Tuesday, May 19, 2020

దేవుడు లేడు !

May 13, 2020
""దేవుడు లేడు అనేవారికి  ,,కరోనా . ఇలా చక్కగా  చెబుతోంది బుద్ది ,!""
______,
"" దేవుడు లేడు  అంటే ,, నీ అంత మూర్ఖుడు భూమిపై ఉండబో డు !!
""ఉన్నాడురా దేవుడు !"
వాడు లేకపోతే ,, లేడని నీవు పొరబాటున కానీ అనుకుంటే ,,నీవు బ్రతకలేవురా ,!!,
దేవుడు  నీ వద్ద ఉన్నాడని , అనుకోని , ఇన్నాళ్లూ నేను  నీకు  దగ్గరగా రాలేక పోయాను !
నీకు దూరంగా  ఉంటూ  చూస్తున్నాను !!
, ఎల్లపుడూ కాపాడుతూ ఉండే  దేవుణ్ణి  ,,నీవు ఎపుడు దూరం చేస్తూ ఉంటావో"" అని  శవం ప్రక్కన పొంచి ఉండే గుంట నక్కలా  కాచుకొని  ఉన్నాను , నేను నీ ""కరోనా"" ని !!!"
""ఇపుడు నాకు లైన్ క్లియర్ చేసి ,నన్ను నీ పీకల మీద కూర్చో బెట్టుకొంటూ ,లక్షల మంది ప్రాణాలు  వేడి వేడి రక్తం  చప్పరించే అవకాశాన్ని కల్పించా వు కదరా ,,మానవా !"" ఆహా !""
"దేవుడు ఏం చేస్తాడు ?  అంటే
,  ,కలనైనా  ఆ దేవుణ్ణి తలవని నిన్ను ,,. నిత్యం  ,,ఆ దేవుడిని  తలచేల చేస్తాడు !  తెలుసా !!??"'
దేవుడు ఎక్కడ  ఉంటాడు??"
నాకు చూపు !""
అంటూ వెటకారం చేసిన నీకు  ,
"",ఇదిగో !, ఎక్కడ ఈ
కరోనా ఉంటుందో  ,,అక్కడ ఆ 
దేవుడు  ఉంటాడు!""
  ,అని నీకు  నీవే  ఒప్పుకునెలా  చేస్తాడు దేవుడు ,!!"
అంటే ,నేను  కొట్టే ఒక్కొక్క  చావు దెబ్బకు ,
""వామ్మో ,అమ్మో ,అయ్యో , అబ్బా, !""అంటూ ముక్కుతూ , మూలుగుతూ    ""దేవుడా నీవే దిక్కు !
తెలియక  నేను చేసిన  ఘోర మహ అపరాదాలు క్షమించు!""
,,అని  నీ తప్పును నీవు  గుర్తించేలా చేస్తూ ఉంటాడు !
""తాను తీసినా గోతిలోపలా .
తానే పడును కదా ,!""
అనిపిస్తూ ఉంటాడు !
లేకపోతే ,
""నీకున్న మిడిమిడి జ్ఞానంతో ,రాక్షస బుద్ధితో   ఆ బ్రహ్మాండ నాయకు డినే ధిక్కరిస్తూ , పెద్ద మొనగాడిలా నీవు  అహంకరిస్తావా ?
""తప్పు కదా !""
"" క్షమించ రాని మహా అపరాధం కాదా  నీది ??""
చక్క ని మానవత్వం తో బ్రతకమని  ,బోధించి,
,,ఉత్కృష్టమైన , అతి దుర్లభమైన ఈ మానవజన్మ ను , నీకు ఉదారంగా  ఇస్తే
,,ఇచ్చిన వాడినే అధిక్షేపిస్తు ,,,"  ఎందుకు పుట్టావో   తెలుసుకోకుండా ,,నీ జీవిత ధ్యేయం  కూడా  మరిచిపోతే ,,అసలు
, నీ జన్మకు నిష్కృతి ఉంటుందా ??"
నీకు పుట్టగతులు ఉంటాయా ,నికృష్టుడా !
నీచుడా,!
ఇదిగో ,,! నీ పాపం పండింది !అందుకే ,నీ దేవుడు  నన్ను ఇలా  పంపించి ,,నీకు  కొంత ఆత్మవిమర్శ జ్ఞానాన్ని కలిగించేలా  ,,, అయోమయాన్ని  కలిగించేలా  , భయాందోళన కు నిన్ను గురి  చేస్తున్నాడు ,!!
ఎన్ని తప్పులైనా మన్నించవచ్చు
కానీ  ,,,దైవాపరాధం , కృతగ్న తా భావాన్ని మాత్రం ,,  ఆ దేవుడు కూడా , ,మన్నించ లేడు సుమా !
ఇలా
చంపేవాడు ,,
చంపించేవాడు  అన్నీ  దేవు డే చేస్తున్నాడా   ?
అంటే ,,
అవును ! దేవునికి పుట్టించడం మాత్రమే కాదు ,చంపడం ,చంపించడం కూడా తెలుసు !!
""దేవుణ్ణి కాలుడు ""అని కూడా అంటారు  అని తెలుసుకో !!
సృష్టి స్థితి లయలు ఆయన నిత్యం  చేసే లీలలు !
ధర్మం అణచివేసి ,పైశాచిక ఆనందాన్ని పొందేవారిని ,నాశనం చేస్తూ ఉంటాడు !!
  ,మూగ సాదు ప్రాణులను  ,,సత్పురుషుల సంరక్షణ చేస్తూ ,సృష్టిని ఒక నియమావళి నీ అనుసరించి నియంత్రణ చేస్తూ ఉండడం   ఆ  దేవుడి పని !
రావణుడి దుర్మార్గం భరించలేని హనుమ,,, లంకా నగరాన్ని కాల్చడం ,తిరిగి  విభీషణుడు తో శాంతి భద్రతలను  దేవుడు సుస్థిరం చేయడం మరచిపో వద్దు!;
వీరభద్రుని వల్ల దక్ష యజ్ఞం వినాశనం ,తర్వాత   శాంతి స్థాపన చేశాడు దేవుడు! అని  మరచిపోవద్దు !
""భారత యుద్దం"" లో జరిగిన మారణహోమం తర్వాత 
ధర్మ స్థాపన జరి పిన  విషయం మరవవద్దు సుమా !!
దైవబలం లేకపోతే కూల్చడం  , దైవానుగ్రహం  కలిగితే ,నిలబెట్టడం 
అంతా ఈశ్వరాజ్ఞ తోనే నడుస్తూ ఉంటుంది !!
""అంతా   ఈశ్వరెచ్చ !""
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు , కదా !!""
అనే సత్యాన్ని తెలియజేయ డాని కే   నేను ఇదంతా  చేస్తూ,, నీకు  చెబుతూ ఉన్నాను
ఓ మనిషీ !!"""
నీవు సంతోషంగా బ్రతుకు !
బుద్దిగా బ్రతకడానికి ,,,ఇది నీకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం !!"" అని తెలుసుకో !!!""
కానీ , నీ లాంటి వేరే ప్రాణులను కూడా సంతోషంగా ఉండే విధంగా ఉంటూ ,,, నీ  మానాన  నీవు బ్రతకాలి !""
వాటి స్వేచ్ఛను హరించే హక్కు నీకు లేదు !లేదు! లేదు !""
దౌర్జన్యంగా,వాటిని ,,వారిని అదే పనిగా  హింసిస్తూ ఉంటే ,
అదే హింసకు నీవు కూడా ,,ఇలా  గురి అవు తూ ఉంటావు అని తెలుసుకో, తమ్ముడూ !!"
చావో , రేవో కొన్నాళ్ళు మనం కలిసి ఉండక తప్పదు కదా  !
తప్పదు యుద్దం. మన మధ్య!!"
ఏదైనా తన దాక వస్తెనే ,, తెలుస్తూ ఉంటుంది !
""ప్రాణం ఎంత విలువైనది, ! అన్న విషయం ,,""నీకు
తెలుస్తోంది కదా ఇపుడు !
" నాకు దేవుణ్ణి చూపు ,!"" అంటే ,
చూడాలనే "కళ్ళు " నీకు ఉంటే  ,,ఆ  దేవుడి ని ఎక్కడైనా నీవు  చూడవచ్చు !!""
""అదిగో ,! అటు చూడు !!
ఖండ,ఖండాంతరాలకు వ్యాపించిన  నా వేటుకు  రోజుకు వేలల్లో ,  జనాలు విలవిలా కొట్టుకుంటూ ,, దారుణంగా బలి  అవుతూ ఉంటున్న  ఆ  210 దేశబాదితు లను చూడు !!
తమ  ,నిద్రాహారాలు  లెక్క చేయకుండా  రేయింబవళ్ళు , హాస్పిటల్ లలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టీ ,,దీనులకు సేవ చేస్తూ ఉంటున్న , ఆ మానవతా శిరోమణులకు,, రోజూ ఒకసారైనా , దండం పెట్టుకొరా బాబూ_!! అందరూ __"దేవుడి ప్రతి రూపాలే ""సుమా !
డాక్టర్స్ ,నర్సు లు ,రక్షక శాఖ పారిశుధ్య శాఖ ,ప్రభుత్వ శాఖ అధికారులు  విపత్తు కు స్పంది స్తూ,స్వచ్చందంగా ముందుకు  వచ్చే   యువ సేవా బృందాలు ,శాస్త్ర వేత్తలు , , దాతలు , ఇలా ఈ ""ప్రాణ రక్షణ ""అనే మహ యజ్ఞంలో పాల్గొనే  ఎందరో మహానుభావులు__ అందరూ దేవుడికి ప్రతి రూపాలే , కదా !""
దేవుడే  ప్రత్యక్షంగా ,భూమిపైకి దిగివచ్చి ఇన్నివిధాలుగా  తన ఆపన్న హస్తాలతో వారిని ఆదుకొంటూ ఉన్నాడు ""
, అన్న"" ఇంగితజ్ఞానం"" మీకు ఇప్పుడైనా కలుగుతుందా ??"" లేదా ??""
నాలాంటి
ఏదుష్ట శక్తి నైనా పుట్టించడం ,లేదా  నాశనం చేసే శక్తి ,,కేవలం ఒక్క విష్ణు శక్తి కి మాత్రమే ఉంది సుమా !;,
అనగా "హరినామ భజన "",తో నీలోని దుష్టమైన కృత్యాలను   ,ఆలోచనలని తొలగించు కోవాలి ,
ఆ విధంగా నన్ను శాంతింప జేసుకునే ఒకే ఒక్క మార్గం  నీ దారిని  సుగమం చేస్తూ ఉంది..!;
అధర్మాన్ని  నీవు ఎంత తీవ్రంగా ఆచరిస్తూ ఉంటావో , అంతే తీవ్రంగా  ధర్మం ,, అధర్మం రూపంలో  నిన్ను వేటాడుతూ వెంటాడి  నీ అంతు చూస్తుంది ,
ఇలా , ఈ కరోనా చేతిలో మాడి మసై పోతూ ఉన్నట్టు !!!
ఏ యుగంలో నైనా ,చెదరని న్యాయం ,,ధర్మం ,,ఇది ! ""చర్యకు ప్రతిచర్య ""ఉండక తప్పదు ,
ఇంటా బయటా ,అంతటా !!""
,నిన్ను, నీ చర్యలను గమనిస్తూ ఉండే దైవిక శక్తి  , తిరిగి ,నిన్ను  నీ హద్దుల్లో పెట్టేవరకు శాంతించదు అని తెలుసుకో ,తమ్ముడా ,!!""""ముల్లును ముల్లు""తోనే తీయాలి కదా !
ఇది కలియుగ ధర్మం కూడా !
కరోనా గా చలామణి అవుతున్న నేను కూడా, మహా విష్ణువు  ప్రయోగించిన  "బ్రహ్మాస్త్రం" లాంటి ""మహామారి""ని , నేను  !!""
అని గుర్తుంచుకో  , పాపాత్ము డా !!
ప్రళయ కాలరుద్రునిలా ,,
విలయ తాండవంతో ప్రపంచాన్ని వణుకు పుట్టిస్తు ,లక్షలాది ప్రాణాలను  , మట్టి కరిపిస్తు ఉన్నాను  ,నేను !!""
నన్ను గెలవాలంటే, నాతో వైరం  కాకుండా ,శాంతి మంత్రం తో మాత్రమే  సాధ్యపడుతుంది ,,!""
నాతో స్నేహం గా ఉంటూ ,నేను శాంతించే మార్గం వెదకుతూ వెళ్లు !!"
అయినా మీది కుక్క బుద్ది   !!
కుక్క కాటుకు చెప్పు దెబ్బ నే సరి !""
నీ దుర్మార్గాలకు నేను. తీసే చావు దెబ్బ లే  మీ జాతికి దీటైన  గుణ పాఠం !!"
, మీరంతా కలిసి కట్టుగా పనిచేస్తూ పరస్పరం  ,దౌర్జన్యాలు చేయకుండా ,సఖ్యంగా మెదలినట్టయితే ,  అప్పుడు  శాంతిస్తూ ఉంటాను !
అయినా,నీ నిజాయితీని నమ్మలేం  కదా !""
"" నేను చెప్పినట్టు  మీరు వినాలి !!""
బుద్దిగా ఉండాలి ""!
,వెధవ వేషాలు వేస్తే , ఇంతకింత అనుభవిస్తారు ,!!
ప్రత్యక్ష నరకాన్ని రుచి చూస్తారు !!
""దేవుడా , నాకు దిక్కు , ఏది ??
అంటూ , నెత్తి నోరు కొట్టుకుంటూ ,  దూరం చేసుకున్న ఆ దేవుడిని మళ్లీ , నీవు ,,నీ దగ్గరకు తెచ్చుకునే లా చేసేవరకు
నేను నిద్ర పోను!
సరికదా !
""మిమ్మల్ని నిద్ర పోనివ్వను !""
,,""ప్రపంచాన్ని జయించాము కదా ,!
ఇక ఈ దేవుడు ఒక లెక్కా?"" అంటూ , నిన్ను పుట్టించిన దైవాన్నే ఛాలెంజ్ చేసే మీ దుష్ట బుద్ది ని మార్చుకుని , చక్కగా మానవతా విలువలు పాటిస్తూ ,, ఐకమత్యం భావంతో ,సకల దేశాల జనాలు   బ్రతకడం చూసేవార కూ ,
నేను"" మహా మారి  """వలె  మాత్రమే కాదు ,!!
""మహా కాళిగా""" ,కూడా  అవతరిస్తూ ,,,మీ మానవ జాతికి ఒక"" గుణ పాఠం"" చెపుతూనే ఉంటాను ,!!
నాగురించి మీకు ఇంకా పూర్తిగా  తెలియదు ,
పడితే విడిచింది లేదు !
నా ఆకలి తీర్చే దమ్ము మీ వద్ద లేదు !
అహంకారం తో దైవాన్ని త్రునీకరించిన రాక్షస జాతి ,సమూలంగా అంతరించి పోయింది , తెలుసు కదా !"
నాకు మీ ఆగడాలు తెలుస్తూనే  ఉంటాయి !!!"",
శరణమా ??,మరణమా ,?? ఏది కావాలో ,, మీరే తేల్చుకోండి ,??""
""రామా, కృష్ణా ! ""అని జన్మలో ఎన్నడూ అనని వారి చేత , రోజూ ,అనుక్షణము  కరోనా అంటూ నా పేరును తలుచుకునే లా చేస్తున్నాను ,
నా కాళ్ళు పట్టుకుంటే, నా పేరు తలచుకుంటే ,నన్ను ధ్యానిస్తూ ఉంటే ,మీ జన్మలో నన్ను గెలవలేరు కదా !
నన్ను నిన్ను పుట్టించిన ఆ దేవుడిని  ప్రార్థించండి ,
దైవాన్ని కొలుస్తూ , భజిస్తు  ధ్యానిస్తూ ,అతడి అనుగ్రహాన్ని పొం దే ప్రయత్నం చేయండి !"
నమ్మండి ,ముందు ,నిన్ను నన్ను సకల జగత్తును కాపాడి రక్షించే సర్వాంతర్యామి ___ నీలోను ,నా లోనూ ,విశ్వమంతా నిండి యుంటూ ఇదంతా __తన  కేళీలీలా విలాసంగా  జగన్నాటకం నడిపిస్తూ , చోద్యం చేస్తూ  ఉంటున్నాడని , ఇప్పుడైనా అర్థం చేసుకో రా ,, ఓ మూర్ఖ శిఖామణి !;""
""హే పరమాత్మ !!
,"హే పరందామా !,
""  హే పరాత్పారా!
అంటూ  ఆర్తితో ,,ఆర్ద్రత తో ,,ఆవేదనతో ,స్వామిని శరణు వేడుకుందాము ,,,!
హే శరణాగత వత్సలా,,! శరణు !
హే ఆది మద్యాంత రహిత!
శరణు!
హే దీనజన శరణ్య
శరణు !
హే ఆపద్బాందవా ,
శరణు
శరణు
శరణు
స్వస్తి
హరే కృష్ణ హరే కృష్ణా !""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...