May 5, 2020
""ఈశ్వరా!"
కేశవుని చేతిలో హతమైన రాక్షసులు ముక్తిని పొందారు ,
ఈ మనుషులు రాక్షసుల కంటే ఘోర పాప కర్మలు చేస్తూ , భగవంతుని చేతిలో హతమయ్యే యోగం,అర్హత కు నోచుకోవడం లేదు , !!
ఉత్కృష్టమైన మానవజన్మ ను చేజేతులా నరకప్రాయం చేసుకుంటూ ,
బ్రతికి ఉండగా నే ,ఇక్కడే నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు ,
అజ్ఞానంతో ,అహంకారం తో,సర్వ ప్రాణులలో ,సర్వాంతర్యామి గా ప్రజ్వరిల్లుతు ఉన్న ఆ పరమాత్మ ను గుర్తించ లేకుండా ఉన్నారు,
పాపాల మూటలు పోగుచేసుకుంటూ ఉన్నారు !వారిని చూస్తుంటే ,జాలిగా ,, వారు చేసే పనులు చూస్తుంటే బాధగా ,ఏమీ అనలేని పరిస్తితి ఉంటోంది స్వామీ,,! తెగని ,పాపాన్ని ముల్లె కడుతూ ,,భూతలం పై ఈ మానవుడు అనబడే దానవుడు నిత్యం చేస్తూ ఉన్న ఘోర కృత్యాలు ఇంకా చెప్పలేను స్వామీ!""
కానీ, ఆ , మూగ ప్రాణులను అంతం చేస్తున్న ఈ మనుషులు దురా ఆగడాలను చూస్తూ సహించలేక పోతున్నాను కూడా ,!
""తండ్రీ !
నాకు శాంతిని అనుగ్రహించు పరమేశా ,!""
కింకరు డు,కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు ,,
,, నాయనా !!
నీకు అంత అవేశం పనికిరాదు ,సుమా !!"
నిదానం ప్రదానం !!""
,లోన ఉన్న బాధను పూర్తిగా చెప్పేసే య్ !!
కింకరు ని భుజం తట్టాడు ప్రేమగా హరుడు !!
""మహాదేవ ,,మహాదేవా,!" ఆ దుర్మార్గుడు,దురాశతో , ఈ
భూమిలో నున్న బంగారం కోసం మాత్రమే కాకుండా,, బొగ్గు ,గ్రానైట్ లాంటి ఖనిజాల కోసం వేల ఎకరాల భూమిని ,యంత్రాలతో తవ్వేసినపుడు అడవిలోని చెట్లను సమూలంగా నరికినపుడు,,
చెట్ల పై నివాసం చేసుకున్న పక్షులు ,అడవుల్లో నివసించే జంతువు లు ,,నిలువ నీడ లేక ,అవి అనుభవించిన నరక బాధ మాటల్లో చెప్పలేం!"" పరమశివ !!"""
సెల్ ఫోన్లు అనే పరికరాల వినియోగం కోసం నిర్మించే టవర్ ల నుండి వెలువడే రేడియేషన్ తీవ్రత కి ,, విలవిల లాడుతు ,,క్రమంగా సంతరిస్తూ , నాశనం అవుతున్న పిచ్చుక లాంటి చిన్న చిన్న పక్షుల బాధ ఏమని చెప్పను ??"" ఈశ్వరా !
ఫ్యాక్టరీ ల నుండి వెలువడే కలుషిత రసాయన విష పదార్థాలు నీటిలోకి వదిిలినప్పుడు వాటి దెబ్బకు గిల గిల కాడుతూ నీటిలోనే ప్రాణాలు వదులుతూ ఉన్న జలచరాలు పడే బాధ నాకు చూడవశం కావడం లేదు,, పరమాత్మా !"
జంతు వధ శాలలో కబే లాలలో నిత్యం వధింపబడుతున్న ఆవులు, ఎద్దులు లాంటి అనేక సాధు జంతువుల బాధ మీకు మాత్రమే అగుపించడం లేదా ప్రభో,!""
""మనిషి వేట ""అనే వినోదానికి బలై పోతున్న అడవి జంతువులు ,అందమైన నెమళ్ళు జింకలు కుందేళ్ళు , కోకిల చిలక ,,పావురాలు ,,వాడి క్రూరహస్తాల్లో నలిగి పోతున్నాయి
,,,వాటి దురవస్థ ను వర్ణించ నలవి కావడం లేదు ,,నాకు మహా దేవా !!
పురుగుల మందులకు ఉక్కిరబిక్కిరైన మరణిస్తూ ఉంటున్న తేనెటీగలు సీతా కొక చిలుకలు ,ఈశ్వరా మమ్మల్ని ఎందుకు పుట్టించావు అని వాపోతున్నట్టు గా విలపిస్తూ ఉన్నాయి
పచ్చని పచ్చిక తినడానికి దొరక్క ,ఆకలికి ప్లాస్టిక్ సంచులను తిని ప్రాణాలు వదులుతూ ఉన్న గేదెల లాంటి మూగ జీవుల బాధ మీకు తెలియనిది కాదు కదా జగదీశా
సర్కస్ లలో జంతు ప్రదర్శన శాలలో జీవచ్ఛవలా వం లా బ్రతుకుతున్న జీవాల బాధ మీకు తెలియనిది కాదు కదా
సోకుల కోసం భవనాలు నిర్మాణం కోసం నరకబడుతు ఉన్న వృక్షాల బాధ మీకు వినిపిస్తూనే ఉంటుంది
ఇలా ఒకటేమిటి ?" స్వామీ,! మహాదేవా ,నాగరికత ఆధునికత పెంచుతూ ప్రకృతిని సర్వ నాశనం చేయడమే లక్ష్యంగా బ్రతుకుతూ ఉంటున్న ఆ మనిషి చర్యలను ఇక నేను ఉపెక్షించ లేక పోతున్నాను మహా ప్రభో ,దేవాది దేవా !"
పరమేశ్వరుడు ,ఇక చాలు ,అన్నట్లుగా ,సమాధి స్థితిలో ప్రవేశిస్తూ ,
""ఓమ్,, శాంతి,శాంతి,శాంతిః !"
అంటూ కళ్ళు మూసుకున్నాడు , వెండికొండ విభుడు,
గౌరీ మనోహరుడు , పరమ దయానిధి !
హర హర మహాదేవ శంభో శంకర,,అంటూ ముకుళిత హస్తుడై ,పరమ శాంత హృదయం తో , నిష్క్రమించాడు ,శంకర కింకరు డు,
""సర్వే జనాః సుఖినోభవంతు !""
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !""
Tuesday, May 19, 2020
పరమేశ్వరా , ఏది దిక్కు ?"_6
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment