Apr 30, 2020
"నేను ఎవరూ ?అంటే ,
నేను మనస్సును ,!"
ఈ "మనస్సు " అనేది __ ఆత్మ స్వరూపము నందు గల ఒక మహా అతిశయ శక్తి !
ఈ "మనస్సు "" అనేకమైన తలంపు లకు నిలయము !
ఈ ""మనస్సే "నిరంతరం __ఆలోచనల పరంపర లను కలుగజేస్తు ఉంటుంది !""
తలంపులు లేకపోతే , ఆలోచించకుండా ఉండే ,"మనస్సు ""అనేది లేనే లేదు !
""కనుక తలంపే మనస్సు !"
""మనస్సు ""అనబడే ఒక ప్రత్యేక వస్తువు ఎక్కడా లేదు !
""నీ తలం పే , నీ మనస్సు యొక్క స్వరూపము !""
ఈ తలంపులు వదలి ""జగత్తు" అనే వేరే వస్తువు లేదు !
ఉండబోదు కూడా!
""జాగ్రత అవస్ట ,""లో మేలుకొని ఉండగా" ఆలోచనలు ఉంటాయి __" ,స్వప్నము అవస్త "" నిద్ర పోయె సమయంలో కనే ""కలల రూపం"" లో కూడా ఈ తలంపులు ఉంటాయి !
సమాధి స్థితిలో, ధ్యానం లో ,మనస్సు ,ఆత్మలో సమాధి , అవుతూ ఉంటుంది !
ఇలాంటి విశిష్ట దశలో మనసు ,తన స్వరూపాన్ని కోల్పోతూ ,ఆత్మలో లయమై పోతుంది !;
"తలంపులు ""ఉంటే జగత్తు కూడా ఉంటుంది !
తలచ కుండా ఉంటే , మనసూ ఉండదు , జగతీ ఉండదు !
ఒక సా లె పురుగు ,, తనలో నుండి నూలు పోగులను అవసరం ఉన్నపుడు బయటకు తీస్తూ, ,
తిరిగి అవసరం తీరగానే తనలోని కి తీసుకొంటూ ఉంటుందో ,,
, అదే విధంగా ,,ఈ ""మనస్సు"" కూడా తనలో నుండి జగత్తు ను బయట కనిపింప జేస్తూ,
మరల తనలోనే మరుగు పరుచు కొంటూ ఉంటుంది !
___మనస్సు ,, ఆత్మ స్వరూపం నుండి ,బహిర్ముఖ మైనపుడు ,అనగా ,బయటకు వెళ్ళే సమయంలో జగత్తు కనిపిస్తూ ఉంటుంది !!
ఈ సమయంలో ,జగత్తు ను దర్శిస్తూ ఉన్నపుడు ,మనస్సు స్వరూపము కనిపించ దు !!
ఇక అంతర్ముఖం అవుతున్నప్పుడు అనగా ,తలంపులు ఆత్మ విచారణ వైపు లోనికి మళ్లించి నపుడు ,
ఆత్మ స్వరూపము దర్శిస్తే ,జగత్తు కనిపించదు !!
ఆలోచించే మనసు ఉండదు !
ఇది ఉంటే అది ఉండదు !
అది ఉంటే ఇది ఉండదు !
ఎక్కడ ఉంటుంది మనస్సు,?,
దాని స్వరూపం ఎలా ఉంటుంది ?
అంటూ విచారిస్తూ పోతూ ఉంటే ,
" తాను "అంటే "నేను" అనేది అదే మనస్సు లో లీనమై పోతుంది !
"నేను ",లేదా" తాను" "అనేది ,,,ఆత్మ యొక్క స్వరూపాలే !
ఈ మనస్సు , ఎప్పుడూ కూడా ఒంటరిగా , స్వతంత్రంగా ఉండలేదు !
,___ఎప్పుడూ ఏదో ఒక స్థూల వస్తువు ను ఆశ్రయిం చుకొని ఉంటుంది !!
ఈ మనస్సు ",సూక్ష్మ శరీరం" అనీ , "జీవుడు ""అన్న పేరుతో పిలువ బడుతూ ఉంది !
ఈ శరీరంలో "నేను " అని అనిపించే ది , ఏదో ,దానినే ""మనస్సు ""అంటారు ,
ఇక ఈ" జీవుడు "తన కర్మలను అనుసరించి ఎన్నో జన్మలు ,ఎన్నో రకాల యోనుల యందు జన్మిస్తూ ,"పునరపి జననం,, పునరపి మరణం!"" పునరపి జననీ జఠ రే శయనం !""_
యాత్ర కొనసాగిస్తూ ఉంటాడు !"___
ఇలా,
జనన మరణ చక్రంలో,, దారి తెన్నూ తెలియకుండా,
,బయట పడే మార్గం కానరాక,, తిరుగాడుతూ ఉంటున్నాడు , ఈ జీవుడు !!
" భక్త తుకారాం" లాంటి ,జ్ఞానులు
, "నీ వెవరవు ?""
అని ఎవరైనా అడిగితే , తుకారాం ఇలా అంటాడు ,,
""నేను జన్మ జన్మాంతర ము , సు దీర్ఘ ప్రయాణం చేస్తూ ఉంటున్న ,, అలుపెరుగని ఒక బాటసారి ని ,!
నా ధ్యేయం , భగవంతుని సన్నిధిలో చేరడం !" !""
__ ఈ జన్మలో ఈ శరీరం , "తుకారాం "అన్న పేరుతో పిలువబడుతూ ఉంది !""
అంటూ జవాబు ఇస్తాడు ,,
,ఇక , జీవన్ముక్తి ని పొందిన ,సంకీర్తనా చార్యుడు ,శ్రీ వేంకటేశ్వర పరమ భక్తా శిఖామణి ,తాళ్ళపాక అన్నమయ్య ,తన సంకీర్తనా వైభవం తో
ఈ జీవుని అడ్రస్ , లొకేషన్ , సంబంధాలు ఎంతో చక్కగా , ఇలా , వివరించా డు !
""ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు ? "
""ఎవ్వరికీ ఏమౌనో ఈ జీవుడు ??"
అంటూ ,,
ఎన్ని శరీరాలు ఇలా మోస్తూ ఉన్నా ,
కూడా
జీవుడికి ,మరణం ,జననం లాంటివి ఉండవు !
పాత బట్టలు తొలగిస్తూ ,కొత్త బట్టలు ధరిస్తు, , మరో జన్మ , మరో తలిదండ్రులు ,మరో బంధనాలు , ఇలా మారుస్తూ ,, వెళ్తూ ఉంటాడు !
ఆది ,అంతు లేని ప్రయాణం !
,గమ్యం తెలియని జీవనం !
ఈ జీవుడి "అనంత మైన యాత్ర " I"
ఈ జీవాత్మ , ఆ పరమాత్మ తో అనుసంధానం చెందేవరకూ,! ,, ఈ జీవన యాత్ర అలా అలా సాగుతూ పోవాల్సిందే !"",
""ఎంత కాలమో కదా ఈ దేహ ధారణ ము?""
, హే ప్రభో,,వేంకటేశ్వరా !
ఎందుకయ్యా ?
మాతో ఇన్ని ఆటలు ఆడిస్తావ్ ?""
,, నీ జగన్నాటక చదరంగం లో ,,__ఇలా మమ్మల్ని పావులుగా మార్చి , ,ఆనందంగా ఆడుకుంటూ ,లీలగా వినో దిస్తూ,, మాలో అంతర్యామి గా ఉంటూ ,మాతో కర్మలు చేయిస్తూ , అవి పూర్తి అయ్యేవరకు కనిపెడుతూ ,,పావులను కదిలిస్తూ , ఎక్కడో, ఎప్పుడో, అయిపోయింది !అంటూ ,, చివరకు తెర దించేస్తు, ఉంటావు !
మళ్లీ ఆట మొదలు పెడుతూ ఉంటావు , ఇదంతా ఏమిటి స్వామీ !??
అంతులేని ఈ కథ ,కు అంతు పలకవా ,దేవా !??
""స్వామీ !ఇక మా వల్ల కాదు !
,, అలసిపో తూ ఉన్నాం ! దయచేసి ఈ జీవన చక్ర పరిభ్రమణ వలయంలో నుండి విముక్తిని ప్రసాదించు !
హే దీన శరణ్య !" ఆర్త జన బం దో , ,!!,కారుణ్య సింధో ,!
నీ పాద కమలాల ముందు శరణాగతి చేస్తున్న ఈ దీనుల ను కరుణించు తండ్రీ!"
""నీవే తప్ప మాకు వేరే దిక్కు లేదు!""
మరో ",దారి లేదు !"
వేరే గతి లేదు !
నీ నామ రూప ధ్యానమే శరణ్యము !"
నారాయణా !
పరమాత్మా ,పరంధామా , పరా త్పరా , పరమేశ్వరా ,
పాహి పాహి పాహి !""
(ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !""
Tuesday, May 19, 2020
నేనె వడ ను ? 4
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment