Tuesday, May 19, 2020

కరోనా తో కంపెనీ_2

May 18, 2020
" కరోనా పీ డ  ""వల్ల ప్రస్తుతం ప్రపంచం మొత్తం లో ఘోరమైన
విషమ పరిస్తితి ఏర్పడింది !
ఎవరూ ఎవరితో నూ బాధ చెప్పుకునే దిక్కు లేకుండా,అయిపోయింది ,ప్రపంచ దేశాల  జనాల పరిస్తితి!!
ఇంట్లో ఉండలేము ,,
బయట తిరగనూ లేము !!
ఓపికతో ,శ్రద్ధతో తొందరపడకుండా  ఆచరణలో పెట్టాలి ; , నీ ఆలోచనలను !!
ఎందుకంటే
కరోనా కూడా నీలాగే ,స్వేచ్ఛగా ,నీకు కనపడకుండా  వీధుల్లో నీతోనే  సహవాసం చేస్తూ తిరుగుతూ ఉంది,,! అన్న విషయం మరచిపో కూడదు సుమా !!
అది చేస్తున్న  ప్రమాద ఘంటిక  శబ్దాలను నీవు టీవీ లో , పేపర్లలో చూస్తున్నావు కదా !!!
""ఎవరికో వస్తుంది కావచ్చు !"
నాకు  మాత్రం రాదు !
నేను  దానికి లొంగే రకం కాదు ,,అతీతుడ ను !""
అన్న అహంకారం ఏ మాత్రం పనికి రాదు సుమా !
,కరోనా లాంటి విష సర్పంతో  ,సహవాసం చేస్తూ బ్రతకడం అంటే ,అంత తమాషా అయిన వ్యవహారం కాదు కదా ,!, అంత తేలికగా తీసుకునే విషయం కాదు !!" అది మనకు లొంగే అవకాశం ఇప్పట్లో లేనట్టే !
అందుకే,
""కరోనా తో గేమ్__ఆడ వద్దు!
కత్తి మీద సాము !'""
పాముతో చెలగాటం !""
చావు ను కొని తెచ్చు కోవద్దు సుమా !!"
కనిపించని రాక్షసుల మద్య ,  భయంతో బ్రతుకుతూ , మృత్యువు  ఎటువైపు నుండి వస్తుంటుం దొ ,తెలియక ,భయాందోళన  చెందుతు ,పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ , పోవడమే,,ప్రస్తుతం  మనకు మిగిలింది !"
పోనీ ,ఇప్పుడైనా రాముడు కృష్ణుడు ,ఈశ్వరుడు గుర్తుకు వస్తాడా ?అంటే రాడు,!
కరోనా జపం చేస్తాడే కానీ,రామ్ అని నోటికి రాదు !
అలవాటు లేని పని కదా మరి !;""
,జీవితమే  ఒక నాటకం!     నాటకంలో మళ్లీ ఇదొక నాటకం ,!!
  ___బ్రతికి వుండగానే , మనో వ్యధ పాలు చేస్తూ  నరకం చూపిస్తు ఉంది  ఈ కరోనా !
వృద్దాప్యం అంతే !
పళ్ళు లేని పులి!
ఒక్కసారే  మింగితే  బాధ ఉండదు కదా !
""ముసలి పులి  అనబడే , ఈ వృద్దాప్యం ,కు
పళ్ళు ఉండవు కదా ,!! ;""
చక్కగా నింపాదిగా  ,, ఒక్కసారి గా ప్రాణం తీయకుండా  మేకను,నమిలి నమిలి ,చంపుతూ తింటూ ఉంటుంది ,
తనశరీరం పై ఏర్పడిన  పుండు వల్ల ,ఎద్దు పడే బాధ , ఆ పుండు ను పొడుస్తూ ,తొలుస్తూ తింటూ ఉండే  కాకికి, ముద్దు  అనిపించ దు కదా !
వృద్ధాప్యం దయ చూపిస్తుంది అనుకుందాం !!
,,కానీ  ఈ కరోనాకు కనికరం లేదు సుమా !!
దానికి దొరికితే ఇంతే సంగతులు !!"
__ఎంత బాధగా ఉంటుందో,తమ కన్న పిల్లలకు దూరంగా , బ్రతుకు గడిపే వారి ముసలి ప్రాణాలకు ?
అది అనుభవిస్తేనే ,, ఆ కన్న పేగు పడే బాధ "అర్థం అవుతుంది !!"
వారు  తమ కడుపు తీపి చంపు కొలేరు,!
అది  ఎంత చెప్పినా  పిల్లలకు అర్థం కాదు !!""
అలా అని వారితో కలిసి బ్రతకలేరు  కూడా !"
"" కరోనా లాంటి ఈ వృద్దాప్యం   "" , కూడా 
అంతా ఘోరంగా ఉంటుంది !
పెద్ద తనంతో , పెద్దరికం గా  బ్రతకడం నేర్చుకోవాలి ,!  తప్పదు !;
మమతా,ప్రేమ ,బంధాలు ,అనే త్రాళ్లను  తెంపుకొంటూ ,,ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా  ,, వైరాగ్యం తో జీవించాలి ;"!
తప్పదు !!
ఏది జరిగినా మన మంచికే!అనుకోవాలి !.
దిక్కు లేని వారికి దిక్కైన దేవుడిని గట్టిగా నమ్మాలి !
తప్పదు !!
ఆ  దైవం తప్ప, ఈ గడ్డు పరిస్తితిలో  ఆదుకునే నాథుడు లేడు కదా !
ఈ రకంగా నైనా , భగవంతు ని చేరువ కు మనల్ని  చేరుస్తూ ఉంది ఈ కరోనా అని భావించుకోవాలి !
తప్పదు !
అందరికీ అన్నివేళలా , దిక్కై నిలిచే ఆ పరమాత్ము ని  ,, ఈ "కరోనా" బారినుండి  మనల్ని రక్షించమని ,,అందరికీ అన్ని వేళలా దిక్కై,నిలిచి కాపాడే ఆ పరమాత్ముని మనసారా , కోరుకుందాం ,!
ఎవరు తోడు లేకున్నా"  ఆ శ్రీకృష్ణ పరంధాముడు ఒక్కడు ,, మనకు తోడు నీడై ఉంటే చాలు!అతడి కృప ఉంటే చాలు ,!
ఇక  , ఏ కరోనా కూడా  మనల్ని ఎమీ చేయలేదు !"",
ఇలాంటి  సంకల్పం తో ,,భావ సంపద తో , ఈ శేష జీవన వాహినీ,, , భక్తి ,జ్ఞానం అనే రెండు తీరాల   మధ్య  ప్రవహిస్తూ, హరినామ స్మరణ చేస్తూ , కరుణా ,సముద్రుడు ,,ఆ    శ్రీమన్నారాయణ స్వామీ సన్నిధిలో  లీనమైతే చాలు , ఈ జన్మకు అదే పది వేలు!!
హే  అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, దీన జన బాంధవా !
భావనా తీతమైన ,
నీ ముగ్ధమోహన రూప  సౌందర్య లావణ్య వైభవాన్ని మా ఎదలో దర్శించే భాగ్యం ప్రసాదించు!
పరమానంద భరితమైన నీ అనుగ్రహంతో  ఈ జన్మను  సార్థకత  చెయ్యి తండ్రీ!
దిక్కు లేని వారికి దిక్కై నిలిచి , ఆదరించి , అపారమైన కృపతో నీ ఒడిలోకి చేర్చుకుంటూ , ఈ దీనులను కటాక్షిస్తు ఉంటున్న  ఓ  చరాచర జగన్నాథ ,! పరాత్పరా ,!పరమ కృపాకరా!, హే , లోకేష్వరా !,,ఈశ్వరా!
హే పరమేశ్వర శరణు !
హే ఆపద్భాందవ ,, శరణు !
హే దీన శరణ్యా ,,శరణు !
స్వస్తి !"
హరే కృష్ణ హరే కృష్ణా !"!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...