May 22, 2020
శుక మహర్షి మహా భాగవతం లోని భక్త మహాశయులు గూర్చి అద్భుతంగా వివరించారు
కానీ రాధా రాణి జోలికి వెళ్లలేదు , ఎందుకంటే , ఆ మహానుభావుని కి , "రాధా" అన్న పేరు వింటే,లేదా స్మరిస్తే చాలు, అతడి మేను పులకరిస్తుంది,, ఆనందభాష్పాలు ఆశృధారలుగా బొట బోటా స్రవిస్తూ వుంటాయి , తన్మయత్వం తో మనసు పరవశిస్తూ , ఈ లోకాన్ని దేహాన్ని పరిసరాలను మరచి పోతాడు
రాసలీల అంతరార్ధం తెలిసిన ఆ యోగి పుంగవు డు ,తిరిగి యధా స్థితికి వచ్చి కోలుకోవడానికి అతడి ఆంతర్యం ఒప్పుకోదు
అలాంటి అలౌకిక అద్వితీయ అపురూపమైన,శాశ్వతమైన ,చిదానంద పరబ్రహ్మ స్వరూపం అయిన ఆ బ్రహ్మానందం స్థితిని , మధురా నుభూతి పొందే వారు , మృగతృష్ణ వంటి ,కోరికల మూటలను తలపింపజేసే ఈ భౌతిక సుఖాల ను, కాంక్షిస్తారా ?"
సుగంధ పరిమళాలను వెదజల్లే పుష్ప వనాలను విడిచి ,తుమ్మెద అరణ్యాలలో తిరుగుతుందా ?
హిమగిరి శిఖరాల లో ,,మానస సరోవర తీరప్రాంతంలో ఆనందంగా ఉండే రాజహంస కు, , కుంటలు చెరువుల్లో ఈదుతూ ఉండాలని ఉంటుందా ?
వసంత ఋతువులో మామిడి లేత చివుల్లు తింటూ , కుహూ కుహూ అంటూ విశ్వాత్మ కు తన మధుర సంగీతాన్ని వినిపిస్తూ ఆనందిస్తూ ఉండే కోయిల , చెట్టు తొర్రలో ఉండాలని అనుకుంటుందా ?
శరద్ ఋతువు లో చల్లని నిండు పున్నమి వెన్నెల కాంతుల లో తడుస్తూ ,,నింగిలో హాయిగా స్వేచ్చగా విహరిస్తూ ఎగురుతూ పరమాత్మ వైభవాన్ని అనుభవిస్తూ పరమానందం పొందుతూ ఉండే చకోర పక్షి ,ఘోరమైన కీకారణ్య ములలో తిరగాలని ,,ఎప్పుడైనా భావిస్తూ ఉంటుందా !
దివ్యమైన భవ్యమైన రాధాకృష్ణుల చరణార విందా లను నిరంతరం చింతిస్తూ , ఆ భావనామృతాన్ని మనసారా గ్రొలుతూ, తని వారా త్రాగుతూ ,శ్రీకృష్ణ చైతన్యం తో, మత్తెక్కి పోయె ఈ చిత్తము ఈ అద్భుతమైన ,,భావ సంపద ,, వేరే ఇతర విషయ వాంఛల యందు తగిలి బాధల్లో కూరుకు పోవడానికి ఎంత మాత్రమూ ఇష్ట పడదు కదా !"
,అందుకే శుక యోగేందృ డు ,దశమ స్కందము ను , పరీక్షిత్తు మహారాజు కు వివరించే ప్రయత్నం లో ,తన ఆరాధ్య దేవతా,పరలోక సామ్రాజ్ఞి ,గోలోక సామ్రాజ్య పట్ట మహిషి ,,శ్రీకృష్ణ హృదయాంతరంగిని,, అద్వైతా మృత వర్షిణి గా భాసిల్లే రాధా రాణి ప్రసక్తి రాకుండా ,,ముందే జాగ్రత్త పడ్డాడు ఆ శుకబ్రహ్మ ,
ఆ నామం లో ఆ రూపంలో ఆ భాగంలో ఉండే రుచి ,,,ఆరాటంతో ,, ఆర్ద్రత తో ,, ఆర్తి తో వారిని ఆరాధిస్తూ భక్తి ప్రపత్తులతో ఆస్వాదిస్తూ ఉంటేనే రాధాకృష్ణ స్వరూప నామ గాన భావ మాధుర్య ము లో దాగి ఉన్న అభిరుచి తెలుస్తూ ఉంటుంది
ఈ అనందం ,అనుభవైక వేద్యం ,
భక్తునికి భగవంతునికి మద్య ఏర్పడే అనుసంధానం , ,, ఈ తాదాత్మ్యం !!
అంతటి మహోన్నత మైన రాసలీల అంతరార్ధం ,, బ్రహ్మాదుల కైనా ఊహించవశమా !
వర్ణించ తరమా ??
__ అదొక ఆనంద లోకం!
సత్ చిత్ ఆనంద స్వరూపాలు గా ప్రకాశిస్తూ రాధాకృష్ణుల ప్రణయ సుధా గీతికా లాపన ధ్వని స్తూ ఉంటే , బాగా వింటున్నవారికి వారు పడే అలసట బడలిక లు తొలగిపోయి , మనసు తేలిక గా ,ఉల్లాసంగా ద్విగుణీకృతం గా అడుగులో అడుగు వేస్తూ , ఎటు చూస్తున్నా ఆ ప్రేమానురాగాల దివ్య దంపతుల దర్శనం చేస్తూ పులకితా అంతరంగ మనస్కులు అవుతూ ఉన్నారు
స్త్రీలకు మాత్రమే మహా రాస లీలా వైభవ ప్రాంగణం లో కనీస ప్రవేశ అర్హతగా రాధా రాణి నిర్ణయించింది ,,
""రాధా రమణ! ,రాధే గోవిందా! ,రాధే రాధే! ,,కృష్ణా కృష్ణా! ,గోవిందా !,గోపాలా !,శ్రీకృష్ణ గోవింద హరే మురారీ ,!,హే నాథ! నారాయణ !వాసుదేవ ,!
హరే కృష్ణ హరే కృష్ణా,
కృష్ణ కృష్ణా హరే హరే !
హరే రామ హరే రామ,,
రామ రామ హరే హరే! __
అంటూ ముక్త కంఠం తో కలిసి కొందరు మధురా స్వరం తో పాడుతూ , ఉన్నారు
కొందరు గోపికా స్త్రీలు వేణు నాదం తో , వీణా గానంతో ,మద్దెల తబలా కంజీరా వంటి సంగీతరస భరిత మైన పలు రకాల వాయిద్యాలతో అలరిస్తూ , ఆ అమృతాఝరులను వర్షించే సప్త రాగ రస ధారల ను తమ భావా వేషాలకు అనుగుణంగా జోడిస్తూ అద్భుతంగా , శ్రవణా నంద క రం గా మోయిస్తు ఉన్నారు ,
మరి కొంత మంది గోపికలు తమ లో కృష్ణుని పై గల అవ్యాజమైన ప్రేమానురాగాలను ప్రదర్శించే తపనతో ,తమ శృంగార రస అభినయ సౌందర్య లహరి ని , ఆ మృదు మధుర సంగీత స్వరాల కు తగినట్టుగా ,,రమణీయంగా ,కమనీయంగా నృత్యం చేస్తూ ,కూడా ,, కృష్ణునిపై గల తమ నిశ్చలమైన దృష్టిని పోనీకుండ ,అతడి సౌందర్యాన్ని మనసారా తానివారా కనులారా గ్రోలుతూ , ఏ మాత్రం ఏమారకుండ , రెప్ప పాటు కాలం కూడా వృధపోకుండా చూస్తూ , అలా తమలో కలిగే ఆనంద పారవశ్యంలో ,,మైమరచి పోతూ ఉన్నా రు ఆ కృష్ణ సౌందర్య లాలస పిపాస కాంక్షా దీక్ష గల ఆ గోపికా వనితామణులు !!"
, ( ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !"
Tuesday, May 26, 2020
కృష్ణ భక్తుడు, నార్శి మెహతా _4
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment