Tuesday, May 26, 2020

ఎవరు గుడ్డి వారు ? 1

May 24, 2020

తాతా ! సూర దాసు అని నీకు  పెట్టిన పేరు సార్ధకం అయ్యింది ,,
నీవు పాడే ప్రతీ పాట  ,,నీ  కంఠస్వర మాధుర్యం తో నన్ను తన్మయున్ని చేస్తోంది సుమా !
భక్తి పారవశ్యంతో కృష్ణా కృష్ణా అంటూ ఆలపించే కీర్తనలు ఈ వ్రజభూమి నీ దాటి , ఉత్తర భారత దేశమంతటా నీ పేరు వినబడుతు ఉంది సుమా !
నీకు తెలియడం లేదు గానీ , తాతా వేల మంది భక్తులు గాయకులు నీ ఎదుట కూర్చుండి వింటూ పరమానందం భరితులై వెళ్తున్నారు !!.
, అయితే,,నాకు ఒక ఆలోచన వస్తోంది , నీ ఎదుట ఉంటూ నీ హరి భక్తిని  మధుర గానాన్ని వింటూ ఉంటే,,నీకు చూపు ప్రసాదించాలని ఉంది తాతా !;
నీకు పుట్టుక తో కంటి చూపు లేదు కదా !ఇపుడు నీకు   ఈ రంగుల ప్రపంచాన్ని చూడగలిగే కంటి చూపును నీకు  నీవు ఆరాధ్య దైవంగా భావిస్తున్న ఈ  గోవిందుడు  ,,నీకు తన తన భక్తుని ప్రజ్ఞ చూస్తూ సంతోషిస్తూ ఉన్నాడు సుమా !!
నీ హరిభజన కీర్తనలను విని సంతోషంతో ,,నీకు  కంటి చూపును  అనుగ్రహిస్తాడు  , సరేనా తాతయ్యా ??
నీకు సమ్మతమేనా ?"'
___""_కృష్ణా !! రాధి కా మనోహర  !  ఇది నీవు నాపై చూపుతున్న అపారమైన   దయ అనుకొనా ?
లేక నా విశ్వాసం పై  ,,నాకు  నీవు పెట్టే పరీక్ష అనుకొ నా ?""
___""లేదు తాతా ,!;
నీవు నముకున్న కృష్ణునికి నీకు కనీసం  కంటి చూపు కూడా ఇవ్వకపోవడం  ఈ నీ  కృష్ణయ్యకు బాధగా ఉండదా చెప్పు ??""
____"కన్నయ్యా  !నను గన్న తండ్రీ ! నా పాలి దైవమా ! నా త పః ఫలమా !
నేను గ్రుడ్డి వాడిని అని నేను అనుకోవడం లేదు , కదా !!
ఎందుకంటే  నేను కృష్ణయ్య కళ్ళతో అంతా లోనా బయటా,, చూస్తున్నాను !   నాలో అంతర్లీనంగా ఉంటూ, హృదయంలో భువన మోహనముగా వేణుగానం చేస్తూ ,ఉన్న  ఈ కృష్ణయ్య ను చూస్తూ నిరంతరం  బ్రహ్మానందం అనుభవిస్తూ ఉన్నాను,  !!
ఇక  ఆ  సంసార భూయిష్టమైన ఆ మాయా  ప్రపంచం తో , ఆ భవ బంధాల తో నాకు సంబంధం లేదు !
వాని అవసరం లేదు కూడా !
నేను పాడుకుంటూ ఉన్న పాటలు నా ముందు కూర్చుం డి ,  ఈ కృష్ణుడు వింటు ఉన్నాడు ,  నాకు ఈ తృప్తి ,, ఈ ఆనందం , ఈ జన్మకు ఇది  చాలు
కృష్ణా !""
నిను చూడలేని కనులు ఉన్నా లేకున్నా ఒకటే కదా కృష్ణా !!!
, నీ భజనలు నేను గానం చేస్తూ ఉండగా వినకుండా వెళ్లిపోయే వారు __నిజమైన చెవిటి వారు సుమా !
నీ లీలలు నీ గుణ గాన రూప లావణ్య వైభావాలు  స్మరించని  వారి బ్రతుకు లు, సుగంధ పరిమళాలు లేకుండా భగవంతుని పాద కమలాల ముందు సమర్పణలు నోచుకోని పుష్పాల వంటివి సుమా !!
కంటి చూపు కోల్పోయి ,బాహ్య ప్రపంచాన్ని  చూడ నోచుకోని అంధులు గ్రుడ్డి వారా  అంటే ఎంత మాత్రమూ కారు !"
""సర్వేంద్రియానాం నయనం ప్రధానం !""అన్నారు విజ్ఞులు ! నిజమే !
కళ్ళు ఉండి సర్వత్రా పరమాత్మను కాంచలేని వారు నిజంగా గ్రుడ్డి వారే !!""
తలి దండ్రులను ప్రత్యక్ష దైవాలు గా గుర్తించలేని బిడ్డలు గ్రుడ్డి వారు ,!
భార్యను దేవత గా కాకుండా బానిసగా చూస్తూ హింసించే  ,మానసిక క్షోభకు గురి చేస్తున్న పశు ప్రవృత్తి గల భర్తలు గ్రుడ్డి వాళ్ళు ,
స్త్రీలలో మమతా , ప్రేమానురాగాల ను దర్శించలేని  మగాళ్లు  నిజమైన గ్రుడ్డి వారు !
ఈ విధంగా యదార్థ మును గ్రహించకుండా పదార్థ మే నిత్యం అనే భ్రమ లో కొట్టు మిట్టాడుతూ ఉండే బుద్ది హీనులు అంతా  ,,తమ బ్రతుకును అంధకార బంధు రంగా మార్చుకుంటూ ఉన్న గ్రుడ్డి వారే  కదా !""
పక్షులు జంతువు చెట్టూ చేమా నదీ నదాలలో నింగిలో ,పంచభూతాలలో తినే ఆహారంలో త్రాగే నీటిలో ,పీల్చే గాలిలొ, సమస్త ప్రకృతిలో ,సూర్య చంద్రుల కాంతి లో పరమాత్ముని వైభవాన్ని కాంచలేని మూఢ జనాలు , అహంకా రులు  ,అజ్ఞానులు నిజంగా గ్రుడ్డి వారే కదా కృష్ణా !
ఆత్మ విచారణ చేస్తూ జీవాత్మను పరమాత్మ తో అనుసంధానం  చేయకుండా అమూల్యమైన మానవ  ,జీవితాన్ని వ్యర్థ కార్య కలాపాలతో   భ్రష్టు పట్టించే వారు కళ్ళు ఉండి కూడా  కబో ది అవుతున్నారు కృష్ణా !! అణువణువునా నిండిన భగవంతుని తత్వాన్ని తమ వివేకంతో  దర్షించలేని వారంతా  గ్రుడ్డి వారే అని నా అభిప్రాయం కృష్ణా !!"
అయినా నిన్ను చూడాలనే ఆశతో ఆర్తితో అర్ద్రత తో , ఆరాటం తో ఆవేదనతో ,,ఆరాధనా భావంతో   నీ కోసం తపించే , ,నిన్ను చూడాలని తలపించే  భావ మాధుర్యం  ప్రాప్తించడం సామాన్యమైన విషయం కాదు కదా కృష్ణయ్యా !!
దేనికైనా పెట్టీ పుట్టాలి ,
యద్భావం తద్భవతి !"
అగ్నిలో కాలిస్తే నే   మలినాలు  తొలగి స్వచ్చమైన బంగారం బయట పడుతుంది కదా !
కృష్ణా! నీవే తప్ప అన్య భావన చేయని వారే నీ కరుణ కు  అర్హత కు నోచుకుని  అంతః చక్షువు లతో  నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ పులకితు లౌతు ఉంటారు కదా , కృష్ణా !;
పరమాత్మ సాక్షాత్కారం  పొందాలంటే కృష్ణ చైతన్య అనుభవాన్ని సంపాదించాలి !
ఆ సర్వేశ్వరుని లీలలను సర్వాంతర్యామి తత్వాన్ని తెలుసుకోలేని ఆ కౌరవులు రెండు కళ్ళు ఉండి కూడా , కూడా  అహంకరించి కళ్ళు ఉండి కూడా ఎదుట కదలాడుతూ ఉంటున్న కృష్ణ స్వామిని చూడలేని  గ్రుడ్డివా రు అయ్యారు కదా  ,!!
వారు
శ్రీకృష్ణుని నిందించి ,సర్వ నాశనాన్ని కొని తెచ్చుకున్నారు !!
బమ్మెర పోతనామా త్యులు  అంధ్రీ కరణ చేస్తూ ,, మహ భాగవతం లో  "" గ్రుడ్డి వారు ఎవరో""?  చక్కగా విశద పరచారు ,
""కమలేశు జూడని కన్నులు కన్నులే ,,
తరు కుడ్య జాల రంధ్రములు గాక !!""
అని చెప్పినట్టుగా ,ఎవరైతే నిత్యం  తాము
దర్శించే దేవాలయంలో  ఎదుట  గోపాలకృష్ణుని ముగ్ద మనోహర సుందర సురుచిర  శతకోటి మన్మథ రూప లావణ్యం తో ప్రకాశించే విగ్రహంలో __ నగుమోము తో ఆగుపించే గోవిందుని చూడలే క పోతే అలాంటి వారి కన్నుల కి, మఱ్ఱి చెట్టు కాండాని కి  ఉండబడే  పెద్ద పెద్ద తొర్ర ల కి  మధ్య పెద్ద తేడా   ఉండదు కదా ?"
అంటారు !!
___""తాతయ్యా !" నీకు తల్లీ దండ్రి సోదరులు ఇల్లూ వాకిలి. ఇన్ని  ఉండి కూడా ఇలా అనాథ వలె ఇక్కడ ఈ వ్రజ భూమిలో తల దాచుకోవడం నీకు బాధగా అనిపించడం లేదా ?
__"" నిజమే ,,కృష్ణా ,!;
చిన్నతనం లో నేను రోజూ  ,చాలా ఏడ్చాను ,!!
నాకు ముగ్గురు అన్నయ్యలు ,నేను చిన్న ,,!!కానీ పుట్టుకతో గుడ్డి వాణ్ణి , నేను ,ఎన్ని జన్మల పాప ఫలమో కదా ఇది ??
ఏ సంస్కారానికి నోచు కోలేదు ,,
అందుకే ఎందుకు పనికి రాని నన్ను  అసలు పట్టించుకోవడం  మానేశారు  !
స్నేహితులు బంధువు లు నా అన్నవారే కరువయ్యారు కన్న య్యా ?""" కన్నవారి ప్రేమ కూడా కరువైంది
అందరకు బరువై పోయాను
కృష్ణా !
నా లాంటి  అభాగ్యులు ,అంధులు ఎందరున్నారో ,ఎంత బాధను అనుభవిస్తూ ఉన్నారో కదా !?? ఈ విషయం తలచుకుంటే భయం వేస్తూ ఉంటుంది !
కృష్ణా ! ఎందుకయ్యా  ఇంత తేడా ?
అందరం మనుషులమే కదా !
ఒకరు ఏడుస్తూ ఉంటే , అది చూస్తూ మరొకరు  నవ్వుకోవడం , కృష్ణా !
ఏమిటయ్యా నీ లీల !
ఏమిటీ ఈ గోల ?
   (ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...