Tuesday, May 19, 2020

కృష్ణా కనరావా !_2

May 12, 2020
"కృష్ణా ! గోపాల కృష్ణ! గోవింద కృష్ణా !""
మోహన కృష్ణా !
మురళీ కృష్ణా !
నీ చూపు పడనిదే , "బండరాయి "వంటి నా హృదయం పై ,"మనస్సు" అనే మొలక చివురించదు కదా !"
"కృష్ణా !
ఒక రైతు ,  నీలాకాశం వైపు , , తన చేల పై చల్లని నీరు కురిపించే ,,నల్లని నీటి మబ్బు కోసం  ఆశగా ,ఎదురు  చూస్తూ   ,తన బ్రతుకు నంతా ,,తాను చూసే  తన కంటి చూపులో  నింపుకుని ఉంటాడో ,
అలా
నేను నీకోసం పడిగాపులు కాస్తూ, నీ అనుగ్రహ వర్షాధార లో మనసారా తనివారా ,కరువు దీరా  తడవాల ని ఉందిరా నాన్నా!
,,నా  చిన్నారి బుజ్జి కన్నా !
"కృష్ణా,! నీ ప్రేమ అనంతం !,
ఈ సుందర జగమంతా, నీ రూపంతో , నీ సౌందర్య లావణ్యం తో  ప్రభవిల్లుతూ ,,దివ్య జ్యోతి లా ప్రకాశిస్తూ ఉంది రా శ్యామ సుందరా !భక్త హృదయ మందారా !"
" హే కృష్ణా !
నీవు  ఈ చరాచర జగత్తులో అణువణువునా  నిండి ఉండడం వల్లనే కదా , ఈ ప్రకృతి ఇంత శోభాయమానంగా ,అడగకుండానే వరాలు,, వనరులు ,,వసతులు కల కల్పవల్లి గా ,కామధేనువు గా  ,,ప్రత్యక్ష దైవం లా  మమల్ని కరుణ  చూపుతూ ఉంది
కృష్ణా!
నిన్ను ఆశ్రయించే భక్తులపై నీ చల్లని" చూపు "అనే ప్రేమను  పంచుతూ,వారిలో భక్తిశ్రద్ధలు పెంచుతూ ఉన్నావు !
ధరణి పై ,మేము ,చిన్న చిన్న గడ్డి పోచల వలె ,, నీ రాకకై  చూస్తూ, నీ పై మనసు పడి   రెపరెప లాడు తూ ,ఉన్నాం !
, గాలి వానలు ,శీతల ఉష్ణ ,,వాతావరణ  ప్రభావాల తాకిడికి తట్టుకునే "భక్తి "అనే శక్తిని ,""ప్రేమ"" అనే తొలకరి చినుకుల ద్వారా మాకు  అందిస్తూ ,మా బ్రతుకులకు  ఒక అర్థం ,పరమార్థం , సార్థకత ను కల్పించమని నిన్ను దీనంగా ప్రార్ధిస్తూ ఉన్నాము !!
హే ,పరాత్పరా ,,కృష్ణా!
నీపై గల భక్తితో ,,,నిత్యం నిన్ను సేవిస్తాం !
నిన్ను పూజిస్తాం !
నిన్ను అర్చిస్తూ ఉంటాం!
నిన్ను భజిస్టూ,నిన్ను కొలుస్తూ ,నిన్ను స్మరిస్తూ, నీ ప్రేమ యే ఊపిరిగా బ్రతుకుతూ  ఉంటాం !""
,కృష్ణా! అయినా తృప్తి కలగడం లేదు,మాలో ఏ లోపం ఉందో,తెలియడం లేదు !!""
  నీ భక్తుల సాంగత్యం ,సహవాసం ,తో  నీపై గల భక్తిని  ఇంకా ఇంకా ఇంకా గొప్పగా చేసుకునే ప్రయత్నం చేస్తూ,, నీ పాద కమలాల సేవలో తరించాలని ఆశగా ఉంది తండ్రీ !"
,అదే భావ సంపద తో మా బ్రతుకు ముగించాల ని కూడా  ఉంది !
కృష్ణా !
""మీరాబాయి ,,సూరదాసు ,చైతన్య మహ ప్రభువు లాంటి అపర కృష్ణ భక్తుల జీవన శైలి  స్మరిస్తూ ఉండడం మహదానందం !,, ఆదర్శం ,అనుసరణీయం !
ముక్తి దాయకం కూడా !""
ఆ కృష్ణ శక్తి చైతన్య తరంగాల ద్వారా,,మాలో ,ఎనలేని కృష్ణ ప్రేమ ,  కలుగుతూ ఉంది !
అది ,మాకు  జీవన్ముక్తి ని  అనుగ్రహించే  పరమపద సోపానం !
ప్రళయకాలంలో లో నీవు  అనంతమైన సాగర జలాల్లో , వటపత్రశాయివై,బాల ముకుందుని దివ్య మంగళ రూపంలో  హాయిగా  పడుకొని ఉంటూ నీ ,కుడికాలి బొటనవేలు ను, నోటిలో ఉంచుకొని  చిద్విలాసం గా ,,మందహాసం వదనంతో  ,,సచ్చిదానంద స్వరూపుడువై ,,సకల బ్రహ్మాండాల ను నీ కుక్షిలో నిడుకొని,సుమధురంగా   వేణుగానం చేస్తూ , ఒంటరిగా  అన్నీ నీవై,,నీవే అన్నీ అవుతూ , ,బ్రహ్మానందం  పొందుతూ ఉంటావట ,!""
  అట్టి నీ ముగ్ద మనోహరమైన బాల కృష్ణుని  పసందైన అందాలను  ఈ శ్లోకం ద్వారా   దర్శిస్తూ  అద్భుతమైన ఆనందం పొందుతూ ఉన్నాము ,,,
" శ్లోకం !!!
"కరారవిందేన ముఖారవిందం ! పదారవిందేన  వినివేశ యంతం !
వటస్య పుటస్య శయనే వసంతం !
బాలం ముకుందం మనసా స్మరామి !!_____
" హే "కృష్ణా ,!
"నిన్ను దొరికించుకోడం ఎలా ?"
ఈ ప్రశ్న, యశోదా మాత వాత్సల్యం తో  తన ముద్దుల గోపాలుని , కన్నయ్య్యను  ,,నిన్ను అడిగింది !,
వేలాది గోపికలు " ఆర్తి"తో నిన్ను  అడిగారు ,!
"ప్రేమ" తో మీరా లాంటి భక్తులూ నిన్ను   అడిగారు ,,!
మునులు " మోక్ష" కాములై అడిగారు నిన్ను !!,
రాక్షసులు "ద్వేషం "తో కోపంతో  నిన్ను అడిగారు ,!
ఇలా ఎందరో భక్తులు , మునులు ,ఋషులు ,శత్రువులు ,మిత్రువులు ,,నిన్ను పట్టుకోవాలని పట్టుదలతో అడిగారు నిన్ను !
జవాబు ఒక్కటే నీపై అనురక్తి ,చెదరని భక్తి !""
ఆ నాడు , ,, నీకోసం అంతటా గాలిస్తూ ఉంటున్న  హిరణ్యకశిపుని హృదయంలో  నీవు ,సూక్ష్మ  రూపంలో   వెళ్లి కూర్చున్నా వు !,
""ప్రహ్లాద! ఎక్కడ రా  నీ శ్రీహరి?""అని కొడుకుని గద్దిస్తూ, గర్జిస్తూ  ఉంటే,,భక్త వత్సలుడైన  నీవు ,, నీ  భక్తునికి కష్టం కలుగకుండా , ఉండాలని  ,, , జగత్తు లో ఉన్న సమస్త వస్తుసముదాయం లో ఆవేశించా వు కదా  !!
""భక్త ప్రహ్లాదు డు
పరీక్ష లో నెగ్గడానికి ఎంత తిప్పలు పడ్డావు లక్ష్మీ నారసింహ    !!  ""
హిరణ్యకశిపుని కి ,,ఎదుట కనిపించే సమస్తం లో నీవు  కొలువై ఉండి పోయా వు ,
""ఎక్కడ ఉన్నాడు భగవంతుడు  ??""
అన్న ప్రశ్నకు ""
ఎక్కడ లేను??""
అని సమాధానం ,,నీవే చెప్పావు  కదా !!
""ఇందు గలడందు లేడను సందేహము వలదు,,,..!"
అన్నట్టుగా ,,
ఒక్కొక్క గోపికతో ఒక్కొక్క కృష్ణుడు గా,అవతరించా వు కదా , గోపీజన హృదయ విహార !!
ఇలా వేలాది మంది గోపికా స్త్రీలకు ,వేలాది కృష్ణుల రూపాల్లో మహా  రాసక్రీడ  లో   చేర్చి ,, వారికి మహదానందం కలిగించా వు,కదా కృష్ణా !!
నీ ప్రియ భక్తురాలు ఆ మీరాబాయి కి ,ప్రతీ తరువు లో ,కొలనులో , నింగిలో నీలి మేఘాల్లో ,, పూవు లో ,ఆకుల్లో , పశువుల లో పక్షులలో ,అంతటా ఆమెకు నీ నేల మేఘ  "ఘన శ్యామ సుందరు ని రూపంలో ఆమెకు   అంతటా " గోచ రించా వు కదా !" మీరా కే ప్రభూ,గిరిధర్ నాగర్ !!""
""చూడాలని అనిపించే మనసు!
,,,చూడకుండా  ఉండలేని , కళ్ళు , , కృష్ణ దర్శనం కోసం తపించే హృదయం ,,
  ,ఇవి ఉంటే  చాలు కదా ,,  కృష్ణా !నీ దివ్య మంగళ రూప లావణ్య వైభవాలను దర్శించడానికి!!"
మధురా నాథుని , మధురా నందాన్ని పొందడానికి  కావల్సిన దివ్యమైన  యోగ్యతా విశేషణాలు అవే. కదా !
""కృష్ణా !
నేను . నీ  దివ్య దర్శనం కోసం ,ఇదిగో  శరణాగత భావంతో,నీకు,అంజలి ఘటిస్తూ నిన్ను వేడుకుంటూ ఉన్నాను ,!
జగన్మోహనాకారా!! చరాచర జగన్నాథ !
, వినమృడనై నీ ముందు  నిలబడి,, నీ శతకోటి మన్మధ లావణ్య సుందర విగ్రహాన్ని ఎదురుగా కనులారా  తిలకిస్తూ ,  మనసారా ఆనందిస్తూ , తనివార నీ ప్రేమామృత సుధారసాన్ని  గ్రోలుతూ,  తన్మయత్వంతో నన్ను నేనే మరచిపోతున్నాను గదా, రాధా మనోహర , ,కన్నయ్యా! శతకోటి మన్మధాకారా !
నా బంగారు తండ్రి ,  నా చిన్నారి కృష్ణయ్యా ,!
""హే కృష్ణా !
నిన్ను స్తుతిస్తూ కీర్తించాలని ఉంది , స్వామీ,,!
, కానీ  ఆర్ద్రత తో , నా గొంతు పెగలడం లేదు !,మాటలు తడబడుతూ ఉన్నాయి !
,స్వరం గద్గద మౌతూ ఉంది !
కంఠం రుద్దమై, నాలుక కదలడం లేదు !
నాకు తెలీకుండానే ,,నా ఈ ,రెండు
కళ్ళ నుండి ఆనంద  భాష్పాలు   ధారలా ,,జలజలా రాలుతూ  ఆగకుండా కారిపోతూనే  ఉన్నాయి !
""శ్యామ సుందరా !,,ప్రేమ మందిరా !
ప్రతీ నిత్యం ఇలానే ,, నీ ముఖారవిందాన్ని చూస్తూ, నేను  పొందుతున్న  ఈ మధురానుభూతి లో  నీవు నన్ను  ఇలా పరవశింప జేస్తూ వుండాలి
""కృష్ణా !
""ఇంతకు మించి నిను కోరేది మరేమీ లేదు !"" నంద కిషో రా ! నవనీత చోర !,రాస విహార ,, శ్రీధర !!"
ఈ భావ సంపదతో నా శేష జీవితాన్ని పండించు ,
రాధా మనోహర ,!!
గోపీ జన హృదయ విహారా , ! నందనందనా!  ,అచ్యుత అనంత ,గోవిందా!!
,ముకుందా !భక్తజన పరిపాలా ,గోపాలా !పాహిమాం , జనార్దనా !  పాహిమాం , యశోదా కిషోరా!
,పాహిమాం ! రుక్మిణీ పతే!!
శరణు, శరణు ,శరణు!
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...