Tuesday, May 19, 2020

హనుమ రామభక్తి!

May 6, 2020
"ఇహము నీవయ ,పరము నీవ య!
నీవే నా పెన్నిధివి  ,,రామ య !""

""వరము కేవలమొకటి  వేడెద !
కరుణ నాకొసంగు రామయ !"
"నీదు చరణ సరోజ యుగలిని ,!""

""రామ చరిత" అనెడు సంత కు ,
నాదు జీవన యాత్ర సాగనీ !""

""నేను పలికెద నీదు నామము !
నేను వినియెద నీ ప్రతాప ము !""

""నిన్ను దలచుట లోనే అందము !
నన్ను దవులునే వేరు చందము ,!!?""

""నిన్ను కొలిచెదరు  అమర గణములు  ,!
నిన్ను దలతురు మౌని జనములు !"

""నీవే స్ఫూర్తివి నిఖిల జగతికి !
నిన్ను మించిన దైవ మెవ్వరు ?"

""ఎన్ని భాషలు ?ఎన్ని జాతులు ?
ఎన్ని జనపద నర్తనమ్ములు ?"

ఎత్తెద నీరాజనం రఘునకు !
ఎన్న వలయున సాక్ష్య మిందుకు  !!"

ముత్తే మంతటి ,రూపు నే గొని ,
త్రిభువన మ్ముల సంచరింతు ను !

నిను భజించే నరుని గాంచిన
మేరువంతగ పొంగి పోదు ను !!""

వేయి నేలల పరుగు లేత్తె,
వేయి చరితలు రఘుని లీలలు !
మేఘ మట్టుల పీల్చుకుని, నే
మేఘ మటు వర్షింతు నిలపై !!

నీ నవ్వులే ఈ సూర్య చంద్రులు !
నవ్యమౌ ఆ తారకావళీ !

కావ్యమై పలుమార్లు వెలసిన
రమ్యమౌ శ్రీ రామ చరితము !""
___&&&-__
జై శ్రీరామ్ ! జై జై శ్రీరామ్ !
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...