Thursday, May 21, 2020

కృష్ణ భక్తుడు నార్సీ మెహతా3

May 21, 2020
""పరమేశ్వరుని కృప'"" వలన
నర్సి మెహతా  తన బాల్య దశలో నే శ్రీకృష్ణ పరందాముని అనుగ్రహాన్ని పొందగలిగాడు !
మంచి అయినా చెడు అయినా పిల్లలు చిన్నతనం లోనే నేర్చుకో వాల్సి ఉంటుంది !ధారణ  పటిమ  ,,అద్భుతమైన
,జ్ఞాపక శక్తి   ,,ఏకాగ్రత ,పట్టుదల  నమ్మకం ,,,ఆత్మ నిబ్బరం బాల్యంలో అధికంగా ఉంటుంది
ఈ సున్నితమైన దశలో నేర్చుకున్నది ,వారికి జీవితాంతం తోడుగా ఉంటుంది ,!
పదేళ్లు దాటాక అంత నిగ్రహం ఉండదు పిల్లలకు,,
ఏది  వచ్చినా  తన  బాల్యం లోనే తొందరగా నేర్చుకుంటారు !
ధృవుడు ప్రహ్లాదు డు,,మార్కండేయుడు ,లాంటి అపార భక్త శిఖమణి పుంగవులు బాల్యంలో నే భగవంతుని కృపను సాధించారు కదా !
భక్తి బీజాలు, రాధా కృష్ణ అనబడే  అమృత భరిత భరితమైన    సారవంతమైన అతడి హృదయ  సుక్షెత్రం లో  పడ్డాయి",ఈశ్వరుని కృప"" అనే వర్ష థారతో  ,అది చివురులతో   మొలకెత్తి సుగంధ వాసనతో  కృష్ణభక్తి పరిమళాలను   వెదజల్లుతూ అతడు  హరి కృపకు పాత్రుడైనాడు !!
అన్నట్టుగానే మహారాస క్రీడ అనే  రాధా కృష్ణుల సహిత గోపికా స్త్రీల   పరందామ సౌఖ్యం తో,, శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య శృంగార రాస రస రమ్య సామ్రాజ్య వైభవాన్ని అతడు దర్శించ గలిగాడు !!
కానీ పాంచ భౌతికమైన ఈ మాంస దేహంతో  మాత్రం వీలు కాదు !!
ఆత్మస్వరూపా లతో,, ఈశ్వరుని సహచర్యం తో రాసలీల ప్రాంగణంలో ప్రవేశించాడు   మెహతా !
నిజానికి రాధా రాణి అనుమతి లేనిదే ఎంతటి వారైనా ,, ఆ మహా భాగ్యానికి నోచు కోరు ,!
కానీ , నా ర్శి హృదయంలో నిండి ఉన్న తన కృష్ణ భక్తిని ఆమె గ్రహించింది ,!
పరమేశుని వంటి మహా పురుషులకు కూడా అర్హత లేని , ఆ ఆనంద నిలయంలో ,_ నియమాన్ని పాటిస్తూ ,,ఈశ్వరుడు ,, నార్సీ మెహతా , ఇరువురూ, స్త్రీల వేషాల్లో నే  రాధాకృష్ణుల సన్నిధానం లో  ఎంతో ఉత్సాహంగా , ఉబలాటం తో,,హుషారుగా  ప్రవేశించారు ,,,!!
వారు అక్కడ చేరగానే , వేషాల్లో మాత్రమే కాదు ,,ఆకారాల్లో కూడా వారు  నిజమైన "స్త్రీలే"" అయ్యారు !
ఆరాధనా పటిమ స్త్రీలకు సాధ్యమైనంత త్వరగా ,పురుషులకు వీలు  కాదు
స్త్రీలు  తమ వివాహం అయ్యాక ,తన మెడలో మంగళ సూత్రాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు!
సృష్టిలో దానికి మించిన ఐశ్వర్యము ,,తనకు లేదని అనుకుంటారు !
భర్తను మాత్రమే అపర దైవంగా  భావిస్తూ జీవితాంతం అతడితో నే కష్టసుఖాలు పంచుకుంటారు !,,
ఆమె జీవితం తన భర్త కోసం మాత్రమే అంకితం ,!! ఎన్ని క్లిష్ట  సమస్యలు వచ్చినా, అవమానాలు , ఈతి బాధలు ఎదురైనా అతడే గతి ,!
అతడి యోగక్షేమాలు తన జీవిత ధ్యేయంగా  తమ జీవన శైలి ని మార్చుకుంటారు ,! తిరుగులేని ఆమె సంకల్పంతో , ,ఆమె శీలాన్ని మానసికంగా దైహికంగా. తన  భర్తకు  సమర్పించు కుంటారు !
అతడే తన ప్రాణం , !
ఆతడే తన సర్వస్వం ,!
తన పిల్లలు , భర్తా,. ఆమెకు  ప్రథమ శ్రేణిలో  నిలుస్తూ  ఉంటారు !;
సంతానం ,తలిదండ్రులు , అత్తా మామలు ,సోదరులు బంధువులు అంతా,,ఆమెకు  ద్వితీయ శ్రేణిలో ఉంటారు  ,!!
అంత గొప్ప ఆత్మ బలం ,మొక్కవోని  మనో నిబ్బరం ,అంకిత భావం స్త్రీలకు మాత్రమే సాధ్యం!!"
ఆమెకు ఏ పూజలూ అవసరం లేదు ,భక్తితో నిత్యం ఆమె చేస్తున్న సకల దేవతల  పూజల ఫలితం  తన భర్త తన సంతానం ,తన కుటుంబం బాగుండాలని ఆకాంక్ష తో చేసే దే ,!!""
పురుషులకు అంత నిగ్రహ శక్తి ఉండదు ,!
మనో బలం తక్కువ ,! ఇంద్రియాల పై నియంత్రణ ,స్త్రీలకు ఉన్నంతగా ఉండదు ,!
వారి మనస్సు  స్త్రీలతో పోలిస్తే , చంచలంగా ఉంటుంది ,!
తమ  మనసుపై సరియైన నియంత్రణ లేక కోపము భయంతో   ,నిగ్రహాన్ని  కోల్పోతూ, న్యూనతా భావానికి లో నౌ తూ ఉంటారు !
తుమ్మెద ఒక పూవు నుండి మరొక పూవు పై వాలుతూ పోతూ ఉన్నట్టుగా మగవాడి మనస్సు ఒక చోట స్థిరంగా ఉండదు ,
అందుకే   సకల స్మృతి శృతి పురాణాలు  ఇతిహాసాలు కేవలం పురుషులకు ఉద్దేశించే మాత్రమే చెప్పబడ్డాయి
సహజంగా స్థిరమైన దృఢమైన చిత్తశుద్ది కల స్త్రీలకు   మనసు నిలకడ గురించి వారికి కొత్తగా   , చెప్పే అవశ్యకత లేదు ,
, ఆత్మ స్థైర్యం ,పట్టుదల ,ఏకాగ్రత, ఎటువంటి పరిస్థితులలో కూడా మొక్కవోని ఆమె దైర్యం  ఆమెకు రక్షణ కవచంలా రక్షిస్తూ వస్తుంది!"
"" ఎంతటి త్యాగానికి  అయినా సరే  సిద్దపడుతూ ,తన భర్త , తన కుటుంబం కోసం , అంకిత భావంతో  జీవితాంతం ,అలసట విశ్రాంతి లేకుండా ,తాను  శ్రమిస్తూ   కూడా  కుటుంబాన్ని,, ప్రేమానురాగాలతో  సంతోషంగా ఉండాలని ముక్కోటి దేవతలకు మొక్కుతూ ఉంటుంది    ,,,   "__భర్తను కోల్పోయిన స్త్రీలు ,తన భర్త  తనకు భౌతికంగా దూరం అయినా అదే  రూపాన్ని తన ఆయుధంగా తన బలంగా విశ్వసిస్తూ ,తన పిల్లలను ఉజ్వల భవిష్యత్తు కోసం శ్రమిస్తూ ఉంటారు ,,
స్త్రీల లో సహజ సిద్దంగా  ఉన్న  అద్భుత అసాధారణ శక్తి ,యుక్తులు _పురుషుల విషయంలో  సమకూరడం వీలు కాదు !;
భార్యా రహిత భర్తలు ,  జీవచ్చవాలుగా మిగులుతూ  అర్థరహితమైన బ్రతుకును అతి దీనంగా గడుపుతూ సమాజానికి బరువుగా భావిస్తూ , అలా బ్రతకడం కంటే  "మరణమే శరణం"" అన్నవారు కూడా లేక పోలేదు ,!!
స్త్రీలు ,సహజ సిద్ధ మైన  తన ""ఆత్మ సమర్పణ భావం ""తో ,అనునిత్యం పూజా విధానం కొనసాగించి నట్టుగా ,  ఆత్మానుబందం తో ,అమ్మదనం తో ,కమ్మ దనం తో  స్త్రీలు దైవారాధన   చేస్తూ చక్కనైన చిత్తశుద్ది తో విధి విధానం  తో , దైవపూజ నిర్వహించి నట్టుగా__ పురుషులు చేయలేరు ,!!
కర్మ కాండలు అన్నీ పురుషులకే ,!
స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవం !
స్త్రీ సహకరించ కుండా సృష్టిలో  ప్రగతి లేదు ,!భవిత ఉండదు !! జీవితంలో ఆనందం ఉండదు
ఆడపిల్ల  చేతికి గాజులు  కాళ్ళకు గజ్జెలు ,నుదుట కుంకుమ ,పరికిణీ ఓణీ లంగా జాకెట్టు తో కళకళ లాడు తూ . మహాలక్ష్మి వైభవం తో ,తిరిగే ఇల్లు నిజంగా అనందనిలయం!
వైకుంఠ వాసం !
,ఇంటిలో
స్త్రీ లేకుండా ,,పురుషునికి మనుగడ లేదు ,!
ఆమె  తన ప్రక్కన లేకుండా పురుషునికి , ఏ యాగము పూజ ,క్రతువు ,నోము లకు కూడా  అనర్హుడు !
స్త్రీ లేకుండా జగత్తు లేదు !
,సృష్టి జరుగదు !!
స్త్రీ ఒక  మహా శక్తి ,!
పురుషుడు  చైతన్యం !
శక్తి లేకుండా చైతన్యం ఉండదు! కదా !!
రాధాదేవి లేకుండా కృష్ణుడు  కూడా  ప్రాణం లేని  శిలా విగ్రహం లా , ఉండలే డు!
గౌరీ దేవి యొక్క శక్తిని గ్రహించి పరమేశ్వరుడు చైతన్యాన్ని పొందుతూ ఉన్నాడు!
అందుకే ముందు రాధ
తదుపరి కృష్ణయ్య !!
అలా లక్ష్మీ నారాయణుడు
గౌరీ శంకరుడు  !!
వాణీ బ్రహ్మ!!
అలా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి,,ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి !!""
""ఏ ఇంటిలో ఇల్లాలు సుఖ సంతోషాలతో  ఉంటూ,,  ఎన్నడూ,తాను  కంట నీరు పెట్టకుండా , బాధ పడకుండా  ఉంటే, ఆ ఇల్లు భూలోక స్వర్గం !
అలాంటి దేవతా మూర్తి ,,స్త్రీని కష్ఠపెట్టే మగాడు "మనిషి" అనిపించు కోడు  కదా !
__ అందుకే  , రాస క్రీడ అనే రసరమ్య రంగ స్థలంలో,, మాతృ మూర్తి ,, ప్రథమ గురువు ,ప్రత్యక్ష దైవం అయిన  స్త్రీల కు,, పెద్ద పీట వేశాడు కృష్ణ పరమాత్మ !
( ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...