Saturday, April 18, 2020

ప్రమాదం ఎక్కడ పొంచి ఉంది ?

Apr 1, 2020
ఇప్పుడు,  ప్రపంచ శాంతిని   కాకుండా,,ఘోరంగా  మారణహోమం తో మారణకాండ ను సాగిస్తూ ,భయాందోళన పుట్టించి , మృత్యువాత కు గురి చేస్తున్న  ఈ దుష్ట కరోనా ను అణచివేయడం,,మన  ప్రతీ ఒక్కరి బాధ్యత గా ,ఒక ఛాలెంజ్ గా భావిస్తూ , ఆత్మబలం తో ఎదుర్కోవాలి !
అందుకు  మన రోజువారీ life style మార్చుకోవాల్సి ఉంటుంది!;
అందుకు ముఖ్యం గా ప్రమాదం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి !!
అక్కడ నుండి జాగ్రత్త చర్యలు తీసుకుంటు ఉండాలి !!
రోజూ ,,నిత్యావసర వస్తువుల కోసం అందరం మార్కెట్ వెళుతూ ఉంటాం !
,అవి కొనుక్కొని ఇంటికి వస్తాం !
అప్పుడు మనతో బాటు ఆ కరోనా భూతం కూడా వస్తుంది !
మనం అది గమనించడం లేదు !
ఎలా , ఏ రూపంలో ,? ఇది  ఖచ్చితంగా
చెప్పలేము ,!"
కానీ ,వస్తుంది  !""
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు!అంటారు !!
కానీ ,,ఆ దెయ్యం ఇంటికి రాకుండా అరికట్టాలి !!
అందుకు ఉదయం  బజార్ వెళ్ళేటపుడు ,,మనం స్నానం చెయ్యకుండా వెళ్లి , వస్తువులు అన్నీ తెచ్చాక శుభ్ర పరచాలి !;
  మనం స్నానం చేస్తూ  ,వాటిని కూడా స్నానం చేయించాలి !అంటే ,,
పాల పాకెట్ ,కూరలు , వగైరాలు అన్నిటినీ  వేడి నీటితో  కడగాలి !"
మనం ధరించిన షర్టు పాంటు  లు కూడా   ఉతక డం మరచి పోవద్దు !!
ఇవన్నీ  రోజూ అందరం చేస్తున్నాం!!
కానీ పర్సు లోని డబ్బులను పది ఇరవై ఎబై వంద రెండు వందలు , ఐదు వందల నోట్లు ,పర్సు లను మాత్రం శుభ్రం చేయడం  మరచి పోతాం !!"
ఆ ఒక్కొక్క నోటు ,ఒక గంటలో ,ఒక రోజులో , ఎన్ని వందల ,వేల  చేతులు మారుతూ ఉంటా యో ఎవరికీ తెలియదు !!
ఇందులో  కరోనా వ్యాది ఉన్నవా రి చేతుల మీదుగా కూడా ఆ నోట్లు వస్తూ ఉన్నాయి అనే విషయం  అందరం గుర్తు పెట్టుకోవాలి !!
అందుచేత బజారు నుండి ,ఇంటికి  తిరిగి వచ్చాక ఆ పర్సును ,అందులోని రూపాయల నోట్లను తప్పనిసరి గా మరచిపోకుండా  శుభ్ర పరుస్తూ ఉండాలి !;
రోజూ
, గ్లాసు సబ్బు నీళ్లలో  ,,లేదా   మంచి నీళ్లలో  ఆ నోట్లను  ఒకసారి ముంచి తీసి ,చక్కగా ఆరబెడితే సరి!
గంటలో ఆరుతాయి !!
కరోనా వ్యాపించే అవకాశం"" బయట తిరిగినప్పుడు  ""అని అందరికీ  తెలుసు !!
మనం గుంపుల లో ఉండక పోవడం మాత్రమే కాదు !!
అందులో ఉన్నవారు ముట్టిన తాకిన వస్తువులు కూడా  గుంపులుగా ఉన్న సమూహం  అనుకోవాలి !!
మనుషుల్ని మాత్రమే  కాదు !!
వస్తువుల ను కూడా నమ్మలేని దౌర్భాగ్యం ప్రస్తుతం మనకు దాపురించింది !!
ఖర్మ ! ఏం చేద్దాం !"ఇక్కడ
భావన  మాత్రమే ముఖ్యం కాదు!!
ఇటువంటి విపత్కర పరిస్తితి లో
భావం కంటే"  కర్తవ్యం " అతి ముఖ్యం!!
అందుచేత ఈ
కరోనా మహమ్మారి,, బజారు నుండి  మన ఇంటికి  రాకుండా ఉండాలంటే ,,
బయట జాగ్రత్తగా అందరికీ అన్ని వస్తువులకు దూరంగా ఉంటూ ,
ఇంటికి వచ్చాక  ,ఎవరిని తాకకుండా , ఏది ముట్టకుండా ,నేరుగా స్నానం గదికి వెళ్లి ,,మనతో బాటు డ్రెస్సు వస్తువులు , పర్సు ముఖానికి కట్టుకున్న మాస్క్ , కర్చీఫ్ హెల్మెట్ ,,మన  బైక్  విధిగా ,తప్పనిసరిగా  కడగాలి !!
దయచేసి ఇది ""మూఢనమ్మకం"" అనుకోకండి !
"ఛాంద సం ""అని కొట్టి పారేయకండి !!
మన నీడను కూడా నమ్మరాని  విపరీత కాలం ఇపుడు మనకు  దాపురించింది !!
దీనినే ఆ కాలంలో ". మడి " అన్నారు !
"" నా కేంటి ??" అని
నేను ఒక్కడినే చేస్తే అవుతుందా ?""అనీ___
అంత ఓపిక ,తీరిక  లేదు నాకు ,!""అనీ ___
జ్ఞాపకం లేదు !
మరచిపోయాను !""అనీ ___
ఇలా
నిర్లక్ష్యం చేస్తే  మాత్రం,
భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టీవీ లు చెపుతున్నాయి !!
అందుచేత ""ప్రాణాలతో చెలగాటం"" ఆడ వద్దు!
నీ  ఈ జాగ్రత్త , సాటి వారి ప్రాణ రక్షణ కు , దేశ భద్రత కు   సంబంధించిన విషయం అని గుర్తుంచు కోవాలి!
ప్రమాదం నీతోనే ఉంది!
నీ ప్రక్కనే ఉంది!
నీ ప్రవర్తన లోనేవుంది !
నీ పరిశుభ్రత లోనే ఉంది !
నీ బాధ్యత లోనే ఉంది
నీవు మానవతా విలువలు  పాటించడం లోనే ఉంది !.
""నన్నెవ్వ రు గమనిస్తున్నారు "?అనుకోకు , !
నీ కంటూ ఒక "ఆత్మ" సాక్షి గా ఉండి
ఏది మంచి , ఏది చెడూ చెబుతూ ఉంటుందని మరచిపోవద్దు !""
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ??
చుట్టూ అవరిస్తూ వస్తున్న కరోనా  చీకటిని  తిట్టుకుంటూ కూర్చుంటే లాభం లేదు !
నీ వంతుగా కర్తవ్యం అనబడే చిరు జ్ఞాన దీపం వెలిగించే ప్రయత్నం చెయ్యి !
నేనూ మనిషినే ! అని  నిరూపించాలి ,,
ప్రయత్నిస్తే పోయేదేం లేదు, అవకాశం  తప్ప !"
స్వస్తి;
హరే కృష్ణ హరే కృష్ణా!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...