Tuesday, May 19, 2020

కరోనా తో కంపెనీ ! 1

May 17, 2020
  భూమిపై గల ,,,లక్షలాది అమాయక  ప్రాణాలను,అన్యాయంగా తన  పొట్టన బెట్టుకున్న  ఈ మహమ్మారి కరోనా దెబ్బకు,తట్టుకోలేక  ఎవరూ కూడా ఇల్లు కదలడం లేదు ,!
వదలడం లేదు !
అయినా , బ్రతుకు దెరువు కోసం ఇంటిని వదలక తప్పదు కదా !
కూర్చుని తింటూ ఉంటే గుట్టలు కూడా తరిగి పోతా యి అంటారు,,
అందుకే , ఇంటి పై , ఇంతి పై ,దేనిపై కూడా
అతిగా  దేనిపై వ్యామోహం పెంచుకో వద్దు !
మమకారం తగ్గించాలి ,,
ఎందుకంటే అవి  నీకు దూరం కాక తప్పదు ,!
దానికోసం విలవిలా కొట్టుకుంటూ,, ఏడవకా తప్పదు !
ఎందుకొచ్చిన బాధ ??
  ,, ,పెద్ద తనం వచ్చాక ,ఇక తమ పిల్లల  పై ఉన్న" వ్యా మోహం " తగ్గించు కోవాలి , కన్నవారు !!"
"" కరోనా రోగం" అంటుకుంటు ఉందని ,
""ఎక్కడి దొంగలు అక్కడనే  గప్ చుప్ !""అంటూ ఎవరి  ఇళ్ళల్లో వాళ్ళను  బంధించి వేస్తోంది ,!" మన " ప్రభుత్వం !
మార్కెట్ లో తిరిగే పదిమందిలో"" ఈ కరోనా బూచి గాడు ""ఎవ్వరో మనకు ఎలా తెలుస్తుంది ??"" చెప్పండి ??
వాడి మొహం మీద రాసి ఉండదు కదా !""
అందుకే  ""లోగుట్టు పెరుమాళ్ ల కు ఎరక""!"" ""అంటూ , ఉంటారు పెద్దలు !
ఇప్పుడు అందరూ  కరోనా ఘరానా "" దొంగలే!!"."
అందరం చిన్న పిల్లల వలె , ఆడుతున్నాం hide and seek ,game !!""
ఆ దొంగకు చేతికి  దొరికింది తీసుకెళ్తాడు ,జాగ్రత్తగా !
ఈ కరోనా దొంగ మాత్రం ,అందరికీ , "మా వాడు,, నీ వాడు"" అనకుండా , అమాంతంగా  మనిషి నే మాయం చేస్తూ ఉన్నాడు !!
ఏ మాత్రం  పక్షపాత బుద్ధి లేకుండా ,సమానంగా పంచి పెడుతూ ,ఉంటాడు ",కరోనా రోగం ""అనే తన  ప్రసాదాన్ని !!"
ఇపుడు రెండు వర్గాలు ఏర్పడ్డాయి 
. 1__చేతకాని  వాళ్ళు
2_ ,,చేతనైన  వాళ్ళు   __
అంటే పిల్లలు పెద్దలు ఒక తెగ !
పడుచు వాళ్ళు మరొక తెగ !! అలా
రెండు తెగలు గా
ఏర్పాటు అయినాయి !
అయినా
ఎన్నడో ",మేము  "" మీ నుండి వేరు పడి పోయాము ,!
,ఇపుడు ప్రత్యేకంగా   ""మీరు దూరంగా ఉండండి ,!" అని మమ్మల్ని  అనే అవసరం  మీకు లేదు !
మా వల్ల మీరు ఇబ్బంది పడుతూ , మాట జారే అవకాశం మీకు ఇవ్వకుండా ,మా జాగ్రత్త లో మేము ఉండటం పెద్దరికం నిలబెట్టు కోవడం , మాకు మంచి సంస్కార లక్షణం కదా !
   ఇది మనవారు అనుకున్న ఆత్మీయులు ప్రేమతో   మనకు ఇచ్చిన తీర్పు  !""
____ఇక కరోనా ఇస్తున్న తీర్పు చూడండి !
""మా ఇంట్లోకి  ఎవరూ రాకండి ,,!
మేము కూడా రాము !
మీరు కూడా మా ఇంటికి రావాల్సిన పని లేదు ,!""
ఉన్నాయిగా ఫోన్ లు !,
ఎంతసేపు మాట్లాడినా  ఫర్వాలేదు ,!
  , అంతే గాని ,,రావడం ,పోవడం కుదరని పని !
  మీరు ఎప్పుడు ఫోన్ చేయమంటే అప్పుడు చేస్తాం ,!
సరేనా !!
ప్రస్తుతం ,ఇది కరోనా మహమ్మారి ఇస్తున్న తీర్పు !
ఎవర్ని ఎవరు ఎంత దూరంలో ఉంచినా , ఈ కరోనా ను మాత్రం దూరంగా ఉంచే దమ్ము ఎవరికి ఉండడం లేదు కదా !
ఇష్టం ఉన్నా ,లేకున్నా , కొన్నాళ్ళు ,
చచ్చినట్టు దానితో  మనం కలిసి బ్రతకాల్సిందే   కదా !
,మా పిల్లలు, వారు  పెద్దవాళ్ళు అవుతూ నే మా ఇద్దరినీ , తమకి దూరంగా ఉంచేశారు ,!!
లేదు !లేదు !;
మేమే వారికి దూరంగా,, వేరుగా ఉంటున్నాం !"
అందుకే ,ఇపుడు ఏ ఊరిలో , ఏ నగరంలో ,చూసినా ,  మారుమూల గా, ,ఒక  ఇంటిలో  తల దాచుకుంటూ ఉన్న ,ఒక ముసలాయన ,,ఒక ముసలావిడ  దంపతులు  నవ్వుతూ  దర్శనం ఇస్తూ ఉంటారు ,, అది దంపతుల లాగా !
,పెళ్లి అయ్యాక ఎలా ఉన్నారో ,వృద్దాప్యం లో కూడా అలాగే ఇద్దరు ,,ఒకరికొకరు  తోడుగా ఉంటూ ,కష్టాలు ,నిష్ఠురాలు భరిస్తూ ,జీవిత చరమాంకం లో ,ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ,కష్టాలను ఇష్టాలుగా భరిస్తూ,, బ్రతుకు ఈడుస్తూ ఉన్నారు ,!
ఈ దశ  జీవితంలోఎవరికైనా తప్పదు కదా !!
నిజానికి ,,మనిషిలో ఉన్న ప్రతిభ బయట పడేది , ఈ ఒంటరి పోరాటం వల్లనే !
ప్రతి వాడిలో ప్రజ్ఞ ,దైర్యం ,ఆత్మ విశ్వాసం దాగి ఉంటాయి ,!అవి బయట పడటానికి అవకాశం రావాలి !
పుట్టుకతో ఎవ్వరూ భీరువు కాదు ,!
అందరూ  అద్భుతమైన తెలివితేటలు కలవారే !
కష్టాల్లో , మునిగి పోతూ ,,ఇబ్బందులు ఎదురైనపుడు ,జీవితంలో  అనుకున్నది జరగనప్పుడు ,ఆత్మీయులు పోయినపుడు ,ఇలా మానసిక క్షోభ కు గురి అయినప్పుడు ,వివేకం శూన్యం అయ్యి "",నేను ""చేతకాని వాడిని!"" అనుకుంటాడు ,!
__మనసు గట్టి చేసుకుని  దైర్యంగా ,,పరిస్తితులకు ఎదురొడ్డి నిలిచే వారికి ,ఈ సమస్యలు ఉండవు !
అలాంటి ధృఢ సంకల్పం కలవారి ముందు నిలబడలేక అవి భయపడి ,  దూరంగా పారి పోతాయి ,!!
  ముఖ్యంగా  ,పెద్దతనంలో తమ కొడుకుల ,,కూతుళ్ళ కుటుంబాలకు  దూరంగా ఉండడం   అనేది ,,తలిదండ్రులు  చేయవలసిన  తెలివైన పని ,!""
అలా ఎవరి నెత్తి మీద వారి చేతులు పెట్టుకునే  పని అప్పగిస్తే  ,,,,, వారికి బాధ్యత తెలిసి వస్తుంది !
,జ్ఞానోదయం ,,అవుతుంది !!క్రమంగా తమ   కుటుంబ ఆదాయం పెంచుకుంటూ , వారు ,,తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రయత్నించే చక్కని అవకా శాన్ని  వారికి  ఇచ్చినట్టు అవుతుంది !
,,ఇక పెద్దవారు ,పెద్ద మనసుతో , రామా కృష్ణా అంటూ
__తమ ఆధ్యాత్మిక చింతనతో ,  దైవ భజన ,, భగవద్గీత లాంటి పుస్తకాల అధ్యయనం తో,, ప్రశాంత జీవనాన్ని. పొందే  అద్భుతమైన అవకాశం కూడా ఉంటుంది !!  శక్తి,ఓపిక , తీరికా ,ఆసక్తి  ఉన్నవారు ,చక్కగాసమాజసేవ లో  ,,సత్సంగం లో స్వచ్చందంగా పాల్గొంటూ ,  ఆనందాన్ని పంచుకొన వచ్చును  !!
పెరిగిన  వయసుతో బాటు గా, పెరిగిన  తమ జ్ఞానాన్ని సమాజానికి చేతనైనంత గా  అందిస్తూ,తమ   ,సేవా దృక్పతాన్ని  పెంచుకునే గొప్ప అవకాశం,,, ఈ వృద్దాప్యం లో  లభిస్తూ ఉంటుంది ,!
ఈ కరోనా ధర్మమా అని, ప్రభుత్వం  ,తాను ఆర్థికంగా నష్టపో తూ ,,ఇన్నాళ్లూ  , పౌరులను భద్రంగా  ఇళ్లలో కూర్చోబెట్టి  ,వారు రోగం బారిన పడకుండా కాపాడింది ,!
  ఈ, కరోనా వ్యాధి బారిన. పడకుండా ,తమను తాము  ఎలా కాపాడు కోవా లో ,, అనుభవం  ద్వారా  అందరికీ  తెలుస్తోంది  !""
,తగిన  జాగ్రత్తలు తీసుకుంటూ  ముఖాలకు మాస్క్ లు తగిలిస్తూ , ఇతరులకు అంటకుండా దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ , , ఇళ్ళ నుండి బయటకు వస్తూ ఉన్నారు ,!
స్వేచ్ఛగా బజారులో తిరుగుతు,",, ఆ కరోనా తమ జోలికి మాత్రం  రాదు!""
అనే"  వెర్రిభ్రమ ""తో   ఎప్పటివలె,  మొండిగా,జాగ్రత్తలు పాటించకుండా , వస్తూ వెళ్తూ ఉన్నారు !!"
ఇపుడు వీరు ప్రభుత్వాన్ని ఆర్థికంగా  నష్టపడకుండ కాపాడే ,  ప్రయత్నంలో ఉన్నారు!!" ,,, వీధుల్లో అదుపు లేకుండా తిరుగుతూ !""!!
__ వాస్తవానికి మనలో  ""వివేకం ,విజ్ఞానం , విచక్షణా జ్ఞానం ,!"   ఉన్నాయని !!"" ఇప్పుడు చూపాలి ,
  ((ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...