May 1, 2020
మహా భారత సంగ్రామం ప్రారంభం లోనే ,,శ్రీకృష్ణ భగవానుడు ,తన ప్రియ శిష్యుడు అర్జునుడికి విశ్వరూప దర్శనం అనుగ్రహిస్తాడు !!
""తానెవరో ,?ఎందుకు ఈ కృష్ణావతారం ధరించాడో, ?
,మనిషి జనన మరణ రహస్యాలు ఏమిటో ? , మానవుడు గా ,చేయాల్సిన కర్తవ్యం విధానాలు ఏమిటో ?
,, భక్తి కర్మ జ్ఞాన యోగాలు , అంటే ఏమిటో ?? బోధించాడు పరమాత్మ !! సర్వాంతర్యామి తత్వాన్ని , సృష్టి రహస్యాలు ,,,మోక్ష సాధనా ప్రక్రియలు ,,ఇలా చాలా చాలా వివరించాడు పరాందాముడు
సాక్షాత్తూ భగవానుడు తన నోటి ద్వారా మానవ కల్యాణం కోసం వినిపించిన అనేక అంశాలను "గీతా వాక్యాలుగా , భగవద్గీత గా ," కీర్తింపబడుతు మన బ్రతుకులకు మార్గదర్శనం చేస్తోంది !!
భగవంతుడు ఎవ్వరూ ??
,ఎక్కడ ఉంటాడు ,??
ఏం చేస్తూ ఉంటాడు ??
,ఎప్పు డు వస్తాడు?"
,ఎలా కనబడతాడు ??
ఎందుకు భగవద్గీత చదవాలి ?
,ఇలాంటి అనేక ప్రశ్నల కే కాకుండా ,,,
మనిషి జీవితంలో ఎదురయ్యే ఏ సమస్య కైన సమాధానం సవివరంగా చెప్పేది ఒకే ఒక సద్గ్రందం మన ""భగవద్గీత ! ""
జననం నుండి మరణం వరకూ ఎదురయ్యే సమస్త సమస్యలన్నీ ""నేను ""అనే అహంభావం తోనే పుడుతున్నాయి !
""నేను ,నాది , నా ఇల్లు ,నా వారు !",,,అనే భావన లేకపోతే బ్రతకడం దుర్లభం !!
నిజమే !!,కానీ ,
ఏది లేకపోతే ఈ జీవితం లేదో, ఆనందం లేదో,, అలాంటి సౌకర్యాలు పరాత్పరుని దయ వల్ల మనిషికి కోరకుండానే లభిస్తూ ఉన్నాయి కదా !! అవన్నీ తన ప్రసాదంగా అనుభవిస్తూ ఆనందంగా ఉండమని ,,కూడా అన్నాడు !!కదా !;
ఇంత జ్ఞానం మనకు ఇచ్చినందుకు మనం "",తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం"" తప్పు కాదా ??"
ఈ మానవ జీవితంతో బాటు ,సకల సంపదలను బంధు బలగాన్ని కుటుంబాన్ని ప్రసాదించిన పరమాత్ము డి పట్ల కృతజ్ఞతా భావం చూపకుండా అఙ్ఞానంగా ,మూర్ఖంగా బ్రతికితే ,మనకి పశువులకు ,, మద్య ఏమైనా తేడా ఉంటుందా !??""
ఉండదు కదా !!""
__అయితే భగవంతుడు ఎక్కడ ఉన్నాడని ప్రతి రోజూ దండం పెడుతూ పూజలు చేయాలి ??""
__ ఈ రకంగా ,, భగవంతుని గురించిన ధ్యాస ,నీకు కలిగింది ""__అంటే అది భగవంతుని కృపయే కదా !""
అంతటా ఉన్న దైవాన్ని దర్శించడం చాలా కష్టం ,!!
,""అంతర్ముఖ సమారాధ్యా ,,బహీర్ముఖ సుదుర్లభా !"" అని లలితా సహస్ర నామాలలో ,జగదంబ ను స్తుతించిన విధంగా ,, !దైవాన్ని ఆత్మ విచారణ తో ఏకాగ్ర చిత్తం తో ,నిశ్చల భక్తితో హృదయంలో సుస్థిరం చేసుకొనవచ్చు ను
కానీ బాహ్య ప్రపంచంలో భగవంతుని దొరికించుకోడం కష్ట సాధ్యం !!
____ నీలోనే ఉంటూ ,నీతోనే ఆనందిస్తూ , జననం నుండి మరణం వరకూ నీకు తోడుగా ఉంటున్నా పరమాత్మను గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉండాలి !!"
అంటే ముందు ""నీవు నిన్ను ""తెలుసుకోవాలి!!
___"నేను ""అనే తలంపు హృదయం నుండి మాత్రమే పుడుతూ ఉంటుంది,!;, మనసున పుట్టే అన్నీ ఆలోచనల కంటే ముందే "నేను " అనే తలంపు పుడుతుంది !!,
ఇది మొదట లేచిన తర్వాతనే మిగతా అనేక తలంపులు పుడుతూ ఉంటాయి !!
"నేను " అనేది ఉత్తమ పురుషము !!
తర్వాత వచ్చే ,""నీవు ,, వాడు,, ఇవి మధ్యమ పురుషములు !!,
""నేనె వడ ను "!?అనే ఆత్మవిచారణ తోనే మనసు నియంత్రణ జరుగుతుంది ,
శవమును కాల్చే కట్టె , శవం తో బాటు అది కూడా కాలిపో తూ న్న
విధంగా ,,
"", నేనెవరిని ?""అనే విచారణ తో మిగతా తలంపులు అన్నీ నశిస్తాయి !!
ఒకవేళ ,ఇతర తలంపులు కలిగినా కూడా "",
""ఈ ఆలోచనలు ఎవరి కి కలిగాయి ?""
అనుకుంటే అవి ",,నాకే " అనిపిస్తూ ఉంటుంది !
మరి ""నే నెవడను ?" ""
అనుకుంటే , పుట్టిన ఆలోచన పూర్తిగా అణగి పోతుంది ,!
__ ""ఎందుకంటే ,,దీనికి సమాధానం అంత సులువుగా దొరికేది కాదు కదా !""
అలాగే ,,ఆత్మలో విచారిస్తూ పోతూ ఉంటే , కొన్నాళ్లకు మనసుకు నిలకడ చెందే శక్తి ""అధికం" అవుతుంది ,!
__ ఈ అతి సూక్ష్మ మైన మనసు ,స్థూలమైన ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళినప్పుడు ,ప్రపంచం లో ని అనేక వస్తువుల నామ రూపాలు భావిస్తూ అవి నేనే అనుకుంటూ ఉంటుంది ,!
ఇదే మనసు , బాహ్యంగా ఆలోచించకుండా , అంతర్ముఖం చేస్తూ ,నిశ్చలంగా ఉంటే ,, బాహ్యంలో ఇందాకా చూసిన వస్తువుల నామ రూపాలు పూర్తిగా మరుగున పడిపోతాయి ,!;
""నేను ""అనే స్వరూపము కొంచెమైనా లేకుండా ఉండే మనసు యొక్క ఈ స్థితిని ""మౌనం ""అంటారు !;
ఈ విధంగా ""మనసును ఆత్మ స్వరూపం తో లయింప జేయడం "" అనే మనో స్థితిని "" ,జ్ఞాన దృష్టి"" అంటారు !;
దీనినే "ఊరక"" ఉండుట"" కూడా అనవచ్చును !;
,అంటే మనసు ఏ ఆలోచన చేయకుండా ఉండుట అని అర్థం !""
ఇదే సమాధి స్తితి ,!;
చంచల స్వభావం గల మనసు అనే . "కోతిని "" "",నేనేవ డను ?"" అనే ఆత్మ విచారణ గొలుసుతో కదలకుండా స్థిరంగా ఒక కర్రకు కట్టివేయడం ,అనేది ,ఎంతో సాధనా బలం తో ,ఏళ్ల అనుభవంతో ,చక్కని సద్గురు ఆశ్రయం తో మాత్రమే వీలపుతుంది కదా !
((ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !""
Tuesday, May 19, 2020
నేనె వడ ను ? 5
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment