి !!
అంటే ,
మనుష్యులు , ఆ నగరవాసులు ,ఎంత నిర్దయులు ,? ఎంత కుటిలబుద్ది కలవారు ??
అయినా,,
మంత్రివర్య.!
కాలం అనుకూలించక పోతే ,బుద్ది కూడా వక్రీకరిస్తుందని అంటారు !!
, ఈ దయనీయమైన దృశ్యం చూస్తుంటే ,, నా కు మాత్రం హృదయం ద్రవిస్తోంది ,!;
ఈ పుణ్య దంపతు లు,,
""ఏ నేరం చేశారని ??""
వీరు ఇంత కటిన శిక్ష అనుభవించాలి ??
చెప్పు,,!!
విధి ఆడించే నాటకం లో ఇలాంటి మహా వీరులు జ్ఞానులు ,మహాత్ములు ,రాజులు అయినా  బొమ్మల వలె  ,మారు మాటాడకుండా  శిరసా వహించాల్సిన కదా !
అంటూ దుఖిస్తాడు  !!,,,
అంతటి సీతారాముల కే,, కర్మానుభవం  అనుభవించక  తప్పలేదు !!
ఇక సామాన్య మానవులం  మనమెంత ?
బహుశా ,, ఈ రామావతార  సందేశం ఇదేనేమో??
సుఖాలకు పొంగకుండ , కష్టాలకు కుంగకుండ ,, , తన వలె కుదురుగా  ఆత్మబలం తో ఉం డా లని  మనకు  సూచిస్తున్నాడు ,!!
నిజంగా"" మహా నటుడు "", ఈ శ్రీరాముడు!!
,శ్రీకృష్ణుని కంటే గొప్ప నటుడు "!!""
తాను సాక్షాత్తూ ,శ్రీమన్నారాయణుడు అని అతడికి తెలుసు ,!!
కానీ , ఎక్కడా బయట పడలేదు !!
సామాన్యుడి వలె తండ్రీ కోసం , తమ్ము డి కోసం ,, భార్య కోసం ,ఒక పక్షి కోసం ,, గోడు గోడు నా విలపించాడు ,,అడవిలో పిచ్చివాడిలా తిరిగాడు !;
కానీ
సమాజ విలువలు చక్కగా పాటించాడు ,!!
ఆదర్శంగా నిలిచాడు !! సోదర ప్రేమ ,,గురువులు , ఋషులు,,తలిదండ్రుల యెడ భక్తి!! చూపి,తనకు తానే సాటి అనిపించాడు !!
మానవుడు ,సాధనతో దేవుడు అవుతాడు అని తన నడక ద్వారా నిరూపించాడు  రామయ్య !!
ఆదర్శ దంపతులు. ,, ఈ ""సీతారాములు " అనిపించారు !!
ఉత్తర ప్రదేశ్ నుండి శ్రీలంక వరకూ కాలినడక న వెళ్ళాడు  రాముడు !!
కోతులతో స్నేహం ! రాక్షసులతో  యుద్దం !
అందరితో సమన్వయం !
రాముడంటే ప్రేమ!
రాముడంటే ధర్మం ! న్యాయం ,,శాంతం ,దైర్యం !!,శరణాగత వత్సలత ,! ఆపద్బాంధవుడు ,!  , రాజా రాముడు,!
"" లోకాభిరామం , శ్రీరామం , భూయో భూయో నమామ్యహం !!""
ఆహా !!"
శ్రీరామచంద్రా !!
, నీ అంత ఓర్పు, నేర్పు , బుద్ది కుశలత మాకు లేదయ్య , రామా !!"
దయ ఉంచి ,నీవే , ఈ మహమ్మారిని  నీ రామ బాణం తో తెగటార్చి ,,
మమ్మల్ని ఈ అపద నుండి గట్టెంకించే ,బాధ్యత ,భారం   దయతో
నీవే స్వీకరించు !! 
ఈ దీనులను ,కాపాడు !!"
నిన్ను శరణు కోరిన వారిని రక్షిస్తావని నీ ప్రతిజ్ఞ కదా !""
హే  ,రామచంద్రా !!
సద్గుణ సాంద్రా !!
శరణు ,శరణు ,శరణు !!""
హే రామ్ !!
ఈ కరోనా దాడికి  ,,పిట్టల వోలె వేల సంఖ్యల్లో రాలి పోతున్న ,, ఆ  ఇటలీ స్పెయిన్ ఫ్రాన్స్ ,అమెరికా లాంటి దేశ పౌరులు  వారు,తమ కర్మానుభవం  ఫలితం అనుభవిస్తూ ఉన్నారని  అనుకోమంటావా ??
లేక కాల ప్రభావం  అనుకోమా ??
ఇలా ఇంకా ఎంత మంది బలి కావాలి !?
దీనికి అంతు ఎక్కడ?
పరిష్కారం ఎప్పుడూ?
ఈ విశాల ప్రపంచం ,, ప్రశాంతంగా  శాంతి పథంలో నడిచేది ఎప్పుడూ ??
పరమేశ్వరా !
ఇదంతా నీకు తెలీకుండా ఉంటుందా ??
స్వామీ!!
ఇంత ఘోరంగా మాకు నీవు విధించిన శిక్ష కు ,మేము చేసిన అంత గొప్ప మహాపరాధం ఏమిటి తండ్రీ???
మాకు తెలియడం లేదు
అఙ్ఞానులం !అవివేకులం !
పాపాత్ముల ము !!
క్షమించు ,తండ్రీ !!""
ఇక చాలు ,ఈశ్వరా!!
ఇకనైనా  నీ కరుణతో  ఆ కరోనా తీవ్రతను తగ్గించు దేవదేవా!!""
దీనబాంధవా !
పాహిమాం ,,
జానకి రామా రక్షమామ్ !!
స్వస్తి !!
హరే కృష్ణ హరే కృష్ణా !!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...