Tuesday, May 26, 2020

ఎవరు గ్రుడ్డి వారు ?_2

May 25, 2020
ఏదైనా తనదాకా వస్తేనే తెలుస్తుంది ,!
, ""తాతా , !అలా  నీవు కన్నీరు పెట్టకు !;నేను చూడలేను ,!!""
,, చెప్పు చెప్పు. తర్వాత  ఏం జరిగింది తాతా ?""
ఏం చేశావు ??""
__"" అంధకార బందురం అయిన ఈ జాలి బ్రతుకును చూస్తుంటే ,నాపై నాకే రోత పుట్టింది !
ఈ బిచ్చ పు బ్రతుకు కంటే చావే మేలు అనిపించింది అపుడు !!
__ప్రతిరోజూ ఇంటి ముందు కి  వస్తుండే బిచ్చగాల్లు   పాడుకునే పాటలు వింటూ బయటనే గడిపే వాడిని !;  అనుకోకుండా ,
ఒకరోజున ""హరి భజన బృందం"" అటుగా వెళ్తూ  ఉందని   విని  ఎవరికీ చెప్పకుండా ,,పరుగున వెళ్ళి ,, సంతోషంతో వారిని కలిశాను !!
ఆ రోజు రాత్రి  వారు ఒకచోట ఆగి హరి భజన చేస్తూ ఉండగా వింటూ,, నా బాధలు మరిచాను !;
ఒకాయన దయతో  నాకు భోజనం పెట్టాడు , !! అంతే !;
తెల్లారింది !
ఎక్కడివారు అక్కడ వెళ్లి పోయారు ;
నేను ఆ వీధిలో  ఒంటరిగా మిగిలాను !
వేరే దిక్కు లేక ""హరీ హరీ"" అంటూ పాడుతూ  అడుక్కోడం , , దొరక్క పోతే పస్తులు ఉండడం  చూసి ఒక పుణ్యాత్ముడు  అక్కడ ఒక  కృష్ణాదేవాలయ సమీపంలో నాకు ఒక గుడిసె కట్టించి ఇచ్చాడు !!
అదే నాకు స్వర్గంలా అనిపించింది ,!!
నిరంతరం భజన చేస్తూ ఉంటూ ఏళ్లు గడిచాయి,!!
అలా  కృష్ణభక్తితో ,నేను పాడుకుంటూ ఉన్న కీర్తనలు ఎందరో భక్తి తో ఆనందంగా పాడుకుంటూ  ఉంటే  విని ,,ఇంకా ఉత్సాహంగా ,నంద బాలుని పాటలు  అత్యంత మనోహరంగా ,ఆశువుగా పాడుతూ  రోజులు గడిచాయి !
ఒక రోజున నేను
ఒక  మంచి వార్త  విన్నాను !
ఇదే త్రోవగుం డా ,శ్రీకృష్ణ భక్తునిగా ప్రసిద్ది పొందిన శ్రీ మాన్ వల్లభాచార్యుల  రాక ఉందని తెలిసి   ఆనందం తో  మనసు పొంగి పోయింది !
, వారి కోసం ఎదురు చూశాను ;!
ఒకరోజున  వారు రానే వచ్చారు ,
నా కుటీరం ముందుకు !!__  నేను  వారి కాళ్ళమీద పడి విలపిస్తూ ఏ  ఆధారం లేని నా  బ్రతుకు దారి కి మార్గం చూపించమని దీనంగా  వేడుకున్నాను !!
వారు  నా వద్దనే రెండు రోజులు ఉండి ,, సద్గురువు గా ,నాకు కృష్ణా మంత్ర మును  ఉపదేశించారు !!!"
ఆ విధంగా కృష్ణా పరమాత్మ నన్ను కరుణించాడు !!""
  హరి కథలు లీలలు ,  పరమాత్మ వైభవము వివరంగా నాకు  బోధించి   వెళ్లారు !!
గురు కృప ,గురు మార్గ దర్శనం ,లభించిన క్షణం నుండి ,వారి ఆదేశం ప్రకారం ఈ వ్రజభూమి లోనే  ఉంటూ ,దీనిని విడవకుండా ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని కృష్ణా,, నీ  స్మరణతో  , నీ గీతాలతో నీ ,కథలతో నా  జీవితాన్ని సార్ధకం చేసుకుంటూ ఉన్నాను ,
కృష్ణా !""
""ఇపుడు అనిపిస్తోంది,,ఇలా నాకు కళ్ళు లేకపోవడం కూడా నా అదృష్టమే ,
.సద్గురువు కృప లభించింది!!
కృష్ణయ్య సాంగత్యం సహచర్యం ,సాయుజ్యం , సామీప్యత , ప్రాప్తిం చాయి!!
నా అంతరంగం లో ఉంటున్న కన్నయ్య నా ఎదుటనే కూర్చుం డి ,, నా పాటలు వింటూ పరవశిస్తూ నన్ను దన్యున్ని చేస్తూ ఉన్నాడు !!
కృష్ణా నీవే తల్లివి తండ్రివి !!
నీవే నా తోడు నీడ నీవే సఖుడవు !!
నీవే గురుడవు దైవము !
నీవే నా పతియూ గతియు ,,
నిజముగా కృష్ణా !"
నేనిపుడు  ఆనందంగా ఉన్నాను  !
నాకూ ఏ కోరికా లేదు , !
  ,, కృష్ణా , చివరి కోరిక ఒక్కటే ఒక కోరిక !;""
నేను మరణించాక నా పార్థివ శరీరానికి ,, కృష్ణా!  నీవే  స్వయంగా నాకు  ""అంతిమ సంస్కారాలు"" చేయాలి , !
__""తాతా ,అప్పుడే అప్పగింతల కార్యక్రమంలో  చేరావు కదూ నీవు ?!"'
ఒక విచిత్రం విన్నాను అందరూ అనుకొంటూ ఉండగా !!
ఢిల్లీ పాదుషా అక్బరు ,మధురంగా పాడుతూ ఉన్న నీ గీతాలు వినడానికి  స్వయంగా నీ వద్దకు వచ్చాడు కదా  !!
ఏం జరిగింది చెప్పాలి తాతా ??"*
,__ కన్నా !  చిన్ని కృష్ణా !
నీవంటే , నీ బాల రూపం అంటే ,రేపల్లెలో ,, ఈ బృందావనం లో ,, రాధమ్మ తో కలిసి చేసిన మహా రాస క్రీడా వైభవాలూ అంటే మహా మహా ఇష్టం !!""
ఈ ""సూరదాసు భజనలు"" వినడానికి ,,పాడుకొడానికి , చాలా అద్భుతంగా ఉన్నాయి ,!అందుకే ,
పాదుషా గారు  నన్ను ఢిల్లీకి రమ్మన్నారు ,!
నాకు సన్మానం చేస్తారట !!
___"" అవునా ??
ఎంత గొప్ప విషయం ?? ఆహా !! ఇంతకూ నీవు ఏమన్నావు తాతా ??""
"""  కృష్ణా ,,నీకు తెలియని విషయం ఉంటుందా  చెప్పు ??
నేను కనలేని విషయం ఉంటుందేమో ,, కానీ, నీవు సర్వజ్ఞుడ వు ,,! స్వామీ !! మా గురువు గారి ఆదేశం ప్రకారం,,నేను  ఈ బృందావనం విడిచి ఎక్కడికి రాలేను ,,నన్ను క్షమించండి !;""అని  చెప్పాను ,
__అంత సూటిగా ఎలా చెప్పావు తాతా ??
కోపం రాలేదా పాదుషా కి """?
__ఏం చేయను కృష్ణా ?? వారికి కోపం బ్రహ్మాండంగా వచ్చింది!!
,కానీ  నేను హరి గానం ఆలపిస్తూ వుంటే, ఆ  మాధుర్యం తో   ఆయన అమితమైన ఆనందాన్ని పొంది ,,_"" ఎం కావా లో  కోరుకో పాదుషా గారు !!""!
మధు రగాయకుడు తాన్సేను గారు ,,భక్తిపూర్వ కంగా సంగీతాన్ని ఆలపిస్తూ వుంటే ,,నాకు  వినాలని ఉంది !""అన్నాను  వెంటనే
తాన్సెను గారు . నా కోరికను మన్నించి  ,,నేను నీ గురించి పాడిన కృష్ణ సౌందర్య వైభవ  గీతాన్ని అద్భుతంగా ఆలపించారు ,,!!_"
కృష్ణా!!ఇలాంటి ఎందరో  పాదుషా లకు ""పాదుషా"" మా నంద గోపాలుడు !!""
,ఆయన కృప ఉండగా ,,తుచమైన  ఏ కానుకలు సత్కారాలు , రాజ భోగాలు అవసరం లేదు"" అన్నాను !
""కృష్ణా!  ___ నీ కృప అపారం !!
ఒక  గాలికి కొట్టుకు పోతున్న ఒక అంధుని బ్రతుక్కు ,అతడి గాలి పాటలకు ఇంత గొప్ప   ప్రాధాన్యత  ప్రాచుర్యాన్ని కల్పించిన శ్రీకృష్ణా ,నీకు శతకోటి ప్రణామాలు !!""
ప్రభూ;!
, నిరంతరం నీవు  సర్వ కాలంలో,సర్వ అవస్తాలలో దాపుగా ,ప్రాపుగా . నాకు బాసటగా ఉంటూ ,నన్ను విడవకుండా ఎప్పుడు ఏది ,ఏది అవసరం ఉందో అది సమకూరు స్తు. ఈ  జన్మకు ఒక అర్థాన్ని పరమార్థాన్ని అనుగ్రహించా వు,,!!"
నీ ఋణం ఎలా తీర్చుకొ ను ??""
నీకీవే ,, నా అంతిమ
సాష్టాంగ ప్రణామాలు !!
స్వీకరించు ,!!
ఇక !సెలవు !""
జై శ్రీకృష్ణా!""
స్వస్తి !!"
హరే కృష్ణ హరే కృష్ణా ?!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...