May 5, 2020
" , హే శ్రీ రామా ! !కారుణ్యధామా !"
పావన గుణధామా!హరే రామా !,
పునర్జన్మ ప్రసాదించా వు!
సకల పాపాలూ హరించి ,నన్ను ఉద్దరించావు !
హే రామచంద్ర ప్రభో !
నమో నమః !
____"_&&&______
1__"నీదు పదము లు సోకినంతనే ,,
నాదు జన్మ "విముక్త" మయ్యెను !"
రాతినై పడియుంటి యుగములు !
"నాతి"నైతిని మరల రఘువర !""
2__""ఓ దయానిధి ,!శ్వాస లయలను ,,
ఒసంగితివి,, ఈ దేహ వల్లికి !!""
నిన్ను చూడగ. ,చూడ నీలో ,"
నీ చరాచర సృష్టి సర్వము ,
3__""కన్నుదోయికి కాంతి యబ్బెను ,!,
క్లిన్నమయ్యే కపోల యుగ్మము !
వినగదయ్యెను కర్ణ యుగ్మము !""
3__""నీవు పలుకు మృదు పదమ్ముల ,,
""లే, అహల్యా! ""అనె దయాలువు ,!
లేచి కనగా ,నీవు మ్రోలన !
4__""నాదు గాత్రము జలదరిం చెను ,!
నీదు" పదముల స్పర్శ " నెరిగెను !
చరణ రజమే కేశ వీధిని ,,
చారుతర సింధూర మయ్యెను !
5__""పతితపావన!, నీదు ప్రాభవ
పారమెరుగున ,, ఆ బ్రహ్మ యైనా !
ఆడ నేర్చితి! ,బ్రతుకు నందలి
హాలాహలమే ,అమృత మయ్యెను!
6__అమర మానవ కల్ప భూజమ !,
అర్ఘ్య పాద్య ము లేల చెపు మా!
నీ వొసంగిన జీవనము నే ,
నీదు పదము ల నిడగ నెంచితి !""
""శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే !"
జై శ్రీరామ్ !""
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !
Tuesday, May 19, 2020
అహల్య ఆవేదన !
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment