Tuesday, May 19, 2020

ఇంట నిలువరా ,మనసును ఇంట నిలపరా,!

Apr 21, 2020
ఇంట నిలువరా ,మనసును ఇంట నిలపరా,!
ఇంటి బయట కెడితే నీఇలు ,,
కరోనా కు  స్వంత మౌను రా!!""
!!ఇంట!!
దేశంలో, ప్రపంచంలో , రాష్ట్రంలో,నగరాల్లో !
,ఊరూరా ,పల్లె పల్లె కూ,
డిల్లీ నుండి గల్లీ వరకూ,!వ్యాపిస్తున్న మహమ్మారిని ,జాగ్రతగా అరికట్టాలి !
పొంచివున్న ప్రమాదాన్ని,, నివారిస్తూ పోవాలి !
  "!!ఇంట!!
లక్షలాది ప్రజలను చూడు ,, కరోనా కు గురి అయ్యారు !
లక్షన్నర కూ పైగా జనాలు,
మృత్యు వాత పడుతున్నారు,!
మందు , మా కూ, ఏదీ లేనీ
బయటపడే దారే తెలియని!
విషవలయం చేధించాలి ,
మన తెలివిని చూపించాలి !!
    !!ఇంట!!
చుట్టు ముట్టు చీకటిలో నా
చిరు దీపం వెలిగించాలి,!
భయాందోళన పడకుండా ,
ధైర్యంగా ఉండాలి!
ప్రభుత్వము సూచిస్తున్న ,
కట్టుబాట్లు పాటించాలి!!
దూరంగా ఉంటూనే ,
దూరాలు చెరిపే యాలి !
  !! ఇంట!!
మాస్క్ లు  ధరియించకుండా
బయటకు పోవద్దు సుమా!
నమస్కారం చేస్తూ నీలో ,
సంస్కారం పెంచు సుమా!
చేతులు కాలాక ఆకులు,
పట్టి లాభం లేదు సుమా!
  నీ చేతులు  శుభ్రంగా కడుగుతూ ,
భద్రంగా ఉండు సుమా !"
  !! ఇంట!!
నీ మనసే నీకు మిత్రుడు,
శత్రువు అవుతాడు కూడా !
మనసును నియంత్రణ చేస్తూ ,
మంచి పౌరు డనిపించాలి !
సమస్యలు ఎదురై నప్పుడే ,
మన ప్రజ్ఞను చూపించాలి ,!
మనసు ఉంటే మార్గం సుగమం,
అవుతుందని చాటాలి !
    ఇంట గెలిచి రచ్చ గెలిచే ,
దీక్ష ను చేపట్టి చూపరా !
    !! ఇంట !!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...