Apr 21, 2020
పల్లవి !
____&___
"___ధైర్యంగా నే నిలబడితే ,
అనుకున్నది సాధిస్తా ము !,,
__భయపడుతూ చూస్తుంటే ,,
వెనకబడి పోతాము ,!
చరణం ,1__
కరోనా ను వదిలితే
కాటు వేస్తూ పోతుంటుంది !,
కటినంగా వ్యవహరిస్తే ,
కరోనా ఖత మౌతుంది !!
ఎక్కడి వారక్కడ ఉంటే,,
మనిషి మనిషి తాకక ఉంటే ,,
కరోనా ను కట్టడి చేస్తే ,,
వ్యాధి అంతరిస్తుం ది ,!
మృత్యుభయం తగ్గుతుంది!
ఎటువంటి పరిస్తితి కైన ,
పరిష్కార ముంటుంది !!
కలిసి చేసే ప్రతి పని తోనూ
విజయం కలిగి తీరుతుంది !!
ఆ దైర్యాన్ని కూడగట్టుకొని,
అపజయాల నదిగమించాలి ,,
కష్టాలు వచ్చినప్పుడే ,
మనిషి కి ,సంకల్ప బలం ఉందనీ,,
అతడి అత్మబలానికి దైవం అయినా తోడు ఉంటాడని,
చరిత్ర చెప్పిన సత్యమిది !
తలచుకుంటే సాద్య మిది !
!!దైర్యంగా!!
చరణం ,2_
చీకటిని తరిమేస్తె నే , వెలుతురం త వస్తుంది ,,!
ఆశా జ్యోతీ వెలిగిస్తే నే ప్రగతి బాట కనిపిస్తుంది !
జనమంతా ఒక్కట య్యి,,
మానవత్వ విలువలు చూపి ,
ఆపదలో ఐక్యత పెంచి,
కరోనాను ఒంటరి చేసి ,,
,, సంఘటిం చి పోరాడాలి !
వ్యాధి వ్యాప్తి నరి కట్టాలి !
కాల జ్ఞాన మున్న వారి వలె ,
కాలు మడిచి కూర్చో వద్దు !
కాల మాప లేవు మిత్రమా ! వరదల వలె బాధలు కూడా ,
తరుముకుంటూ వస్తుంటాయి ,
దైర్యాన్నీ కూడగట్టుకొని ,
గట్టు చేరి తీరాలి ,
ఆత్మ విశ్వాసాన్ని పెంచాలి !
చరణం 3_
________
టెక్నాలజీ పెరిగిన చోటే ,
జనం చేతు లేత్తే శారని,,
దిగులు పడి ,ఆశ కొరవడి ,
బ్రతుకు పోరు మాన కూడదు !
సంకల్ప బలమును మించిన ,
ఆయుధము లేదని అంటూ,
పట్టుదలతో వేసే అడుగుకు
జయము తథ్యమని సాగాలి ,
ఉత్సాహమే నీ ఊపిరిని
పారుల సేవ కొరకే నీవని
నీ ,ప్రయత్నము చేయి మిత్రమా !
భయపడే ఈ బ్రతుకు నిత్యమా !
సంతోషమే నీ సగం బలమని ,
,అంధకారం కొన్నాల్లే అని,
సాధనతో సాగు నేస్తమా !
గమ్యం దూరం లేదు మిత్రమా !"
Tuesday, May 19, 2020
ధైర్యంగా నే నిలబడితే
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
ఆమె చాలా భాగ్య వంతురాలు -గొప్ప కుటుంబలో పుట్టి - గొప్ప కుటుంబంలో మెట్టి -గొప్ప వ్యక్తిత్వాన్ని - సంస్కారాన్ని సంపాదించుకుంది -!పదకొండు ...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
June 18, 2022 ""ఎక్కడని నిను వెద కేది పరమాత్మా _!?? ___&&&&&&____&&& "" నిను ఎంతగ ...
No comments:
Post a Comment