Tuesday, May 19, 2020

కృష్ణ ప్రేమ

May 3, 2020
కృష్ణ ప్రేమ ను సూచిస్తూ ఉండే ఒక పాట
_____&-___
పల్లవి !
__&&_&&
చరణం _1
____
కృష్ణా , నిన్నొక్క సారి చూడాలని ఉంది !
నా గుండె లోని బాధ నీకు చెప్పాలని ఉంది !
ఎక్కడవుంటావు , నీవు ?
ఎలా నిన్ను తెలిసేది ?
పట్ట రాని నిన్నెలా , పట్టాలిరా కృష్ణా ? "
  కృష్ణా !!
చరణం _1
_____
భక్తితో డ నీ  కృపను  పొందాలని ఉంది !
నాలో నిను దర్శిస్తూ ,, ఆనందించా _లని ఉంది !
నీ కరుణామృత వర్ష ధార
నెలా  తడిచి తరించేది ?
నీ చరణకమలాల ముందు
నా హృదయాన్ని  ఎలా పరచేది ?
  కృష్ణా !
చరణం _2
____&&___
రాధానురాగ భావ సుధలో ,,
హాయిగ మునిగి  తేలాలి ,!
గోపికా మనోహరుని _
మధుర భావం తో ఎద పొంగాలి !
కృష్ణ ప్రేమ  అనుభూతిని ,,
అణువణువున నింపాలి !
నవనీత ము నారగించు
కృష్ణుని కళ్ళారా చూడాలి !"
    "కృష్ణా !"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...