Wednesday, May 20, 2020

కృష్ణ భక్తుడు నార్సి మెహతా 2

May 20, 2020
ఆయన   ఆ ఐదేళ్ల బాలుడు నర్శి నీ, తన తొడపై కూర్చోబెట్టి ,అతడి చెవిలో "" రాధాకృష్ణ"" అంటూ మూడుసార్లు మంత్రోపదేశం చేశాడు ,!!
ఇంకేం !!"
, న ర్సి మెహతా " రాధాకృష్ణ"" అనడం  , పెద్దావిడ వింటూ ఉంది!
""నానమ్మ!
నానమ్మ! ,, నేను మాట్లాడుతూ ఉన్నాను !
నాకు మాటలు వస్తున్నాయి !"" అనగానే
ఆవిడ సంతోషంతో ,""రాధా కృష్ణ ,,రాధా కృష్ణ !"" అంది
నర్సికూడా  ఎగిరి గంతులు వేస్తూ ,
""నానమ్మ!!  నీవు అన్నది ,,నేను  వింటున్నాను !!.
నాకు వినడం కూడా వచ్చింది !""అంటూ , ఎగిరి గంతులు వేశాడు
రాధే  కృష్ణా రాధే  కృష్ణా !"" అంటూ ఆనందంతో సాధువు కు ప్రణామం చేస్తూ బిగ్గరగా పాడుతూ ఆడుతూ   ఉంటే,,
ఆమె కళ్ళల్లో అనందాష్రువులు వర్షించాయి !!
""బాబూ !,నీకు శివానుగ్రహం లభించింది !!,
చాలు ! ఇక నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను!!""
నా బాధ తీరింది ,నా బాధ్యత ముగిసింది ! అంటూ, తాను ,తనతో బాటు మనవడి తో కూడా కలిసి ,కృతజ్ఞతా పూర్వకంగా, సాధు పుంగవునీకి ప్రణామం చేసింది !!
ఆ సాధువు వేషంలో , ఉన్న వాడు, ఆ చిన్నారి కృష్ణా భక్తుని అనుగ్రహించా లని వచ్చిన  ,, భోళాశంకరుడు, ఈ కైలాస నాథుడు అని వారికి తెలియదు
ఆమె , ,కొన్ని రోజులకు. శివ సాయుజ్యం పొందింది ,!
కష్టాల పరంపర నర్శి నీ పరామర్శిస్తూ పోతోంది,,
ఒకరోజు వదిన ఆజ్ఞ ప్రకారం నర్శి అడవికి ఎండు  కట్టెలు  తేవడానికి వెళ్ళాడు ,
కట్టెల మోపు సిద్దం చేసేసరికి మధ్యాహ్నం అయ్యింది ,,
ఆకలి వేస్తోంది ,ఇంటికి వెళ్లేందుకు సిద్దమయ్యాడు !!
ఇంతలో దూరంగా కొందరు  తన కేసి వస్తూ కనిపించారు ,!!
వారు బృందావనం  దర్శనం చేస్తూ తిరిగి వస్తూ  ఉన్న యాత్రికులు
వారు అక్కడే కూర్చుం డి "",రాధాకృష్ణ ,,రాధే రాధే!"" అంటూ చేస్తున్న భజన నర్సి వింటూ  పరమానందం తో ,,అన్నీ మరచి , పోయాడు
రాధే రాధే అంటూ ఆ కృష్ణ భక్తులు అంతా కలిసి చేస్తున్న హరినామ భజనలో తాను కూడా గొంతు కలిపి , ఆనందంగా వారితో   కలిసి నాట్యం చేశాడు !!
ఆ విధంగా అతడికి కాలం ప్రాంతం , బాధ ఏవి తెలిసి రాలేదు
రాధే గోవిందా రాధే గోపాలా అంటూ  తనని తానే మరచి పోయాడు ,
ఆ యాత్రికులు  అక్కడినుండి ఎప్పుడు పోయారో ,ఎటు వెళ్లారో కూడా అతడికి ధ్యాస లేదు ఆ పిల్లాడు అలాగే  ఒంటరిగా కూర్చుం డి ,,శ్రీకృష్ణ గోవింద హరే మురారీ ,,
హే నాథ !నారాయణ్ వాసుదేవ !" అంటూ తన్మయత్వం తో  తాదాత్మ్యం  పొందుతూ భజన చేస్తూ ,, పొద్దు పోయేవరకు అలానే  ఉండి పోయాడు !!"
అంత ప్రభావం చూపింది ఆ నామ మంత్ర గానం అంత చిన్న వయసులో నే !!
సాయంత్రం అయ్యింది !
యాత్రికులు వెళ్లారు !
అప్పుడు ఆ బాలుడికి  "" వదిన కోపం ,ఇల్లు ,ఆకలి ""గుర్తు కొచ్చింది
పరుగున వెళ్ళాడు నర్శి !
,ఎదురుగా వదిన కాళికా దేవిలా ఉగ్ర రూపంలో నిలుచుంది ,!!
వెళ్లి కాళ్లపై పడ్డాడు !
జరిగింది చెప్పాడు !
"" వదినా ,నోరు ఎండిపోతోంది ,, వదినా!నీకు దండం పెడతాను ,దయచేసి  కొన్ని మంచి నీరు ఇవ్వు !"",అని అడిగాడు
ఆవిడ కోపంతో వెళ్లి  ,మురికి నీరు తెచ్చి నర్శి మీద కుమ్మరించింది !!"
""వెళ్లు , బయిటకు వెళ్లు !"
"ఇక నా ఇంటికి రావద్దు!" అంటూ కోపంతో ఇంటి బయటకు నెట్టేసింది ! ఏడుస్తూ ,
నర్శి  శివాలయం వైపు  వెళ్ళాడు ,!!
నార్శి  అలాగే శివలింగం ముందు కూర్చుం డీ పోయాడు , అలా 10 రోజులు దీక్షగా ఉంటూ ,, కనీసం నీరు కూడా ముట్టకుండా , తనను  కరునించమని  గౌరీ శంకరుల ను ఆర్తితో ,ఆవేదనతో  బాధ పడుతూ. దీనంగా  ప్రార్థించాడు
,,పార్వతి మాతా హృదయం కరిగిం ది,శివుని తో సహా ప్రత్యక్షం అయి,, 5 ఎండ్ల పిల్లాడు నార్శి నీ  ,తన ఒడిలోకి తీసుకుని ,,తానే స్వయంగా పుష్టికరమైన భోజనం తినిపించింది ,
పరమశివుడు  నార్శి భక్తికి సంతసించి ,
""నాయనా ! వరం  కోరుకో,,""మన్నాడు ,!,
నార్శీ  ఆది దంపతుల కు  సాష్టాంగ  ప్రణామం చేసి ,
""తండ్రీ ! నీకు ఏది ఇష్టమో ,,,దానిని  నాకు ప్రసాదించు !"" మని అన్నాడు
శివుడు అన్నాడు ,
నాకు చాలా  ఇష్టమైనది రాధాకృష్ణ నామం ,!"
వారిని  చూడనిదే నేను  ప్రశాంతంగా ఉండలేను !
రాసలీల  వైభవం లో ,శ్రీకృష్ణా భగవానుని లీలా వినోదాలు చూడటానికి నేను స్త్రీ వేషం లో వెళ్తూ ఉంటాను , సతీ సమేతంగా !,
ఎందుకంటే  ,అక్కడ పురుషోత్తముడు ఆ శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు!
,,మిగిలిన గోపికలు అందరూ స్త్రీలే ,!
కాబట్టి నేను కూడా ఒక గోపిక వేషం ధరించి ,సతీ పార్వతి మాత తో సహా ఆ రాసలీల  మధుర కేళి విలాస  వైభవం లో పాల్గొన్నా ను !
అద్భుతంగా వేలాది గోప స్త్రీలతో వైభవంగా అనందా ఉత్సాహాలతో నిర్వహించ బడుతున్న మహా రాసలీల  సం రం భం లో ,పరవశిస్తూ నాట్యం చేస్తున్న నా జటాజూటం,, ముడి విడి,, ఆడవేషం తొలగి,సాక్షాత్తూ జటాజూటం తో  శంకర రూపంలో ,,నేను బయట పడి పోయాను  అందరి ముందు !!
కృష్ణుడు నన్ను గుర్తు పట్టాడు ,!
గోపికలందరినీ  మాకు ప్రణామాలు సమర్పించు కొమ్మని ,చెప్పి ,
తన ముగ్ద మోహన సుకుమార సుందర సురుచిర రూప లావణ్యాన్ని ,, రాధా రాణి తో కలిసి తమ దివ్య  దర్శన  భాగ్యాన్ని మాకు  అనుగ్రహించాడు ,శ్రీకృష్ణ పరంధాముడు ,,!
ఆ విధంగా నాకు ప్రియాతిప్రియమైన నామము  రాధే రాధే కృష్ణా కృష్ణా,కలిపి  రాధా కృష్ణా నామము నాకు ప్రాణ ప్రదంగా అయ్యింది ,
ఇపుడు ,నీకు నాకు అత్యంత ప్రీతపాత్రమైనది,, ఆ
రాధాకృష్ణ అనే నామాన్ని నీకు ప్రసాదిస్తూ ఉన్నాను !;
దీనితో నీవు రాధాకృష్ణుల అపార కృపను,వారి దర్శన భాగ్యాన్ని కనులారా చూసే అదృష్టాన్ని కూడా నీవు  అందుకుంటావు !!
వారిని దర్శిస్తూ , నీ జన్మను సార్ధకం చేసుకుంటావా , ?
అంటూ పరమశివుడు అంటూ ఉంటే  తన భాగ్యానికి ,శివ భగవానుని కరుణ కు ,,రాధాకృష్ణుల రాసలీల ను చూడగల ను   అన్న  తలంపు తో అమితానందం పొందాడు నార్సీ మెహతా !!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...