May 2, 2020
నేటి కరోనా మహమ్మారి వలన రెండూ లక్షల పైగా పౌరులు తమ ప్రాణాలు కోల్పోయారు ,ప్రపంచంలో మనం చూస్తుండగానే !!,
ఈ రోజు ఎవరినో ఎక్కడో దయదాలుస్తున్న మృత్యువు ,,,రేపు మనలను కూడా ఏదో ఒక రూపంలో కరునించ వచ్చును ,!
ఇలా ఇంత ఘోరం అవుతుందని ఊహించామా ??
""భగవద్గీత "లో భగవానుడు పేర్కొన్న ప్రతీ వాక్యము ప్రత్యక్షముగా ,,ఇపుడు మన కళ్ళ ఎదుట పరమ సత్యము గ కనిపిస్తూ ఉంది !""కదా ,,
___నిర్దోషులు ,అమాయకుల
చావుకు కారకులు ఎవరు ?
__వారి పాప కర్మలా?
__కరోనా వైరస్ దా ?
__కరోనా సృష్టి కర్త చైనా దా ?
__,ముంచుకొస్తున్న విపత్తును అంచనా వేయలే ని దేశ ప్రభుత్వాల దా ?
___నియంత్రణ చేయలేని అధికారుల దా ?
__అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రజలదా ?
___కావాలని వ్యాధిని అంటగ ట్టే ప్రయత్నం చేస్తున్న తీవ్రవాద సంస్థల దా ?
__విపరీతంగా పెరిగిన జంతు బలి వల్లనా !?
___మాంస భక్షకుల జాతి కి ,తినడానికి సరిపోని జంతువు లు లేకుండా పోవడం వల్లనా ?
____అమానుషంగా బ్రతికి వుండగానే తమను పీక్కు తింటున్న నరరూప రాక్షసుల పై , ,జంతువులు పక్షులు ,నోరులేని ప్రాణులన్నీ కక్ష గట్టి ,వారిపై తీసుకుంటున్న ప్రతికార ఫలిత మా ఈ నరమేధం ?"
___దైవానుగ్రహం తగ్గడం వల్లనా ?
__ప్రకృతిమాత, భూమాత , పంచభూతా లు పడుతున్న ఆత్మక్షోభ యా ఈ విపరీతం ??"
___మనిషి చేస్తున్న అనైతిక, అధార్మిక అకృత్యా ల ఫలిత మా ?
__దరణిపై ,వాతావరణములో సంతులనం కోల్పోయిం దా ?
___"కారణం "ఏదైనా ,మన మేధస్సుకు అంతుపట్టని ఏదో ఒక సృష్టిరహస్యం ,,మనిషి చేస్తున్న ఘోర అపరాధాన్ని ,,పొరబాటు ను నేరుగా మనకు సూచిస్తూ ఉంది !
""ప్రాణి ఎప్పుడైనా చావడం ,మాత్రం ఖాయం !
తప్పదు ;
ఈ దుస్తులు తీసి , మరో వేషం వేయడానికి ,, అందరూ ,సంతోషంగా ready గా ఉండాలి !!
శ్రీకృష్ణ భగవానుడు
అర్జునుడికి చెప్పింది ఇదే !
,నీవు చంపకున్నా వారు,కౌరవులు చస్తారు !
__పుట్టిందే చావడానికి !!
_చావడం అనేది శరీరానికే !వారిలోని ఆత్మకు కాదు !
__వారికి జీవించే యోగ్యత ఏ మాత్రం లేదు ,!
ఎందుకంటే వారు అధర్మాన్ని ఆశ్రయించారు !
రెచ్చిన పుండు తో బాటు, శరీరం కూడా పోవాల్సిందే !!
నీవు నిమిత్త మాత్రుడి వి!
ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా చావాలో ,కాలం ఇదివరకే నిర్ణయించింది ,!;
కాలం తీర్పును నీవూ, నేనూ వారూ కూడా శిరసా వహించాలి !
, అర్జునా !
అంటూ అతడి కర్తవ్యాన్ని సూచిస్తాడు పరమాత్మ !
___"భగవద్గీత " చక్కగా అర్థం కావాలంటే ,,ముందు" నేను" వాడు ""గురించి మనకు తెలియాలి , ,!
""వారు" నా బంధువులు !
""నేను "వారిని చంపలేను !
ఇదీ సమస్య !
ఈ సమస్య , ప్రతీ అడుగడుగునా మనిషికి ఉండేదే !
చంపుతూ ఉంది కరోనా !
చస్తూ ఉన్నారు మనుషులు !
ఏదైనా శత్రుత్వం ఉందా ఇక్కడ?
పగలు ప్రతీకారాలు ఉన్నాయా ?
ఇక్కడ నేను అనేది ఎవరు ??
చచ్చేది ఎవరు ?
చంపే ది ఎవరు ?
శ్రీకృష్ణుడు బోధించిన ఈ శరీర జ్ఞానం గురించి కొంత తెలుసుకొందాం !
ఆత్మ స్వరూపము ఒక్కటే సత్యం !
""జగత్తు ,,ఈశ్వరుడు ,జీవుడు"" ఇవి మూడు ,ముత్యపు చిప్ప లో వివిధ ఆకారాలలో కనిపించే వెండి వలె , , ఇవి ఆత్మ స్వరూపం యొక్క కల్పిత స్వరూపాలు ,!
ఇవి మూడు ఒకే కాలంలో అగుపిస్తూ ,ఒకే కాలంలో కనిపించకుండా పోతూ ఉంటాయి !
మనస్సు పై నియంత్రణ పొందాలంటే , విచారణ తప్ప ,తగిన ఉపాయం మరొకటి లేదు !
ప్రాణాయామము , అనగా ఊపిరి బిగబట్టడం వల్ల మనసు కదలకుండా కొంతసేపు ఆపవచ్చు ,, కానీ ప్రాణము బయలు వెడలి నపుడు తానూ వాసనల వశమై పోవును
మనస్సునకు ,ప్రాణానికి పుట్టు చోటు ఒక్కటే ,
తలంపె మనస్సు స్వరూపము ,!
నేను అనెడి తలంపు అహంకారము ,
అహంకారము పుట్టిన చోటు నుండి శ్వాస కూడా బయలుదేరుతుంది !
మనస్సు అణగి ఉంటే ,ప్రాణము,, నూ,,,,ప్రాణము అణగి ఉంటే మనస్సు అణగి ఉంటాయి !
సుషుప్తి అవస్థ లో ,అంటే , సమాధి లో ,ధ్యాన యోగ క్రియలో , మనస్సు అణగి ఉంటుంది , కానీ ప్రాణము మాత్రము అణగి ఉండటం లేదు ,అది కావలి వాని లా కాచుకొని ఉంటుంది ,
ఎప్పుడు లేస్తాడా ,అని ఎదురు చూస్తూ ఉంటుంది !
ఇది ఈశ్వరుని నియమం ,దేహము మరణించలేదు అని సూచి స్తు ఉన్నట్టుగా ధ్యానం ,శ్వాసను నియంత్రిస్తూ ఉంటుంది !
ప్రాణము మనస్సు యొక్క స్థూల రూపము
మరణకాలము వరకూ ,,మనస్సు ప్రాణము అనే శరీరాన్ని ధరించుకొని ఉంటుంది !
దేహము మరణించగా నే, మనస్సు ప్రాణమును తీసుకొని పోతోంది ,
కాబట్టీ,,ప్రాణాయామము మనస్సును లోబరచుకొంటుంది ,,కానీ మనస్సును నశింప జేయదు,,!
ఈ ప్రాణాయామము వలెనే , మంత్రజప ము ,, మూర్తి ధ్యానము ,,ఆహార నియమా ల తో కూడా మనస్సు ఏకాగ్రత పొందుతుంది !
ఏనుగు ను ఒక గొలుసు తో కట్టి , మనకు నచ్చిన దిశలో తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందో మనం , చెప్పినట్టు అది వింటూ వుంటుం దొ ,
అలా , బలమైన ఏనుగులా చలిస్తూ, ఈ శరీరాన్ని తన ఇచ్చానుసారం గుంజుకు పోయే, ఈ మనస్సుకు ఒక రూపాన్ని గానీ,ఒక నామాన్ని గానీ అలవాటు చేస్తే ,అది ,దాన్ని పట్టుకొని విడవకుండా ఉంటుంది !
పలుపు తాడుతో భూమిలో బలంగా పాతిన కర్రకు పశువును కట్టివేస్తే ,,అది దానికి లొంగిపోయి ,దాని చుట్టూ తిరుగుతూ ఉంటున్నట్టు గా ,, వరదలా ,ఉప్పెన లా , వచ్చి పడుతున్న తలంపులు ఆపాలం టే ,, ఒక బలమైన ఆనకట్ట ఏర్పాటు చేయాలి !!
అనేకమైన ఆలోచనలు వస్తూ వుంటే, దేనికీ పట్టు ఉండదు కదా ! ఒక్కొక్కటి , విడిగా ఉంటూబలహీనం అవుతూ ఉంటుంది !
బలమైన మనస్సుకు ,ఆత్మ విచారణ చేసే శక్తి అధికంగా ఉంటుంది ,
మితమైన సాత్వికాహారం నియమము చే మనస్సు యొక్క సత్వగుణం పెంపొంది ,,ఆత్మ విచారణ చేసేందుకు చక్కగా సహాయపడుతూ ఉంటుంది !;""
సోమనాథ క్షేత్రం సముద్రాన్ని ఆనుకొని ఉంది , ఆ దేవాలయ ప్రాంత సముద్ర జలాల్లో ,ఒక పెద్ద శివలింగం ఉంది ,
బలమైన సముద్రపు అలలు అభిషేకం చేస్తూ ఎన్ని వచ్చినా , ఆ శివలింగం చెదరకుండా నిశ్చలంగా ఉంటుంది ,
అలాగే ,విషయ వాసనలు ,అంటే కోరికలు ,,తలంపులు ఎన్ని కలుగుతూ ఉన్నా ,స్వరూప ధ్యానము పెరుగుతూ ,పెరుగుతూ ఉంటే , అవన్నీ నశిస్తూ వుంటాయి ,
స్వరూప ధ్యానము మాత్రము ఎడతెగకుండా కొనసాగిస్తూ ఉండాలి ,,
నేను పాపాత్ము ను ,మహా పాపిని , ఘోరమైన పాపం చేశాను అంటూ దుఃఖిస్తూ ఉండడం కంటే , ,, ఆ మనో వ్యధ నుండి బయట పడేందుకు తనకు ఇష్టమైన ఏదైనా ఒక స్వరూపాన్ని ధ్యానం చేస్తూ , ఆ ధ్యానం లో దృఢమైన పట్టుదల గలవాడై , దీక్షగా , ఆ ధ్యాన ప్రక్రియను కొనసాగిస్తూ సాధన చేస్తూ ఉంటే ,అతడు నిశ్చయముగా బాగుపడతా డు ,,!
. (ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !""
Tuesday, May 19, 2020
నేనె వడను ? 6
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment