Tuesday, May 19, 2020

నేనె వడ ను ? 7

May 3, 2020
మనస్సు నందు ఎంతవరకు విషయ వాసనలు ,అంటే "కోరికలు" కలుగుతూ ఉంటాయో  ,అంతవరకూ ,"నేను ఎవరిని ?"అనే విచారణ చేస్తూ ఉండడం  అవసరం !;
కలిగే కోరికలను ఒక్కటొక్కటిగా వెంటనే   తెంపివేస్తు ఉండాలి ,!
ఇలా ఇతరము ఏది ,కోరకుండా ఉండడం ,"వైరాగ్యం ""
అంటారు !
తన్ను తాను వదలకుండా ఉండుట ,అంటే ",తన గూర్చిన ఎరుకను"" కలిగివుండటం ,"జ్ఞానం "
అంటారు !
నిజానికి ఇవి రెండూ ఒకటే ,!!
వైరాగ్య భావన తో ,,"ఆత్మ స్వరూపము ""అనే ముత్యాన్ని  పొందడం ,జ్ఞానం అవుతోంది !;
ఎదురుగా ఉన్న కొడుకును ,లేదా కూతురు ను  చూస్తూ మనసు అంతర్ముఖమై , ఆత్మసుఖాన్ని పొందుతూ ఉంటుంది ,!
వారు ఎదురుగా  లేనప్పుడు ఈ మనసు , బాహ్య ప్రపంచంలో ని మరొక వస్తువును ఆశ్రయిస్తూ ,ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తుఉంటుంది !
చెట్టుకింద నీడలో ఉండడం, సుఖంగా ఉంటుంది ,!
ఇక్కడ
చెట్టు  మన " ఆత్మను   సూచిస్తోంది !
కానీ బాహ్యంలో వస్తువుల పై కోరికతో , తీవ్రమైన మండుఎండ ల్లోకి వెళ్తూ, దాన్ని గ్రహించి ,,దాన్ని గురించిన అనుభూతితో చెట్టు నీడలో కి వచ్చి తాత్కాలిక సుఖాన్ని  అనుభవిస్తూ ఉంటాడు ,!!
కోరికలతో జీవుడు అలా బయటకు  వెళ్తూ ,లోనికి వస్తూ ,రాకపోకలు సాగిస్తూ,మనసు కుదుట లేక ,పొందిన దానితో తృప్తి పడక , ,అత్మసుఖాన్ని దూరం చేసుకుంటూ ,,, మనః శాంతిని కోల్పోతాడు ,!!
"వివేకి "నీడను విడిచి పోడు!
"జ్ఞాని "అయిన వాని మనసు ,"బ్రహ్మము" ,అనగా "ఆత్మ "అనే చల్లని నీడను విడిచి దూరం గా వెళ్ల డు !!
జగత్తు అనేది తలంపు!అనగా భావ న !
జగత్తు లేకపోతే ,కోరిక అనేది లేకుండా పోతే ,మనస్సు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది !
తలంపు కలిగితే ,దుఖం కలుగుతూ ఉంటుంది !
పుస్తకాలు  నిరంతరం చదవడం వలన "ఆత్మ జ్ఞానం  "కలుగదు !
"నేను ఎవరు ?""అనే విషయాన్ని , విచారణ తో ,,తన ఆత్మలోనే  తెలుసుకోవాలి ,
""రాముడు ,తాను రాముడు అని తెలియడానికి అద్దం కావాలా ?"
నేను దేహిని కాదు ,ఆత్మస్వరూపాన్ని !  అని తెలియడానికి ,జీవితంలో మనం అనుభవాలు, అనుభూతులు, కరోనా లాంటి విపత్తులు ,ఇలా  మనం ఎదుర్కొంటూ ఉన్న సమస్యలను గూర్చి విచారణ చేస్తే చాలు ,బోధపడుతుంది !!
దేహంలో
అన్నమ య,ప్రాణమయ , మనో మయ,ఆనందమయ , విజ్ఞానమ య , కోశము లు  ఉంటాయి,!
ఇవి యోగసాధన కు ఉపకరిస్తూ ఉంటాయి !
యోగి యొక్క సాధన ,, ఈ పంచ కోశము లను దాటి తే గానీ  ,,"ఆత్మ స్థానాన్ని "" చేరలేము !
ఈ ఆత్మను పరబ్రహ్మము తో అనుసంధానం చేయడం ,సాధకుని ధ్యేయం !
ఆ సాధనలో ,పొందే దివ్యానుభూతి   ఆత్మసుఖా న్ని సూచిస్తుంది ,!
""సంసార బంధాలలో ఉన్న తాను  ఎవరు?""
అని విచారిస్తూ,తన యదార్థ స్వరూపాన్ని తెలుసుకోవడమే "ముక్తి ""!!
నిరంతరము మనస్సును ఆత్మ యందుంచు కొనుట యే "",అత్మవిచారణ"" అంటారు !
తాను ""సచ్చిదానంద స్వరూపుడు ""అని భావించడమే "",ధ్యానం  "
అంటారు ,!
ఈ దశలో ,గతంలో నేర్చుకున్న వాటిని అన్నిటినీ మరవ వలసి వస్తుంది !!
,ప్రపంచమును ఒక "స్వప్నము "గా అనుకోవాలి !
"మేల్కొని "ఉండగా జరిగే పనులు ఎంత నిజముగా అనిపిస్తూ ఉన్నాయో , అంతే నిజం గా" స్వప్నం" లోకూడా  జరుగుతూ ఉన్నాయి ,
జాగ్రత దీర్ఘంగా ,స్వప్నం క్షణికం గా  తోస్తూ ఉంటాయి ,!
అంతే,తప్ప , ఈ రెండింటికి పెద్ద తేడా ఏమీ ఉండదు,!
ఈ రెండు అవస్తలలో భావాలు ,నామ రూపాలు  ఒకే సమయంలో సంభవిస్తూ ఉంటాయి !
""మంచి మనస్సు ,చెడు మనస్సు ""అనీ రెండూ వేరే ఉండవు !
మనస్సు ఒకటే !
వాసనలు ,, కలిగే తలంపులు __" శుభాలు , అశుభాలు ""అని రెండు రకాలుగా  కలుగుతూ ఉంటాయి !
ఇతరులు ఎంత చెడ్డవారు గా అనిపించినా , పొరబాటున కూడా వారిని ద్వేషించ రాదు,!
"రాగ ద్వేషాలు "రెండూ త్యజించాల్సినవే !
సాధ్యమైనంత వరకూ ఇతరుల పనులలో జోక్య ము చేసుకోరాదు !"
ఒకరికి "దానం"గా ఒక వస్తువును ఇవ్వడం అనేది ,,వాస్తవానికి  దానిని తనకే ఇచ్చుకుంటూ ఉన్నాడు !
ఎందుకంటే,ఇరువురిలో ఉన్నది ఒకే ఆత్మ !
దేహాలు వేరు !
ఆత్మకు వేరు స్వరూపాలు ఉండవు !
అవి దైవాంశ సంభూతాలు !
ఆత్మతోడు లేకుండా జీవుడు మన లేడు !
అందుకే ,జీవుడిని ఆత్మతో కలిపి "జీవాత్మ "అంటున్నాం
ఈ సత్యాన్ని గ్రహిస్తే, ఎవరైనా ,ఇతరులకు ఏదైనా ఎపుడైనా సంతోషంగా వస్తువులు దానం చేస్తూ ఉంటాడు !
_
చివరి మాట
_____&__
"తాను ,"అంటే నేను లేస్తే ,అన్నీ లేస్తాయి !
నేను  అనే భావం అణగి పోతే ,అన్నీ అణగి పోతాయి !
ఎంత అణకువగా ఉంటే ,మనకు అంత మేలు !
మనస్సును లోబరచుకొని  ఉన్నట్లయితే ,మనం ఎక్కడ, ఏ దేశంలో , ఏ ప్రాంతంలో, ఉన్నా ప్రశాంతంగా ,తృప్తిగా ,ఆనందంగా ,,పరమాత్మ వైభవాన్ని అనుభవిస్తూ  జీవన్ముక్తి ని పొందవచ్చును !!
అనగా ,జీవించి ఉండగా నే,జీవనచక్ర భ్రమణం నుండి విముక్తిని  పొందవచ్చును !
జయం ,శుభం !
హరిః ఓం !
శాంతి శాంతి శాంతిః!
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...