Tuesday, May 19, 2020

కృష్ణ భక్తుడు నార్సి మెహతా _1

May 18, 2020
శ్రీకృష్ణ భక్తులలో  అనేకులు కృష్ణ దర్శన భాగ్యాన్ని పొందారు ,
పరమాత్ముని నేరుగా దర్శిస్తూ పులకించి a  తన్మయత్వం  తో సంకీర్తనలు చేసి ,ఆడుతూ పాడుతూ ,గానం చేస్తూ దన్యులైన వారు  ఎందరో ఉన్నారు
గానానికి ఉన్న శక్తి అపారం!
,వందల పురాణాలు వింటున్నా కూడా  ,,ఒక్క ""భజన" తో శరీరంలో ని సర్వాంగాలు ,కోట్ల నాడులు  పులకిస్టూ  మనసును శ్రీకృష్ణా రూపా వైభవ ధ్యాన అమృత పాన చిత్తం తో ఉన్మత్త పూరితం చేస్తుంది !
ఒక భక్తి గీతం , కొందరు భక్తుల జీవితాలనే మారుస్తుంది !!
త్యాగరాజు ,అన్నమయ్య రామదాసు ల వంటి భక్తుల  అద్భుతమైన అపురూపమైన. సంకీర్తనలు ఆలపిస్తూ ఉంటే ,  అవి వింటూ ఉంటే , అమితమైన ఆత్మానందం  పొందుతూ , ఎదురుగా పరమాత్ముడు ఉన్నట్టుగా మధురానుభూతి చెందుతూ ఉంటాము !!
అలాంటి ఎందరో మహానుభావు లలో  ,పురుషులలో" నర్సి మెహతా "" ,స్త్రీలలో ""మీరాబాయి "" లు మేటి అని చెప్పవచ్చును !
ఎందుకంటే, నర్శి  మెహతా అనే కృష్ణ భక్తుడు ,శ్రీకృష్ణుని దివ్య దర్శనం 54 సార్ల కు పైగా చేశాడని  ప్రతీతి ,!
ఆయన  అద్భుతమైన వేలాది కృష్ణ భక్తి గీతాలు ,భజనలు  అతి  మధురంగా  రచించి ,గానం చేశాడు ,అతడు రాధాకృష్ణుల అత్యంత సన్నిహితుడైన  గొప్ప   కృష్ణ భక్త  శిఖామణి !!
దర్శన్ దో ఘన్ శ్యామ్ నాథ్ , మోరే,,
అఖియా ప్యాసీ రే,,,!""
లాంటి భక్తి పారవశ్యం తో పాడిన   అనేక కృష్ణ భక్తి గీతాలు ,ఉత్తర భారత దేశంలో   ,ఇప్పటికీ   ఎంతో ప్రసిద్దిని పొందుతూ,కృష్ణా భక్తుల ను అమితంగా ఆనందింప జేస్తూ ఉంటున్నాయి !""
ఇక మీరాబాయి భక్తి తత్పరత అమోఘం ,!అద్వితీయం ,!
ఆమెను విడిచి కృష్ణుడు ఒక్క క్షణం కూడా  దూరంగా విడిచి ఉండ లేదు !!"
,, నిరంతరం మీరాబాయి ,శ్రీకృష్ణ సాన్నిధ్యంలో నే ఉంటూ,కీర్తనలు అతడికి వినిపిస్తూ ,తరించింది ,!!
గోపికల భక్తి  గురించి  పురాణాల ద్వారా వినడమే ,కానీ  మీరాబాయి  కృష్ణ తత్వం  విన్నవారు ,కన్నవారు  ఆమె కాలంలో ఉండి తరించారు ,
నార్శీ , మెహతా జీవితం కష్టాల మయం , బాధ ల నిలయం
  నాది అనేది ఏది లేకుంటే నే భగవత్ కృప లభిస్తుంది కదా !
అతడు తప్ప మరేదీ మదిలో హృదిలో లేనప్పుడే , కృష్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది  !!
నర్శి  మెహతా ,గుజరాత్ లో  వైశ్య కుటుంబంలో జన్మించాడు ,
కానీ  అతడి తండ్రి నిరుపేద!!
మహ్మ దీయుల పాలన ,బాబర్  కాలం నాటి వాడు !
రామ అంటే బూతు మాట అనిపించే మహ్మదీయ పాలకుల భయం తో , దేశం అంతా కంపించి పోయింది,
రామ కృష్ణా అనడం , బొట్టు పెట్టడం , హిందూ ఆచారం సంప్రదాయం పాటించడం ,,ఇవన్నీ నిషిద్దం చేస్తూ ,హిందువులను  అణచి వేశారు ,
భక్తి భజన పూజ దేవతా మూర్తుల పూజ వర్జితం చేశారు ,
బలవంతంగా ముస్లిమ్ సంప్రదాయాన్ని రుద్దుతూ ,  అనేక హిందువులను  తమ మతం లోకి మార్చేశారు ,
అలాంటి భయాందోళన వాతావరణం లో మన కృష్ణ భక్తుని జననం జరిగింది ,!
నర్శి మెహతా పుట్టుకతో మూగ వాడు ,చెవిటి వాడు కూడా ,
అతడి కన్నవారు  బ్రతికి లేరు !, బహు బీద కుటుంబం ,!
అన్న వంశీ దర్  మహ్మదీయ పాలన లో జైలు శాఖ లో  కనీస వేతనం తో   పనిచేసేవాడు ,!!
అతడు నర్శి కంటే 14 ఏళ్లు పెద్ద , !!
"గౌరీ  "అనే  అమ్మాయీ తో పెళ్లి  జరిగింది ,
కానీ ఆవిడ  చాలా దుష్ట స్వభావం కలది కావడం తో నర్సీ కష్టాలు ప్రారంభం అయ్యాయి ,
అప్పటికి అతడికి ఐదేళ్లు మాత్రమే !
సరిగా అన్నం  పెట్టకపోవడం  ,ఎండిన రొట్టెలు  మాత్రమే ఇవ్వడం , ఆకలికి మాడ్చడం  , ఎప్పుడూ తిడుతూ  ఉండడం , ఎంగిలి మెతుకులు పడేయడం  ,,కొడుతూ ,ఇలా నానా హింసలకు గురి చేసేది , !!
""ఒరేయ్ మూగో డా,!!ఒరేయ్ ,చెవిటి వాడా ,!!" అంటూ గేలిచేస్తు ,అందరిలో  అవమానిస్తూ  ,ఇంట్లో నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉండేది ,
అయినా ఎప్పుడూ పల్లెత్తు ఎదురు మాట  తిరిగి అనే వాడు కాదు ,
మూగతనం వల్ల నోటితో చెప్పలేని హరినామ గానం ,భజన ను ,
ఎప్పుడూ "హరి, హరీ"" అంటూ  మనసులో భావిస్తూ,చేతులతో భజన  చేస్తూ ,పరమ భక్తిభావం తో శాంత చిత్తం తో   , బాల యోగిలా ఆనందిస్తూ బాల్య జీవితం గడిపాడు నార్శి ,!"
ఇదంతా అన్నకు తెలిసినా గౌరీ  దురుసు  ప్రపర్తన కు భయపడి  ఏమి అనకుండా వెళ్ళేవాడు !!
న ర్శి  కి  ,జయకుమా రి  అనే నాయనమ్మ ఒకతె  దిక్కు అయింది !
మనవడి కష్టాలు చూడలేక దగ్గర్లో ఉన్న శివాలయం కు తీసుకెళ్ళి
బాబూ నీకు తల్లి  ,, ఈ పార్వతి మాతా ! నీ ,,తండ్రీ ఇదిగో ఈ శివయ్య !""
ఇకనుండి నీకు ఏ బాధ దుఖం ఉన్నా వీరితో చెప్పుకో , !""
అంది  ! 
అక్కడే ఒక సాధువు చక్కని తేజస్సుతో వెలిగిపోతూ కనిపించాడు ,
వెంటనే ఆ నానమ్మ  , నర్శి బాలుడిని అతడి కాళ్లపై పడవేసి ,
""మహాత్మా ,వీడి భారం నీదే!. ,మూగ చెవిటి , బాల్యం ,అమాయకత్వం తో వీడి  బ్రతుకు భారంగా ఉంది ,నేను ,చూడలేక  పోతున్నాను స్వామీ!! అంటూ రోదిస్తూ  నర్శి బాధలు వివరించింది ఆ మహాత్మునికి !!
   (ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...